- అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
- వే బిల్లులు లేకుండానే రవాణా
- కందికట్కూర్ క్వారీలో 78 లారీలు పట్టివేత
- రూ.19.50 లక్షలు జరిమానా
సిరిసిల్ల రూరల్ : జిల్లాలో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా విదిల్చారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ ఇసుక క్వారీలపై శుక్రవారం రాత్రి దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న 78 లారీలను అడ్డుకున్నారు. వేబిల్లులు లేకుండానే ఇసుక సరిహద్దులు దాటిస్తున్నట్లు తేలింది. ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలతో తహ శీల్దార్ సుమా శనివారం పంచనామా నిర్వహించారు.
ఒక్కో లారీకి రూ.25 వేల చొప్పున రూ.19.50 లక్షలు జ రిమానా విధించారు. అయితే ఈ జరిమానా చెల్లించేందుకు క్వారీ నిర్వాహకులు, లారీ యజమానులు ముందుకురావడం లేదు. జరిమానా చెల్లించకుండా లారీలను విడిపించుకునేందుకు క్వారీ నిర్వాహకులు అధికార పార్టీ నాయకులతో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. నెల క్రితం వేములవాడ మండలం ఆరెపల్లి వద్ద లారీ ఢీకొని పది మంది మృతిచెందడంతో ఇసుక రవాణా విషయం తెరమీదికి వచ్చింది.
అయితే ఇసుక లారీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. డీఆర్‌సీ సమావేశంలోనూ ఎమ్మెల్యేలు మంత్రి వద్ద ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరడంతో ఆలస్యంగానైన రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది. శుక్రవారం బోయినపల్లి మీదుగా సిరిసిల్ల రూరల్, వేములవాడ పట్టణ, రూరల్ సీఐలు, నలుగురు ఎస్సైలు, 20 మంది సిబ్బందితో దాడు చేయడంతో అసలు విషయం బయటపడింది. అయితే ఓ మంత్రితోనే జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వడానికి ఇటు రెవెన్యూ, అటు పోలీసులు జంకుతున్నారు.
ఏడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నిమ్మపల్లి(కోనరావుపేట): మూలవాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఏడు ఇసుక ట్రాక్టర్లను అధికారులు పట్టుకుని జరిమానా విధించారు. మండలంలోని నిమ్మపల్లిలోని మూలవాగు నుంచి ప్రతి రోజూ ఇసుక రవాణా జరుగుతోంది. గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. తహశీల్దార్ ముఖీధుల్ హక్, ఆర్‌ఐ గోపాల్ వచ్చి ట్రాక్టర్లను పట్టుకున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
Published Sun, Jun 29 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM
Advertisement
Advertisement