mayor rammohan
-
మరో మూడు ఆస్పత్రుల్లో నైట్ షెల్టర్లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువుల కోసం జీహెచ్ఎంసీ మరిన్ని నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 12 ఉండగా మరో మూడింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. నిలోఫర్, మహావీర్, కోఠి ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.4.8 కోట్లతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్‌లు వీటిని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తమ వారి కోసం వచ్చే అటెండెంట్లు రాత్రివేళ బస చేసేందుకు సరైన నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నైట్ షెల్టర్లు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. -
హైదరాబాద్‌ను తీర్దిదిద్దుతాం
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రామచంద్రాపురం: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గురువారం ఆయన రామచంద్రాపురంలోని భారతీనగర్ డివిజన్లో రూ.70లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంఐజీ కాలనీలో పలు ఆభివృద్ధి కార్యక్రమలను ప్రారంభించారు. అక్కడ నుంచి విద్యుత్‌నగర్‌లో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్ధాపన చేశారు. పట్టణంలోని నాగులమ్మ దేవలయం వద్ద జాతీయ రహదారిని పరిశీలించారు. అనంతరం కార్పొరేటర్ వెన్నవరం సింధు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ది బాటలో నడుపుతున్నామన్నారు. ప్రధానంగా ముఖ్య మంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించండంలో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో మంచినీటి సమస్య లేకుండా చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అలాగే ప్రతి కార్పొరేటర్‌కు రూ.మూడు కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు. వర్షాలు పడితే నగర రోడ్లపై నీళ్లు వస్తున్నాయని దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నాలాల పరిరక్షణకు నడుం బిగించిందన్నారు. నగరంలో నాలను కబ్జా చేసి కట్టిన కట్టడాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దీని వల్ల కొందరికి నష్టం జరిగుతున్న ప్రజలకు ఎంతో మేలు జరిగిందని వివరించారు. రామచంద్రాపురం పట్టణంలో చిన్నిపాటి వర్షానికే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నీరు చేరుతోందనే విషయం సంబంధిత కార్పోరేటర్లు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. అందులో బాగంగా నాగులమ్మ గుడి సమీపంలోని రోడ్డును స్వయంగా పరిశీలించానన్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తారని హామి ఇచ్చారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు జాతీయ రహాదారిపై ఉన్న నాలాలపై బాక్స్ కల్వర్టులు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయన్నారు. విద్యుత్ నగర్లో డ్రైనేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు మేయర్‌ను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, గాంధీ, ఎమ్మెల్సీ వి. భూపాల్‌రెడ్డి, కార్పోరేటర్లు సింధు, తొంట అంజయ్య యాదవ్, నాగేందర్ యాదవ్, రాష్ర్ట సర్పంచ్ల పోరం ఆధ్యక్షుడు మల్లేపలి సోమిరెడ్డి, నాయకులు పుష్పనాగేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ
హిమాయత్‌నగర్: ఈ నెల 8న ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న మహా బతుకమ్మ ఏర్పాట్లపై మంగళవారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో రాష్ట్ర మంత్రులు సమావేశం నిర్వహించారు. గిన్నిస్‌బుక్‌లో నమోదవనున్న బతుకమ్మ మహా ప్రదర్శనపై అందరూ శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా మంత్రులు కోరారు. నగర మహిళలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఒకేసారి పది వేలమంది మహిళలు బతుకమ్మ ఆడడం అద్భుత విషయమన్నారు. కార్యక్రమంలో 20 వేల మంది మహిళలు పాల్గొనేలా కార్పొరేటర్లు కృషి చేయాలని కోరారు. ఈసందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఇరవై అడుగుల ఎత్తుతో ప్రత్యేక బతుకమ్మను ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి తెలిపారు. సమావేశంలో సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మేయర్ రామ్మోహన్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పర్యాటక సంస్థ ఎండీ క్రిస్టినా చోంగ్తు, టూరిజం శాఖ కమిషనర్ సునీతా భగవత్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ హరికృష్ణ, సాంస్కృతికశాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.