విచారణ ఖైదీలకు సుప్రీంకోర్టు ఊరట
న్యూఢిల్లీ: విచారణ ఖైదీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సగం జైలు శిక్ష అనుభవించిన ఖైదీలను విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అక్టోబర్ 1 నుంచి వారానికొకసారి రెండు నెలలపాటు న్యాయాధికారులు(మేజిస్ట్రేట్, సెషన్స్ జడ్జి, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్) జైళ్లను సందర్శించాలని పేర్కొంది.
జైళ్ల సందర్శనలో సగం జైలు శిక్ష అనుభవించిన ఖైదీలను గుర్తించాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది విచారణ ఖైదీలకు ఊరట లభించనుంది. విచారణ పూర్తికాక, బెయిల్ దొరకని ఖైదీలు విడుదల కానున్నారు.