50వేలు దాటితేనే వేబిల్లు | Way bill if exceed 50 thousand | Sakshi
Sakshi News home page

50వేలు దాటితేనే వేబిల్లు

Published Thu, Aug 10 2017 2:36 AM | Last Updated on Mon, Sep 11 2017 11:41 PM

Way bill if exceed 50 thousand

కిలోమీటర్ల ప్రాతిపదికన వేబిల్లు గడువు విధింపు
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలకు రవాణా చేసే సరుకులకు సంబంధించిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వేబిల్లు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల ముఖ్య కార్య దర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్త ర్వులు జారీ చేశారు. రవాణా వాహనంలోని సరుకుల విలువ రూ.50వేలు దాటితే కచ్చితంగా వేబిల్లు తీసుకో వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. గతంలో అమల్లో ఉన్న వ్యాట్‌ ప్రకారం వాహనంలోని సరుకుల విలువకు సంబంధం లేకుండా ఉండేది. ఒరిజినల్‌ వేబిల్లుతో పాటు డూప్లికేట్‌ కాపీ కూడా వాహనంలో ఉండాలని, అధికారులు తనిఖీ చేసినప్పుడు ఒరిజినల్‌ వేబిల్లు ను తీసుకుంటారన్నారు.

అదే విధంగా కిలోమీటర్ల ప్రాతిపదికన వేబిల్లుల గడువు కూడా విధించారు. 100 కిలో మీటర్ల లోపు 2 రోజులు, 500 కి.మీ లోపు అయితే 3 రోజులు, 1000–2000 కి.మీ అయితే 10 రోజులు, 2 వేల పైన కి.మీ ఉంటే 12 రోజులు ఈ వేబిల్లులు చెల్లుబాటు అవుతాయి. ఈ లోపు సరుకులు గమ్యస్థానానికి చేరని పక్షంలో ఆ వేబిల్లులు చెల్లుబాటు కావు. అదే విధంగా ఒకే ఇన్వాయిస్‌ మీద ఉన్న సరుకులను రెండు వాహనాల్లో రవాణా చేయాల్సి వస్తే రెండు వేబిల్లులు తీసుకోవాలని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement