రసవత్తరంగా అనంతపురం, గుంటూరు మ్యాచ్
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని కేఓఆర్ఎం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అండర్–19 ఎలైట్ పోటీల్లో అనంతపురం, గుంటూరు జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. వర్షం కారణంగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో 381 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు 100.4 ఓవర్లలో 425 పరుగుల భారీ స్కోరు చేసి, ఆలౌట్ అయింది.
జట్టులో ముదాసిర్ 73 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు ధాటిగా ఆడుతూ 17 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 92 పరుగులు చేసింది. జట్టులోని మహీప్కుమార్ 38, నోవా 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసింది.