Midcap index
-
మిడ్క్యాప్స్లోనూ డెరివేటివ్స్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ స్టాక్స్‌లోనూ డెరివేటివ్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ నెల 24 నుంచీ నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్‌లో కాంట్రాక్టులను అనుమతించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందినట్లు పేర్కొంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ నుంచి ఎంపిక చేసిన 25 స్టాక్స్తోకూడిన పోర్ట్‌ఫోలియోను నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ ట్రాక్ చేస్తుందని వివరించింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన స్టాక్స్‌లోనూ విడిగా డెరివేటివ్స్ అందుబాటులో ఉంటాయని తెలియజేసింది. ఒక్కో స్టాక్‌కు ఫ్రీఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పద్ధతిలో వెయిటేజీ ఉంటుందని వివరించింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో భాగంగా నెలవారీ గడువు కాంట్రాక్టును మినహాయించి వారం రోజుల్లో గడువు ముగిసే(వీక్లీ) కాంట్రాక్టులతోపాటు, మరో మూడు నెలవారీ సీరియల్ కాంట్రాక్టులకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. లార్జ్ క్యాప్స్‌లో..: ప్రస్తుతం ఇండెక్స్ డెరివేటివ్స్ ప్రధానంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ లేదా రంగాల ఆధారంగా ఎంపిక చేసిన కౌంటర్లలో అందుబాటులో ఉన్నట్లు ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీ విక్రమ్ లిమాయే ఈ సందర్భంగా పేర్కొన్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్లో మిడ్‌క్యాప్స్ 17 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. పోర్ట్‌ఫోలియో రిస్కును తగ్గించుకునే బాటలో నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్‌లో డెరివేటివ్స్ అదనపు హెడ్జింగ్ టూల్‌గా వినియోగపడతాయని వివరించారు. ఇటీవల మార్కెట్ ర్యాలీలో విభిన్నతరహా ఇన్వెస్టర్ల నుంచి మిడ్‌క్యాప్‌లో లావాదేవీలు పెరగడం, లిక్విడిటీ పుంజుకోవడం వంటి అంశాల నేపథ్యంలో ఎన్ఎస్ఈ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ ఏడాదిలో 39% వృద్ధి చూపడం గమనార్హం! -
మార్కెట్ బౌన్స్‌బ్యాక్- మిడ్ క్యాప్స్ రికార్డ్
ముంబై, సాక్షి: ఒక్క రోజులోనే మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. ముందురోజు నమోదైన నష్టాల నుంచి కోలుకుని తిరిగి ర్యాలీ బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 276 పాయింట్లు పెరిగి 48,450కు చేరింది. నిఫ్టీ సైతం 85 పాయింట్లు లాభపడి 14,231 వద్ద ట్రేడవుతోంది. 10 రోజుల వరుస ర్యాలీకి బుధవారం బ్రేక్ పడినప్పటికీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు దిగడంతో ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,558 ఎగువన, నిఫ్టీ 14,256 వద్ద గరిష్టాలను చేరాయి. ఎన్ఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 21,962 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకడం విశేషం! కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ వంటి అంశాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇటీవల మార్కెట్లు నిరవధిక ర్యాలీ బాటలో సాగుతుండటంతో ట్రేడర్లు కొంతమేర అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. (టాటా క్లిక్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు) ఐటీ, ఫార్మా వీక్ ఎన్ఎస్ఈలో మెటల్, రియల్టీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్ 3-1.3 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఐటీ, ఫార్మా 0.5-0.2 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ఐషర్, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్, ఆర్ఐఎల్ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో టైటన్, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, టెక్ మహీంద్రా, దివీస్, సన్ ఫార్మా, కొటక్ బ్యాంక్ 1.3-0.4 శాతం మధ్య క్షీణించాయి. భారత్ ఫోర్జ్ అప్ డెరివేటివ్ స్టాక్స్‌లో భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, జిందాల్ స్టీల్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎన్ఎండీసీ, అపోలో టైర్, సెయిల్, ఎల్ఐసీ హౌసింగ్, ఐబీ హౌసింగ్ 7-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క మైండ్‌ట్రీ, మ్యాక్స్ ఫైనాన్స్, కోఫోర్జ్, అరబిందో, ఐసీఐసీఐ లంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 2-0.6 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.2 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ 1,894 షేర్లు లాభపడగా.. 523 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 484 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 380 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 986 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 490 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 715 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన ప్రదర్శన
గడిచిన ఏడాది కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ 15 శాతం వరకు ర్యాలీ చేసింది. కానీ, ఇదే కాలంలో మిడ్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం ఫ్లాట్‌గా కొనసాగింది. గతంలో ప్రధాన సూచీలతో పోలిస్తే అధిక వ్యాల్యూషన్లకు చేరిన మిడ్‌క్యాప్ విభాగంలో ప్రస్తుత పరిస్థితి పూర్తి విరుద్ధం. ప్రధాన సూచీల కంటే ఎంతో చౌకగా స్టాక్స్ వ్యాల్యూషన్లు ఉన్నాయి. కనుక ఈ సమయంలో నాణ్యమైన మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందే అవకాశం ఉంటుందని విశ్లేషకులు, నిపుణుల అంచనా. మిడ్‌క్యాప్ విభాగంలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పథకం రాబడుల పరంగా మెరుగైన ప్రదర్శన చూపుతోంది. రాబడులు...: గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్ విభాగంలో నికర రాబడులు సున్నాయే. కచ్చితంగా చెప్పుకోవాలంటే బీఎస్ఈ మిడ్‌క్యాప్ టీఆర్ఐ 0.3 శాతం నికరంగా నష్టపోయింది. కానీ, యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ మాత్రం ఏడాది కాలంలో 14.6 శాతం రాబడులను ఇచ్చి ఈ విభాగంలోనే ఉత్తమ పథకంగా నిలిచింది. ఇక గడిచిన మూడేళ్ల కాలంలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కేవలం 8 శాతమే వృద్ధి చెందింది. ఈ కాలంలోనూ యాక్సిస్ మిడ్‌క్యాప్ పథకం వార్షికంగా 17.3 శాతం రాబడులతో అద్భుత పనితీరు చూపించింది. అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి వృద్ధి, ర్యాలీకి అవకాశం ఉన్న కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడంలో ఫండ్ మేనేజర్ విజయవంతమైనట్టు ఇది సూచిస్తోంది. ఇక ఐదేళ్ల కాలంలోనూ వార్షికంగా 9.9 శాతం రాబడులను ఈ పథకం ఇచ్చింది. ఈ కాలంలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 8.4 శాతమే వృద్ధి చెందింది. ఈ పథకం ఫిబ్రవరి 2011న ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా 16.79 శాతం రాబడులను ఇన్వెస్టర్లకు పంచింది. పెట్టుబడుల విధానాలు.. మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సెబీ నిబంధనల ప్రకారం తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని మిడ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ ఈ నిబంధనలను అనుసరిస్తోంది. ప్రస్తుతం డెట్ విభాగంలో 15 శాతం మేర ఇన్వెస్ట్ చేసి ఉంటే, 85 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించింది. ఈక్విటీ పెట్టుబడుల్లో 79 శాతం మిడ్‌క్యాప్ విభాగానికి, 21 శాతం లార్జ్‌క్యాప్ విభాగానికి కేటాయించి ఉంది. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 42 స్టాక్స్ ఉన్నాయి. ప్రధానంగా గడిచిన రెండేళ్ల కాలంలో (2018 నుంచి) మార్కెట్లలో ఎంతో అస్థిరతలు ఉన్నా కానీ, ఈ పథకం మంచి పనితీరు చూపించడానికి గల కారణాల్లో డెట్ విభాగానికి చెప్పుకోతగ్గ పెట్టుబడులను కేటాయించడం కూడా ఒకటి. మార్కెట్ అస్థిరతల్లో ఈ పథకం నష్టాల రిస్క్‌ను తగ్గించేందుకు డెట్ విభాగంలోకి కొంత పెట్టుబడులను మళ్లిస్తుంది. 2017 మార్కెట్ ర్యాలీలో ఈక్విటీల్లో పెట్టుబడులను 95 శాతం మేర నిర్వహించగా, ఆ తర్వాత 2018లో అస్థిరతలు ఆరంభం కాగానే ఈక్విటీ ఎక్స్పోజర్ను కొంత మేర తగ్గించుకుంది. అంతేకాదు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీగా కేటాయించిన పెట్టుబడుల్లోనూ మార్పులు చేస్తుంటుంది. ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సర్వీసెస్, కెమికల్స్ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. ఈ తరహా విధానాలతో ఈ పథకం తన పనితీరును మెరుగ్గా కొనసాగిస్తోంది. -
కొరియా భయం : సెన్సెక్స్ భారీ పతనం
సాక్షి, ముంబై : ఉత్తరకొరియా క్షిపణి దాడి హెచ్చరికలు దలాల్ స్ట్రీట్‌లో బాంబు పేల్చాయి. సెన్సెక్స్ భారీగా 300 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ సైతం 9750 మార్కు కిందకి పడిపోయింది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం గ్వామ్ ద్వీపం సమీపంలో క్షిపణి దాడి చేస్తామంటూ ఉత్తరకొరియా హెచ్చరించింది. ఇందుకు ధీటుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బదులు ఇచ్చారు. దీంతో అమెరికా-ఉత్తరకొరియాల మధ్య భౌగోళిక రాజకీయ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ టెన్షన్ వాతావరణం అమెరికా మార్కెట్లకు వణుకు పుట్టించాయి. ఆసియన్, యూరోపియన్ మార్కెట్లకు కొరియా భయం పట్టుకుంది. దీంతో మన మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి. ఈ రెండు దేశాల వైఖరితో ప్రపంచమంతటా యుద్ధమేఘాల భయం అలముకుందన్న భయాందోళనలో ఇన్వెస్టర్లు జంకుతున్నారని దలాల్ స్ట్రీట్ వర్గాలు పేర్కొన్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 274 పాయింట్ల నష్టంలో 31,257 వద్ద, నిఫ్టీ 93.55 పాయింట్ల నష్టంలో 9,726 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్టాక్స్‌లో కేవలం పవర్ గ్రిడ్, టెక్ మహింద్రా, విప్రోలు మాత్రమే లాభపడుతున్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2 శాతం మేర నష్టాలు గడిస్తున్నాయి. మరోవైపు రూపాయి కూడా భారీగా పతనమవుతోంది. నేటి ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసలు పతనమై 64.18 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు బ్రేక్ లేకుండా భారీగా 344 రూపాయల మేర పైకి ఎగిసి, 29,188 రూపాయలుగా ఉన్నాయి.