marri raghavaiah
-
రైల్వే కార్మికుల సమ్మె వాయిదా
- ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య వెల్లడి హైదరాబాద్: ఏడో వేతన సంఘం ఏర్పాటుపై రైల్వే యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రావడంతో కార్మికుల సమ్మెను వాయిదా వేసినట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జాతీయ ప్రధానకార్యదర్శి మర్రి రాఘవయ్య తెలిపారు. గురువారం కాచిగూడలోని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో జరిగిన కాచిగూడ హెడ్ క్వార్టర్స్, ఐదు బ్రాంచీల కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీతో 4 నెలలపాటు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈలోగా సమస్యలు పరిష్కారంకాని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని, సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు. రైల్వేలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నామన్నారు. రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి యత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ సంఘ్ హైదరాబాద్ డివిజన్ డిప్యూటీ డివిజనల్ కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వర్లు, నాయకులు భరణి భానుప్రసాద్, భిక్షపతి, కేవీఆర్ ప్రసాద్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
'వారికి ఓకే.. స్వాగతం కూడా. మరి మాకు'!
న్యూఢిల్లీ: మాజీ సైనిక ఉద్యోగులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాని కార్యదర్శి మర్రి రాఘవయ్య అన్నారు. అయితే, అదే సమయంలో రైల్వే ఉద్యోగులకు కూడా అమలు చేయాలని చెప్పారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించకుంటే నవంబర్ 23 నుంచి సమ్మె చేపడతామని ఆయన స్పష్టం చేశారు. -
రైల్వేను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
దక్షిణమధ్య రైల్వే ఉద్యోగుల సంఘం మండిపాటు హైదరాబాద్: రైల్వే శాఖను ఉద్దేశపూర్వకంగా నష్టాల బాటలో నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై ఉద్యమిస్తామని దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. సంఘం జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం నగరంలో పారంభమైన సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య మీడియాతో మాట్లాడారు. రైల్వేల ప్రగతికి ప్రభుత్వమే అడ్డంకిగా నిలుస్తోందని విమర్శించారు. సరుకు రవాణా వ్యాగన్ల సంఖ్యను, చార్జీలను పెంచకపోవడం వల్ల ఆదాయం పెరగడం లేదన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతులను పాటించి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఉన్నతాధికారులపై మండిపడ్డారు. తగినంత మంది సిబ్బంది లేక ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోందని, దీంతో ఆశించిన ఫలితాలు రావడం లేదని చెప్పారు. పదవీ విరమణ చేసే ఉద్యోగుల విషయంలోనూ కొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తేవడం అన్యాయమన్నారు. పాత విధానాన్నే పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త జోన్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్నారు. మూడు రోజులపాటు జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రైల్వే ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, రైల్వే వ్యవస్థ పటిష్టానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. దాని అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె: మర్రి రాఘవయ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: రైల్వే కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే సమ్మె తప్పదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే (ఎన్ఎఫ్ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య హెచ్చరించారు. సౌత్‌సెంట్రల్‌రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్‌నిలయం ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఏడో వేతన సంఘాన్ని వెంటనే ప్రకటించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, డీఏను మూలవేతనంలో కలపాలని, బోనస్‌పై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేయాలని, రైల్వేలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.