మైనింగ్.. మనీ
తెలంగాణలో మైనింగ్ ఆదాయం ఏడాదికేడాది పెరిగిపోతోంది. రాష్ట్ర అభివృద్ధికి ఆదాయం సమకుర్చే వనరుల్లో మైనింగ్ రంగం ఒకటి. దీంతో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇసుక, గ్రానైట్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించింది. గతంలో మాదిరిగా ఇసుక రీచ్‌లను వేలం వేయడం కాకుండా టీఎస్ఎండీసీ ద్వారా ఆన్లైన్ కొనుగోలు పద్ధతిని ప్రవేశపెట్టింది. దీంతో ఇసుక రీచ్‌ల వద్ద లెక్కలోకి రాని ఇసుక తగ్గి పోయింది. ఫలితంగా ఆదాయం గణనీయంగా పెరిగింది. గ్రానైట్ రవాణాకు సంబంధించి తనిఖీలు పెరగడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది.
వీటి ఫలితంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతూ పోతోంది. తెలంగాణ ఏర్పాటు కాకముందు రూ.1,807 కోట్లు ఉంటే ఇప్పుడు ఆ ఆదాయం రూ.3,169 కోట్లకు చేరింది. ఇసుక, గ్రానైట్‌తోపాటు బొగ్గు, ఇనుప ఖనిజం, డైమండ్, డోలమైట్, యూరేనియం, సున్నపురాయి నిక్షేపాలు తెలంగాణలో విరివిగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే సిమెంట్ కర్మాగారాలు, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, గ్రానైట్ కటింగ్, ఫేసిటింగ్, స్ట్రీల్, స్పాంజ్ ఐరన్ వంటివి మొత్తం 1,904 పరిశ్రమలు ఉన్నాయి. వీటి లైసెన్సులు, అమ్మకాలు, లీజు, పన్నుల ద్వారా ఆదాయం భారీగా సమకూరుతోంది.
– సాక్షి, వరంగల్ రూరల్
తెలంగాణలో ఖనిజ ఆధార పరిశ్రమలు...
సిమెంట్ ప్లాంట్స్ 21
స్పాంజ్ ఐరన్ ప్లాంట్స్ 15
క్వార్జ్ పల్వరైజింగ్ యూనిట్స్ 79
ఫెర్రో అల్లాయ్స్ యూనిట్స్ 02
గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ 723
స్టోన్ క్రషింగ్ యూనిట్స్ 463
నాప స్లాబ్ యూనిట్స్ 183
ఇసుక తయారీ యూనిట్లు 44
రెడీమిక్స్ కాంక్రీట్ యూనిట్లు 34
బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు 03
క్లే సిరామిక్ యూనిట్స్ 29
పుల్లర్స్ ఎర్త్ ప్రాసెసింగ్ యూనిట్లు 55
మొజాయిజ్ చిప్స్ యూనిట్స్ 16
లాటరైల్ బెనిఫిసియేషన్ ప్లాంట్స్ 02
బరైటీస్ ప్రాసెసింగ్ యూనిట్స్ 01
తెలంగాణలో ఖనిజ వనరులు
బొగ్గు: దక్షిణ భారత దేశంలో తెలంగాణ లోనే బొగ్గు నిక్షేపాలున్నాయి. రాష్ట్ర ప్రభు త్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ద్వారా తవ్వకాలు జరిపిస్తున్నది.
ఇనుము: బయ్యారం రక్షిత అటవీ ప్రాం తంలో మీడియం గ్రేడ్ ఇనుప ఖనిజం, మహబూబాబాద్, జయశంకర్ భూపాల పల్లి, జగిత్యాల, వరంగల్ అర్బన్ జిల్లాలో ఫ్లోట్ ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉన్నాయి.
యురేనియం: నల్లగొండ జిల్లా లంబాపూ ర్, పులిచర్ల, నమ్మాపురం, ఎల్లాపురం గ్రామాల్లో 11 మిలియన్ టన్నుల యురేనియం ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా.
సున్నపురాయి: ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపే ట, వికారాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సుమారుగా 7,519 మిలియన్ టన్నుల సున్నపురాయి నిక్షేపాలున్నాయి. 21 సిమెంట్ ప్లాంట్లు ఉండగా అందులో 10 మేజర్, 11 మైనర్‌వి. 29.50 ఎంటీపీఏ సామర్థ్యం తో సున్నపురాయిని వాడుతున్నారు.
గ్రానైట్: కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహ బూబాబాద్, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో గ్రానైట్ లభిస్తున్నది. కరీంనగర్, పెద్దపల్లి, జగి త్యాలల్లో బ్రౌన్ పొర్పొరే, రెడ్ రోజ్, బ్లూబ్రౌన్, టాన్ బ్రౌన్ లభిస్తాయి.