May Day
-
మే డే: ఫిలిం ఫెడరేషన్ ఆఫీసు వద్ద జెండా ఎగురవేసిన పరుచూరి గోపాలకృష్ణ (ఫొటోలు)
-
ఠంఛన్‌గానే పింఛన్
సాక్షి, అమరావతి: మే 1న మేడే సందర్భంగా సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఠంచనుగా పింఛన్ అందించింది. 48,92,503 లబ్ధిదారులకు రూ.1,471.22 కోట్లను నేరుగా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికి లేదా వీల్‌చైర్‌కే పరిమితమైన మరో 16,57,361 మందికి వారి ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.474.17 కోట్లను విడుదల చేయగా బుధవారం ఉదయం నుంచి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పంపిణీని ప్రారంభించారు.గత ఐదేళ్లుగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్లను అందజేసింది. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ కుట్రలతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరగకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రతినెలా ఒకటినే ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును అందుకునే లబ్ధిదారులు గత నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడంతో అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ కష్టాలకు చంద్రబాబే కారణమని వారు మండిపడుతున్నారు. ప్రతి నెలా 1నే వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారని.. ఇప్పుడు చంద్రబాబు కుట్రలతో వలంటీర్ల సేవలకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులు తమకు పచ్చమూక కుట్రలతో మళ్లీ వచ్చాయని ధ్వజమెత్తుతున్నారు.అవ్వాతాతలకు పచ్చమూక తెచ్చిన కష్టాలు..చంద్రబాబు, ఆయన సన్నిహితుల కుట్రలతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అవ్వాతాతలకు పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేవు. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లోనే బ్యాంకులు ఉన్నాయి. దీంతో మండల కేంద్రాలకు 10–15 కిలోమీటర్ల దూరంలో గ్రామాల్లో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎవరో ఒకరి సహాయం లేకుండా బ్యాంకులకు వారు వెళ్లలేరు. దీంతో ఎవరో ఒకరిని బ్యాంకు వరకు రావాలని సహాయమడగాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు వేసవి కూడా కావడంతో పింఛన్ల నగదు తీసుకోవాలంటే అవ్వాతాతలు చాలా కష్టపడాల్సి వస్తోంది. గత ఐదేళ్ల నుంచి తమ ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును నేరుగా అందుకున్న అవ్వాతాతలు బ్యాంకులకు ఎలాగోలా కష్టపడి వెళ్లినా నగదు విత్ డ్రా చేసుకోవడం తెలియదు. ఇందుకోసం వేరేవారిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇలా చంద్రబాబు, ఆయన ముఠా పన్నిన కుట్రలతో అవ్వాతాతలకు కష్టాలు తప్పడం లేదు.పింఛన్ కోసం వెళ్లి మృత్యువాతపింఛన్ కోసం అన్నమయ్య జిల్లా రాయచోటి కెనరా బ్యాంక్ దగ్గరికి వచ్చిన ముద్రగడ్డ సుబ్బన్న (80) బుధవారం వేసవి తాపానికి గురై కుప్పకూలి చనిపోయాడు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకులవరం గ్రామం పిచ్చుకగుంట్లపల్లెకు చెందిన సుబ్బన్న 1వ తేదీ కావడంతో తన పెన్షన్ డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయో, లేదో తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అయితే మే డే కారణంగా బ్యాంకుకు సెలవు కావడంతో తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో ఎండ వేడికి తాళలేక బ్యాంకు సమీపంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. సమీపంలో ఉన్న వ్యక్తులు నీళ్లు చల్లి మంచినీరు తాగించినా ప్రాణాలు దక్కలేదు.పింఛను నేరుగా ఇవ్వడం లేదని మృతివలంటీర్ల ద్వారా నేరుగా పింఛన్ ఇవ్వనీయకుండా చంద్రబాబు కుట్రలు చేశారని మనస్తాపానికి గురైప ఒక వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కళ్లా వీధికి చెందిన ఖలీల్ బేగ్ (75) ప్రతి నెలా ఇంటి వద్దనే వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేవాడు. అయితే ఈసారి పింఛన్ బ్యాంకులో వేస్తున్నారని.. అక్కడి నుంచి తెచ్చుకోవాలని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవే ఆలోచనలతో ఇంటిలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. చంద్రబాబు కుట్రలతో ఇబ్బందులునాకు వృద్ధాఫ్య పింఛన్ వస్తోంది. ఆధార్‌కు లింక్ చేసినా ఇప్పుడు నా బ్యాంక్ ఖాతా పని చేయడం లేదు. పింఛన్ వస్తుందో, లేదో అని భయంగా ఉంది. రెండు నెలల క్రితం వరకు వలంటీర్లు ఇంటికి వచ్చి తలుపు కొట్టి పింఛన్ రూ. 3 వేలు చేతిలో పెట్టేవారు. చంద్రబాబు కుట్రలకు మాలాంటి ముసలోళ్లు ఇబ్బందులు పడుతున్నారు. – గుంజి లక్ష్మీదేవిఇంత ఎండలో బ్యాంకుకు ఎలా వెళ్లేది?పింఛన్ సొమ్మును ఈసారి బ్యాంక్‌లో వేస్తారని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంక్‌కు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నాలాంటి వృద్ధులకు ఇబ్బందే. వలంటీర్లు ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేవారు. మాలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. చంద్రబాబు వల్లే మాకీ కష్టాలు. – బొబ్బ సుందరమ్మ, ఆత్మకూరు, పల్నాడుజిల్లా వలంటీర్ ఉంటే ఉదయాన్నే పింఛన్..నాకు వితంతు పింఛన్ వస్తోంది. మంచం మీద నుంచి పైకి లేవలేను. వలంటీర్ ఉన్నప్పుడు ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాడు. బాబు ఓర్వలేక వలంటీర్లను అడ్డుకున్నారు. ఇప్పుడు పింఛన్‌ను బ్యాంకు ఖాతాలో వేస్తామంటున్నారు. నేను బ్యాంక్‌కు వెళ్లలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. జగనన్న వస్తే మళ్లీ కష్టాలు తీరతాయి.– తాతపూడి రాహేలమ్మ, వెలిగండ్ల, ప్రకాశం జిల్లా బాబు మంచి చేయడు.. చేయనివ్వడు..వలంటీర్ల ద్వారా మాకు వచ్చే పింఛన్లను అడ్డుకుంది చంద్రబాబే. ఆయన మంచి చేయడు.. ఎవరైనా చేస్తుంటే చేయనివ్వడు. ఐదేళ్లుగా ఇంటివద్దే పింఛన్ అందుకున్నాను. గత రెండు నెలలుగా చంద్రబాబు, ఆయన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేశ్ కుట్రలతో మాకు కష్టాలు తెచ్చిపెట్టారు. ఇప్పుడు పింఛన్ తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. నా బ్యాంకు ఖాతా ఇప్పుడు వినియోగంలో కూడా లేదు. – గంగాబాయి, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా -
సరిగ్గా 22 ఏళ్ల క్రితం.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తోంది. అయితే ఇవాళ మేడే సందర్భంగా మెగాస్టార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.సరిగ్గా 22 ఏళ్ల క్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసిన వీడియోను పోస్ట్ చేశారు. పసి పిల్లలను పనివాళ్లుగా చేయొద్దని ఆ వీడియోను రూపొందించారు. ఇవాళ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కావడంతో మెగాస్టార్ వీడియోను పంచుకున్నారు. ఈ రోజుకీ సంబంధించిన వీడియో కావడంతో షేర్ చేస్తున్నాను అంటూ మెగాస్టార్ ట్విటర్లో రాసుకొచ్చారు. సే నో టూ చైల్డ్ లేబర్.. హ్యాపీ మే డే టూ ఆల్ అంటూ పోస్ట్ చేశారు. 22 సంవత్సరాల క్రితం ... పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దని International Labour Organisation, ILO కోసం చేసిన "చిన్ని చేతులు" campaign. ఈ రోజుకీ relevant అనిపించి share చేస్తున్నాను. Say NO to Child Labour.Happy May Day to all !International #LaborDay #MayDay pic.twitter.com/q5EqvxeoY6— Chiranjeevi Konidela (@KChiruTweets) May 1, 2024 -
May Day Special Story: ఖరీదు కట్టే షరాబు లేడు
ప్రతి శ్రమకూ ఒక విలువ ఉంటుంది.పురుషుడు విలువ కలిగిన శ్రమే చేస్తాడు. అతడిది ఉద్యోగం.స్త్రీ విలువ కట్టని ఇంటి పని చేస్తుంది.ఆమెది చాకిరి.భారతదేశంలో స్త్రీ, పురుషుల్లో స్త్రీలుఅత్యధిక గంటలు ఏ ఖరీదూ లేనిఇంటి పనుల్లో మునిగి ఉంటున్నారనిసర్వేలు చెబుతున్నాయి.దేశ యంత్రాంగాలు అంతరాయంలేకుండా ముందుకు సాగడంలోఈ శ్రమ నిశ్శబ్ద ΄ాత్ర వహిస్తోంది.స్త్రీల శ్రమకు విలువ కట్టలేక΄ోతేకనీసం గౌరవం ఇవ్వడమైనా నేర్వాలి. ఇంతకు ముందు వివరించి చెప్పడం కొంత కష్టమయ్యేది. ఇప్పుడు అర్బన్ క్లాప్ వంటి సంస్థలు వచ్చాయి కనుక సులువు. అర్బన్ క్లాప్ వారికి బాత్రూమ్ల క్లీనింగ్ కోసం కాల్ చేస్తే వాళ్లు ఒక్కో బాత్రూమ్కు ఇంతని చార్జ్ చేస్తారు. ఇంట్లో రెండుంటే రెంటికీ చార్జ్ పడుతుంది. అదీ ఒకసారికి. అమ్మ వారంలో రెండు సార్లు, నెలలో ఏడెనిమిది సార్లు రెండు బాత్రూమ్లు కడుగుతుంది. ఆమెకు ఆ చార్జ్ మొత్తం ఇవ్వాలి లెక్క ప్రకారం. అలాగే కిచెన్ క్లీన్ చేయాలంటే కూడా ఒక చార్జ్ ఉంటుంది. అమ్మ రోజూ వంటిల్లు సర్దిసర్ది, ΄్లాట్‌ఫామ్ కడిగి, స్టవ్ రుద్ది క్లీన్ చేస్తుంది. ఆ చార్జ్ కూడా ఆమెకు ఇవ్వాలి. అమ్మ శ్రమకు కనీసం విలువ కట్టాలని కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా అంటున్నాయి. కొన్ని సంస్థలు అమ్మ శ్రమను ఎలా విలువ కట్టవచ్చో కూడా చెబుతున్నాయి.1. ఆపర్చునిటీ కాస్ట్ మెథడ్: అంటే అమ్మ బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే నలభై వేలు వస్తాయనుకుంటే, ఆమె ఆ ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉండి΄ోతే ఆమె శ్రమ విలువను నెలకు నలభై వేలుగా గుర్తించాలి. (అమ్మ ఉద్యోగం చేసి కూడా అంత శ్రమా చేస్తుంటే నలభైకి మరో నలభై కలిపి ఇంటికి ఇస్తున్నట్టు).2. రీప్లేస్మెంట్ కాస్ట్ మెథడ్: ఇల్లు చిమ్మడం, బట్టలుతకడం, ఆరిన బట్టల్ని మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడం, బిల్లులు కట్టడం, వంట చేయడం, ఇంటిని కనిపెట్టుకుని ఉండటం... వీటన్నింటినీ బయట వ్యక్తులతో సర్వీసుగా తీసుకుంటే (అర్బన్ క్లాప్ మాదిరిగా) ఎంత అవుతుందో లెక్కగట్టి అది అమ్మ చేసే పని శ్రమగా గుర్తించడం.3. ఇన్పుట్/అవుట్‌పుట్ కాస్ట్ మెథడ్: అలా కాకుండా ఈ పనులన్నింటికీ ఒక యోగ్యమైన ఉద్యోగిని పెట్టుకుంటే మార్కెట్ అంచనాను బట్టి ఎంత జీతం ఇవ్వాల్సి వస్తుందో అంత జీతం ఇవ్వడం.అవన్నీ సరే. కంటికి కనిపించే పనులకు కట్టే విలువ. కాని పిల్లవాడు స్కూల్లో పడి దెబ్బ తగిలించుకుని ఇంటికి వస్తే అమ్మ దగ్గరకు తీసుకుని, మందు రాసి, ధైర్యం చెప్పి, వాడి పక్కన కూచుని కబుర్లు చెపుతుందే... ఆ ప్రేమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? మే డే రోజున ప్రపంచ కార్మికురాలా ఏకం కండి అనే నినాదాలు వినిపిస్తుంటాయి. కాని ఇంటి పని చేస్తూ, అది ఎక్కువైనా చేస్తూ, కుటుంబమంతా ఆ పనిలో భాగం కావాలన్న సంగతిని చెప్పడానికి కూడా తటపటాయిస్తూ, అది వద్దనుకుంటే ఆ ఆప్షన్ లేక, తప్పించుకోవడానికి వీల్లేని ఆ పనిని చేస్తూ కూడా విలువ లేని పని చేస్తున్నామన్న న్యూనతను అనుభవిస్తూ తమ హక్కులు ఏమిటో తమకే తెలియని తల్లి, భార్య, కుమార్తె, చెల్లెళ్లను కార్మికులుగా గుర్తించాలని ఎవరూ అనుకోరు.స్త్రీల ఇంటి శ్రమ దేశంలోని యంత్రాంగం సజావుగా పనిచేయడంలో కీలకమైనది. వారు... దేశం కోసం పని చేసి రిటైరైన వృద్ధుల సేవలో ఉంటారు. దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే యువత సేవలో ఉంటారు. దేశానికి భవిష్యత్తులో అంది రావాల్సిన పిల్లల సేవలో ఉంటారు. ‘కుటుంబం’ అనే బంధంలోకి వచ్చి కూతురిగా, కోడలిగా, భార్యగా వీరు ‘ప్రేమ’తో, ‘బాధ్యత’తో, ‘బంధం’తో ఈ సేవ చేస్తారు. అంత మాత్రం చేత ఈ సేవను నిరాకరించడానికి వీల్లేదు. శ్రమగా చూడక్కర్లేదని భావించకూడదు. ఇంత చేస్తున్నా ‘ఇంట్లో కూచుని ఏం చేస్తుంటావ్?’ అనే మాటను వాళ్లు పడాలా?ఉద్యోగం చేసినా చేయక΄ోయినా ఒక గృహిణి రోజుకు సగటున మూడున్నర గంటలు ఇంటి పని చేస్తుంటే పురుషుడు కేవలం గంటన్నర ఇంటి పని చేస్తున్నాడు.స్త్రీలు తమ ఇంటి పనిని ఒక్కరోజు మానేసి సహాయనిరాకరణ చేస్తే దేశం స్తంభిస్తుంది. అందుకే స్త్రీల శ్రమను గౌరవించే మే డే రోజున వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. విలువైన శ్రమ చేస్తున్నందుకు సమాజం వారికి హర్షధ్వానాలు తెలియచేయాలి. -
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా అరుణ పతాకం రెపరెపలతో ప్రపంచ వ్యాప్తంగా సభలు ప్రదర్శనలతో... మే డే వచ్చింది. సకల దేశాల జాతుల మతాల, కులాల కార్మికులంతా ఒకటేనని ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ దినమే మే డే. 19వ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో ఇంగ్లండ్ కేంద్రంగా యూరప్ అమెరికా లలో సంభవించిన పారిశ్రామిక విప్లవ ఫలితంగా కార్మిక వర్గం పుట్టుకతోనే సంఘటిత సమరశీల పోరాటాలకు నాంది పలికింది.ఆవిరి యంత్రం, జౌళి యంత్రాలు, రైళ్లు, టెలిగ్రాఫ్, మర మగ్గం తదితర అనేక యంత్ర సాధనాలను కనిపెట్టడంతో పారిశ్రామిక విప్లవం జరిగింది. దీని వలన అంతకు ముందు ఉన్న భూస్వామ్య ఉత్పత్తి వ్యవస్థ నిర్మూలించబడి పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ అమలులోకి వచ్చింది. కార్మిక వర్గంపై పెట్టు బడిదారీ వర్గ దోపిడీ తీవ్రంగా కొనసాగుతున్న కాలంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం సంఘటితంగా పోరాడవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ పరిస్థితుల మధ్య 18 – 16 గంటల పని నుండి 8 గంటల పని దినం కోసం కార్మిక వర్గం రక్తతర్పణ చేసిన దినమే మే డేగా ప్రసిద్ధి చెందింది. 1923 మే 1వ తేదీన లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు (ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ) సింగార వేలు ఎర్రజెండాను ఎగరవేయడంతో ఆనాటి నుండి భారతదేశంలో కార్మిక వర్గం మే డేను జరపడం కొనసాగుతూ వస్తున్నది. రష్యాలో మేడే ఉత్సవాల్లో అక్కడి కమ్యూనిస్ట్ నాయకులు 8 పని గంటల డిమాండ్‌తో పాటు చిన్న చిన్న ఆర్థిక డిమాండ్లను చేర్చడాన్ని లెనిన్ నిరసించినాడు. మే డే రాజకీయ స్వభావాన్ని తక్కువ చేసే ఆర్థిక డిమాండ్లు చేర్చ డాన్ని లెనిన్ వ్యతిరేకించారు. మే డే సందర్భంగా కార్మిక వర్గం రాజకీయ లక్ష్య సాధన కోసం ప్రతిన పూనాలని ఆయన చెప్పారు.ఆ తర్వాత కాలంలో మే డే అంతర్జాతీయ కార్మిక వర్గానికి కేంద్ర బిందువు అయింది. ఎన్నో రాజకీయ డిమాండ్లు వివిధ సందర్భాల్లో చేర్చబడ్డాయి. అంతర్జాతీయ కార్మిక వర్గ సంఘీ భావం, అందరికీ ఓటు హక్కు, సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేకత, వలసవాద అణచివేత వ్యతిరేకత, రాజకీయార్థిక సంఘాలు ఏర్పర చుకునే హక్కు, రాజకీయ ఖైదీల విడుదల వంటివి అందులో కొన్ని.మే డే రాజకీయ చరిత్ర ప్రాముఖ్యాన్ని రూపుమాపేందుకు అమెరికా బూర్జువా సంస్కరణ వాద, అవకాశవాద సంఘ నాయ కులు మే డే నాడు ప్రదర్శనలు కాకుండా సెలవు రోజు అయిన ఆది వారం జరపాలని 1890 లోనే నిర్ణయించారు. ఇటువంటి కుట్ర తోనే అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అవకాశవాద నాయకులు మే డేకు ప్రతిగా సెప్టెంబర్ ఒకటిని లేబర్ డేగా నిర్ణయించారు. అమెరికన్ ప్రభుత్వ కుట్ర పూరితంగా మే మొదటి తేదీని బాలల ఆరోగ్య దినంగా ప్రకటించింది.భారతదేశంలో మతోన్మాద అనుబంధ కార్మిక సంఘం అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ మే డేని గుర్తించకుండా ‘విశ్వ కర్మ దినం’ జరుపుతు న్నారు. మే డేకు ఉన్న వర్గ స్వభా వాన్ని మొద్దుబార్చడానికి మే డే రాజకీయ స్వభావాన్ని దెబ్బతీయ డానికి ప్రభుత్వాలు, వివిధ సంస్కరణ వాద అవకాశవాద ట్రేడ్ యూనియన్లు మే డేను రికార్డింగ్ డ్యాన్సులతో పండుగలుగా జరుపుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మే నెల మొదటి రోజున ప్రపంచ కార్మిక వర్గం కమ్యూనిస్టు పార్టీలు అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు.శ్రామిక ప్రజల దోపిడీకి, అణచివేతకు, మానవ సమాజం ఎదుర్కొంటున్న సకల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకు మూల కారణంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి కార్మిక వర్గం సంసిద్ధం కావాలనే మే డే చారిత్రక పిలుపును శ్రామిక వర్గం ఎత్తి పట్టాలి.కార్మిక వర్గ అంతర్జాతీయత వర్ధిల్లాలి!ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి!! – జంపన్న ‘ మార్క్సిస్ట్–లెనినిస్ట్ నాయకుడు(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం – మే డే)