Marping photo
-
విజయవాడలో దారుణం.. స్నేహితుల పనేనా..?
‘‘విజయవాడ పటమటలో నివసించే ఓ వివాహిత ఫొటోలను ఓ ఆగంతకుడు అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఆమె వాట్సాప్కే పోస్ట్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పలు దఫాలుగా రూ.25 వేలు వసూలు చేశాడు. ఆ తరువాత ఆమె వద్ద డబ్బులు లేవని తెలుసుకున్న ఆ కీచకుడు అవే ఫొటోలను ఆమె భర్తతో పాటు మరికొందరికి పోస్ట్ చేశాడు. బాధిత మహిళ భర్త సహకారంతో ఇటీవల సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల క్రితం ఆమెతో పాటు కాలేజీలో చదువుకున్న ఇద్దరు వ్యక్తులు ఈ సైబర్ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన మహిళ సోషల్ మీడియా మాయగాళ్ల వేధింపులతో కొన్ని నెలలు మానసిక వేదన అనుభవించింది. ఆ వేధింపులను తాళలేక ఈ గండం నుంచి కాపాడాలంటూ ఓ స్నేహితుడిని సాయం కోరింది. అయినా ఫలితం లేకపోవడంతో చేసేది ఏమీలేక ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో ఆ మహిళ సాయం కోరిన వ్యక్తే ఈ నేరానికి పాల్పడ్డాడని వెల్లడైంది. దీంతో ఆమె అవాక్కయింది. స్నేహంగా ఉన్నట్లు నటిస్తూనే ఆమె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు ఆ కీచకుడు’’. విజయవాడ : ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో సైబర్ నేరాల పరంపర కొనసాగుతోంది. విద్యార్థునులు, యువ తులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని కొందరు కీచకులు వేధింపులకు పాల్పడుతున్నారు. బాధితులకు తెలిసిన వ్యక్తులే ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. యువతులు, మహిళలతో చనువుగా ఉంటూ వారి ఫొటోలను సేకరించి అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు పోగొట్టుకుని, కొన్నాళ్లు మానసిక వేదన అనుభవించాక బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసుల విచారణలో తమతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న వ్యక్తులే ఈ దారుణాలకు పాల్పడినట్లు తెలుసుకుని కంగుతింటున్నారు. గడిచిన 15 నెలల్లో ఒక్క విజయవాడలో 210 కేసులు వెలుగులోకి వచ్చాయి. స్వయంకృపరాధమే.. గృహిణులు, యువతులు, విద్యారి్థనులు అధిక సమయం స్మార్ట్ ఫోన్‌తోనే గడిపేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే వీడియోలు, షార్ట్ వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ తరహాలో తాము సైతం గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో వ్యక్తిగత ఫొటోలు, భర్త, పిల్లలతో సరదాగా తీసుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పరిచయాలను పెంచుకునే ప్రయత్నంలో తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను కూడా ఆమోదిస్తున్నారు. అదును కోసం మాటు వేసిన సైబర్ నేరగాళ్లు వారితో పరిచయం పెంచుకుని మరిన్ని వీడియోలు, ఫొటోలను సేకరించి, ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఎడిటింగ్ యాప్‌ల సాయంతో అసభ్యకరంగా మారి్ఫంగ్ చేసి వేధింపులకు దిగుతున్నారు. ఇటీవల పెనమలూరు మండలం పోరంకి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ఇదే తరహాలో మోసపోయింది. తనతో పాటే చదువుకుంటున్న యువకుడు తన వీడియోను మారి్ఫంగ్ చేశాడని తెలియక సింగ్‌నగర్‌కు చెందిన మరో విద్యారి్థని మూడు నెలల పాటు మానసిక వేదన అనుభవించింది. మారి్ఫంగ్ వీడియోలు, ఫొటోల విషయం ఇంట్లో చెబితే ఏమంటారోనే భయంతో కీచకులు అడిగిన డబ్బు ఇవ్వడం, వారు చెప్పినట్లు చేస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. గతంతో నగరాలకే పరిమితమైన ఈ నేరాలు ప్రస్తుతం పల్లెలకూ పాకాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా నేరాల్లో బాధితులు అధికంగా విద్యావంతులే ఉంటున్నా, 25 శాతం మంది బాధితులే పోలీసులను ఆశ్రయిస్తున్నారని సమాచారం. పరువు పోతుందని కొందరు, సైబర్ నేరాలపై అవగాహన లేక మరి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. అప్రమత్తంగా ఉండాలి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రా మ్లో ఎంతో మంది మోసగాళ్లు ఉంటారు. కొందరు మహిళలు పరిచయాలు పెంచుకునే క్రమంలో ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. సైబర్ నేరాల కట్టడికి కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ‘చేరువ’ వాహనం ద్వారా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం. ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్ ప్రొఫైల్‌కు లాక్ చేస్తే మంచిది. మన నుంచి వెళ్లిన ఫొటోలను మాత్రమే మోసగాళ్లు మారి్ఫంగ్ చేసి వేధిస్తారు. మన నుంచి మన ఫొటోలు వెళ్లకపోతే వారు ఏమీ చేయలేరు. – టి.కె.రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా -
'బాయ్స్ లాకర్ రూమ్'లో కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాయ్స్ లాకర్ రూమ్' కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. తమ క్లాస్మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ చేద్దాం అంటూ కొందరు విద్యార్థులు చేసిన గ్రూప్ చాట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఓ టీనేజీ అమ్మాయే అబ్బాయిగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిలతో చాట్ చేసినట్లు విచారణలో తేలింది. తన శరీరంపై తానే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, దానికి అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని తాను ఈ పని చేసినట్లు పేర్కొందని ఢిల్లీ సైబర్ పోలీసులు వెల్లడించారు. తన పేరు సిద్దార్థ్‌గా పరిచయం చేసుకొని తన శరీరంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. దానికి అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో దాన్ని బట్టి తన క్యారెక్టర్ తెలుసుకోవచ్చని సదరు టీనేజీ అమ్మాయి విచారణలో పేర్కొంది. (డర్టీ ఛాట్ ) కొంతమంది టీనేజీ విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో బాయ్స్ లాకర్ రూం అనే అకౌంట్ క్రియేట్ చేసి తమ క్లాస్మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చాటింగ్ చేసిన ఘటన తెలిసిందే. వీరంతా ఢిల్లీలోని ప్రముఖ స్కూల్లో చదువుతున్న వారే. గ్యాంగ్ రేప్ చేద్దామంటూ సదరు విద్యార్థులు చాట్ చేసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరంతా 18 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్నవారే. అమ్మాయిల ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా గ్రూప్‌లో చర్చించుకున్నారు. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు 24 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. (‘బాయ్స్ లాకర్ రూం’ తరహాలో.. ఆ యూనివర్సిటీలో ) -
అమ్మా తప్పు చేశానా?
మంచివాళ్లనుకున్న అబ్బాయిలు మంచి స్కూళ్లలోని అబ్బాయిలు మంచి కుటుంబాల అబ్బాయిలు ఇలా ఎలా చేయగలుగుతారు?.. మోనా తల్లి విస్మయం. మోనాకైతే లోకం మీదే నమ్మకం పోయింది. టీనేజ్‌లో ఉన్న అమ్మాయి వందల్లో ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి వేల లైక్స్ ఉండే అమ్మాయి బాయ్స్ దగ్గర తన మార్ఫింగ్ ఫొటోలు చూసి గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అబ్బాయిలూ.. ఆలోచించండి. ఏడిపించడం ఫన్ అవుతుందా?! ‘‘అమ్మా.. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు వద్దంటున్నా వినకుండా ఫొటోలు షేర్ చేసి తప్పు చేశాను కదా..’’ గట్టిగా ఏడుస్తోంది మోనా (పేరు మార్చాం). పద్నాలుగేళ్ల అమ్మాయి. ఢిల్లీలో మంచి పేరున్న స్కూల్లో చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ ‘బాయ్స్ లాకర్ రూమ్’ స్క్రీన్ షాట్స్‌లో మోనా మార్ఫింగ్ ఫొటో ఉంది. మోనాపై బాయ్స్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ ఉన్నాయి. వాటిని తనే తల్లికి చూపించింది. ‘‘లేదురా.. నువ్వు తప్పేం చేయలేదు. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. అబ్బాయిలదే తప్పు. నేను నీవైపే ఉన్నాను. వాళ్లకు బద్ధొచ్చేలా చేస్తాను’’ అన్నారు మోనా తల్లి. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. అబ్బాయిలు మళ్లీ ఇలాంటి పని చేయకుండా గట్టి శి„ý పడేలా చేయడానికి ఏమేమి చట్టాలు ఉన్నాయో పుస్తకాలు తిరగేయడం మొదలుపెట్టారు. ∙∙ ఇది ఢిల్లీలో జరిగిన ఘటన. అయితే మిగతా చోట్ల భవిష్యత్తులో బయట పడబోయే ఘటన కూడా కావచ్చు! ‘బాయ్స్ లాకర్ రూమ్’ అనే మాటను దేశం ఈ ఆదివారం తొలిసారిగా వినింది. ఇదేమీ భారత్‌పై ఉగ్రవాదులు తలపెట్టిన దాడుల ఆపరేషన్ పేరు కాదు. దేశవిద్రోహల కోడ్ లాంగ్వేజి కూడా కాదు. ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ అకౌంట్ పేరు. అందులో ఉన్నవాళ్లంతా పసితనం వీడని పద్నాలుగూ పదిహేనేళ్ల మగ పిల్లలే. ఢిల్లీలోని ఐదారు స్కూళ్లలోని వాళ్లు. వాళ్లలోనే ఒకరిద్దరు అడ్మిన్లు. ఆ అకౌంట్ చాట్ గ్రూప్‌లో జరిగే రహస్య సంభాషణలన్నీ తమ క్లాస్మేట్స్ అయిన ఆడపిల్లల గురించే! వాళ్ల ఫొటోలను షేర్ చేస్తారు. మార్ఫింగ్ చేస్తారు. కామెంట్స్ రాస్తారు. నవ్వుకుంటారు. వాటిల్లో బాడీ షేమింగ్ ఉంటుంది, రేపిస్టు మెంటాలిటీ ఉంటుంది. వీళ్ల చాటింగ్ స్క్రీన్ షాట్స్ కొందరు అమ్మాయిల (వాళ్లలో మోనా కూడా ఉంది) ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో షేర్ అవడంతో ‘బాయ్స్ లాకర్ రూమ్’ సంగతి బయటపడింది. ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లల్ని మానసికంగా కృంగదీసి, వారి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసే చాటింగ్ అది. సున్నిత మనస్కులు తట్టుకోలేరు. కరోనా వైరస్‌ను వుహాన్‌లో మొదట ఒక చైనా నర్సు గుర్తించారు. అలా ఈ ప్రమాదాన్ని మనదేశంలో వెంటనే గుర్తించిన వ్యక్తి.. స్వాతీ మలీవాల్. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్. ఢిల్లీపోలీసులకు, ఇన్స్టాగ్రామ్ సంస్థకు మర్నాడే.. అంటే సోమవారమే.. ఆమె నోటీసులు పంపారు. ఇలాంటి తత్వం ఉన్న మగపిల్లలకు తక్షణం ఒక బలమైన హెచ్చరిక వెళ్లాలి అని స్వాతి అనుకున్నారు. ∙∙ మంగళవారం ఉదయానికి పోలీసులు లాకర్ రూమ్ సభ్యుడొకరిని కనిపెట్టారు. పద్నాలుగేళ్ల విద్యార్థి అతడు. ఢిల్లీలో పేరున్న స్కూల్లో చదువుతున్నాడు. ‘రూమ్’ తాళం చెవిలా దొరికాడతడు. మిగతా సభ్యులు పేర్లు, వాళ్లు ఏయే స్కూళ్లలో చదువుతున్నదీ అతడి నుంచి, అతడి స్నేహితుల నుంచి పోలీసులు రాబట్టారు. వాళ్లలో ఒకరిద్దరు ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏప్రిల్ మొదటివారంలో ‘బాయ్స్ లాకర్ రూమ్’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మొదలైంది. ఒకర్నుంచి ఒకరు జమ అయ్యారు. ఇద్దరు అడ్మిన్లు కాబట్టి గ్రూపు త్వరత్వరగా వృద్ధిచెందింది. గ్రూపు టాపిక్ ఒక్కటే.. అమ్మాయిలు.. అమ్మాయిలు.. అమ్మాయిలు! తెలిసిన అమ్మాయిలు. క్లాస్మేట్స్ అయిన అమ్మాయిలు! వాళ్ల ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సంపాదించడం, ఇందులో షేర్ చేయడం. షేమింగ్ చేయడం! బుధ, గురువారాల్లో వీళ్లలో మరికొందరు బయటపడ్డారు. వీరిపైన ఏం చర్య తీసుకుంటారని తెలియకపోయినా, ఈ పిల్లల తల్లిదండ్రులు మాత్రం.. ‘పోలీసులు ఇంటికి రావడం’ అనే శిక్షను అనుభవిస్తున్నారు. లాక్‌డౌన్‌తో జువెనైల్ జస్టిస్ బోర్డు.. కేసులేమీ తీసుకోవడం లేదు. దాంతో పోలీసులు నిందిత విద్యార్థులను ప్రస్తుతానికి వాళ్ల తల్లిదండ్రుల అదుపులోనే ఉంచుతున్నారు. మొబైల్ ఫోన్స్ తీసేసుకున్నారు. తమకు తెలియకుండా వాళ్లను సిటీ బయటికి పంపించడం చేయకూడదని చెప్పి వెళుతున్నారు. బాయ్స్ లాకర్ రూమ్ చాట్‌లో తమ కూతుళ్ల ఫొటోలు ఉన్నాయని తెలుసుకున్న తల్లిదండ్రుల పరిస్థితీ దాదాపుగా అలానే ఉంది. ‘‘అమ్మా.. నా తప్పేమీ లేదు కదా’’ అని కూతురు అపరాధిలా అడగడం ఏ తల్లిని మాత్రం బాధించదు! ∙∙ తల్లి చెబుతున్న దానిని బట్టి మోనాకైతే ఈ అనుభవం తర్వాత లోకం మీదే నమ్మకం పోయింది! ‘నేనీ సమాజంలో ఉండలేను మమ్మీ’ అంటోంది. ‘ఫొటోలు షేర్ చెయ్యకమ్మా.. ఎవరైనా మిస్ యూజ్ చేస్తారు’ అని మొదట్లో తల్లి చెప్పినప్పుడు మోనా నవ్వింది. ‘పిచ్చి భయాలు మమ్మీ నీవన్నీ. మీ రోజుల్లో అలా ఉండేదేమో. బాయ్స్ ఇప్పుడు మర్యాదగా ఉంటున్నారు. గర్ల్స్‌ని, ఆడవాళ్లని రెస్పెక్ట్ చేస్తున్నారు’ అని మోనా అంది. ఇప్పుడు అదే బాయ్స్ ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారు! ఎందుకిలా చేశారు అని అడితే.. ‘ఫర్ ఫన్’ అంటున్నారు! దుర్గంధం ఈ దర్గంధపూరిత ప్రవర్తనకు అబ్బాయిల తల్లిదండ్రులనే నిందించాలి. ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వక పోవడం మీ హక్కు అన్నట్లు అబ్బాయిల్ని పెంచుతున్నారు. బాయ్స్.. ఈ పనికి మీరు సిగ్గుపడాలి. – నటి సోనమ్ కపూర్ ఇంత విషమా! ఈ వయసులో ఇంత పురుషాహంకారం అంటే ఈ విషం ఎంతవరకూ పాకపోబోంది! అత్యాచారాలను ప్రేరేపించే ఇలాంటి ఆలోచనా ధోరణులను ఇప్పుడే అదుపులో పెట్టాలి. – నటి స్వరా భాస్కర్ -
ఫేస్బుక్లో బుక్కాయ్యారు
శాంతిపురం: ఫేస్బుక్లో మార్పింగ్ ఫొటోలు పెట్టిన ఇద్దరు యువకులు అడ్డంగా బుక్కయ్యారు. మండలంలోని మొరసనపల్లిలో బంధువుల ఇంటికి వచ్చిన ఓ అమ్మాయిని అదే గ్రామానికి చెందిన యువకుడు తన ఫోన్లో ఫొటో తీశాడు. మిత్రుడి ఫొటోతో ఆ అమ్మాయి ఫొటోను కలిపి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. కానీ తమ ఇంటికి వచ్చిన అమ్మాయి ఫొటో మార్పింగ్‌తో ఫేస్బుక్లో ఉండడం ఆ అమ్మాయి బంధువైన వురో యువకుడు గమనించి, పెద్దలకు తెలిపాడు. ఇలా ఎవరు చేశారనేది కనుక్కున్నారు. అంతటితో ఆగకుండా నిందితుడి చెల్లెలి ఫొటో తీసి మరో వ్యక్తి ఫొటోతో కలిపి మార్పింగ్ చేశాడు. తనకు పరిచయం ఉన్న మరొకరి ఫేస్బుక్ ఖాతా నుంచి దానిని అప్లోడ్ చేశాడు. అప్పటికే ఒక ఫొటోతో సాగుతున్న వివాదం రెండవ ఫొటోతో తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం ఇరు వర్గాల వారూ గొడవకు దిగారు. కలగజేసుకున్న స్థానికులు ఇరు వర్గాలనూ శాంతిపజేసి ఆదివారం గ్రామంలో పంచాయితీ జరపాలని తీర్మానించారు. ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లలేదు.