Mercy petition
-
‘అమ్మను ఉరి తీస్తే నా పరిస్థితి ఏంటి?’
లక్నో: అమ్మను ఉరి తీస్తే నా పరిస్థితి ఏంటి.. ఈ ప్రశ్న చదువుతుంటేనే కడుపులో పేగు బాధతో మెలిపెడుతోంది కదా. అలాంటిది తన కళ్ల ముందే తల్లి చనిపోతుందని తెలిస్తే.. 12 ఏళ్ల ఆ చిన్నారి మనసు ఎంత విలవిల్లాడుతుందో ఊహించుకోండి. తల్లి లేకుండా అసలు బిడ్డలు తమ జీవితాన్ని ఊహించుకోలేరు. ఎన్ని జన్మలు అనుభవించినా తనివి తీరనది తల్లి ప్రేమ మాత్రమే. అలాంటి బంధం తర్వలోనే తనకు దూరం కాబోతుందని తెలిసి ఆ చిన్నారి విలవిల్లాడాడు. తన కోసం అయినా అమ్మను క్షమించాల్సిందిగా రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఇంతకు ఆ చిన్నారి ఎవరు.. ఎందుకు అతడి తల్లి చనిపోతుంది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా షబ్నం అనే పేరు మార్మోగుతుంది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్ష అనుభవించబోతున్న తొలి మహిళ షబ్నం. ఉత్తరప్రదేశ్ మథురలో నివాసం ఉండే ఈమె.. ప్రేమించిన వ్యక్తితో విహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో లవర్‌తో కలిసి వారిని హతమార్చిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల క్రితం అనగా 2008 ఏప్రిల్ 14న షబ్నం తన ప్రియుడు సలీంతో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును మథుర కోర్టు విచారించింది. ఇక నిందితులు షబ్నం, ఆమె ప్రియడు ఇద్దరికి మరణశిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. 2010లో వచ్చిన మథుర కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. దోషులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఇదే రిపీట్ కావడంతో 2015లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చివరకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని క్షమాభిక్ష కోరారు. కానీ ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో త్వరలోనే వీరిని ఉరి తీయాల్సిందిగా మథుర కోర్టు, జైలు అధికారులను ఆదేశించింది. ఇక కుటుంబ సభ్యులను హతమార్చే సమయానికే షబ్నం గర్భవతిగా ఉంది. జైల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. తనతో పాటే కుమారుడిని పెంచింది. అయితే ఖైదీగా ఉన్న తల్లి దగ్గర పిల్లలు ఆరు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం ఉండకూడదు. ఈ క్రమంలో 2015లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి షబ్నం కుమారుడిని ఎవరికైనా దత్తత ఇవ్వాలని భావించింది. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చింది. దాంతో షబ్నం కాలేజీ స్నేహితుడైన సైఫి, ఆమె కుమారుడి బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. పిల్లాడిని తనతో పాటు తీసుకెళ్లి పెంచసాగాడు. ఈ సందర్భంగా సైఫి మాట్లాడుతూ.. ‘‘చదువుకునే రోజుల్లో ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా నేను చాలా వీక్‌గా ఉండేవాడిని. అప్పుడు షబ్నం నాకు ఎన్నో సార్లు డబ్బు సాయం చేసింది. ఆమె వల్ల నేను కాలేజీ చదువు పూర్తి చేయగలిగాను. ఆమె నాకు అక్క కన్నా ఎక్కువ. చదువు పూర్తయ్యాక నేను అక్కడి నుంచి వెళ్లి పోయాను. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిందని తెలిసి నేను షాక్ అయ్యాను. వెళ్లి ఆమెను కలవాలని అనుకున్నాను’’ అని తెలిపాడు. ప్రస్తుతం సైఫి బులంద్‌షహర్‌లో జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ‘‘ఇదే సమయంలో షబ్నం కుమారుడి దత్తతకు సంబంధించిన యాడ్ చూశాం. గతంలో తను నన్ను ఆదుకోకపోయి ఉంటే.. ఇప్పుడు ఇంత మంచి స్థితిలో ఉండేవాడిని కాదు. ఆమె నాకు చేసిన మేలుకు రుణం తీర్చుకునే అవకాశం లభించింది. ఆమె కుమారుడి బాధ్యత నేనే తీసుకోవాలనుకున్నాను. దీని గురించి నా భార్యతో కూడా మాట్లాడాను. ఆమె కూడా అంగీకరించింది’’ అని తెలిపాడు. ‘‘ఆ తర్వాత మేం భార్యభర్తలిద్దరం జైలుకు వెళ్లి షబ్నమ్‌ని కలిశాము. ఆమె కుమారుడిని మాతో పాటు తీసుకెళ్తాం.. అతడి బాధ్యతను మేం తీసుకుంటాం అని అడిగాం. ఆమె అంగీకరించింది. ఇక బాబును ఎన్నటికి అతడి తల్లి పుట్టిన ఊరికి తీసుకెళ్లకూడదని భావించాం. ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడకు తీసుకెళ్లలేదు. జైలులో తనకు పెట్టిన పేరు మార్చి.. తాజ్ అని పెట్టాం’’ అని తెలిపారు. ‘‘తల్లి గురించి తాజ్‌కు అన్ని వివరాలు తెలుసు. ఎంతైనా కన్న తల్లి కదా. ఆమె మీద ప్రేమను వదులుకోలేకపోతున్నాడు. ఇక తర్వలోనే షబ్నమ్‌ను ఉరి తీస్తారని తెలిసి ఆ చిన్నారి మనసు విలవిల్లాడుతుంది. అందుకే తన తల్లిని క్షమించాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కోరుతున్నాడు. ఈ మేరకు క్షమాభిక్ష పిటిషన్‌ని దాఖలు చేశాడు. పాపం అమ్మ చనిపోతే నా పరిస్థితి ఏంటంటూ ఆ చిన్నారి అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. అందుకే చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతూ రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశాడు. చూడాలి ఏమవుతుందో అన్నాడు’’ సైఫి. చదవండి: ఏడుగురి హత్య: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి న్యాయవాదుల హత్య: ఆ కేసులే కారణమా? -
కుల్‌భూషణ్ కేసులో పాక్ కొత్త కుట్ర
ఇస్లామాబాద్: ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ యాదవ్ కేసులో పాకిస్తాన్ కొత్త కుట్రకు తెరతీసినట్లు కనిపిస్తోంది. ఆయన తన కేసులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి నిరాకరించారని పేర్కొంది. అంతేకాక పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటిషన్‌తోనే ఆయన ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారని పాక్ ప్రభుత్వం తెలిపింది. జూన్ 17న కుల్‌భూషణ్‌ను రివ్యూ పిటిషన్ వేసుకోవాల్సిందిగా ఆహ్వానించామని.. అందుకు ఆయన నిరాకరించారని పాకిస్థాన్ అదనపు అటార్నీ జనరల్ తెలిపారు. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరో అవకాశం ఇచ్చినట్లు పాక్ మీడియా బుధవారం (జులై 8) వెల్లడించింది. ఆయనపై మోపిన ఆరోపణలు, విధించిన మరణశిక్షను పున:సమీక్షించడానికి అవకాశం కల్పించగా.. న్యాయపరంగా తన హక్కులను దృష్టిలో ఉంచుకొని రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి ఆయన తిరస్కరించారని పాక్ మీడియా తెలిపింది. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై 2016 మార్చి 3న పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాక్ బలగాలు కుల్భుషణ్ యాదవ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో కులభూషణ్‌కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇరాన్లో వ్యాపార కార్యకలాపాలు చేసుకుంటుండగా పాక్ అక్రమంగా నిర్భందించి, న్యాయస్థానానికి కూడా అనుమతివ్వలేదని భారత్ ఫిర్యాదు చేసింది.(మౌనం వీడని శాంతి కపోతం) దీనిపై విచారణ చేపట్టిన ఐసీజే కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేస్తూ 2019 జులై 17న తీర్పు చెప్పింది. కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేసింది. దీంతో భారత్‌లో ఆశలు చిగురించాయి.16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడం గమనార్హం. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటామని గతంలో పాక్ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. కుల్‌భూషణ్ జాదవ్‌ను వెంటనే విడుదల చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. -
క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి
-
క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న నిర్భయ అత్యాచార, హత్య దోషుల ఉరిశిక్షలో కీలక పరిణామం చోటుచేసకుంది. దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పటిషన్‌ను రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. శిక్ష అమలుకు సమయం దగ్గరపడుతుండటంతో.. సోమవారం ఉదయమే ఆయన క్షమాభిక్ష పెట్టుకున్నారు. దీనిని పరిశీలించిన రాష్ట్రపతి క్షమాభిక్షకు దోషులు అనర్హులని తిరస్కరించారు. కాగా ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ పవన్‌గుప్తా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ఇదివరకే కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే డెత్‌వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు కూడా నిరాకరించింది. దీంతో నలుగురు దోషులను రేపు (మంగళవారం) ఉదయం ఆరుగంటలకు తీహార్ జైల్లో ఉరితీసే అవకాశం ఉంది. -
‘నిర్భయ’ దోషి పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ హత్యాచార దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్న సభ్యులుగా ఉన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంపై న్యాయ సమీక్ష అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘క్షమాభిక్ష కోరుతూ సమర్పించిన అన్ని సంబంధిత పత్రాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతుంది. ఆ నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరమని భావించేందుకు ఎలాంటి ప్రాతిపదిక కనిపించడం లేదు. అందువల్ల ఈ రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న పిటిషనర్ వాదనను కూడా కొట్టివేసింది. వినయ్ శర్మ ఆరోగ్యం సరిగ్గానే ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్స్‌లో స్పష్టంగా ఉందన్నారు. తిహార్ జైళ్లో తనను చిత్రహింసలు పెట్టారని, దాంతో తన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని, ఈ విషయాన్ని క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించే సమయంలో రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు పెట్టుకున్న పిటిషన్లో వినయ్ శర్మ పేర్కొన్నారు. జైళ్లో చిత్రహింసల కారణంగా మానసిక అనారోగ్యానికి గురయ్యా నని స్పష్టం చేసే అన్ని పత్రాలను రాష్ట్రపతి దృష్టికి కేంద్రం తీసుకువెళ్లలేదని ఆ పిటిషన్లో శర్మ ఆరోపించారు. అయితే, వాదనలను విన్న ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. డెత్ వారెంట్ జారీ చేయొచ్చు: నిర్భయ దోషులకు వేర్వేరు రోజుల్లో ఉరిశిక్ష విధించేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని తాజాగా డెత్ వారెంట్లను ట్రయల్ కోర్టు జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే, నలుగురు దోషుల్లో పవన్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోలేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. 17న ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభించే సమయానికి, పవన్ క్యూరేటివ్ పిటిషన్ వేస్తాడన్నారు. ఇక పవన్ వంతు.. నలుగురు దోషుల్లో.. పవన్ గుప్తా ఇంకా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేయలేదు. పవన్‌కు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే అవకాశం కూడా ఉంది. కాగా, తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ ముకేశ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్షయ్ కుమార్ క్షమాభిక్ష అభ్యర్థనను కూడా రాష్ట్రపతి కొట్టేశారు. స్పృహ కోల్పోయిన జస్టిస్ భానుమతి నిర్భయ’ దోషులను వేర్వేరు రోజుల్లో ఉరి తీసేందుకు అనుమతించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించే సమయంలో ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ భానుమతి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. కాసేపటికి మళ్లీ స్పృహలోకి వచ్చారు. వెంటనే ఇతర న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది ఆమెను తన చాంబర్లోకి తీసుకువెళ్లారు. ఆ తరువాత కోర్టు ప్రాంగణంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించారు. జస్టిస్ భానుమతి ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
నిర్భయ కేసు: సొమ్మసిల్లిన సుప్రీం న్యాయమూర్తి
న్యూఢిల్లీ : నిర్భయ కేసులో వాదనలు వింటున్న ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ ఆర్.భానుమతి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరి శిక్ష విధించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు చదివి వినిపిస్తున్న క్రమంలో జస్టిస్ ఆర్.భానుమతి అస్వస్థత కారణంగా సొమ్మసిల్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం తేరుకున్నారు. ఆమెను కోర్టు సిబ్బంది వీల్ చెయిర్లో చాంబర్‌కు తరలించారు. అనంతరం వైద్యులు ఆమెకు చికిత్సనందించారు. (చదవండి : నిర్భయ కేసు: వినయ్ శర్మ పిటిషన్ కొట్టివేత) ఇక పిటిషన్‌ను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణ తేదీని ఉత్తర్వుల్లో వెల్లడిస్తామని పేర్కొంది. దోషుల ఉరికి సంబంధించి వచ్చే సోమవారం కింది కోర్టు ఉత్తర్వులు ఇవ్వనున్నందున అప్పటి వరకు వేచి చూడాలని అపెక్స్ కోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దోషులకు సంబందించి ఎటువంటి పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో లేవని తెలిపింది. కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరణను చాలెంజ్ చేస్తూ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు (శుక్రవారం) కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
నిర్భయ కేసు: వినయ్ శర్మ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరణను చాలెంజ్ చేస్తూ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. జైల్లో తీవ్రమైన టార్చర్ కారణంగా వినయ్ శర్మ మానసిక స్థితి సరిగా లేదని, క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే సమయంలో ఆ విషయాన్ని రాష్ట్రపతి పరిగణించలేదని అతని తరపు లాయర్ వాదించారు. అతను మానసిక అనారోగ్యంతో ఉన్నాడని చెప్పే మెడికల్ రికార్డులు రాష్ట్రపతి వద్దకు రాలేదని కోర్టుకు తెలిపారు. కాగా, ఈ వాదనల్ని కేంద్రం తోసిపుచ్చింది. వినయ్ శర్మ మానసిక స్థితి బాగానే ఉందని కోర్టు దృష్టికి తెచ్చింది. ఫిబ్రవరి 12 నాటి మెడికల్ రికార్డుల ప్రకారం వినయ్ ఆరోగ్య స్థితికి ఇబ్బందేం లేదని కేంద్రం తరపు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్రం వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు వినయ్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇక 2012లో నిర్భయ ఘటన జరగగా.. 2020లో (జనవరి 22, ఫిబ్రవరి 1) దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తు శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి : నిర్భయ దోషికి లాయర్‌ను నియమించిన కోర్టు) -
నిర్భయ కేసు : వినయ్ శర్మ పిటిషన్ తిరస్కరణ
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం తిరస్కరించారు. ఇక నిర్భయ దోషులైన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ సింగ్‌ల ఉరిశిక్ష అమలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని దోషుల విఙ్ఞప్తి మేరకు.. ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా శుక్రవారం ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయొద్దని స్పష్టం చేశారు. (చదవండి : ‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా) నిబంధనలకు విరుద్ధం..! దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ కుమార్ సింగ్‌లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలంటూ కోర్టు జనవరి 17వ తేదీన ఆదేశించారు. అయితే, వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి కోవింద్ వద్ద పెండింగ్‌లో ఉండటం.. మిగతా ఇద్దరు (అక్షయ్, పవన్) చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ వారి తరఫున లాయర్ ఏపీ సింగ్ గురువారం అడిషనల్ సెషన్స్ కోర్టులో వాదనలు వినిపించారు. నలుగురిలో ఏ ఒక్కరి పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయడం నిబంధనలకు విరుద్ధమని దోషుల తరఫు న్యాయవాది వాదించారు. ఏకీభవించిన న్యాయమూర్తి డెత్ వారెంట్లను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చారు. (చదవండి : అందుకే నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టే: జడ్జి) -
నిర్భయ దోషుల్ని 22న ఉరితీస్తారా?
న్యూఢిల్లీ: నిర్భయ మూకుమ్మడి అత్యాచారం, హత్య కేసులో దోషులను ఈ నెల 22న ఉరి తీసే అవకాశాలపై సందిగ్ధం నెలకొంది. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి మూడు రోజుల క్రితమే విజ్ఞప్తి చేశారు. అది పెండింగ్‌లో ఉన్నందున ఉరి అమలును వాయిదా వేయాలంటూ ముఖేష్ సింగ్ తరఫు లాయర్ తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారించించి కోర్టు, తాము జారీ చేసిన డెత్ వారెంట్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. దీంతో లాయర్ గురువారం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ అరోరా ఉరి అమలుపై సమగ్ర నివేదికను శుక్రవారానికల్లా సమర్పించాలని ఆదేశించారు. వ్యవస్థలకు కేన్సర్ సోకింది నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందు వల్ల ఉరిశిక్ష అమలు కోర్టు ఆదేశించినట్టుగా 22న సాధ్యం కాదని ఢిల్లీ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. నిబంధనల ప్రకారం ఒక కేసులో ఉన్న దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాల్సి ఉంటుందని, ముఖేష్ క్షమాభిక్ష పెట్టుకోవడంతో మిగిలిన వారి ఉరినీ వాయిదా వేయాల్సి ఉంటుందని తీహార్ జైలు అధికారులు కోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు బెంచ్ తీవ్రంగా స్పందించింది. ‘నిబంధనల్ని రూపొందించే సమయంలో ఎవరూ బుర్ర ఉపయోగించలేదా ? ఈ లెక్కన దోషులందరూ క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నంత వరకు వేచి చూస్తారా? దేశంలో వ్యవస్థలకి కేన్సర్ సోకింది’అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఎందుకు ఉరి అమలును ఆలస్యం చేస్తున్నారు ? ఎవరు మిమ్మల్ని నియంత్రిస్తున్నారు ? ఒకసారి డెత్ వారెంట్లు జారీ అయ్యాక ఉరి అమలులో తాత్సారం జరగకూడదంటూ వ్యాఖ్యానించింది. ఇలాగైతే దేశంలో వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ఉరి అమలు వాయిదా వేయాలన్న ముఖేష్ సింగ్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఢిల్లీ సర్కార్ ఆగమేఘాల మీద స్పందించి క్షమాభిక్షను తిరస్కరించాలని నిర్ణయించింది. కాగా,నిర్భయ దోషుల్ని ఉరి తీయడానికి ఢిల్లీలో ఆప్ సర్కార్ కావాలనే జాప్యం చేస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. 2017లోనే సుప్రీం కోర్టు వారికి ఉరిశిక్ష ఖరారు చేసినప్పటికీ ఆప్ ప్రభుత్వం ఉరి అమలును ఎందుకు నానుస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావేద్కర్ ప్రశ్నించారు. వెంటాడుతున్న ప్రాణభయం నిర్భయ దోషుల్లో ప్రాణభయం రోజు రోజుకీ పెరిగిపోతోంది. దోషుల్లో అతి చిన్నవాడైన 26 ఏళ్ల వయసున్న వినయ్ శర్మ అందరికంటే ఎక్కువగా ఆందోళనకు లోనవుతున్నాడు. ఢిల్లీ హైకోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన దగ్గర నుంచి దోషులు నలుగురు ముఖేష్‌సింగ్, వినయ్ శర్మ, అక్షయ్‌కుమార్ రాథోడ్, పవన్ గుప్తాలను తీహార్ జైలు అధికారులు నాలుగు వేర్వేరు సెల్స్‌లో ఉంచారు. రేయింబగళ్లు వారి కదలికల్ని సీసీటీవీ కెమెరాల ద్వారా గమనిస్తున్నారు. వారి మానసిక స్థితి దెబ్బ తినకుండా ప్రతీ రోజూ వారితో మాట్లాడుతున్నారు. సైక్రియాటిస్టులు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. వీరిలో వినయ్ శర్మ తన సెల్లో ఒకేచోట ఉండకుండా అసహనంగా తిరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. -
నిర్భయ ఉదంతం: క్షమాభిక్ష తిరస్కరణ!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతం దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతడి క్షమాభిక్షను తిరస్కరించాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు విఙ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ముఖేశ్ పిటిషన్‌ను తిరస్కరించాల్సిందిగా ప్రతిపాదనలు పంపినట్లు ధ్రువీకరించారు. కాగా మరణ శిక్ష తప్పించుకునేందుకు ‘నిర్భయ’ దోషులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ... డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో... వినయ్ శర్మ(26), ముఖేశ్ సింగ్(32) ఆఖరి ప్రయత్నంగా క్యూరేటివ్ పిటిషన్లను దాఖలు చేశారు. (నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు) ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం(అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారీమణ్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్) వాటిని కొట్టివేసింది. దీంతో ముకేశ్ మంగళవారం క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశ్రయించాడు. తన ఉరిశిక్షపై జారీ అయిన డెత్ వారంట్‌ను పక్కన పెట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించాడు. ఈ నేపథ్యంలో ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినందున జనవరి 22న ఉరిశిక్ష అమలు జరగదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జైళ్ల నిబంధనల ప్రకారం.. ఉరి శిక్షను అమలు చేయలేమని బుధవారం పేర్కొంది. ఇక ప్రొటోకాల్ ప్రకారం.. తొలుత దోషి క్షమాభిక్ష అర్జీని ఢిల్లీ ప్రభుత్వానికి పంపిస్తారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు చేరుతుంది. ఆ తర్వాత కేంద్ర హోం శాఖకు పంపిస్తారు. ఈ క్రమంలో అన్ని స్థాయిల్లోనూ సదరు అర్జీని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అది దోషి తరఫు అర్జీగా రూపాంతరం చెందుతుంది. అనంతరం రాష్ట్రపతికి చేరిన తర్వాత క్షమాభిక్షపై రాష్ట్రపతి తన అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారు.(నిర్భయ దోషులు : పలు సంచలన విషయాలు) కాగా దేశ రాజధాని ఢిల్లీలో 2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు బాధితురాలు సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు.. నిందితులు రామ్‌సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. (క్షమాభిక్ష పెట్టండి!) నిర్భయ దోషులకు సుప్రీంలో షాక్! -
క్షమాభిక్ష అడగలేదు: నిర్భయ కేసు దోషి
సాక్షి, న్యూఢిల్లీ: 2012లో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన నిర్భయ కేసులో నేరస్తుడు వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు రాసిన లేఖలో సంచలన విషయం వెల్లడించాడు. అసలు తాను క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదని ఢిల్లీలోని నిర్భయ సామూహిక హత్యాచార ఘటనలో మరణ శిక్ష పడిన వినయ్ శర్మ పేర్కొన్నాడు. ఆ పిటిషన్‌పై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తన మెర్సీ పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలని తన న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా అభ్యర్థించాడు. అంతేకాదు హోం మంత్రిత్వ శాఖ పంపించిన క్షమాభిక్ష పిటిషన్‌పై సంతకం తనది కాదని స్పష్టం చేశాడు. తను ఇంకా ఎలాంటి క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయకముందే ఏదో కుట్ర జరిగిందని ఆరోపించాడు. కాగా వినయ్ శర్మ పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించగా, దీన్ని రాష్ట్రపతికి పంపిన హోంశాఖకు పంపించిన సంగతి తెలిసిందే. ఈకేసులో వినయ్ శర్మ సహా మొత్తం దోషులుగా తేలినవారు ఆరుగురు. వీరిలో రామ్‌సింగ్ 2013 మార్చిలో జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా మరొక నిందితుడు మైనర్ కావడంతో అతడికి బాలనేరస్తుల కోర్టు మూడేళ్ళ శిక్ష విధించి అనంతరం విడుదల చేసింది. ఇక మిగిలిన నలుగురు నిందితులు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసలు తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని వినయ్ శర్మ చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
నిర్భయ దోషులకు వారంలో ఉరిశిక్ష!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన దోషులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలన్నీ పూర్తి అయ్యాయి. దీంతో మరికొన్ని రోజుల్లోనే వారికి మరణశిక్షను అమలుచేయనున్నారు. అయితే మరణశిక్ష విధించే ముందే దోషులకు క్షమాభిక్ష వేడుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తిహార్ జైలు అధికారులు నలుగురు దోషులకు నోటీసులు పంపారు. ‘నిర్భయ కేసులో దోషులకు (ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్ శర్మ) న్యాయపరమైన కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయి. త్వరలోనే మరణ శిక్ష అమలు కానుంది. కానీ చివరగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం ఉంది. వారం రోజుల్లో మీరు ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అనంతరం తదుపరి వివరాలను కోర్టుకు నివేదించాల్సి ఉంటుంది’ అంటూ నోటీసును పంపారు. ఒకవేళ రాష్ట్రపతి వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందిస్తే.. మరణశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. కాగా 2012 డిసెంబర్ 6 న దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మెడిసిన్ విద్యార్థినిపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. మరోకరు మైనర్ అయినందున జువైనల్ కస్టడీలో ఉన్నారు. దీనిపై విచారణ అనంతరం ట్రయల్ కోర్టువారికి మరణశిక్షను విధించింది. దీనిని ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్పమర్థించాయి. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ.. ముగ్గురు దోషులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో శిక్షను అమలు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. -
శిక్ష తగ్గించాలని ఆశారాం బాపూ వేడుకోలు..
జైపూర్ : బాలికపై లైంగిక దాడి కేసులో దోషిగా జీవిత ఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపూ రాజస్థాన్ గవర్నర్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని లేఖ రాశారు. ఐదేళ్ల కిందట తన ఆశ్రమంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో జోథ్‌పూర్ కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 25న ఆశారాంను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జులై 2న ఆశారాం హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న తనకు జీవిత ఖైదు తీవ్రమైన శిక్ష అంటూ శిక్ష తీవ్రతను తగ్గించాలని క్షమాభిక్ష లేఖలో ఆశారాం గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆశారాం దరఖాస్తుపై సవివర నివేదిక పంపాలని గవర్నర్ హోంశాఖకు పంపారు. దీనిపై జిల్లా అధికారులు, పోలీసుల నుంచి నివేదిక కోరామని జోథ్‌పూర్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ జై కైలాష్ త్రివేది చెప్పారు. నివేదిక రాగానే రాజస్థాన్ డీజీ (జైళ్లు)కు పంపుతామని జైలు అధికారులు తెలిపారు. కాగా 2013 ఆగస్ట్ 15 రాత్రి తనపై ఆశారాం బాపూ తన ఆశ్రమంలో లైంగిక దాడికి పాల్పడాడ్డరని 16 సంవత్సరాల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జాదవ్ కేసు.. పాక్ ప్రజలకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ క్షమాభిక్ష విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. జాదవ్ మెర్సీ పిటిషన్ గురువారం సైన్యాధ్యకుడు ఖమర్ జాదవ్ బజ్వా వద్దకు చేరిందని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చెప్పారు. జాదవ్ కేసులో త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని గఫూర్ పేర్కొన్నారు. కాగా, తనకు విధించిన మరణశిక్షను కొట్టేయాలంటూ అప్పిలేట్ కోర్టు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దానిని కొట్టివేసింది. దీంతో ఆయన పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆశ్రయించారు. ఒకవేళ ఆయన కూడా దానిని కొట్టివేస్తే నేరుగా పాక్ అధ్యక్షుడిని ఆశ్రయంచవచ్చు. అయితే క్షమాభిక్ష పిటిషన్ ఆర్మీ ఛీఫ్ తిరస్కరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్న సంకేతాలు అందుతున్నాయి. ‘పాక్ ప్రజలు త్వరలోనే ఓ శుభవార్త వినబోతున్నారు’ అంటూ జాదవ్ క్షమాభిక్షను ఉద్దేశిస్తూ... పాకిస్థాన్ ఏజెన్సీ సంస్థ ఇంటర్-స్టేట్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) ఓ ప్రకటన వెలువరించటంతో ఆయన ప్రాణాలకు ముప్పుతప్పదనే భావించవచ్చు. కాగా, గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్ జాదవ్ ను 2016లో పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. ఆపై పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించగా.. 46 ఏళ్ల జాదవ్ తరపున భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భారత్ పిటిషన్‌పై మే 18న విచారించిన 10 మంది సభ్యుల ఐసీజే ధర్మాసనం.. జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది. అయితే జాదవ్ క్షమాభిక్ష పిటిషన్లపై ఓ స్పష్టత వచ్చేంత వరకు ఆయనకు మరణశిక్ష అమలు చేయబోమని పాక్ స్పష్టం చేసింది. -
అర్ధరాత్రి తెరుచుకున్న ‘సుప్రీం’ తలుపులు
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా సుప్రీంకోర్టు తలుపులు అర్ధరాత్రి తెరుచుకున్నాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు కోర్టు తలుపులు తీశారు. ఉరిశిక్షను వాయిదా వేయాలంటూ యాకూబ్ మెమన్ తరఫు న్యాయవాదులు చిట్టచివరి నిమిషంలో దాఖలు చేసిన పిటషన్ ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు అంగీకరించడంతో సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా అర్ధరాత్రి 4వ నెంబరు కోర్టులో వాదనలు కొనసాగాయి. అంతకుముందు బుధవారం సాయంత్రం మెమన్ పిటిషన్ ను కొట్టేసిన త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులనే ఈ పిటిషన్ విచారణకు కూడా చీఫ్ జస్టిస్ నియమించారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం వద్ద రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన 14 రోజుల వరకు ఉరి తీయకూడదని మరో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మెమన్ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. మహారాష్ట్ర మాన్యువల్ ప్రకారం చూసినా కూడా క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు, ఉరితీతకు మధ్య 7 రోజుల వ్యవధి ఉండాలని చెప్పారు. అయితే, ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ధర్మాసనం తన తుది తీర్పు వెలువరించింది. షెడ్యూలు ప్రకారమే గురువారం నాడు మెమన్ ను ఉరి తీయాలని స్పష్టం చేసింది. దీంతో యాకుబ్ మెమన్‌కు ఉరికి ఖరారైంది. -
అర్ధరాత్రి హైడ్రామా
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ క్షమాభిక్షపిటీషన్ని తిరస్కరిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మెమన్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మరికొందరు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు రాత్రి 12 గంటల సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కూడా అక్కడకు చేరుకొని మెమన్ తరఫు న్యాయవాదుల పిటీషన్లను తీసుకొని సీజేఐ కు సమర్పించారు. క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే నిర్ణయం సరికాదని ...ఒక వేళ తిరస్కరించినా ఆ నిర్ణయం అమలుకు కనీసం 14 రోజులు గడువు కావల్సి ఉంటుందని కావున తమ విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్ ఎల్ దత్తును మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ వినతిని స్వీకరించిన సీజేఐ రాత్రికి రాత్రే ఇదివరకే ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించారు. తెల్లవారుజామున మూడుగంటలకు సుప్రీం కోర్టులోని హాల్లో మెమన్ ఉరిశిక్ష వాయిదాకు సంబంధించిన తుది విచారరణ ప్రారంభమైంది. అంతకు ముందులాగే ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు మెమన్ ఉరిశిక్ష నిలిపివేతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఉరిశిక్ష అమలుకు 10గంటల ముందు దాఖలు చేసిన క్షమాభిక్షపిటీషన్ చెల్లు బాటుకాదని, నిజానికి ఈ కేసులో వాస్తవ న్యాయప్రక్రియ మొత్తం ఇప్పటికే పూర్తయిపోయిందని ఆటార్నిజనరల్ ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. ఇంతకు ముందు క్షమాభిక్షపిటీషన్ మెమన్ సోదరుడు దాఖలు చేయగా, తాజాగా బుధవారం రాష్ట్రపతికి అందిన పిటిషన్ మెమన్ ఇచ్చిందని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం బుధవారం సాయంత్రం నుంచి శిక్షఅమలుకు 14 రోజుల వ్యవధి ఉండాలని మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్నఅనంతరం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా తీర్పువెలువరించడంతో మెమన్ ఉరి అమలుకు అడ్డంకులు తొలగినట్లయింది. -
'మెమన్ కు క్షమాభిక్ష పెట్టండి'
న్యూఢిల్లీ: ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉరి శిక్ష పడిన యాకూబ్ మెమన్ కు క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఉరిశిక్షను వ్యతిరేకించిన అబ్దుల్ కలాంకు నివాళిగా మెమన్ కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. ఈ నెల ఆరంభంలో ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాన్ని న్యాయ కమిషన్ కు కలాం తెలిపారని గుర్తు చేశారు. మానవతా దృక్పథంతో మెమన్ కు ప్రాణభిక్ష పెట్టి అతడికి కొత్త జీవితం ప్రసాదించాలని రాష్ట్రపతిని గాంధీ అభ్యర్థించారు. తొందరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరారు. మెమన్ కు క్షమాభిక్ష పెట్టేందుకు గతేడాది రాష్ట్రపతి తిరస్కరించారు. క్షమాభిక్ష పెట్టాలని మరోసారి రాష్ట్రపతిని మెమన్ అభ్యర్థించాడు. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకోవాల్సివుంది. -
65 క్షమాభిక్ష పిటిషన్ల తిరస్కృతి
ఇస్లామాబాద్: 65 మంది మరణ శిక్ష పడ్డ ఖైదీల క్షమాభిక్ష పిటిషన్లను, పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ తిరస్కరించారు. వీరిలో హత్య కేసులో దోషిగా ఉన్న కనీజాన్ బీబీ అనే ఒకే ఒక్క మహిళ కూడా ఉంది. కనీజాన్కు ఉరి అమలైతే, పాక్‌లో ఇప్పటివరకు ఉరి శిక్ష పడ్డ మహిళల సంఖ్య 9కి చేరుతుంది. అధికారిక లెక్కల ప్రకారం పాక్‌లో కింది స్థాయి కోర్టులు ఇచ్చిన తీర్పులతో కలుపుకొని మొత్తం 47 మంది ఉరిశిక్ష పడ్డ మహిళల కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గత ఆరు నెలల్లో 150 మంది ఖైదీలకు ఉరి శిక్షని అమలు చేశారు. గత సంవత్సరం జరిగిన పెషావర్ ఆర్మీ స్కూల్ విషాదం తర్వాత మరణ శిక్ష నిషేధాన్ని టెర్రరిజం సంబంధం ఉన్నకేసుల్లో ఎత్తి వేశారు. ఈసంఘటనలో 140 విద్యార్థులు, సిబ్బంది చనిపోయారు. క్షమాభిక్ష తిరస్కరించిన వారందరికి రంజాన్ మాసం పూర్తయిన తర్వాత ఉరి శిక్ష అమలు కానుంది. -
‘నిఠారి’ కోలికి దక్కని క్షమాభిక్ష
ఆరుగురి క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన రాష్ట్రపతి న్యూఢిల్లీ: నిఠారి వరుస అత్యాచారాలు, హత్యల కేసుల్లో దోషి సురేంద్రకోలి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. కోలి సహా వేర్వేరు కేసుల్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న రేణుకాబాయ్, సీమ, రాజేంద్రప్రతాద్రావ్ వాన్సిక్(మహారాష్ట్ర), జగదీష్ (మధ్యప్రదేశ్), హోలీరామ్ బర్దోలాయి (అస్సాం) క్షమాభిక్ష పిటిషన్లను కేంద్ర హోంశాఖ సిఫారసుల మేరకు రాష్ట్రపతి తిరస్కరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్, నోయిడా సమీపంలోని నిఠారిలో 2005, 2006 సంవత్సరాలలో చిన్నారులపై సురేంద్రకోలి(42)అత్యాచారం చేసి ఆ తర్వాత వారిని క్రూరంగా హత్య చేసినట్లు తేలడంతో అతడికి దిగువ కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా సమర్థించాయి. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇతడిపై 16 కేసులు నమోదు కాగా నాలుగు కేసుల్లో మరణశిక్ష పడింది. మిగతా కేసుల్లో విచారణ ఇంకా పూర్తి కాలేదు. అలాగే, మహారాష్ట్రకు చెందిన అక్కా చెల్లెళ్లు రేణుకాభాయ్, సీమ చిన్నారులను అపహరించి వారితో దొంగతనాలు చేయిస్తూ, ఊహ తెలిసే వయసు వచ్చిన తర్వాత వారిని హత్య చేస్తున్నట్లు తేలడంతో సుప్రీంకోర్టు 2011లో మరణశిక్ష విధించింది. 1990 నుంచి 1996 మధ్య వీరు 13 మంది చిన్నారులను అపహరించి వారిలో 9 మందిని హత్య చేసినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే, ఐదుగురిని హత్య చేసినట్లు మాత్రమే ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన మిగిలిన వారు కూడా వివిధ కేసుల్లో మరణశిక్ష ఎదుర్కొంటున్నవారే. మరణశిక్ష అమలు చేయడంలో కారణం లేకుండా మితిమీరిన జాప్యం జరిగితే వారు క్షమాభిక్షకు అర్హులంటూ... 15 మంది దోషులకు మరణశిక్ష నుంచి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో సంచనల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.