సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె: మర్రి రాఘవయ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: రైల్వే కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే సమ్మె తప్పదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య హెచ్చరించారు. సౌత్‌సెంట్రల్‌రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్‌నిలయం ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఏడో వేతన సంఘాన్ని వెంటనే ప్రకటించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, డీఏను మూలవేతనంలో కలపాలని, బోనస్‌పై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేయాలని, రైల్వేలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.