marriage functions
-
ఉత్తరప్రదేశ్ వెళ్లిన సీఎం జగన్
-
ఇక పెళ్లిళ్లపై సర్కారు ఆంక్షలు
ఇంట్లో కొడుకు లేదా కూతురు పెళ్లి జరుగుతోందంటే చెప్పలేనంత ఆర్భాటం ఉంటుంది. నిశ్చితార్థం నుంచి పెళ్లి అయ్యేవరకు చుట్టాల సందడి, బాజా భజంత్రీలు, భారీ ఎత్తున విందు వినోదాలు.. ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ హంగు, ఆర్భాటాలకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ముకుతాడు వేసింది. నిశ్చితార్థం లాంటి చిన్న ఫంక్షన్లకైతే గరిష్ఠంగా వంద మందికి మించి అతిథులను పిలవడానికి వీల్లేదని, అలాగే కూతురి పెళ్లికైతే 500 మంది, కొడుకు పెళ్లికైతే 400 మందిని మాత్రమే పిలవాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఏడు రకాల వంటలను మాత్రమే వడ్డించాలి తప్ప.. ఎక్కువ పదార్థాలు పెట్టి వాటిని వృథా చేయకూడదని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రభుత్వ, ప్రైవేటు, సామాజిక ఫంక్షన్లలో ఎక్కడైనా కూడా లౌడ్ స్పీకర్లు వాడకూడదని, టపాసులు కాల్చకూడదని తెలిపింది. శుభలేఖలతో పాటు స్వీట్లు గానీ డ్రై ఫ్రూట్లు గానీ పంపడానికి కూడా వీల్లేదని స్పష్టం చేసింది. సామాజిక, ప్రభుత్వ, ప్రైవేటు ఫంక్షన్లు ఎక్కడ జరిగినా అత్యవసర సరుకులను విచ్చలవిడిగా ఉపయోగించడానికి వీల్లేదని ప్రభుత్వం ఆంక్షలు పెట్టినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి చౌదరి జుల్ఫికర్ అలీ చెప్పారు. ఈ కొత్త నిబంధనలన్నీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. -
నటిస్తూ..నగలు దోచుకుంటూ..
ఖమ్మం : పెళ్లి మండపాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఖమ్మం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ పోలీస్‌స్టేషన్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సురేష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. చెన్నైకి చెందిన ఎక్స్ సర్వీస్‌మెన్ వేలుమళ్లై రంగనాథ్ అలియాస్ రాజు కొంతకాలం హైదరాబాద్‌లో ఉంటూ చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. అనంతరం ఖమ్మం చేరుకున్న అతడు బల్లేపల్లిలో ఉన్న మచ్చా ఉమతో వివాహేతర సంబంధం ఏర్పర చుకున్నాడు. ఉమకు పదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో వీరు నగరంలోని కల్యాణ మండపాలకు వెళ్లి చోరీలు చేయడం ప్రారంభించారు. మండపానికి వెళ్లే ముందు పెళ్లి వారి బంధువుల్లా తయారై.. అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా హడావుడి చేస్తూ.. ముఖ్యంగా పెళ్లి కూతురు ఉండే గది వద్ద కొద్దిసేపు రెక్కీ నిర్వహిస్తారు. వారి వద్ద నగలు ఉన్నాయని తెలుసుకుంటారు.. పెళ్లి హడావుడిలో వారుండగా.. ఉమ, ఆమె కొడుకు ఆ గదిలోకి వెళ్లి.. కుర్చీలు, అవి, ఇవి సర్దుతూ బంధువుల్లా నటిస్తారు. తర్వాత తెలివిగా గదిలో పెళ్లికి వచ్చిన వారి నగలను అపహరిస్తారు. తర్వాత ఏమీ తెలియనట్లు పెళ్లి భోజనం చేసి మరీ తాపీగా వెళ్లిపోతారు. ఈ నేపథ్యంలో వీరు బుధవారం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి వెళ్తుండగా.. ఆ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టూ టౌన్ సీఐ రమేష్ వీరిని అదుపులోకి తీసుకన్నారు. అనుమానంతో ప్రశ్నించగా.. వ్యవహారం బయటపడింది. వీరి వద్ద నుంచి రూ.2.50 లక్షల విలువ గల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలైన ఉమ గతంలో ఆమె చెల్లితో కలిసి పలు చోట్ల దొంగతనాలకు పాల్పడింది. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై మూడు కేసులు సైతం ఉన్నాయి. సమావేశంలో సీఐ రమేష్, ఎస్సైలు ఓంకార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సాక్షిగా... కల్యాణమస్తు!
భారతీయ ఆశ్రమ ధర్మాలకు ఊపిరి వంటిది వివాహ వ్యవస్థ. పవిత్రమైన ఈ వివాహ బంధం పటిష్టతకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గట్టి పునాదులు వేసింది. పెళ్లి వేడుకల వల్ల పేద కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడుకొండల వాడి ఆశీస్సులతో ఇప్పటివరకూ ఏడడుగులు వేసిన జంటలు వేలల్లో ఉన్నాయి. సనాతన హైందవ ధర్మాలను విస్తృతం చేయటమే తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యం. ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలను ఆరంభించి... ధర్మప్రచారం, శ్రీనివాసుని వైభవం, భక్తితత్వాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లటంలో టీటీడీ సఫలీకృతమవుతోంది. కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా హిందూ వివాహ వ్యవస్థకు గట్టి పునాది వేసింది. పెళ్లి వేడుకల పేరుతో పేద కుటుంబాలు ఆర్థికంగా మరింత కుంగిపోకూడదని భావించిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి... రాష్ట్రంలోని పేదల్ని వివాహ బంధంతో ఒక్కటి చేయాలని సూచన చేశారు. దాంతో అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీవారి సాక్షిగా కలసిన బంధాలు! శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యాశీస్సులతో 2007 ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆరు విడతల్లో 45,209 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. 10 తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా 21,198 మంది ఒక్కటవగా, తొమ్మిది జిల్లాలు కలిగిన కోస్తాంధ్రలో 17,307 జంటలు, రాయలసీమ ప్రాంతంలో మొత్తం 6,704 జంటలు వివాహం చేసుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 7 వేల వివాహాలు జరిగాయి. సామూహికంగా నిర్వహించిన ఈ కల్యాణమస్తులో ఒక్కో వివాహానికి టీటీడీ రూ.7 వేలు ఖర్చు చేసింది. పెళ్లికి అవసరమైన పూజా సామగ్రి నుంచి పసందైన విందు భోజనం వరకు అన్నీ ధార్మిక సంస్థే ఉచితంగా అందజేసింది. నూతన వధూవరులకు ఇచ్చిన బంగారు తాళిబొట్లు, వెండి మట్టెలు, కంకణాలు, వధూవరులకు నూతన వస్రాలు, పూజా సామగ్రి, ధార్మిక స్తోత్ర పుస్తకాలకు తిరుమల ఆలయంలోని గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద, ఆ తర్వాత లోకమాత తిరుచానూరు అలమేలుమంగమ్మ పాద పద్మాల చెంత పూజలు చేసి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని టీటీడీ కల్యాణమండపాల్లోనూ, ఆలయాల్లోనూ వివాహ తంతును వేడుకగా నిర్వహించారు. వధూవరుల బంధువులకు ఉచిత విందు భోజనాన్ని స్వామి ప్రసాదంగా టీటీడీ సమకూర్చింది. తర్వాత వధూవరులు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించి ఆశీస్సులు అందించింది. పేద కుటుంబాల్లో ఆనందోత్సాహం పేదల పక్షపాతి అయిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదరణ, తిరుమలేశుని ఆశీస్సులతో రాష్ట్రంలోని 23 జిల్లాల్లోనూ కల్యాణమస్తు ద్వారా ఒక్కటైన పేద కుటుంబాలు నేడు పిల్లాపాపలతో కళకళలాడుతున్నాయి. సంతానం, సౌభాగ్యం, ఆనందోత్సాహాలతో వారి జీవితాలు వర్థిల్లుతున్నాయి. శ్రీనివాసస్వామి, పద్మావతి అమ్మవారి దీవెనలతో పెళ్లి కావటం వల్ల తమకు పుట్టిన సంతానానికి శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, మహాలక్ష్మి, పద్మావతి అంటూ వారి పేర్లు పెట్టుకుని మురిసిపోతున్నారు. మరికొందరైతే రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో తమ కొడుకులకు ఆయన పేరు పెట్టుకున్నామని ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఏడుకొండలవాడి ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నాం. స్వామి పాదాల వద్ద ఉంచిన తాళిబొట్లు, మట్టెలు, బట్టలు కానుకగా అందాయి. మాకిప్పుడు ఇద్దరు పిల్లలు... షర్మిల, శ్రావణి’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు పశ్చిమగోదావరి జిల్లా కాపవరంలో పేద వర్గానికి చెందిన వీర్రాజు, స్వాతి. ‘‘రాజన్న చల్లని దీవెనలతో మా పెళ్లి విశాఖపట్నం టీటీడీ కల్యాణమండపంలో జరిగింది. మాలాంటి వారు ఇబ్బంది పడకూడదనే రాజశేఖరరెడ్డిగారు ఈ కార్యక్రమాన్ని పెట్టించారు. మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆయనకు, ఏడుకొండలవాడికి రుణపడి ఉన్నాం’’ అన్నారు కొత్త పరదేశిపాళెం నివాసి, ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్‌లో క్యూరేటర్‌గా పనిచేస్తున్న కృష్ణారావు, ఆయన భార్య రామలక్ష్మి. వీళ్లు మాత్రమే కాదు... కళ్యాణమస్తు ద్వారా వైవాహిక బంధాన్ని ముడి వేసుకున్నవారు ఎందరో ఉన్నారు. వారందరూ చెప్పేది ఒక్కటే. ఏడుకొండలవాడి ఆశీర్వాదం, రాజన్న అండ లేకుంటే మేమిలా ఉండేవాళ్లం కాదు అని! శుభమస్తు... కళ్యాణమస్తు..! ఆరువిడతల్లో జరిగిన కల్యాణమస్తు వివరాలివి 1. 2007, ఫిబ్రవరి 22న 4658 2. 2007, ఆగస్టు 26న 8113 3. 2008, మార్చి 9న 6373 4. 2008, నవంబరు2న 7090 5. 2009- అక్టోబరు 28న 7724 6. 2011 మే 20న 11,251 మొత్తం 45,209 -
సినిమాను తలపిస్తున్న పెళ్లి వేడుకలు
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : ఒకప్పుడు పెళ్లంటే వారం రోజుల పండగలా ఉండేది. బంధువుల రాక.. పెళ్లి ఏర్పాట్లతో పెళ్లి సందడి నెలకొనేది. రానురాను పెళ్లి తంతులో కూడా మార్పు జరిగింది. ఏడడుగులు నడవడం.. తలంబ్రాలు పోసుకోవడం.. పెళ్లితంతు ముగించేవారు. పెళ్లినాటి మధుర స్మృతులను వీడియోలో బంధించేవారు. కొడుకులు పెద్దపెరిగాక పెళ్లినాటి వీడియోలను చూపించి ముచ్చటపడిపోయేవారు. అయితే మారుతున్న కాలానుగుణంగా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. పెళ్లి తంతు కూడా నయా ట్రెండ్‌లో నడిపిస్తున్నారు. వీడియో తీయడంతోనే సరిపెట్టడం లేదు. ఖరీదైన పెళ్లిగా నిలిచిపోయే విధంగా ఆ చిత్రాలను డిజైన్ చేస్తున్నారు. స్టేటస్‌కు, బడ్జెట్‌కు ముందూ, వెనకా ఆడకుండా పెళ్లి వీడియో క్యాసెట్లను తయారు చేయిస్తున్నారు. సినిమా టైటిల్స్‌ను మరిపించే విధంగా గ్రాఫిక్‌లతో వధూవరుల పేర్లు వేయడం, వారి ఫొటోలను రకరకాలుగా చూపించడం, కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు వేయడం, పెళ్లి విశేషాలు, పాటలు, పెళ్లి సన్నివేశాలు గ్రాఫిక్‌గా వేస్తూ సినిమాను తలపించే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. బెంగళూర్‌లో ఫొటో ఆల్బమ్ తయారీ ఫొటోలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పెళ్లి ఫొటోలు హైటెక్నాలజీతో ఫొటోలను ప్రింట్ చేస్తున్నారు. తొలుత హైదరాబాద్, విజయవాడలో ఫొటోలు పెద్ద సైజులో కడిగే మిషిన్స్ ఉన్నాయి. అయితే అక్కడి కంటే బెంగళూర్‌లో ఇంకా మంచి పెద్ద సైజు ఫొటోలు గ్రాఫిక్స్‌తో ఆల్బమ్‌లుగా తయారు చేస్తున్నారు. ఇక్కడి ఫొటోగ్రాఫర్లు ఇంటర్నెట్లో ఫొటోలను బెంగళూర్‌కు పంపిస్తే అక్కడ ఫొటో ఆల్బమ్‌ను తయారు చేసిన అనంతరం కొరియర్ ద్వారా పంపిస్తారు. ఒక్కో ఆల్బమ్ తయారీకి రూ.15 వేలు తీసుకుంటారు. ఈ ఖర్చంతా ముందుగా ఒప్పందం ప్రకారం తీసుకున్న డబ్బులో నుంచే ఫొటోగ్రాఫర్ భరిస్తాడు. ఫొటో అండ్ వీడియోగ్రాఫర్లే దర్శకులు ఈ సినిమాటిక్ వివాహాల్లో అసలు సిసలు పాత్ర అంతా ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్దే. అత్యుత్తమ కెమెరాలు, పక్కా స్క్రిప్ట్, సంగీత నేపథ్యాలతో ఫ్రీ ప్రొడక్షన్, రికార్డింగ్స్.. ఇవన్నీ అచ్చం సినిమాకు చేసినట్టే జరుగుతాయి. ఈ తరహాలో తమ పెళ్లిని రూపొందించుకోవాలని సిద్ధమైన వారు తమ బడ్జెట్‌ను చెప్పి, అది ఒకే అయ్యాక వధూవరుల వృత్తి వ్యాపకాలతో పాటు బంధుమిత్రుల సహా తమవారి వివరాలను రూపకర్తలకు అందిస్తారు. అది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది కూడా తెలియపరుస్తారు. అన్ని వివరాలు తీసుకున్న సదరు సంస్థ ప్రతినిధులు పెళ్లి థీమ్‌కు అనుగుణంగా జరిగేలా, ముహూర్తాలతో సమన్వయం చేసుకుంటూ పెళ్లి తంతును సినిమాటిక్‌గా డిజైన్ చేస్తారు. పెళ్లికొడుకు చెవిలో మరదలు చెప్పే సరదా కబుర్ల నుంచి నవవధువును అత్తింటికి పంపే అంపకాల సమయంలో చెమర్చిన కళ్లను దాచుకునే పెద్దల విఫలయత్నాల వరకూ పెళ్లి వేడుకల్లో తళుక్కున మెరిసే సహజమైన సన్నివేశాలను లాఘవంగా పట్టుకోవడం పైనే దృష్టిసారిస్తారు. ఒక్కో వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్ రూ.50 నుంచి రూ.75 వేల వరకు పెళ్లి ఆల్బమ్స్‌కి తీసుకుంటున్నారు. మూడు గంటల పెళ్లి చిత్రీకరణకు తెర ఒకప్పుడు పెద్ద వీడియో క్యాసెట్లు ఉండేవి. వరపూజ నుంచి మొదలుకొని పెళ్లి, రిసెప్షన్ వరకు వీడియో తీసేవారు. మూడు గంటల పెళ్లి వేడుకను చూడడం ఇబ్బందిగా మారేది. రానురాను ఆ పెద్ద క్యాసెట్ల స్థానంలో చిన్న క్యాసెట్లు వచ్చాయి. ప్రస్తుతం అవి కూడా తెరమరుగయ్యాయి. క్యాసెట్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల పనికిరాకుండా పోయాయి. పైగా ఇప్పుడు వీడియో క్యాసెట్ ప్లేయర్లు లేవు. అన్ని సీడీ, డీవీడీ ప్లేయర్లు వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక పెళ్లిని తక్కువ నిడివిలోనే అత్యంత ఆసక్తిగా మలచడం ఎలా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఉద్భవించినవే ఈ సినిమాటిక్ వెడ్డింగ్స్. వీటిలో పెళ్లి చూపుల దగ్గర్నుంచి ఎంగేజ్మెంట్, వివాహ వేడుక అంతా కలిపి కేవలం 15 నుంచి 25 నిమిషాల్లోపు ముగిసిపోతుంది. చక్కని నేపథ్య సంగీతంతో, ఎడిటింగ్ స్క్రిప్ట్ వర్క్‌తో పాటు వధూవరుల అనుభూతులను, మనోభావాలను దీనికి జతచేసి ఓ అందమైన కదిలే చిత్రంగా కనువిందు చేస్తుంది. హెచ్‌డీతో కూడిన వీడియో అండ్ కెమెరాలు వచ్చాయి. వాటికి క్యాసెట్లు ఉండవు. మెమరి కార్డు ఉంటుంది. అందులోనే వివాహ వేడుక మొత్తం రికార్డు అవుతుంది. మొత్తం పెళ్లితంతు ముగిసిన అనంతరం గంట వరకే కుదిస్తున్నారు. ప్రతి సన్నివేశాన్ని వీడియో తీసినప్పటికీ అవసరమైన మేరకు మాత్రమే మెమరీ కార్డులో కాపీ చేసుకుంటున్నారు. వాటిని పెన్‌డ్రైవ్‌లోకి డౌన్లోడ్ చేస్తున్నారు. కొత్తగా స్క్రీన్లు వచ్చాయి ఒకప్పుడు పెళ్లిళ్ల సందర్భంగా సంపన్నులైతే అందరూ వివాహ వేడుకలను చూసే విధంగా కల్యాణ మండపాల ప్రాంగణాల్లో అక్కడక్కడ టీవీలను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం వాటి స్థానంలో పెద్దపెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్లు వచ్చాయి. జిల్లాలో సుమారు 20 వరకు ప్రొజెక్టర్ స్క్రీన్లు ఉన్నాయి. ఒక్కో స్క్రీన్కు రూ.6 వేలు చార్జీగా వేస్తారు. జనం ఎక్కువగా ఉండే హాలులో స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి వేడుకలను టీవీల ద్వారా నేరుగా చూసే సౌలభ్యం వచ్చింది. ఇటీవల జరిగిన కొన్ని పెళ్లిళ్లు, రిసెప్షన్లలో క్రేన్ల ద్వారా వీడియో చిత్రీకరణ జరిగాయి. ఆర్థిక ఖర్చుతో కూడుకున్నప్పటికి కొంతమంది తమ స్టేటస్ కోసం వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఫొటో ఆల్బమ్ ఒకప్పుడు ఫొటోలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. వీడియో క్యాసెట్లు, సిస్టం అందుబాటులో లేని సమయంలో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు ఎంతో ఆదరణ ఉండేది. పెళ్లి తర్వాత నెల, రెండు నెలలకు ఫొటోలు వచ్చేవి. కానీ ప్రస్తుతం ఉదయం పెళ్లి జరిగితే మధ్యాహ్నం కల్లా ఫొటోలు వస్తున్నాయి. డిజిటల్ సిస్టం రావడం మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, బెల్లంపల్లి లాంటి పట్టణాల్లో డిజిటల్ కలర్ ల్యాబ్‌లు వెలిశాయి. బ్లాక్ అండ్ ఫొటోకు ఫొటోగ్రాఫర్ రూ.35 తీసుకునేది. ఆ తర్వాత కలర్ ఫొటో రాగా పోస్టు కార్డుకు రూ.15, 4/6, 12/6, 12/36 ఇప్పుడు తాజాగా నడుస్తుంది. ఒక్కో ఫొటో రూ.20 నుంచి రూ.600 వరకు చేరుకుంది. ఉపాధి పెరిగింది... డిజిటల్ సిస్టం వచ్చిన తర్వాత ఉపాధి పెరిగింది. ఫొటో, వీడియోలు నైపుణ్యంతో తీసేవారికి మంచి డిమాండ్ పెరిగింది. జిల్లాలో ఫొటోగ్రాఫర్లు సుమారు 1500లు, వీడియోగ్రాఫర్లు 2000ల వరకు ఉన్నారు. వివాహం జరిపించే వారు డబ్బులకు వెనకంజా వేయడం లేదు. కల్యాణ మండపం మొదలుకొని వీడియో, ఫొటోలు చాలా ఖరీదుగా ఉండాలని చెప్తున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగానే ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆల్బమ్ తయారు చేయించే మేము ఇప్పుడు హెచ్డీ టెక్నాలజీతో ఫొటోప్రింట్లు వేసే బెంగళూర్‌కు పంపిస్తున్నాం. దీని వల్ల అందరికీ ఉపాధి లభించడంతో పాటు చిరకాలం నిలిచిపోయే విధంగా ఫొటోలు ఉంటున్నాయి. ఇక వీడియో విషయానికి వస్తే సినిమా గ్రాఫిక్‌లకు తీసిపోని విధంగా రూపొందిస్తున్నాం. ఎదురుకోళ్లు ఎలా ఉండాలి. పెళ్లి పీటల పై ఎలాంటి ఫొటోలను చిత్రీకరించాలి లాంటివి మొదలుకొని అప్పగింతలు, అరుంధతి నక్షాత్రాన్ని చూపించే వరకు అన్ని వీడియో, ఫొటో చిత్రీకరణ అంతా మా దర్శకత్వంలోనే జరుగుతాయి. ఒకప్పటికి, ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. కేవలం అరగంట, గంట నిడివి గల వీడియో తయారు చేస్తున్నాం. - ఎం.కె.రాము, సీనియర్ ఫొటో అండ్ వీడియోగ్రాఫర్, మంచిర్యాల