Marketing Committee
-
అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ
Indian-origin professor Neeli Bendapudi: భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అయితే ఆమె విశాఖపట్నంలో జన్మించి, ఉన్నత చదువుల కోసం 1986లో అమెరికాకు వచ్చిన బెండపూడి ప్రస్తుతం కెంటకీలోని లూయిస్విల్లే విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గానూ, ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: అదో విచిత్రం!...సముద్రం పై కదిలే కాంతి చుక్కలు!!) ఈ మేరకు పెన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నీలి బెండపూడిని తదుపరి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా పేర్కొన్నట్లు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఆమె అకాడమీలో దాదాపు 30 సంవత్సరాలుగా మార్కెటింగ్ విభాగంలో బోధించడమే కాక కాన్సాస్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత అధికారిగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్‌గా, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా, ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా సేవలందించారు. పైగా ఆమె తన వృత్తిని విద్యార్థుల విజయానికి అంకితం చేసింది. అయితే ఆమె వచ్చే ఏడాది 2022లో పెన్ స్టేట్ 19వ ప్రెసిడెంట్‌గా సేవలందించనున్నారు. ఈ మేరకు నీలి బెండపూడి మాట్లాడుతూ.."పెన్ స్టేట్ ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం. ఈ అత్యుత్తమ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి పనిచేయడాన్ని నెనెంతో గర్వంగా భావిస్తున్నా. అంతేకాదు పెన్ స్టేట్ యూనివర్సిటీని కొత్త శిఖరాలకు చేరుకునేలా పనిచేయడమే నా ధ్యేయం" అని అన్నారు. (చదవండి: అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!) -
ఇక గుంటూరు బ్రాండ్ కారం
సాక్షి, అమరావతి: కారం అంటేనే గుంటూరు..! నాణ్యమైన మిర్చికి నగరమే చిరునామా.. ఇక అదే పేరుతో మార్కెట్లోకి కారాన్ని వదిలితే విక్రయాలకు తిరుగుంటుందా? గుంటూరు మిర్చి పవర్ అలాంటిది మరి! గుంటూరు మార్కెట్ కమిటీ తాజాగా ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశిస్తోంది. గుంటూరు మిర్చికున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదే బ్రాండ్‌తో కారం తయారీ, అమ్మకాలు చేపట్టాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన నాణ్యమైన ఎండుమిరప కాయలను ప్రాసెస్ చేసి కారం విక్రయాలు చేపడతారు. ఇప్పటికే మిర్చి నాణ్యతను నిర్థారించే యాంత్రిక పరికరాలను సమకూర్చుకోగా మార్కెట్ స్పందనను పరిశీలించి గుంటూరు మిర్చి యార్డు, పల్నాడు మార్కెట్ కమిటీల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించనున్నారు. దేశ విదేశాలకు గుంటూరు ఘాటు.. ఘాటుగా ఉండే గుంటూరు మిర్చికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. గుంటూరు మిర్చి యార్డులో ఏటా రూ.6 వేల కోట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయి. చైనా, థాయిలాండ్, సింగపూర్ తదితర దేశాలకు రూ.2,000 కోట్ల మేర మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి. ఎండుమిరప ప్రాసెసింగ్ ద్వారా రైతులకు అధిక ధరలతో పాటు మార్కెట్ కమిటీకి ఆదాయం సమకూరుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసురత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కారం తయారీ, విక్రయాలపై నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులో మిల్లులను అద్దెకు తీసుకుని వచ్చే ఏడాది మార్చిలోపు కారం తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. మార్క్‌ఫెడ్ బ్రాండ్ మార్కెప్ పేరుతో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మహారాష్ట్రలో మార్కెట్ కమిటీలు రైతులు పండించిన పంటలను ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉప ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభించడంతోపాటు కమిటీలు రైతులకు అధిక ధరలను ఇవ్వగలుగుతున్నాయి. ఇదే తరహాలో గుంటూరు మార్కెట్ కమిటీ కారం తయారీతో ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించనుంది. -
కమలానికి టీడీపీ ఝలక్!
► ఆలయ కమిటీల్లో తెలుగు తమ్ముళ్లకే పెద్దపీట! ► బీజేపీ సభ్యుల స్థానాలకు ఎసరు ► ఎంపిక బాధ్యత చినరాజప్పకు! ► జాబితాల రూపకల్పనలో దేవాదాయ శాఖ ► మంత్రి తమవాడైనా బీజేపీకి దక్కని ఫలితం ► టీడీపీ అడ్డగోలు యత్నాలపై విమర్శలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇప్పటికే మిత్రపక్షమైన బీజేపీకి మార్కెటింగ్ కమిటీల్లో మొండిచేయి చూపించిన టీడీపీ ప్రభుత్వం.. దాని నుంచి తేరుకోక ముందే మరో ఝలక్ ఇవ్వబోతోంది! మార్కెటింగ్ కమిటీల్లో చోటుదక్కకున్నా కనీసం ఆలయ కమిటీల్లోనైనా పదవీయోగం పడుతుందని కలలుకంటున్న కమలం పార్టీ కార్యకర్తలకు గట్టిదెబ్బే తగలనుంది. పలు దేవాలయాలున్న జిల్లాలో ఆలయ కమిటీలు తప్పక వేయాల్సిన పరిస్థితి. రాజకీయ నిరుద్యోగులుగా దాదాపు పదేళ్లు గడిపిన టీడీపీ నాయకులు అన్ని కమిటీల్లోనూ తామే మెజార్టీ స్థానాలు దక్కించుకొని.. మిత్రపక్షం బీజేపీ కన్నా పైచేయిగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే గత ఎన్నికలలో టీడీపీ విజయానికి కష్టపడిన తమకు కమిటీల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ బీజేపీ నుంచి చాలాకాలంగానే వినిపిస్తోంది. టీడీపీ వైఖరి అందుకు భిన్నంగా ఉండటంతో నిస్పృహ చెందడం బీజేపీ శ్రేణుల వంతు అవుతోంది. టీడీపీ సర్కారు ఏర్పాటై దాదాపు రెండేళ్లు అవుతోంది. జిల్లాలో 952 దేవస్థానాలు ఉన్నాయి. రెండు లక్షల లోపు ఆదాయం ఉన్న 68 దేవస్థానాలకు కమిటీలను నియమించకుండా నిర్వహణ బాధ్యతను ఆయా దేవస్థానం అర్చకులకే అప్పగించారు. రెండు లక్షల కన్నా అధిక ఆదాయం ఉన్న మిగిలిన 884 దేవస్థానాలకు కమిటీలు వేయాల్సి ఉంది. రాష్ట్రంలో తిరుపతి తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్న అన్నవరం సహా సామర్లకోట, ద్రాక్షారామలలోని పంచారామ క్షేత్రాలు, పిఠాపురంలోని పాదగయ, తుని సమీపంలోని తలుపులమ్మలోవ, కాకినాడ కుళాయిచెరువు దగ్గరున్న బాలత్రిపురసుందరి అమ్మవారి ఆలయం, జగన్నాథపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వంటి ప్రముఖ క్షేత్రాల్లోనూ ట్రస్టుబోర్డు నియామకాలు జరగలేదు. చివరకు ఇటీవల 340 దేవస్థానాల ట్రస్టుబోర్డుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయగా 146 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మిగిలిన 544 ఆలయాలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి దాదాపు మూడు నెలలైపోతోంది. కేవలం 32 దేవస్థానాలకు మాత్రమే కమిటీలు వేశారు. అప్పనపల్లి, అయినవిల్లి వంటి ఒకటీ రెండు ఆలయాల్లో ఏడుగురు సభ్యులతో ట్రస్టుబోర్డులు వేశారు. కానీ పెద్ద ఆలయాల్లో రెండు స్థానాలు ఇస్తామని ఎన్నికల సమయంలో బీజేపీకి హామీ ఇచ్చిన టీడీపీ.. కేవలం ఒక్క స్థానం మాత్రమే కేటాయించింది. ఆయా ట్రస్టుబోర్డుల ప్రమాణ స్వీకారానికి బీజేపీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు హాజరైనా సభ్యుల సంఖ్య మాత్రం పెరగలేదు. మంత్రి మనవాడైనా... దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తమ పార్టీకే చెందినవారు కావడంతో బీజేపీ శ్రేణుల్లో కమిటీల పట్ల ఆసక్తి పెరిగింది. తీరా ఆచరణలోకి వచ్చేటప్పటికి కమిటీల నియామకంపై కుమ్ములాటలు మొదలయ్యాయి. ప్రారంభంలోనే ఆలయ కమిటీలను వేయడానికి టీడీపీ ప్రభుత్వం నానా హడావుడి చేసింది. టీడీపీ నాయకులు తమ కార్యకర్తల పేర్లతో కమిటీల జాబితాలు తయారు చేసి పంపారు. తీరా ఆ జాబితాల్లో తమ పార్టీవారు లేకపోవడంతో బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. మోసపోయామని భావించిన వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆలయ కమిటీల నియామకం చేపట్టాలని దేవాదాయశాఖ కమిషనర్ అనురాధకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆలయ కమిటీల్లో బీజేపీకి ఒక్క స్థానం ఖాళీగా ఉంచి మిగిలిన సభ్యులను టీడీపీ నాయకులతో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఆలయ కమిటీల బాధ్యతను హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అప్పగించారు. ఈ మేరకు ఆలయాల వారీగా కమిటీల జాబితాను రూపొందించే పనిలో అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. అయితే దేవాదాయ శాఖ మంత్రిగా తమ పార్టీ వాడైన మాణిక్యాలరావు ఉండటంతో ఏవిధంగానైనా చోటు దక్కుతుందని ప్రతి చోటా పెద్ద సంఖ్యలోనే బీజేపీ కార్యకర్తలు ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో కమిటీల్లో కమలం పార్టీ వారికి ఎంత చోటు దక్కుతుందో లేక ఆశాభంగమే మిగులుతుందో వేచి చూడాలి. -
జోగిపేటలో ఉద్రిక్తత
జోగిపేట - సంగారెడ్డి జాతీయ రహదారి పక్కన మార్కెట్ కమిటీ ముందు ఉన్న వడ్డెరుల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం ఉదయం పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గుడిసెల తొలగింపు జరిగింది. దీంతో నిరాశ్రయులైన 30 కుటుంబాలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమకు ప్రత్యామ్నయ స్థలం చూపించకుండా.. తమ గుడిసెలు కూల్చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. వీరికి వేరొక చోట స్థలాలు చూపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తహశీల్దార్ హామీ ఇచ్చారు. భారీ పోలీసు పహారా.. రెండు జేసీబీలు కార్యక్రమంలో పాల్గొనటంతో.. పెద్ద ఎత్తున రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. -
బిల్లులు చెల్లించాలని రైతుల ధర్నా
సుబాబుల్ బిల్లుల్ని వ్యవసాయ మార్కెట్ కమిటీయే చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో ఉన్న కాగితపు పరిశ్రమ ఉంది. దీనికి సమీప గ్రామాల రైతులు సుబాబుల్ కర్రను వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా సరఫరా చేస్తుంటారు. ఆ సంస్థ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవటంతో బకాయిలు రూ.9.20 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనిపై ఆగ్రహించిన రైతులు సోమవారం సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు రావల్సిన డబ్బులను మార్కెట్ కమిటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది. గతంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. -
మంత్రుల ఇంటి అద్దె రూ.లక్షకు పెంపు
* మీరు త్యాగాలు చేయరా అని మంత్రులను ప్రశ్నించిన విపక్షం * ఆలయాలకు పాలక మండళ్లు, మార్కెట్ కమిటీలకు అవకాశం * అభ్యంతరాలను తోసిరాజని బిల్లులకు శాసనసభ ఆమోదం సాక్షి, హైదరాబాద్: ఒకవైపు పీఆర్సీ కోసం ఉద్యోగులు అడుగుతున్నా స్పందించని ప్రభుత్వం.. మంత్రుల ఇంటి అద్దెను రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచుకోవడానికి సభలో బిల్లు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తప్పుబట్టారు. మంత్రుల ఇంటి అద్దెను రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచడానికి ఉద్దేశించిన ‘ఏపీ జీతాలు, పెన్షన్ల చెల్లింపు సవరణ బిల్లు’ మీద శుక్రవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘‘విభజన వల్ల రూ. 16 వేల కోట్ల లోటు ఉంది. త్యాగాలకు సిద్ధం కావాలని సీఎం పదేపదే ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు రాజధానికి విరాళాలు సేకరిస్తున్నారు. త్యాగాలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిస్తున్న వారు.. కనీసం పొదుపునకైనా సిద్ధం కారా? పొదుపు కోసం కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రుల భత్యాలు పెంచడం తగదు’’ అని హితవు చెప్పారు. ప్రతిపక్షం అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణించలేదు. బిల్లుకు ఆమోదం తెలపాలని ఆర్థిక మంత్రి యనమల ప్రతిపాదించారు. బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. డీజీపీకి 2 సంవత్సరాల పదవీ కాలం పదవీ విరమణతో సంబంధం లేకుండా డీజీపీకి 2 సంవత్సరాల పదవీ కాలాన్ని కల్పించడానికి ఉద్దేశించిన పోలీసు సంస్కరణల సవరణ బిల్లుకు కూడా సభ ఆమోదం తెలిపింది. యూపీఎస్సీ సూచించిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి ఒకరిని ఎంపిక చేసే అధికారం తాజా బిల్లు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ‘‘ఒకట్రెండు నెలల్లో పదవీ విరమణ చేసే అధికారిని డీజీపీగా ఎంపిక చేస్తే, తర్వాత రెండేళ్ల వరకు పదవిలో ఉంటారు. సీనియారిటీలో తర్వాత స్థానాల్లో ఉన్న ఐపీఎస్ అధికారులకు అన్యాయం జరగదా?’’ అని విపక్ష నేత జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే హోం మంత్రి చినరాజప్ప బిల్లును ఆమోదించాలని సభను కోరారు. బిల్లుకు సభ ఆమోదం లభించింది. దేవాలయాల ప్రస్తుత పాలక మండళ్ల రద్దు, పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంపునకు అవకాశం కల్పించే ‘ఏపీ ధార్మిక, హిందూ మతపర సంస్థలు, దేవాలయాలు(సవరణ) బిల్లు’ మీద చర్చ జరగకుండానే సభ ఆమోదం తెలిపింది. ఫలితంగా కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లభించింది. -
వెజిట్రబుల్స్
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టులేదు.. అనే పాట పాడుకోవడానికి అసలైన సందర్భం ఇదేనేమో..! ఎందుకంటే చినుకు పడక, మొక్క మొలకెత్తక కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గింది. మార్కెట్‌కు రావాల్సినంత సరుకు రాకపోవడంతో ఉన్న సరుకు ధర అమాంతంగా పెరిగిపోతోంది. దీంతో కిలో కొందామని మార్కెట్‌కు వచ్చి పావుకిలోతో ‘ఆయన’ ఇంటికి వెళ్తుండగా... కొసరు సరుకుతో వంట చేయాల్సిన పరిస్థితి ‘ఆమె’ది. ఇప్పుడే చుక్కలనంటు తున్న కూరగాయల ధరలు మరికొన్ని రోజులపాటు వర్షాలు కురవకపోతే ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయమేసే దుస్థితి నెలకొంది. సాక్షి, ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల దిగుబడి తగ్గిపోవడంతో నవీముంబై, వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ప్రతీరోజు వందలాదిగా రావాల్సిన కూరగాయల ట్రక్కులు పదుల సంఖ్యలో వస్తున్నాయి. ఫలితంగా నిల్వలు తగ్గిపోయి సరుకు కొరత తీవ్రమవుతోంది. దీని ప్రభావం సరుకు ధరలపై పడుతోంది. ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం కావడంతో కూరగాయలు సాగు చేయాల్సిన రైతులు చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఇక సాగు చేసినా సరైన దిగుబడి రాని పరిస్థితి నెలకొంటుందంటున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో కూరగాయల ధరలు 15-20 శాతం పెరిగిపోయాయి. ప్రతీ సంవత్సరం వేసవి కాలంలో దిగుబడి తగ్గిపోయి ధరలు పెరుగుతాయి. అయితే జూన్ మొదటి వారంలో వర్షాలు కురవడంతో ధరలు తగ్గుముఖం పడతాయి. కాని ఈ ఏడాది వేసవిలో పెరిగిన ధరల జోరు జూన్ పూర్తయినా కూడా కొనసాగుతోంది. వర్షాలు పత్తా లేకపోవడంతోనే వేసవిలోకంటే కూడా కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. గత నెలలో ఏపీఎంసీలోకి ప్రతీరోజు 550 పైగా ట్రక్కులు కూరగాయల లోడ్లతో వచ్చాయి. అయితే జూన్ నెల మొదటి వారంలో ఏరోజూ ట్రక్కుల సంఖ్య 500 దాటలేదు. రెండోవారం వచ్చేసరికి మరింతగా తగ్గింది. నెలాఖరునాటికి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ట్రక్కులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఒకవేళ మరో వారంరోజుల్లో వర్షాలు కురవకపోతే కూరగాయల ధరలు మరింత మండిపోతాయని ఏపీఎంసీ కి చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారి తెలిపారు. ఇదిలావుండగా కూరగాయల ధరలు పెరిగినప్పటికీ టమాటాలు మాత్రం కొంత ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం టమాటలు ఏపీఎంసీలో హోల్‌సెల్‌గా 10 కేజీలకు రూ.140 చొప్పున ధర పలుకుతున్నాయి. కొనుగోలుదారుల చెంతకు వచ్చే సరికి అవి కేజీకీ రూ.20 చొప్పున లభిస్తున్నాయి. మిగతా కూరగయాలతో పోలిస్తే వీటి ధర తక్కువగానే ఉందని చెబుతున్నారు. ఏపీఎంసీలో ప్రస్తుతం హోల్సెల్లోలభిస్తున్న కూరగాయలు. పెరిగిన కూరగాయల ధరల వివరాలు (10 కేజీలకు) కూరగాయ గతనెలలో ప్రస్తుతం క్యాలీప్లవర్ రూ.140 రూ.200 క్యాబేజీ రూ.100 రూ.140 వంకాయలు రూ.200 రూ.300 పచ్చిబఠానీ రూ.250 రూ.340 సొరకాయ రూ.100 రూ.200