Meeku Maathrame Chepta
-
నవ్వులతో నిండిపోవడం ఆనందంగా ఉంది
తరుణ్ భాస్కర్ హీరోగా షామీర్ సుల్తాన్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ నెల 1న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘ప్రేమతో, ఇష్టంతో చేసే పనిలో దేవుడు ఉంటాడు. ఆ ఇష్టంతో విజయ్ నిర్మించిన ఈ సినిమాకు మంచి ఫలితం వచ్చింది. ప్రేక్షకులు రెండు గంటలపాటు పగలబడి నవ్వుతున్నారు. విజయ్ ఎప్పుడు దర్శకత్వం చేయాలనుకున్నా ఆ సినిమాకి నేను నిర్మాత అవుతా’’ అని అన్నారు. ‘‘మా అందరి కలలు నిజమయ్యాయి. నైజాంలో 80శాతం థియేటర్స్ ఫుల్ అయ్యాయి. వీటికంటే థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండిపోవడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. సృజన్ అనే మరో కొత్త దర్శకుడితో మరో సినిమా నిర్మిస్తున్నా’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘సినిమా విడుదలైన రోజున మూడు థియేటర్స్‌కు వెళ్లాం. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకే రెండేళ్లు కష్టపడ్డాను’’ అన్నారు షామీర్. నటుడు అభినవ్, సంగీత దర్శకుడు శివకుమార్, ఎగ్జిక్యూటివ్ పొడ్యూసర్ అనురాగ్ మాట్లాడారు. -
‘మీకు మాత్రమే చెప్తా’ థ్యాంక్యూ మీట్
-
మీకు మాత్రమే చెప్తా : మూవీ రివ్యూ
-
నేనే దర్శకుడినైతే అనసూయను..
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని అంటారు. ఈ నానుడి సినిమా పరిశ్రమకు వర్తిస్తుందని హీరో విజయ్ దేవరకొండ నిరూపించారు. ఒకప్పుడు తనను విమర్శించిన ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్‌కు తన సినిమాలో ప్రధాన పాత్ర ఇచ్చి తాను పక్కా ప్రొఫెషనల్ అని నిరూపించారు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో నటించిన విజయ్‌పై గతంలో అనసూయ ట్విటర్లో విమర్శలు చేశారు. ఈ విషయాన్ని మర్చిపోయి అనసూయకు తన సినిమాలో అవకాశం ఇచ్చారు విజయ్. దీని గురించి అడిగినప్పుడు.. ‘క్షమించే స్వభావం ఉన్న వ్యక్తిని నేను. మా సినిమా కోసం అనసూయను ఎంపిక చేసింది దర్శకుడే. ఆమె అయితేనే ఆ పాత్రకు సరిపోతారని చెప్పాడు. వ్యక్తిగత వివాదాల కంటే పని ముఖ్యం. ఒకవేళ నేనే ఈ సినిమాకు దర్శకత్వం చేసుంటే ఆమెను తీసుకునేవాడినో, కాదో చెప్పలేను. నేను దర్శకత్వం చేయలేదు కాబట్టి ఏ డిపార్ట్మెంట్లోనూ జోక్యం చేసుకోలేదు. దర్శకుడి ఇష్టప్రకారమే నటీనటుల ఎంపిక జరిగింది. షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారి కూడా నేను సెట్‌కు వెళ్లలేదు. మా సినిమాలో నటించడానికి అనసూయ అంగీకరించడం సంతోషం కలిగింది. తన పాత్రలో చాలా బాగా నటించింది. షామీర్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నిర్మాతగా దర్శకుడు అడిగినవన్నీ సమకూర్చాను’ అని విజయ్ పేర్కొన్నారు. ఆయన నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’. సినిమా నేడు విడుదలయింది. ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్ హీరో నటించిన ఈ సినిమాకు షామీర్ సుల్తాన్ దర్శకుడు. (చదవండి: ‘మీకు మాత్రమే చెప్తా’ ఎలా ఉందంటే..) -
మీకు మాత్రమే చెప్తా : మూవీ రివ్యూ
టైటిట్: మీకు మాత్రమే చెప్తా జానర్: యుత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు: తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్ నిర్మాతలు: వర్ధన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ బ్యానర్: కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ టాలీవుడ్లో స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఎలాంటి వారసత్వం లేకపోయినా.. చిన్నచిన్నగా అడుగులు వేస్తూ.. పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందంలాంటి సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్.. ఇటు నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో తనకు మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. ఆయన తొలిసారిగా నిర్మించిన యుత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘మీకు మాత్రమే చెప్తా’ . ఈ సినిమాతో దర్శకుడి రోల్ నుంచి హీరో రోల్‌లోకి తరుణ్ భాస్కర్ షిఫ్ట్ అవ్వగా.. అతని సరసన కన్నడ నటి వాణీభోజన్ హీరోయిన్గా నటించింది. విజయ్ నిర్మాతగా మారడం, తరుణ్ హీరో అవతారం ఎత్తడంతో సహజంగానే యుత్‌లో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అనుకున్నట్టుగానే యుత్‌ను ఈ సినిమా ఆకట్టుకుందా? ఒకప్పుడు ‘పెళ్లిచూపులు’ సినిమాతో విజయ్-తరుణ్ జోడీ టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మారిన రోల్స్‌తో ఈ ఇద్దరు మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేశారా? కథ: రాకేశ్ (తరుణ్ భాస్కర్), కామేశ్ (అభినవ్ గోమటం) జాన్‌జిగిరీ దోస్తులు. ఒక టీవీ చానెల్లో ఇద్దరూ పనిచేస్తుంటారు. రాకేశ్, కామేశ్ ఇద్దరూ డాక్టర్లను ప్రేమిస్తారు. రాకేశ్ ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తుంటాడని ప్రతి విషయంలోనూ అతని లవర్ స్టెఫీ అనుమానిస్తూ ఉంటుంది. పెదవాళ్లను ఒప్పించి రాకేశ్ స్టెఫీని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో పెళ్లికి రెండురోజుల ముందు రాకేశ్ ఫోన్‌కు ఒక వీడియో వస్తుంది. ఒక అమ్మాయితో హానీమూన్‌లో గడుపుతున్నట్టు ఆ వీడియో ఉంటుంది. ఎవరో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఈ వీడియో పెళ్లికి ముందు బయటపడితే.. తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని రాకేశ్ తీవ్రంగా టెన్షన్ పడుతుంటాడు. మరోవైపు స్టెఫీని లవ్ చేస్తున్న ఆమె బావ జాన్సన్ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంకోవైపు ప్రతి విషయంలో రాకేశ్ అబద్ధాలు చెప్తున్నాడని స్టెఫీని అనుమానిస్తుంటుంది. అసలు ఈ వీడియో ఎక్కడిది? నిజంగానే ఓ యువతితో రాకేశ్ గడిపాడా? ఆ వీడియోను డిలీట్ చేసేందుకు రాకేశ్, కామేశ్ ఏం చేశారు? కింగ్ హ్యాకర్ ఎవరు? చివరకు రాకేశ్ పెళ్లి ఎలా జరిగింది? కామేశ్ మీకు మాత్రమే చెప్తా అని మొదలుపెట్టిన ఈ కథ అసలు ఎవరిది అన్నది తర్వాతి కథ. విశ్లేషణ: ప్రజల వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో లీకై రచ్చరచ్చ అవ్వడం.. ఎన్నో దురాగతాలు జరగడం చూస్తూనే ఉన్నాం. ఇది సుమారు అలాంటి కథే కానీ, కేవలం కామెడీ ఎంటర్టైనర్గా ఒక చిన్న పాయింట్ చుట్టే దర్శకుడు షమ్మీర్ ఈ కథను తిప్పాడు. ఎంచుకున్న పాయింట్ కొత్తదే అయినప్పటికీ.. పెద్దగా ట్విస్టులు, మలుపులు లేకుండా కేవలం కామెడీ ఎంటర్టైనర్గా మలచడంపైనే దర్శకుడి దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. పెళ్లికి రెండురోజుల ముందు తన ‘పర్సనల్ వీడియో’ బయటపడటంతో ఓ వ్యక్తి ఎలాంటి తిప్పలు పడ్డాడన్నది ఆసక్తికరంగా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంలో దర్శకుడు కొంతమేరకు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా కామెడీతో ప్రేక్షకులను నవ్వించేలా సాగుతోంది. అయితే, సెకండాఫ్‌లో అంతగా కామెడీ లేకపోవడంతోపాటు స్క్రీన్‌ప్లే పెద్దగా ఇంట్రస్టింగ్‌గా సాగకపోవడంతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. తొలిసారిగా హీరోగా చేసిన తరుణ్ భాస్కర్ తన నటనతో సినిమాకు ప్లస్ అయ్యాడు. చాలా సీన్లలో తరుణ్ సహజంగా నటించాడు. తరుణ్ ఫ్రెండ్ కామేశ్‌గా అభినవ్ గోమటం మరోసారి అలరించాడు. తనదైన స్టైల్లో సినిమాలో నవ్వులు పూయించాడు. హ్యాకర్ పపా అక్కగా అనసూయ కీలక పాత్రలో కనిపించారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా.. నేపథ్య సంగీతం సినిమాను బాగా ఎలివేట్ చేసింది. వాణీ భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ తమ పరిధిలో పాత్రలకు న్యాయం చేశారు. సినిమా చివర్లో వచ్చే ‘మీకు మాత్రమే చెప్తా’ పాటలో విజయ్ దేవరకొండ అలరించాడు. మొత్తానికి విజయ్-తరుణ్ తమ రోల్స్ మార్చుకొని కొత్త రోల్స్‌తో తీసిన ఈ సినిమా యూత్‌ను కొంచెం ఆకట్టుకోవచ్చు. బలాలు తరుణ్ భాస్కర్ కామెడీ ఫస్టాప్ బలహీనతలు సెకండాఫ్ కొన్ని సాగదీత సీన్లు - శ్రీకాంత్ కాంటేకర్ -
టికెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ
సాక్షి, హైదరాబాద్: విజయ్ దేవరకొండ కొత్త అవతారం ఎత్తాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నిర్మాతగా మారిన అతడు కౌంటర్లో కూర్చొని సినిమా టికెట్లు అమ్మాడు. పెళ్లి చూపులు చిత్రంతో విజయ్‌కు సినీ లైఫ్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో హీరోగా పరిచయం చేశాడు. కామెడీ మూవీ అయిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విజయ్ ఐమాక్స్ థియేటర్లోని కౌంటర్లో టికెట్లు అమ్మాడు. అయితే విజయ్ టికెట్లు అమ్ముతున్నట్లు విషయం తెలుసుకున్న ప్రేక్షకులు థియేటర్ దగ్గర గుమిగూడారు. అభిమాన హీరో చేతుల మీదుగా టికెట్లు తీసుకునేందుకుఎగబడ్డారు. రౌడీ అమ్మిన టికెట్లు సొంతం చేసుకున్న ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ మొట్టమొదటిసారిగా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో తరుణ్ భాస్కర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాసేపు నవ్వుకోడానికైనా ఈ సినిమాను చూడొచ్చు అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌ను ఇలా భిన్నంగా కూడా చేయవచ్చని విజయ్ నిరూపించాడు. టికెట్లు కొన్నవారికి అద్భుత ఆఫర్లు కూడా ప్రకటించాడు. టికెట్లు దక్కించుకున్న ప్రేక్షకులకు ఉచిత పాప్‌కార్న్ అందించాడు. -
ఇంకో సినిమా నిర్మించే ధైర్యం వచ్చింది
‘‘కొత్త సినిమాకి నిర్మాత దొరక్కపోతే ఎంత కష్టం అనేది ‘పెళ్ళి చూపులు’ టైమ్‌లో చూశా. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఎంతోమంది. అందుకే.. ఇప్పుడు నేను ఉన్న ఈ స్టేజ్‌లో ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చని ‘మీకు మాత్రమే చెప్తా‘ సినిమా నిర్మించా’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. తరుణ్ భాస్కర్, వాణీ భోజన్, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో షామీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు. ► ‘మీకు మాత్రమే చెప్తా’లో మీరు హీరోగా ఎందుకు నటించలేదు? నేను ‘పెళ్ళి చూపులు’ సినిమా చేసిన తర్వాత షామీర్ సుల్తాన్, ‘మీకు మాత్రమే చెబుతా’ కో– డైరెక్టర్ అర్జున్ నన్ను కలిశారు. అప్పటికే వాళ్లు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఏ మాత్రం బడ్జెట్ లేకున్నా చాలా రిచ్‌గా తీశారు. వాళ్ల ప్రతిభ చూసి ఓ సినిమా చేస్తానని చెప్పా. ‘అర్జున్ రెడ్డి’ విడుదల కాకముందు ‘మీకు మాత్రమే చెప్తా’ కథ చెప్పారు. నేను కూడా చేద్దామనుకున్నాను. ‘అర్జున్ రెడ్డి’ విడుదల తర్వాత నేనీ సినిమా చేయడం కరెక్ట్ కాదనిపించింది. వేరే నిర్మాతల కోసం తిరుగుతున్నాం కానీ వర్కవుట్ కాలేదని ఆ ఇద్దరూ అన్నారు. కథపై, వారిపై ఉన్న నమ్మకంతో నేనే నిర్మాతగా మారి ఈ సినిమా చేశా. ► మీ ‘పెళ్ళిచూపులు’ చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్‌నే ఈ సినిమాకిæహీరోగా పెట్టుకోవడానికి కారణం? ఈ చిత్రంలోని రాకేశ్ పాత్రకి నవీన్ పొలిశెట్టి, తరుణ్ భాస్కర్ సరిపోతారనిపించింది. ‘పెళ్ళిచూ పులు’ సినిమా చేస్తున్నప్పుడు ఆయా సన్నివేశాల్లో ఎలా నటించాలో తరుణ్ చేసి చూపించేవాడు. ఆ సమయంలో నిజంగా మాకంటే బాగా నటించేవాడు. అందుకే తరుణ్‌ని లీడ్ రోల్ చేయమని అడిగాను. ఏదో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నానే కానీ లీడ్ రోల్ కష్టం, నా దృష్టి డైరెక్షన్పైనే అన్నాడు. ఓ సారి కథ వినమని చెప్పా. విన్నాక ఒప్పుకున్నాడు. ► ఈ సినిమా కథలో మీరు కల్పించుకున్నారా ? స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశాక ఎక్కడా కల్పించుకోలేదు. సెట్‌కి ఒక్కసారి మాత్రమే వెళ్లాను. అది కూడా ఓ సారి వస్తే బాగుంటుంది అని వారు అడిగితేనే వెళ్లా. సంగీతం గురించి మాత్రమే నాతో చర్చించేవాళ్లు. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా కొంచెం చూశా. మిగిలినవాటి గురించి అస్సలు పట్టించుకోలేదు. అల్లు అరవింద్‌గారి వంటి నిర్మాత కూడా సెట్స్‌లో మాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు. మా యూనిట్‌కి నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. ► నిర్మాణం రిస్క్ అనుకోలేదా? నేనిప్పటివరకూ చేసిన కొన్ని సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో 70 శాతం ‘మీకు మాత్రమే చెప్తా’కి పెట్టాను. ‘ఇప్పుడు మనకెందుకురా ప్రొడక్షన్’ అని మా నాన్న (వర్థన్) అన్నారు. అయితే కథ బాగుంది.. ఈ టీమ్‌పై పూర్తి నమ్మకం ఉంది. పైగా డబ్బులు పోయినా మళ్లీ సంపాదించుకోవచ్చనే నమ్మకంతో రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశాను. నా మీద నమ్మకంతో నా నిర్మాతలు డబ్బు ఖర్చు పెట్టకపోతే నేను ఇప్పటికీ ఓ చిన్న ఇంట్లో నెలకు రూ. 3000 అద్దె కట్టుకుంటూ, తర్వాతి నెల ఎలా? అంటూ ఇబ్బందులు పడేవాణ్ణి. ► ‘మీకు మాత్రమే చెప్తా’లో మీకు నచ్చిందేంటి? ఈ కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు కూడా మా సినిమా చూసి థియేటర్ నుంచి బయటకి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తే నాకు తృప్తి. ఈ రోజుల్లో వినోదం వర్కౌట్ అవుతుంది. సినిమా చూశాక బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశాం అని ప్రేక్షకులు భావిస్తారు. ► కొత్తవాళ్లతో ఇంకా సినిమాలు నిర్మిస్తుంటారా? ముందు ముందు కూడా చేయాలని ఉంది. మా సినిమాని సునీల్ నారంగ్‌గారు అడ్వాన్స్ ఇచ్చి కొన్నప్పుడు మా నాన్నగారి కళ్లలో నీళ్లు తిరిగాయి. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్.. ఇవన్నీ జరిగిన తీరు చూస్తుంటే ఇంకో సినిమా చేయడానికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ► మీరు హీరోగా చేస్తున్న సినిమాల గురించి... క్రాంతి మాధవ్‌గారి దర్శకత్వంలో చేస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఎనిమిది రోజులు షూటింగ్ మిగిలి ఉంది. పూరి జగన్నాథ్‌గారితో చేయబోయే ‘ఫైటర్’ జనవరిలో ప్రారంభమవుతుంది. ఆనంద్ అన్నామళై దర్శకత్వంలో చేస్తోన్న ‘హీరో’ సినిమా తర్వాత శివ నిర్వాణతో ఒక సినిమా ఉంటుంది. -
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటం నా బాధ్యత
‘‘విజయ్ వాళ్ల నాన్న గోవర్థన్‌తో వర్క్ చేశాను. చాలామంచి వ్యక్తి. ఈ చిత్రం ట్రైలర్ చూశాను, బావుంది. సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ చిత్రంతో పాటు విజయ్ చేస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవ్’ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు పూరి జగన్నాథ్. ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్ హీరోగా ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా షామీర్ సుల్తాన్ దర్శకునిగా చేసిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో పూరి జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘విజయ్, తరుణ్ ఎదిగిన తీరు చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది. ఈ చిత్రం ట్రైలర్ చూశాను. చాలా బాగుంది’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఐదారేళ్ల క్రితం టీవీలో సెలబ్రిటీలందరినీ చూసి నటుడవ్వాలనే కోరిక ఉండేది. అప్పుడు మా నాన్న నన్ను పూరిగారి దగ్గర వర్క్ చేయమని చెప్పారు. ఇప్పుడు నేను పూరిగారితో వర్క్ చేయటం మర్చిపోలేని అనుభూతి. కలలు కనండి, వాటిని నిజం చేసుకోవటానికి కష్టపడండి. నన్ను చాలామంది సపోర్ట్ చేయటంతో ఈ స్థానంలో ఉన్నాను. అందుకే నేను కొత్తవారిని సపోర్ట్ చేస్తున్నాను. నా సక్సెస్‌కు కారణం సందీప్‌రెడ్డి వంగా. నిర్మాత సురేశ్‌బాబు గారు నా మొదటి సినిమా నుండి సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘విజయ్ దేవరకొండ చేసే ఏ ప్రయత్నమైనా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు తరుణ్ భాస్కర్. షామీర్ మాట్లాడుతూ– ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్‌కి, వర్థన్ గారికి థ్యాంక్స్. రాకేశ్ పాత్రలో తరుణ్ భాస్కర్ చక్కగా నటించారు. అంతేకాకుండా ఎడిటింగ్, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లో చాలా సపోర్ట్ చేశారు. సినిమా విడుదల తర్వాత అందరి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి’’ అన్నారు. నిర్మాతలు కె.ఎస్.రామారావు, మధురా శ్రీధర్, గోవర్థన్ దేవరకొండ, చార్మి తదితరులు పాల్గొన్నారు. -
జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ.. నేను హీరో ఏంటి?
‘‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నువ్వే హీరో అని విజయ్ దేవరకొండ అన్నప్పుడు, నేను హీరో ఏంటి? అనుకున్నాను. ‘నాకు జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ’ అని విజయ్‌తో చెప్పాను. ‘ఏం ఫర్వాలేదు’ అన్నాడు’’ అని అన్నారు తరుణ్ భాస్కర్. ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. వాణీ భోజన్, అనసూయ, అభినవ్ గోమటం ముఖ్యపాత్రల్లో షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. హీరో విజయ్ దేవరకొండ, వర్థన్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్, చిత్రంలో కీలక పాత్ర చేసిన అభినవ్ గోమటం చెప్పిన విశేషాలు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘విజయ్ దేవరకొండ కోసం తమిళ దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ కథను వినిపించారు. విజయ్‌కి కథ చాలా నచ్చింది కానీ తనకు సెట్ కాదనిపించింది. ఈ కథ మిస్ అవ్వకూడదనుకున్నాడు. నన్ను కథ వినమన్నాడు. ఫ్రెండ్లీగా విన్నాను. ఆ తర్వాత నువ్వే హీరో అన్నాడు. నిర్మాతగా విజయ్ ఎక్కడ వరకూ ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడి వరకే ఉండేవాడు. ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ అంతా ముగిసిన తర్వాత ‘బరువు తగ్గాలి తరుణ్’ అని విజయ్ చెప్పాడు. ‘పెరగడం తప్ప తగ్గడం నాకు తెలియదు’ అన్నాను. ఆ తర్వాత మెల్లిగా తగ్గాను. – నేను హీరోగా చేయాలనుకున్నప్పుడు మా ఆవిడ నాతో మాట్లాడలేదు (నవ్వుతూ). చిన్న చిన్న పాత్రలు చేస్తునప్పుడు ఎంకరేజ్ చేసింది. కానీ హీరోగా చేయడం నచ్చలేదు. అయితే మా అమ్మ ప్రోత్సహించారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ‘ఫిదా’ సినిమాలో మా అమ్మకు నటించే అవకాశం వచ్చింది. ‘విధవరాలికి ఇవన్నీ ఎందుకు?’ అని కొందరు బంధువులు కామెంట్ చేశారు. ‘అమ్మా ఇది నీ లైఫ్. నువ్వు చేయాలనుకుంది చెయ్. పక్కనోళ్ల మాటలు పట్టించుకోకు’ అని ధైర్యం చెప్పాను. అవే మాటలు నాకు మళ్లీ గుర్తు చేసింది అమ్మ. కొడుకు హీరో అంటే ఏ అమ్మకైనా ఆనందమే కదా. – ప్రస్తుతం వెంకటేశ్‌గారి కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాను. ‘ఈ నగరానికి ఏమైంది’ కొనసాగింపుగా వెబ్ సిరీస్ చేస్తున్నాం. ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌లో నా పోర్షన్‌కి కథ సిద్ధం చేసుకున్నాను. సెల్‌ఫోన్ వల్ల ఇబ్బందులు అభినవ్ గోమటం మాట్లాడుతూ – ‘‘నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. సినిమాలంటే ఆసక్తితో థియేటర్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం హిట్ కావడంతో పాటు నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తరుణ్ భాస్కర్‌తో నాకున్న ప్రయాణంతో ‘మీకు మాత్రమే చెప్తా’లో చేయమని అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. ఈ కాన్సెప్ట్‌ని షమ్మీర్ మొదట విజయ్‌కు చెప్పాడు. ‘అర్జున్ రెడ్డి’ విడుదల తర్వాత విజయ్ చేద్దామనుకున్న ప్రాజెక్ట్ ఇది. తరుణ్ భాస్కర్లో డైరెక్షన్ స్కిల్స్‌తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని తెలియడంతో హీరోగా నటించాడు. మొబైల్ వాడకం వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని వినోదాత్మకంగా చెప్పాం.ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’, జయంత్ సి. పరాన్జీగారి సినిమాతో పాటు సుశాంత్ సినిమాలో నటిస్తున్నాను’’ అన్నారు. -
‘మూస్కొని పరిగెత్తమంది’
‘మీకు మాత్రమే చెప్తా’ టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచేసిన చిత్రయూనిట్.. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ సక్సెస్ జోరులోనే మరో సర్ప్రైజ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా తొలి లిరికల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది. ‘ఈ రోజు పొద్దున్నేపెద్ద పులి నన్నే ఎందుకో తరుముతోంది. అరె ఎందుకని తిరగి నేనడిగిగా.. పులి మూస్కోని పరిగెత్తమంది’అంటూ సాగే గీతాన్ని రాకేందు మౌళి రచించగా శివకుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. సింగర్ రేవంత్ ఆలపించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ‘మీకు మాత్రమే చెప్తా’తో హీరోగా మార్చాడు టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ ఈ చిత్రన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనిలో భాగంగా మూవీ ప్రమోషన్స్‌ను కూడా చిత్రయూనిట్ ప్రారంభించింది. ప్రిన్స్ మహేశ్ బాబుతో ట్రైలర్ లాంచ్ చేయించి సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తుంటే.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. -
‘మూస్కొని పరిగెత్తమంది’
-
ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది
‘‘విజయ్ ప్రొడ్యూసర్, తరుణ్ భాస్కర్ హీరో అని వినగానే కొత్తగా అనిపించింది. నాకు బాగా నచ్చిన సినిమా ‘పెళ్ళి చూపులు’. నిర్మాతగా విజయ్ చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ చాలా బాగుంది. కథ ఆసక్తిగా అనిపించింది’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి ముఖ్య తారలుగా షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని మహేశ్‌బాబు విడుదల చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మీకు మాత్రమే చెప్తా’ కథాంశం బాగా నచ్చి నేనే నిర్మించా. నిర్మాత బాధ్యతలు మా నాన్న వర్ధన్ దేవరకొండగారు తీసుకున్నారు. నా మనసుకు నచ్చిన సినిమా ఇది. నా అభిమాన హీరో మహేశ్‌గారు ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ మూవీలో నన్ను హీరో అంటున్నారు. కానీ, నేను ఓ నటుడిగానే భావిస్తున్నా. కథ, కథనాలు ఫన్‌గా ఉంటాయి’’ అన్నారు తరుణ్ భాస్కర్. ‘‘ఈ సినిమా ఓ సంఘటన ఆధారంగా ఉంటుంది. డైలాగ్స్ రాసిన తరుణ్ భాస్కర్‌కి థ్యాంక్స్. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్‌తో ఎంటర్టైన్ చేయబోతున్నాం’’ అన్నారు షమ్మీర్ సుల్తాన్. నటీనటులు అనసూయ భరద్వాజ, వాణి భోజన్, అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మదన్ గుణదేవా, సంగీతం: శివకుమార్, లైన్ ప్రొడ్యూసర్: విజయ్ మట్టపల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనురాగ్ పర్వతనేని. -
మీరు చూడబోయే వీడియో మీదే అయితే..?
-
ప్రతి ఒక్కరి ఫోన్లో కచ్చితంగా ఒక సీక్రెట్ ఉంటుంది
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడని వారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కనీసం ఒక్క రహస్యమైనా నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి రహస్యం దాచుకున్న ఓ స్మార్ట్ ఫోన్ మాయం అయితే.., అందులో ఉన్న సీక్రెట్ బయటకు వచ్చేస్తే.. అప్పుడు ఏం జరుతుంది? మన దేశంలో ప్రతి ఒక్కరు సుమారుగా 6 గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు చూస్తారట. వాటిల్లో మన వీడియో ఉంటే? ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాయే ‘ మీకు మాత్రమే చెప్తా’. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించాడు. సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా బుధవారం ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ విడుదలైంది. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ప్రకారం.. పెళ్లికి ఒక్క రోజు ముందే హీరోకి సంబంధించిన ఓ సీక్రేట్ వీడియో లీకైపోతుంది. దీంతో హీరో అండ్ గ్యాంగ్ కంగారు పడిపోతుంది. వీడియో వల్ల పెళ్లి ఆగిపోతే ఎలా? తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే ఎంటి పరిస్థితి. పుట్టబోయే కొడుకు ఆ వీడియో చూస్తే ఎంత ఘోరంగా ఉంటుందని అని హీరో టెన్షన్ పడతాడు. అసలు లీకైన వీడియో ఎంటి.. హీరో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు అని తెలుసుకోవాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే. తరుణ్ భాస్కర్ నటన సహజంగా ఉంది. అతను చెప్తే డైలాగ్స్ ఫన్నీగా అనిపించాయి. విజయ్ దేవరకొండని అక్కడక్కడ అనుకరిస్తున్నాడేమో అనిపిస్తోంది. ట్రైలర్లో చూపించిన ఫన్ వర్కవుట్ అయితే.. నిర్మాతగా విజయ్‌కు తొలి విజయం దక్కినట్టే. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వినయ్ వర్మలు నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్కు షమ్మిర్ సుల్తాన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు.