టీడీపీ నాయకులకు దోచి పెట్టేందుకే రాజధాని నిర్మాణం
టీడీపీ నాయకులకు దోచి పెట్టేందుకే రాజధాని నిర్మాణం
Published Sun, Oct 23 2016 10:50 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నాయకుడు కోట్లసూర్యప్రకాష్‌రెడ్డి ధ్వజం
ఆళ్లగడ్డ: తెలుగు దేశం పార్టీలోని నాయకులకు కావలిసినంత దోచిపెట్టడానికే అమరావతి నిర్మాణం చేపట్టారే తప్ప ప్రజలకు ఉపయోగ పడేందుకు కాదని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని రామలింగారెడ్డి కల్యాణ మండపంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇన్‌చార్జి పుల్లయ్య అధ్యక్షతన నియోజవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కోట్ల మట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర్ర సంవత్సరాలు కావస్తున్నా కొద్దిగా కూడా అభివృద్ధి జరగలేదన్నారు. అయితే, ఆపార్టీ నాయకుల మాత్రం బాగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, యువత ఇలా ఏ వర్గాన్ని వదలకుండా అందరిని పూర్తిగా మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జిల్లాలో ఓ వైపు కరువు పరిస్థితులు, మరోవైపు పండించిన అరకొర పంటలకు గిట్టుబాటుధర లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తుందన్నారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి తులసిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అంటే 'తెలుగు దొంగల పార్టీ ' అన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులను ముఖ్యమంత్రి నట్టేట ముంచారని విమర్శించారు. రైతులకు మూడు సంవత్సరాలుగా ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సురెన్సులు ఏమాత్రం అందజేయలేదన్నారు. ఇంత వరకు పేదలకు ఒక ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అదిగో అభివృద్ధి అంటూ ముఖ్యమంత్రి డ్రామాలడుతున్నారని ఘాటుగా విమర్శించారు. తర్వాత గోస్పాడు మండలంలోని కానాల పల్లెలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని స్థానిక నాయకులతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, అశోక్‌రత్నం, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సత్యరాజు, శివశంకర్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement