కోమటిరెడ్డివి చిల్లర రాజకీయాలు
నల్లగొండ: బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతి భ్రమించి చిల్లర రాజకీయాలు చేశారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమిర్శించారు. కోమటిరెడ్డిని పరామర్శిస్తామంటున్న జానారెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో జానారెడ్డి, ఉత్తమ్లను ఎన్నో సార్లు కోమటిరెడ్డి అవమానించాడని గుర్తు చేశారు. కోమటిరెడ్డి హుందాగా ప్రవర్తించాలని, లేకుంటే పరాభవాలు తప్పవని హెచ్చరించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కోమటిరెడ్డి రాజకీయంగా పరిణతి సాధించలేదని విమర్శించారు