Maryland hospital
-
పంది గుండె మార్పిడి చేయించుకున్న రోగి చనిపోవడానికి కారణం అదే...
Animal virus detected in patient: ఇటీవలే పందిగుండె అమర్చిన వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతను ఎందువల్ల చనిపోయాడు కారణాలేంటి అనే దానిపై వైద్యులు పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌కి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. పంది గుండెని అమర్చి ప్రపంచ చరిత్రోలోనే ఒక సంచలనాత్మక ప్రయోగానికి నాంది పలికారు. ఆ సర్జరీ కూడా విజయవంతమైంది. ఇది వైద్యశాస్రంలోనే ఒక సరికొత్త అధ్యయనం అని అందరూ ఆనందించేలోపే ఆ వ్యక్తి సర్జరీ జరిగిన రెండు నెలల్లోనే చనిపోయాడు. వైద్యులు కూడా అతన్ని బతికించేందుకు శతవిధాల ప్రయత్నించారు కూడా. అసలు ఎందుకు ఇలా జరిగిందని పరిశోధనలు చేస్తున్న వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈమేరకు యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు మాట్లాడుతూ... పంది గుండె లోపన వైరల్ డీఎన్ఏ ఉంది. పోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలువబడే ఈ బగ్ రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందనే విషయాన్ని గుర్తించలేకపోయాం. జంతువుల నుంచి మనుషులను అవయవాలను అమర్చినప్పుడూ కొత్త ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని వైరస్లు చాలా గుప్తంగా ఉంటాయి. సర్జరీకి ముందు బెన్నెట్ మానవ గుండె మార్పిడికీ అనర్హుడని, పైగా అతనికి వ్యాధి నిరోధక శక్తి తక్కువని తెలిసే జన్యుమార్పిడి చేసిన పంది గుండెను అమర్చాం. పైగా ఆ వైరస్ భారిన పడకుండా ఉండేలా అతని అత్యంత మెరుగైన చికిత్స కూడా అందించాం. మా బృందం దాత పంది ఆరోగ్యంగా ఉందని, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహించి నిర్ధారించింది. అంతేకాదు ఆ పంది అంటువ్యాధులు వ్యాప్తి చేయకుండా నిరోధించేలా పెంచే ప్రత్యేక సదుపాయంలో ఉంది. బెన్నెట్‌కి యాంటీ వైరల్ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే చికిత్సలను అందించాం. అని అన్నారు. బెన్నెట్ సర్జరీ తర్వాత నెమ్మదిగా కోలుకోవడం మొదలు పెట్టాడని, ముందు జాగ్రత్త చర్యగా వైరల్ ఇన్ఫెక్టకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించామని సర్జరీ చేసిన డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ తెలిపారు. ఐతే పంది గుండే ఉబ్బిపోయి ద్రవంతో నిడిపోయి పనిచేయడం మానేసిందన్నారు. కానీ ఈ పంది వైరస్ ఎలా మానవ శరీరంపై ప్రభావితం చేస్తుందో స్పష్టం చేయలేదు. (చదవండి: పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత) -
పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత
వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం అవుతుందనుకున్నది కాస్త విషాదంగా మిగిలింది. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూశాడు. జనవరి 7వ తేదీన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. కానీ, ఆ ఆనందం రెండు నెలల్లోనే ముగిసింది. మేరీల్యాండ్(అమెరికా)కు చెందిన డేవిడ్ బెన్నెట్‌కు రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను ఆయనకు విజయవంతంగా అమర్చారు. దీంతో దీనిని పెద్ద ముందడుగుగా భావించారు. కొన్ని రోజులుగా బెన్నెట్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంగళవారం బెన్నెట్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి మృతి విషయాన్ని బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ నిర్ధారించారు. 1984లోనూ ఇలాంటి ప్రయోగమే జరగ్గా అది కూడా విఫలమైంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే, ఈసారి పందిగుండె అమర్చుకున్న బెన్నెట్ రెండు నెలలు జీవించడం కొంత మెరుగైన ఫలితంగా భావించినా.. ఇప్పుడదీ విషాదమే అయ్యింది. -
చారిత్రక ఘట్టం.. పంది గుండె మనిషికి!
Pig Heart Transplantation To Human: వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చారు అమెరికన్ వైద్యులు. తద్వారా అవయవాల కొరత, అవి దొరక్క చనిపోతున్న వేల మందికి ప్రాణదానం చేసే అవకాశం లభించినట్లయ్యింది. శుక్రవారం బాల్టిమోర్ ‘మేరీలాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. పంది నుంచి తీసిన గుండెను మనిషికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు వైద్యులు. జన్యుపరంగా మార్పు చేయబడిన పంది గుండెను అమర్చడం ద్వారా పేషెంట్‌కు ప్రాణదానం చేసినట్లయ్యింది. 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. సంప్రదాయ మార్పిడికి పేషెంట్ పరిస్థితి అనుకూలించని తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు వైద్యులు. ఇందుకోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్ కోలుకుంటున్నాడని, ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్తున్నారు. పేషెంట్ గనుక పూర్తిగా కొలుకుంటే గనుక అద్భుతమే అవుతుంది. వైద్య శాస్త్రంలో ఇదొక చారిత్రక ఘట్టమని చెబుతున్నారు వైద్యులు. తద్వారా భవిష్యత్తులో ఆర్గాన్ డొనేషన్స్ కొరతను పరిష్కరించడానికి ఒక మార్గం దొరికినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది అక్టోబర్‌లో న్యూయార్క్ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్లో వైద్యులు ఈ ఆపరేషన్ చేయగా.. పేషెంట్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. వేలల్లో మరణాలు అమెరికాలో ప్రతీ ఏడాది సగటున ఆరు వేల మందికి పైగా పేషెంట్లు.. గుండె మార్పిడికి ముందే చనిపోతున్నారు. అవయవాల కొరతే అందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికి పైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. ఇక పంది శరీరాకృతి, ఎదుగుదల, పైగా మాంసం తింటారు కాబట్టి ఆధారంగా.. అవయవాలు తీసుకోవడానికి ఉత్తమమైందని అమెరికన్ డాక్టర్లు భావిస్తున్నారు. సంబంధిత వార్త: పేషెంట్‌కు పంది కిడ్నీ అమర్చారు -
పామే కాదు.. బిల్లూ కాటేసింది..
వాషింగ్టన్: పాము కాటునైనా భరించగలిగాను కాని.. ఆస్పత్రి వారిచ్చిన బిల్లు భారాన్ని మాత్రం భరించలేకపోయాను బాబోయ్ అంటోంది చిత్రంలోని జూలెస్ వీజ్. విషయమేమిటంటే.. అమెరికాకు చెందిన ఈమె గత నెల్లో తన కారులో వెళ్తూవెళ్తూ.. వర్జీనియాలోని పొటోమాక్ నది వద్ద అందమైన దృశ్యాన్ని చూసి.. క్యా సీన్ హై అంటూ కారు ఆపి దిగింది. అలా చూస్తుండగానే.. ఇలా ఓ పాము వచ్చేసి కాటేసి పోయింది. ఏదో కందిరీగ కుట్టిందిలే అనుకుని.. కారు స్టార్ట్ చేసి లైట్ల వెలుతురులో చూస్తే.. పాము కాటులాగా రెండు గాట్లు కనిపించాయి. గంటలో కాలు బెలూన్లాగా ఉబ్బిపోయింది. ఈమె వెంటనే బెటెస్డాలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పాముకాటుకు విరుగుడు మందును ఓ మూడు డోసులు ఇచ్చారు. 18 గంటలు ఆస్పత్రిలో ఉంది. హమ్మయ్య.. బతికి బట్టకట్టానురా అనుకునేసరికి.. ముందు బిల్లు కట్టు అంటూ రూ.34 లక్షల ఆస్పత్రి బిల్లు చేతిలో పెట్టారు. దీనికితోడు వీజ్ వైద్య బీమా అంతకు కొన్నిరోజుల ముందే ముగిసిపోయిందట! దీంతో నానాపాట్లు పడి ఆమె బిల్లు కట్టింది. ఆస్పత్రి తీరును మీడియా ముందు ఎండట్టింది. పాముకాటు విరుగుడు మందు రేటు చాలా పెరిగిపోయిందంటూ ఆస్పత్రి సమర్థించుకుంది.