Mary matha celebrations
-
ఘనంగా ప్రారంభమైన గుణదల మేరీమాత శతాబ్ధి ఉత్సవాలు
గుణదల/రైల్వేస్టేషన్(విజయవాడ తూర్పు/పశ్చిమ): క్రైస్తవ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన గుణదల మేరీమాత ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి సమిష్టి దివ్యబలి పూజతో ఉత్సవాలను బిషప్ తెలగ తోటి రాజారావు ప్రారంభించారు. ఉత్సవాల్లో ఫాదర్స్,క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఈనెల 9, 10, 11 తేదీల్లో జరిగే ఈ తిరునాళ్లకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. వీరి సౌకర్యార్ధం పుణ్యక్షేత్రంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండ దిగువన ఉన్న బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో తొలి సమి ష్టి దివ్యబలి పూజతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. పలు ప్రభుత్వ శాఖల అధికారు ల సహకారంతో పుణ్యక్షేత్ర గురువులు తిరునాళ్ల ను సజావుగా ని ర్వహించను న్నా రు. భక్తు లు లక్షలాదిగా తరలి వచ్చి మరియమాతను దర్శించుకుని దీవెనలు పొందాలని గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాత్కాలిక స్టాపేజ్ కేటాయించింది దక్షిణమధ్య రైల్వే. రామవరప్పాడులో నాలుగు రైళ్లకు తాత్కాలిక స్టాపేజ్కు అనుమతి ఇచ్చింది. ఈ నాలుగు రైళ్లు భక్తుల సౌకర్యార్ధం నిమిషం పాటు తాత్కాలిక స్టాపేజ్లో ఆగనున్నాయి. నాలుగు రైళ్లకు రామవరప్పాడులో నిమిషం హాల్టింగ్ ఈ ఉత్సవాల కోసం రైల్వేశాఖ నేటి నుంచి మూడు రోజులపాటు రామవరప్పాడు రైల్వేస్టేషన్లో పలు రైళ్లకు ఒక నిమిషం హాలి్టంగ్ సదుపాయం కల్పించింది. పూరి–తిరుపతి (17479), బిలాస్పూర్–తిరుపతి (17481) ఎక్స్ ప్రెస్ రైళ్లు మధ్యాహ్నం 12.04 గం.లకు రామవరప్పాడు చేరుకుని 12.05 గం.లకు బయలుదేరతాయి. తిరుపతి–పూరి (17480), తిరుపతి–బిలాస్పూర్ (17482) రైళ్లు సాయంత్రం 6.44 గం.లకు రామవరప్పాడు చేరుకుని, తిరిగి 6.45 గం.లకు బయలుదేరతాయి. -
ఘనంగా మేరి మాత ఉత్సవాలు
-
రెండో రోజు మేరీమాత ఉత్సవాలు
-
మేరిమాత ఉత్సవాలు
-
గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ : గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఫాదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రార్థనాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందచేశారు. మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండ పైకి చేరుకుని మేరీమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. -
ఘనంగా ప్రారంభమైన మేరీమాత ఉత్సవాలు
విజయవాడ (గుణదల): గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉదయం 7 గంటలకు విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఎం.చిన్నప్ప, గోల్డెన్ జుబిలేరియన్ గురువులు ఫాదర్ వెంపని, ఫాదర్ టీహెచ్ జాన్ మాథ్యూ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఉత్సవాలు ప్రారంభించారు. బిషప్ టీజే రాజారావు ప్రారంభ సందేశమిస్తూ, లోక రక్షకుడైన యేసును ఈ లోకానికి అందించిన మరియమాతను ప్రార్థించడం ద్వారా సర్వజనులకు దీవెనలు లభిస్తాయని తెలిపారు. ఇన్నేళ్లుగా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయంటే మరియమాత ఆశీర్వాదమేనన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందచేశారు. గురువులుగా 50 ఏళ్లు, 25 ఏళ్లు పూర్తిచేసుకున్న వారిని బిషప్ తెలగతోటి అభినందించి, సత్కరించారు. మధ్యాహ్నం 3 గంటలకు మరియమాత విగ్రహాన్ని గుణదల పురవీధుల్లో ఊరేగించారు. మరియమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు గుణదల చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండ పైకి చేరుకుని మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు.