Material tax
-
అవగాహన కలిగితే... అంతా దైవత్వమే
ఆత్మగా చెప్పబడే అనంతశక్తి పదార్థంగా, తిరిగి ఆత్మగా పరిణమిస్తూ ఉండడం నిరంతర ప్రక్రియ. ఈ అద్వైత సిద్ధాంతమే కనిపించేవన్నీ ఆత్మ స్వరూపాలేనని నిర్ధారిస్తోంది. అంతేకాక, అత్యంత సాంద్రతమ ఆత్మలో పదార్థము, పదార్థ అంతరాలలో ఆత్మ సమ్మిళితమై విరాజిల్లడమే గమ్మత్తు అంటోంది. ఈ పదార్థాలన్నింటినీ తనలో చరించే అవకాశం ఇచ్చే ఆకాశం కూడా ఆత్మలో ఒకానొక చిన్న భాగమేనంటే ఆ ఆత్మ పరిధి, సాంద్రతలు ఊహకందనివి. ఈ ఆత్మజనిత పదార్థాలు అంతర్గత చర్యలను జరుపుతూ తమ రూపాలను సూక్ష్మస్థాయి నుండి ప్రౌఢస్థాయి వరకు, ప్రౌఢస్థాయి నుండి వార్థక్యంలోకి తీసుకువెళ్లి, ఆ చర్యలు ఆగిపోగానే నశించిపోతాయి. దీనికి చక్కని ఉదాహరణ మన ఆదిత్యుడే. ఖగోళపరంగా చూస్తే ఆయనకూ పరిమిత జీవితమే ఉంది. సూర్యుని ఆవిర్భావానికి కారణమైన కేంద్రక సంలీనం అనే ప్రక్రియ నిత్యం కొనసాగుతూ, కాంతి, శబ్దం, ఉష్ణం లాంటి శక్తి రూపాలను వెలువరుస్తూ, సూర్యుని లోపలి హైడ్రోజన్‌ను పూర్తిగా వినియోగించి చివరకు సూర్యుని అంతానికి హేతువు అతుంది. ఈ ప్రక్రియ అనేది సూర్యునికి జీవం లాంటిది. ఈ ప్రక్రియను మనలో జరిగే జీర్ణశక్తితో, తద్వారా ఉద్భవించే ప్రాణంతో పోల్చుకోవచ్చు.సూర్యునితో సహా విశ్వంలో ఉన్న నక్షత్రాలు మొదలుకొని జీవుల వరకు ‘బ్రహ్మసూత్రాల’లో చెప్పిన ‘జన్మాద్యస్య యతః‘ అన్నట్టుగా పుట్టుట, పెరుగుట, నశించుట ఎవనియందు జరుగుతున్నదో అదే బ్రహ్మము అనే సూత్ర పరిధిలోకే వస్తారు. అదే విధంగా భూమి కూడా అనుకూల పరిస్థితుల వలన జలావరణాన్ని పొంది, తద్వారా ఈ ప్రకృతిని తయారు చేసుకుంది. ఎప్పుడైతే ఈ జలావరణం నశిస్తుందో, అప్పుడు భూమిపై ప్రాణం నశించి, సర్వాంతర్యామిలో లయమైపోతుంది. ఆదిశంకరుల ‘ఆత్మబోధ’ లో ఎలాగైతే చిల్లగింజల గంధం మురికి నీటిలో వేస్తే మురికిని తొలగిస్తూ, నీటిలో కలిసిపోతుందో, అలాగే జ్ఞానం, అజ్ఞానిలో ప్రవేశించగానే అజ్ఞానం తొలగి పోవడమే కాక, అజ్ఞాని జ్ఞానియై ఆత్మగా శోభిల్లుతాడని చెప్పబడింది. ఇదే విషయాన్ని ఐన్ స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం లో’ బలీయమైన నమ్మకం ఆవరించిన విస్తృత మేథస్సుతో ఆలోచిస్తే, ఈ అనుభవాత్మక ప్రపంచమంతా దేవుడనే అవగాహన కలుగుతోంది. సాధారణ మాటల్లో చెప్పాలంటే అదే విశ్వదైవత్వం ఇది అవగాహనలోకి వస్తే జీవి మనుగడంతా దైవత్వమే! -
పన్నుల శాఖలో డివిజన్లు, సర్కిళ్ల పెంపు ఏదీ?
సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక రాష్ట్ర పన్నుల శాఖలో ప్రతిదీ ఓ ప్రహసనంగానే మారిపోతోంది. ఉద్యోగులకు పని విభజన నుంచి డీలర్ల పన్ను మదింపు, ఆడిటింగ్ వరకు అన్ని అంశాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న అభిప్రాయం శాఖ సిబ్బందిలోనే వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉద్యోగుల పదోన్నతులు, పోస్టింగులు, అప్‌గ్రెడేషన్ లాంటి ఫైళ్లు నత్తనడకన నడుస్తుండగా.. కీలకమైన శాఖ విస్తరణ ప్రక్రియ అంతకన్నా నెమ్మదిగా కొనసాగుతూ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగుల్చుతోంది. పెంపు ప్రతిపాదనలకు మోక్షమెప్పుడు? వాస్తవానికి పన్నుల శాఖలో డివిజన్లు, సర్కిళ్ల పెంపు ప్రతిపాదన రెండేళ్ల నుంచే ఉంది. డీలర్లు పెరుగుతున్నా డివిజన్లు, సర్కిళ్లు పెరగడం లేదని.. క్షేత్రస్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు డీలర్లపై పర్యవేక్షణ ఇబ్బంది అవుతోందని, శాఖను సంస్థాగతంగా విస్తృతం చేసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 91 సర్కిళ్లు, 12 డివిజన్ల ద్వారా పన్నుల శాఖ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. డివిజన్ల సంఖ్యను 20కి, సర్కిళ్ల సంఖ్యను 175కు పెంచాలని ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. కానీ ఉన్నతాధికారులు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నేపథ్యంలో ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడు నెలలు దాటుతున్నా.. డివిజన్లు, సర్కిళ్ల ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు. మరోవైపు 33 వేల మంది డీలర్ల బాధ్యతలను నిర్వహిస్తున్న సెంట్రల్ ఎక్సైజ్ శాఖ మాత్రం జీఎస్టీకి అనుగుణంగా తమ వార్డులను 253కి పెంచుకుంది. కానీ ఏకంగా 1.5 లక్షల మంది డీలర్లకు సంబంధించి బాధ్యతలున్న పన్నుల శాఖలో మాత్రం చర్యలు లేకపోవడం గమనార్హం. అప్‌గ్రెడేషన్ చాలు! పన్నుల శాఖ పరిధిలో ఒక సర్కిల్లో 6 వేల మంది డీలర్లుంటే.. మరో సర్కిల్లో నాలుగైదు వందల మంది కూడా లేని పరిస్థితి ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతో శాఖను పునర్వ్యవస్థీకరించాలని కోరుతున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణకు కొత్త పోస్టులు కూడా అవసరం లేదని, అదనపు భారం లేకుండానే... కేవలం పోస్టుల అప్‌గ్రెడేషన్ సరిపోతుందని అంటున్నారు. అయితే పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. అయితే ఇటీవల జాయింట్ కమిషనర్ స్థాయిలో కొత్త ప్రతిపాదన రూపుదిద్దుకుందని.. శంషాబాద్, అబిడ్స్, మాదాపూర్‌ల పేరుతో మూడు కొత్త డివిజన్లను ఏర్పాటు చేస్తూ, 15–18 సర్కిళ్ల పెంపుతో సరిపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్టు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. కనీసం ఇదైనా అమలుకు నోచుకుంటుందో, లేదోనని పన్నుల శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. -
50వేలు దాటితేనే వేబిల్లు
కిలోమీటర్ల ప్రాతిపదికన వేబిల్లు గడువు విధింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలకు రవాణా చేసే సరుకులకు సంబంధించిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వేబిల్లు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల ముఖ్య కార్య దర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్త ర్వులు జారీ చేశారు. రవాణా వాహనంలోని సరుకుల విలువ రూ.50వేలు దాటితే కచ్చితంగా వేబిల్లు తీసుకో వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. గతంలో అమల్లో ఉన్న వ్యాట్ ప్రకారం వాహనంలోని సరుకుల విలువకు సంబంధం లేకుండా ఉండేది. ఒరిజినల్ వేబిల్లుతో పాటు డూప్లికేట్ కాపీ కూడా వాహనంలో ఉండాలని, అధికారులు తనిఖీ చేసినప్పుడు ఒరిజినల్ వేబిల్లు ను తీసుకుంటారన్నారు. అదే విధంగా కిలోమీటర్ల ప్రాతిపదికన వేబిల్లుల గడువు కూడా విధించారు. 100 కిలో మీటర్ల లోపు 2 రోజులు, 500 కి.మీ లోపు అయితే 3 రోజులు, 1000–2000 కి.మీ అయితే 10 రోజులు, 2 వేల పైన కి.మీ ఉంటే 12 రోజులు ఈ వేబిల్లులు చెల్లుబాటు అవుతాయి. ఈ లోపు సరుకులు గమ్యస్థానానికి చేరని పక్షంలో ఆ వేబిల్లులు చెల్లుబాటు కావు. అదే విధంగా ఒకే ఇన్వాయిస్ మీద ఉన్న సరుకులను రెండు వాహనాల్లో రవాణా చేయాల్సి వస్తే రెండు వేబిల్లులు తీసుకోవాలని పేర్కొన్నారు. -
వస్తుసేవల పన్నుపై ఆందోళన వద్దు
జీఎస్టీ అదనపు కమిషనర్ ఆనంద్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ)పై వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీఎస్టీ అదనపు కమిషనర్ ఆనంద్‌కుమార్ అన్నారు. జీఎస్టీ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించారని, జీఎస్టీ అమలుతో ప్రభుత్వాలు, ప్రజ లకు మేలు జరుగుతుందని చెప్పారు. జీఎస్టీ అమలు పరిశీలనకు కేంద్రం నియమించిన అధికారులతో కలసి శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. బేగంబజార్‌లోని కిరాణా మర్చంట్స్, జనరల్ మర్చంట్స్, స్టీల్ మర్చంట్స్, కన్ఫెక్షనరీ అసో సియేషన్లు, వ్యాపారులతో చర్చించారు. ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. జీఎస్టీపై సందేహాలుంటే తమను అడిగి నివృత్తి చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. ఒక దేశం–ఒక పన్ను విధానంతో అమల్లోకి వచ్చిన జీఎస్టీ సమాజానికి మేలు చేస్తుందన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ శివనారాయణ్, అసిస్టెంట్ కమిషనర్ మనోజిత్ మజుం దార్, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఎం.ఏ.రవూఫ్, టి.నాగమహేశ్, బి.వి.శ్రీధర్, జి.వి.ప్రసాద్, కొంపల్లి శ్రీనివాస్, బసన్నగౌడ, ఇన్స్పెక్టర్ హరిశర్మ పాల్గొన్నారు.