Mehta
-
Archa Mehta: ఎక్స్పరిమెంటలిస్ట్
సంజయ్ లీలా భన్సాలీ సినిమా అంటే ఫ్యాషన్ డిజైనర్లందరికీ పండుగ! ఆయన సినిమా విడుదల తర్వాత చిన్న చిన్న బోటీక్ ఓనర్స్ నుంచి టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ దాకా అందరూ ఆ చిత్రం రిఫరెన్స్‌తో కొత్త కలెక్షన్స్‌ను విడుదల చేస్తారు. అలాంటిది కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా తొలి అవకాశమే సంజయ్ లీలా భన్సాలీ మూవీలో వస్తే.. అదృష్టమే అనుకుంటారు! అలాంటి చాన్స్ దక్కించుకున్న అదృష్టవంతురాలే ఇక్కడ పరిచయమవుతున్న స్టయిలిస్ట్ అర్చా మెహతా!అర్చా మెహతా స్వస్థలం ఢిల్లీ. కెరీర్ విషయంలో తండ్రి ఏం చెప్తే అదే అనుకొని, ఇంటర్ అయిపోగానే ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది. కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో భాగమైన ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నది. అప్పుడు గ్రహించింది తన అసలు ప్యాషన్ ఫ్యాషనే అని! ఆ విషయాన్ని తండ్రితోనూ చెప్పింది. కూతురి ఇష్టాన్ని గుర్తిస్తూ ఆయన వెంటనే అర్చాను ఇంజినీరింగ్ మాన్పించి, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం లండన్ పంపించాడు. అక్కడ ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌తో పాటు స్టయిలింగ్ గురించి కూడా తెలుసుకుంది. కోర్స్ పూర్తవగానే అక్కడే సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. తర్వాత ముంబై చేరింది. వెంటనే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘గోలియోంకీ రాస్లీలా రామ్‌లీలా’కి అసిస్టెంట్ స్టయిలిస్ట్, అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసే అవకాశం దొరికింది. అది పనిలో అనుభవాన్నే కాదు.. టాలీవుడ్లో ఎంట్రీనీ కల్పించింది. ‘హార్ట్ ఎటాక్’ మూవీలో అగ్రతారలకు స్టయిలిస్ట్‌గా! అందులో ఆమె కేవలం కాస్ట్యూమ్స్ మీదే కాదు స్కార్ఫ్‌లు, యాక్ససరీస్, ఆఖరకు పచ్చబొట్టు లాంటి వాటిపైనా దృష్టి పెట్టి స్టయిలింగ్ చేసింది. తక్కువ ఎక్స్‌పోజింగ్‌తో ట్రెండీ లుక్ ఇచ్చినందుకు హీరోయిన్స్ ఆదా శర్మ మెప్పును కూడా పొందింది. అప్పటి నుంచి అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఆ స్కిల్‌కి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది ఫిదా అయ్యారు. ఆ జాబితాలో కీర్తీ సురేశ్, మృణాల్ ఠాకుర్, కృతీ శెట్టీ, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్, సంయుక్తా మీనన్, కళ్యాణీ ప్రియదర్శన్, కేథరిన్ త్రెసా, హన్సిక, మెహ్రీన్, ప్రణీత, దిశా పాట్నీ, నుస్రత్ భరూచా ఎట్సెట్రా ఉన్నారు. వాళ్లంతా అర్చాను తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఈ హీరోయిన్స్‌కే కాదు శర్వానంద్, నితిన్ లాంటి హీరోలకూ ఆమె స్టయిలింగ్ చేస్తోంది. ∙దీపిక కొండి -
ఎండకు గొడుగు పట్టారు..
మండుతున్న ఎండల్లో రోడ్డు మీద పుచ్చకాయ ముక్కలు కనిపిస్తే వెంటనే ఆగిపోతాం.ఓ కప్పు తాజా పుచ్చకాయ ముక్కలు తిని సేదదీరుతాం. ఇంటి నుంచి బయటకు వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి ఇల్లు చేరేలోపు ఏర్పడే అవసరం అది. మరి అదే ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రకోపాన్ని భరిస్తూ పుచ్చకాయ ముక్కలమ్ముకునే వ్యక్తి పరిస్థితి ఏంటి? 52.9 డిగ్రీలకు చేరిన ఎండలో ఎన్ని పుచ్చకాయలు తింటే అతడికి సాంత్వన దొరుకుతుంది. తనకు, తన తల మీద నాట్యమాడుతున్న సూర్యుడికి మధ్య ఏ అడ్డూ లేదు. వర్షాకాలంలో మొక్కజొన్న కండెలు కాలుస్తూ, ఎండాకాలంలో పండ్ల ముక్కలమ్ముకుంటూ... బతుకు బండి ఈడ్చడానికి ఏ ఎండకా గొడుగు పట్టే తనకు గొడుగుపట్టేదెవరు? ఎండనే గొడుగు చేసుకుని బతుకీడుస్తున్న ఇలాంటి వాళ్లకు గొడుగులు పంచుతున్నారు ఢిల్లీలోని నలుగురు యువతులు అనూష అత్రీ, భావని సింగ్, ఖుషీ సింగ్, వశిఖా మెహతా.‘సమాజంలో సహాయం అవసరమైన వాళ్లు అనేకమంది ఉన్నారని కరోనా సమయంలో తెలిసింది’ అంటూ తమ సేవా ప్రస్థానాన్ని వివరించారు. ‘సేవ’ అవసరం ఉంది! ‘‘మా సర్వీస్ కరోనా సమయంలో మాస్క్‌లు పంచడంతో మొదలైంది. కరోనా కరాళనృత్యం చేస్తున్న రోజుల్లో కూడా శ్రామికులు కొంతమంది మాస్కు కూడా లేకుండా పనులకు వెళ్లడం మమ్మల్ని ఆందోళన పరిచింది. తమ ఆరోగ్యభద్రత కోసం కనీసంగా కూడా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. వాళ్ల అలసత్వం, నిర్లక్ష్యానికి కారణం చైతన్యం లేకపోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన వెసులుబాటు లేకపోవడం. కనీసం మాస్కు అయినా ఇవ్వగలిగితే మంచిది కదా అనుకున్నాం. మా పేరెంట్స్ మాకు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో కొంత తీసి మాస్కులు కొని పంచాం. ఒకసారి మురికి వాడల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు తెలిశాయి. వాళ్లు ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని తెలిసి హెల్త్ క్యాంపులు పెట్టి ఉచితంగా మందులిచ్చాం. సమాజానికి చేయాల్సిన సేవ చాలా ఉందని తెలిసి ‘వారియర్స్ వితవుట్ ఏ కాజ్’ పేరుతో ఎన్జీవో ్రపారంభించాం. చదువు అవసరాన్ని తెలియచేయాల్సిన పరిస్థితి ఇంకా దేశంలో నెలకొని ఉందంటే నమ్ముతారా? చదువు జీవితాన్ని మెరుగుపరుస్తుందని వివరించినప్పటికీ వారిలో ఏదో నిర్లిప్తత. హెల్త్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అవేర్‌నెస్‌తోపాటు రుతుక్రమ పరిశుభ్రత కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు ఫైనాన్షియల్ లిటరసీ కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. మేము సర్వీస్ అందిస్తున్న వాళ్లలో చాలామందికి తమకు చేతనైన పని చేసి ఓ వంద రూపాయలు సంపాదించుకోవడం తెలుసు. కానీ పని దొరకని రోజు కూడా భోజనం చేయాలంటే ఈ రోజు సంపాదించిన వందలో ఓ పది రూపాయలు దాచుకోవాలని తెలియదు. పని దొరక్కపోతే పస్తులుండడమే ఇంతవరకు వాళ్లకు తెలిసిన జీవితం. అలాంటి కుటుంబాలలో మహిళలను సమీకరించి వాళ్లు చేసే పనులతోనే డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆడవాళ్లందరికీ ఊలుతో స్వెట్టర్లు, టోపీలు అల్లడం వచ్చి ఉంటుంది. వాళ్లను సంఘటిత పరిచి క్రోషియో నిట్టింగ్ బ్యాగ్‌లు, ఊలు ఉత్పత్తుల తయారీని ్రపోత్సహించాం. ఆ మహిళలను స్థానికంగా ఎగ్జిబిషన్లు నిర్వహించే సంస్థలతో అనుసంధానం చేయగలిగాం. ఈ ఏడాది ‘బీట్ ద హీట్’ క్యాంపెయిన్ చేపట్టాం. ఇందులో భాగంగా రోడ్డు పక్కన బండి పెట్టుకుని పుచ్చకాయ ముక్కలమ్మేవాళ్లు ఇతర చిన్న చిన్న వస్తువులమ్ముకునే వాళ్లకు మొత్తం ఐదువేల మందికి గొడుగులిచ్చాం. పండ్లు, సోడాలమ్ముకునే వాళ్ల కంటే స్టవ్ పెట్టి వండే వాళ్ల పరిస్థితి ఇంకా ఘోరం. ఎర్రటి ఎండలో బండి మీద స్టవ్ పెట్టుకుని బ్రెడ్ ఆమ్లెట్, బజ్జీలు వేసే వాళ్ల తల కూడా పెనంతో సమానంగా వేడెక్కి పోతుంటుంది. అలాంటి ఎందరో మేమిచ్చిన గొడుగును వాళ్ల బండికి కట్టుకుని రోజంతా హాయిగా పని చేసుకుంటున్నారు. మా సర్వీస్‌ని ఢిల్లీ, నోయిడాల నుంచి దేశంలోని బెంగళూరు, చండీగర్, ముంబయి, హైదరాబాద్‌లకు విస్తరించాం. ఇంకా అన్ని రాష్ట్రాల్లో మా నెట్‌వర్క్‌ను విస్తరిస్తాం’’ అని చెప్పారు. -
అమ్మ చెప్పిన మాటే.. ఇప్పుడీ స్థాయికి!
ప్రీతిక మెహతాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘గ్లోబల్ షార్పర్’గా గుర్తించింది. చండీగఢ్‌కు చెందిన ప్రీతిక బహుముఖ ప్రజ్ఞాశాలి. గణిత మేధావి, డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పర్ట్‌గా పేరు తెచ్చుకున్న ప్రీతిక ‘బటర్నట్ ఏఐ’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా రాణిస్తోంది. మరోవైపు మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. మార్గనిర్దేశం చేస్తోంది.లెక్కలు అంటే చాలామంది పిల్లలకు భయం. అయితే చిన్నప్పటి నుంచి ప్రీతికకు లెక్కలు అంటే చెప్పలేనంత ఇష్టం. బొమ్మలు వేయడం అంటే కూడా ఇష్టం. పద్నాలుగు సంవత్సరాల వయసులో కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఒక ప్రొడక్ట్ స్టార్టప్‌లో తొలి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆసక్తి పెరిగింది. దాంతో ఉద్యోగాన్ని వదులుకొని న్యూయార్క్‌లోని స్టేట్ యూనివర్శిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ చేసింది.ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఖర్చుల కోసం ఒక రెస్టారెంట్లో పనిచేసేది. గ్రాడ్యుయేషన్ సెర్మనీకి ప్రీతిక తల్లి అమెరికాకు వచ్చింది. తల్లిని తన ప్రొఫెసర్‌కు పరిచయం చేసింది. ‘మీ అమ్మాయి బ్రైట్ స్టూడెంట్. క్లాస్‌రూమ్‌లో లోతైన ప్రశ్నలు అడిగేది. మీ కూతురికి మంచి భవిష్యత్ ఉంది’ అంటూ ఆ ప్రొఫెసర్ ప్రీతికపై ప్రశంసల వర్షం కురిపించాడు.ప్రొఫెసర్ మాటలు విన్న తరువాత ప్రీతికకు తన మీద ఉన్న నమ్మకం రెట్టింపు అయింది. ‘యస్. నేను సాధించగలను’ అనుకుంది. బోస్టన్లోని ‘బాంక్ ఆఫ్ అమెరికా’లో పనిచేసే అవకాశం ప్రీతికకు వచ్చింది. అయితే సొంతంగా ఏదైనా సాధించాలనే లక్ష్యంతో అధిక వేతనంతో కూడిన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రీతిక నిర్ణయం కుటుంబ సభ్యులతో సహా చాలామందికి నచ్చలేదు.‘బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగ జీవితం బాగున్నప్పటికీ నాలో ఉన్న అన్ని టాలెంట్స్‌ను ఉపయోగించుకునే అవకాశం దొరకలేదు’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది ప్రీతిక. అమెరికా నుంచి వచ్చిన తరువాత పిల్లలకు కోడింగ్ నేర్పించడానికి ‘కిడ్డీకోడర్స్’ను స్టార్ట్ చేసి పన్నెండు దేశాలకు వెళ్లింది. ఆ తరువాత సాక్సోహో.కామ్‌తో మెన్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.‘మెన్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉన్నాయని రిసెర్చ్ ద్వారా తెలుసుకున్నాను. ఈ స్పేస్‌లో గ్లోబల్ స్టార్టప్ నిర్మించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాక్సోహో మొదలు పెట్టాను’ అంటుంది ప్రీతిక.తనకు పట్టు ఉన్న డేటా, ఏఐ సబ్జెక్ట్లతో కస్టమర్ల వ్యక్తిగత అనుభవాలతో కంపెనీని బిల్డ్ చేసింది. యూఎస్‌లో చదువుకునే రోజుల్లోపార్ట్టైమ్ ఉద్యోగిగా ఒక ఇటాలియన్ రెస్టారెంట్లో పనిచేసింది. అది కస్టమర్–ఫేసింగ్ జాబ్ కావడం వల్ల ఎన్నో విషయాలపై అవగాహన వచ్చింది. ఆ జ్ఞానం ‘సాక్సోహో’కు ఉపయోగపడింది. డైరెక్ట్–టు–కన్జ్యూమర్ ఫ్యాషన్ బ్రాండ్ ‘సాక్సోహో’ తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది ప్రీతిక. ‘మనపై మనకు ఉన్న నమ్మకమే శక్తి. దానితో ఎన్ని విజయాలైనా సాధించవచ్చు’ అంటుంది ప్రీతిక మెహతా.మార్గనిర్దేశం..‘ఉన్నత స్థానానికి చేరుకున్న మహిళలకు తమ స్థాయిని కా΄ాడుకోవడానికి రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో లక్ష్యసాధనకు సంబంధించి అమ్మాయిలకు మార్గనిర్దేశం చేయడానికి వారికి సమయం దొరకదు’ అంటున్న ప్రీతిక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికి లక్ష్యసాధన విషయంలో అమ్మాయిలకు మార్గనిర్దేశం చేయడానికి ఎన్నో సమావేశాల్లోపాల్గొంది. ఎంటర్ప్రెన్యూర్గానే కాదు మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ‘థింక్. లెర్న్. డిసైడ్ విత్ యువర్ ఓన్ హెడ్ అండ్ హార్ట్’ అనేది ఎన్నో సమావేశాలలో ప్రీతిక నుంచి వినిపించే మాట.అమ్మ చెప్పిన మాట..చదువుకునే రోజుల్లో ఎందరో విజేతల కథలు నాకు స్ఫూర్తి ఇచ్చాయి. అదే సమయంలో ‘ప్రతి రంగంలో పురుషులతో పోల్చితే మహిళా విజేతలు ఎందుకు తక్కువగా ఉన్నారు?’ అని ఆలోచించేదాన్ని. ఈ ఆలోచనలతోనే నా వంతుగా ఏదైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. చిన్నప్పుడు స్కూల్ మార్చమని ఇంట్లో గొడవ చేశాను. దీనికి కారణం క్లాసులో 80 మంది స్టూడెంట్స్ ఉండడం. ‘ఇంత మంది మధ్య నేను టాపర్‌గా ఎలా ఉండగలను’ అన్నాను.‘ఇరవైమందిలో ఎలాగైతే టాపర్‌గా నిలిచావో 80 మందిలో కూడా టాపర్‌గా నిలవాలి’ అని అమ్మ చెప్పింది. వందమందిలో రాణించగలిగినప్పుడు వెయ్యిమందిలో కూడా రాణించగలం అనే సత్యం బోధపడింది. మనలో సామర్థ్యం ఉన్నప్పుడు సంఖ్య ముఖ్యం కాదు. ఒకవైపు భవిష్యత్ లక్ష్యాలు. మరోవైపు ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు.‘ఈ డ్రెస్‌తో బయటికి వెళతావా?’ ‘అబ్బాయిలా పొడుగ్గా పెరుగుతున్నావేమిటి?’... ఇలాంటి నాన్సెన్స్ మైండ్‌సెట్ కామెంట్స్ చిరాకు కలిగించేవి కానీ నా భవిష్యత్ లక్ష్యాలను నీరుగార్చలేకపోయాయి. మన దేశంలోనే కాదు అమెరికాలోనూ వృత్తిజీవితంలో లింగవివక్షతను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి వాటికి చిన్నబుచ్చుకోకుండా టాలెంట్‌తోనే సమాధానం చె΄్పాను.– ప్రీతిక మెహతా -
Niyamat Mehta: శిల్పకళకు తను ఒక ‘మెరుపుల మెరాకీ’
నియమత్ మెహతా దిల్లీలో ఏర్పాటు చేసిన ఫస్ట్ సోలో ఎగ్జిబిషన్ ‘మెరాకీ’కి మంచి స్పందన లభించింది. ‘మెరాకీ’ అనేది గ్రీకు పదం. దీని అర్థం మనసుతో చేయడం. ఈ ఎగ్జిబిషన్‌లోని 27 బ్రాంజ్, హైడ్రో రెసిన్ స్కల్ప్చర్లు కళాప్రియులను ఆకట్టుకున్నాయి. మన పౌరాణికాల నుంచి సాల్వడార్ డాలీ, లియోనార్డో డావిన్సీ, లియోనోరా కారింగ్టన్, ఎంఎఫ్ హుసేన్లాంటి మాస్టర్ల కళాఖండాల వరకు స్ఫూర్తి పొంది ఈ శిల్పాలకు రూపకల్పన చేసింది మెహతా. బీథోవెన్ సంగీతం, లార్డ్ బైరన్ పదాల ప్రభావం మెహతా శిల్పకళపై కనిపిస్తుంది. లండన్ నుంచి రోమ్ వరకు తాను చూసిన, పరవశించిన ఎన్నో ఆర్ట్ షోల ప్రభావం ఆమె కళాత్మక ప్రయాణాన్ని ప్రకాశవంతం చేశాయి. ఒక చిన్న శిల్పం తయారుచేయడానికి నెల అంతకుమించి సమయం తీసుకుంటుంది. ఎగ్జిబిషన్లో అత్యంత ఆకర్షణీయమైన ‘మిస్టర్ సినాట్రా’ శిల్పం రూపొందించడానికి ఆమెకు ఎనిమిది వారాలు పట్టింది. ఎరుపు రంగు జాకెట్‌తో కనిపించే ఈ శిల్పం పాత కాలం బ్రిటిష్ పబ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చిన వ్యక్తిలా కనిపిస్తుంది. ‘మన దేశంలో శిల్పకళకు అత్యంత ఆదరణ ఉంది’ అంటున్న నియమత్ శిల్పకళపై ఆసక్తి ఉన్నవారికి సలహాల రూపంలో తనవంతుగా సహాయం చేస్తోంది. View this post on Instagram A post shared by Niyamat Mehta (@niyamat_mehta) -
నవీన్ సోదరి గీతా మెహతా కన్నుమూత
భువనేశ్వర్/కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా (80) శనివారం రాత్రి న్యూఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం విషయం బయటకు రావడంతో రాష్ట్ర ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ కర్మ పూజలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఎటువంటి సూచనలు లేకపోయినప్పటికీ పార్టీ నాయకులు పరోక్ష సంతాప సూచకంగా ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ముఖ్యమంత్రి నవీన్ ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్న దృశ్యాలు ప్రజలు టీవీల్లో వీక్షించారు. గాంధీ కుటుంబంతో స్నేహం.. దివంగత ఉత్కళ వరపుత్రుడు బిజూ పట్నాయక్‌కు ఇద్దరు కుమారులు ప్రేమ్ పట్నాయక్, నవీన్ పట్నాయక్, ఒక కుమార్తె గీతా ఉన్నారు. వీరందరి బాల్యం లండన్‌లో జరిగింది. ప్రేమ్ ప్రముఖ పారిశ్రామికవేత్త కాగా, గతంలోనే మృతిచెందారు. గీతా అంతర్జాతీయ కవయిత్రి. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు సైతం అందుకున్నారు. బిజూ సంతానినికి బాల్యంలో గాంధీ కుటుంబంతో స్నేహ సంబంధాలు ఉండేవి. చివరి చూపు కోసం.. నవీన్ న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడుతూ అక్క చివరి చూపు కోసం ఢిల్లీ వచ్చానని ప్రకటించారు. కాగా, నవీన్ ఉండగా ఏనాడూ అతని కుటుంబం రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అప్పుడప్పుడు నవీనే ఢిల్లీ వెళ్లి అక్కని చూసేవారు. గీత మృతిలో రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గీతా మెహతా అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఘన చరిత్ర.. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కుమార్తె గీతా మెహతా రచయిత్రిగా, లఘు చిత్ర నిర్మాతగా, జర్నలిస్ట్‌గా పేరొందారు. ప్రఖ్యాత అమెరికన్ పబ్లిషర్ దివంగత సోనీ మెహతాను 1965లో గీతా మెహతా వివాహం చేసుకున్నారు. ఢిల్లీలో బిజు, జ్ఞాన్ పట్నాయక్ దంపతులకు 1943లో జన్మించిన ఆమె తన విద్యను భారత్‌తో పాటు యూకే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. 2019లో భర్త సోనీ మెహతా మరణించినప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ► కర్మ కోలా, స్నేక్ అండ్ ల్యాడర్స్, ఎ రివర్ సూత్ర, రాజ్ అండ్ ది ఎటర్నల్ గణేషా అనే మూడు పుస్తకాలను రచించారు. ► తన రచనలలో భారత చరిత్ర, సంస్కృతి, మతాన్ని చిత్రీకరించారు. ఈమె రచనలు 13 భాషల్లోకి అనువాదమయ్యాయి. 27 దేశాలలో ప్రచురితమయ్యాయి. యూకే, యూరోపియన్ దేశాలు , యునైటెడ్ స్టేట్స్ కోసం 14 బుల్లి తెర లఘు చిత్రాలను మెహతా నిర్మించి దర్శకత్వం వహించారు. ► 1970లలో నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీకి చెందిన యునైటెడ్ స్టేట్స్ టెలివిజన్ నెట్‌వర్క్‌కు గీత యుద్ధ ప్రతినిధిగా పని చేశారు. యూఎస్ టీవీ నెట్వర్క్ ఎన్బీసీ కోసం గీతా మెహతా బంగ్లాదేశ్ యుద్ధాన్ని కవర్ చేశారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంపై డేట్లైన్ బంగ్లాదేశ్ పేరుతో శక్తివంతమైన డాక్యుమెంటరీని రూపొందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ డాక్యుమెంటరీలో పాకిస్తాన్ సైనికులు చేసిన మారణహోమం, కొత్త దేశం ఆవిర్భావానికి దారితీసిన విముక్తి యుద్ధాన్ని చిత్రీకరించారు. ప్రముఖుల సంతాపం.. గీతా మెహతా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గీతా మెహతా బహుముఖ వ్యక్తిత్వం కలిగిన మహిళగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆమె మరణం అత్యంత బాధాకరమన్నారు. గీతా మెహతా మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఈసారి మళ్లీ లాభాల్లోకి..
తిరువనంతపురం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మళ్లీ లాభాల్లోకి మళ్లగలమని, వృద్ధి బాట పట్టగలమని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఎండీ సునీల్ మెహతా ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకును ముంచేసిన నీరవ్ మోదీ స్కామ్ ఇక ముగిసిన అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు రూ.13,000 కోట్ల మోదీ స్కామ్‌తో కుదేలైన పీఎన్బీ .. ఇంకా ఆ ప్రభావాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మెహతా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.12,282 కోట్ల నష్టం ప్రకటించిన పీఎన్బీ.. జూన్ క్వార్టర్లో మరో రూ.940 కోట్ల నష్టం నమోదు చేసింది. బాకీలు రాబట్టుకునేందుకు తీసుకుంటున్న వివిధ చర్యల ఊతంతో 2018–19లో బ్యాంకు మళ్లీ లాభాల్లోకి రాగలదని మెహతా చెప్పారు. పీఎన్బీ క్రమంగా వృద్ధి బాట పడుతోందని.. రుణ వృద్ధి ఊపందుకోవడంతో పాటు పరిశ్రమ సగటు స్థాయిని కూడా మించిందని ఆయన వివరించారు. వరద బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు రూ. 5 కోట్ల విరాళం అందించిన సందర్భంగా మెహతా ఈ విషయాలు తెలిపారు. కార్యకలాపాల విస్తరణ కోసం ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా కేంద్రం నుంచి రూ. 5,431 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం ఇటీవలే ఇచ్చిన రూ. 2,816 కోట్లు.. మూలధనానికి సంబంధించి నియంత్రణ సంస్థల పరమైన నిబంధనల పాటింపునకు ఉద్దేశించినవని మెహతా చెప్పారు. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థకు కేంద్రం అందించనున్న రూ.65,000 కోట్లలో పీఎన్బీకి రూ.8,247 కోట్లు లభించగలవని ఆయన వివరించారు. అక్టోబర్ 30న అసాధారణ సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్ల నుంచి, ఆ తర్వాత నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం లభించాక బ్యాంకుకు నిధులు అందనున్నాయని మెహతా పేర్కొన్నారు. -
బోధన్ స్కామ్‌లో ఐదుగురు నిందితుల గుర్తింపు
వీరి కోసం గాలిస్తున్నామన్న ఐజీ సౌమ్యామిశ్రా సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ రూపంలో రావాల్సిన కోట్ల రూపాయలను బినామీ ఖాతాలో్లకి మళ్లించిన బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ దర్యాప్తును సీఐడీ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని నిందితులుగా గుర్తిం చినట్లు ఐజీ సౌమ్యామిశ్రా శుక్రవారం తెలి పారు. వీరిలో ముగ్గురు కమర్షియల్ ట్యాక్స్ అధికారులుండగా... ఇద్దరు దళారులని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఓ ఉదంతంలోనే రూ.3.39 కోట్లు స్వాహా అయినట్లు గుర్తించామని మిగిలిన ఉదంతాల్లో గుర్తించా ల్సుందని పేర్కొన్నా రు. ఈ కేసు దర్యాప్తులో అనేక ఖాతాలను సరిచూడాల్సి ఉందని, దీంతో కమర్షియల్ ట్యాక్స్ విభాగం నుంచి నోడల్ అధికారి, కొందరు సహాయకులను నియమించామని పేర్కొన్నారు. నమో ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్న అంకిత్ మెహతాపై ఆశిష్ జైన్ న ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశామని ఐజీ తెలి పారు. తన తల్లి సరోజ జైన్ నుంచి మెహతా రూ.12.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనకు ప్రధాన మంత్రి కార్యాలయంలోనూ (పీఎంఓ) పలుకుబడి ఉన్నట్లు బాధితులకు చెప్పాడని, దీంతో వారు సీఐడీలో ఫిర్యాదు చేయడంతో పాటు పీఎంఓకూ లేఖ రాశారన్నారు. ఈ మోసానికి, ఫౌండేషన్ కు సంబంధం లేదని, అయితే బాధితులు మాత్రం ఆ సంస్థ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే మెహతాకు నగదు ఇచ్చినట్లు చెప్తున్నారని సౌమ్యామిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కూడా దర్యాప్తు స్థితిలో ఉందని వివరించారు. ఎంసెట్ లీకేజ్ స్కామ్‌లో ఇప్పటికే అనేక మంది నిందితుల్ని అరెస్టు చేశామని చెప్పిన ఐజీ బీహార్ కేంద్రంగా జరిగిన ఈ స్కామ్‌లో కీలక నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.