Mining permits
-
మైనింగ్ అనుమతుల జారీకి ప్రత్యేక విధానం
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ అనుమతులు త్వరితగతిన జారీ చేసేందుకు ప్రత్యేక విధా నాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సచివాలయంలో కేంద్ర, రాష్ట్ర గనుల శాఖ అధికారులు, రాష్ట్రంలోని జియోసైన్స్ సంస్థల ప్రతినిధులతో గురువారం జరిగిన వార్షిక వ్యూ హాత్మక ముఖాముఖి సమావేశం (అసిమ్)లో ఆయన మాట్లాడారు. అటవీ, పర్యావరణ అనుమతులు జారీ చేస్తున్న తరహాలో గనుల శాఖలోనూ లీజుదారులకు మైనింగ్ అనుమతులు సత్వరం జారీ చేయాలన్నారు. దీనికోసం కన్సల్టెన్సీ సేవలు అందించాలని సీఎస్ సూచించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సమావేశాన్ని తెలంగాణలో కేంద్ర గనుల శాఖ నిర్వహించడాన్ని అభినందించా రు. రాష్ట్రంలో గనుల అభివృద్ధి, ఖనిజాన్వేషణకు ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కేంద్ర గనుల శాఖ పరిధిలోని జియోసైన్స్ పరిశోధనా సంస్థల సహకారంతో తెలంగాణలో ఖనిజాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అసిమ్ తరహా ఎంతో ఉపయోగం హైదరాబాద్‌లో ఉన్న జియో సైన్స్ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేసేందుకు అసిమ్ తరహా సమావేశాలు ఉపయోగపడుతాయని కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి కె.రాజేశ్వర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), అటమిక్ మినరల్ డైరక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), నేషనల్ జియోఫిజికల్ రీసె ర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వంటి సం స్థల సహకారంతో ఖనిజాన్వేషణ వేగవంతం గా చేపట్టవచ్చన్నారు. తెలంగాణలో సున్నపురాయి, మాంగనీస్, ఐరన్‌ఓర్, బొగ్గు తదితర ఖనిజాల అన్వేషణ పనులు చేపడతామన్నారు. రూ.4,792 కోట్ల ఆదాయం రాష్ట్రంలో 3,291 మైనింగ్ లీజులుండగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.4,792 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు గనులశాఖ జాయింట్ డైరక్టర్ రఫీ అహ్మద్ వెల్లడించారు. స్టేట్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు ద్వా రా ఖనిజాల అన్వేషణ చేపట్టడంతోపాటు కేం ద్ర జియోసైన్స్ సంస్థల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీగా గుర్తింపు పొందినట్లు టీఎస్ఎండీసీ మేనేజింగ్ డైరక్టర్ మల్సూర్ వెల్లడించారు. తమ సంస్థకు నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్టు నాలుగు ప్రాజెక్టులు కేటాయించిందన్నారు. -
కలెక్టర్ దృష్టికి ‘క్వారీ’ సమస్య
మైనింగ్ అనుమతులపై కలెక్టర్, ఎస్పీకి విన్నవించిన దువ్వాడ శ్రీకాకుళం పాతబస్టాండ్ : నందిగాం మండలంలో సొంటినూరు గ్రామం వద్ద నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీ అనుమతులను రెన్యువల్ చేయాలని, ఈ విషయమై టెక్కలి మైన్స్ ఏడీ లెసైన్స్‌లు రెన్యువల్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ సోమవారం కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంకు ఫిర్యాదు చేశారు. తొలుత దువ్వాడ కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిశా రు. అనంతరం ఎస్పీ బ్రహ్మారెడ్డిని కూడా కలసి శాంతి భద్రతల విషయమై ప్రస్తావించారు. మైనింగ్ అనుమతుల రెన్యువల్ విషయమై టెక్కలి మైనింగ్ ఏడీ నిర్లక్ష్యానికి నిరసనగా 11 రోజులుగా దువ్వాడ వాణితో పాటు 400 మంది గిరిజనులు దీక్షలు నిర్వహిస్తున్నారని, అయినా ఇంత వరకూ అనుమతులు ఇవ్వలేదని ఆయన వివరించారు. క్వారీ నిలిపివేయడం వలన ప్రతి రోజూ రూ.75వేలు చొప్పు న నష్టం భరించాల్సి వస్తోందన్నారు. ఇటీవల మైన్స్ ఏడీ తన కిందిస్థాయి సిబ్బందిని క్వారీకి పంపించారని, వారు కోరిన విధంగా అన్ని దరఖాస్తులు, అన్ని బ్లాకులు వారికి చూపించామని తెలిపారు. క్వారీ విషయంలో హైకోర్టు కూడా తనను మైనింగ్‌ను కొనసాగించాలని అనుమతులు కూడా జారీ చేసిందని ఆ ఉత్తర్వులను చూపించారు. సకాలంలో కలెక్టర్, ఎస్పీలు స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. కలెక్టర్, ఎస్పీలను కలసిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు, పోలాకి సోమేశ్వరరావు, వి.తాతారావు, విశ్వనాథం, ఎంపీటీసీ కృష్ణ తదితరులు ఉన్నారు. -
సిలికాన్ ముసుగులో.. ఇసుక దోపిడీ
- గూడూరు నుంచి బెంగళూరుకు వందల లోడ్ల రవాణా - పక్కా మైనింగ్ పర్మిట్లతోనే తరలుతున్న వైనం - అక్రమాల్లో చిత్తూరుకు చెందిన అధికారపార్టీ నాయకుల హస్తం పలమనేరు: సిలికాన్ ముసుగులో ఇసుక దోపిడీ పేట్రేగుతోంది. గూడూరు నుంచి బెంగళూరుకు వందల లోడ్ల ఇసుక రవాణా అవుతోంది. దీనివెనుక చిత్తూరుకు చెందిన అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నట్టు సమాచారం. అంతా పక్కాగానే.. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూ రు నుంచి సిలికాన్ ఇసుక బెంగళూరుకు తరలుతోంది. అక్కడ మైనింగ్ లీజుదారులు సిలికాన్ ఇసుకను సబ్‌లీజు, లేదా సేల్స్ ద్వారా టన్ను రూ.500 విక్రయిస్తున్నారు. లారీలోడు 20 టన్నులకు వారికి అక్కడికక్కడే పదివేలు గిట్టుబాటవుతోంది. దీన్ని కొనుగోలుచేసిన వ్యక్తి పక్కా రికార్డులతో అక్కడి నుంచి బయలుదేరి మధ్యలో లారీలోని సిలికాన్ ఇసుక లోకి మామూలు ఇసుకను నింపుకుని పైకి మాత్రం సిలికాన్ ఇసుక కనిపించేలా పట్టలు కప్పి బెంగళూరుకు తరలిస్తున్నారు. సిలికాన్ ఇసుకను గ్లాస్, పింగాణీ, గేర్‌బాక్స్‌లు, టాయ్‌లెట్స్, కొన్ని ఫౌడర్ల తయారీకి ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇసుకకు డిమాండ్ ఉంది కాబట్టి మామూలు ఇసుకలోనూ దీన్ని కలిపి భవన నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. మామూలుగా సిలికాన్ ఇసుకైతే బెంగళూరులో టన్ను రూ.35 వేలు పలుకుతోంది. అదే మామూలు ఇసుకైతే రూ.80 వేల నుంచి లక్షవరకు (12 చక్రాల లారీ) అమ్ముడవుతోంది. గూడూరు నుంచి నిత్యం బెంగళూరుకు 700 లోడ్లు గూడూరు నుంచి బెంగళూరుకు అటు తిరుపతి, చిత్తూరు, పలమనేరు మీదుగా రోజుకు 400 లోడ్లు, పుంగనూరు మీదుగా 300 లోడ్లు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ పక్కా బిల్లులతో సిలికాన్ ఇసుకను తరలించినట్టే వెళుతున్నాయి. అయితే వీటిల్లో కొన్ని లోడ్లు మాత్రం ఇసుకతో వెళుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం పలమనేరు పోలీసులు కేవలం ఒక రాత్రిలోనే 30 లారీలను పట్టుకోవడం గమనార్హం. అంతా మామూళ్ల మయం ఈ మధ్యలో నాయుడుపేట నుంచి హొస్కోట వరకు 16 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. రేణిగుంట, కర్ణాటకలోని వడ్డిపల్లె చెక్‌పోస్టులున్నాయి. ఇక్కడ లారీకి రూ.500 ఇస్తేనే బండి ముందుకు కదులుతుందట. ఇక సంబంధిత పోలీసు సబ్డివిజన్లకు నెల మామూళ్లు టంచనుగా అందుతున్నట్టు తెలుస్తోంది. అక్రమ రవాణాలో అధికారపార్టీ నాయకులే కీలకం చాలామంది లారీ యజమానులు, సిలికాన్ ఇసుక కొనుగోలుదారులు లోడుకు రూ.ఐదువేలు సంపాదించుకోవడానికే ఈ వ్యాపారం చేస్తున్నారు. కానీ వీరి ముసుగులో చిత్తూరుకు చెందిన ఓ అధికారపార్టీ చోటా నాయకుడు మరో బడా నాయకుని పేరు చెప్పి ఈ అక్రమాలను కొనసాగిస్తున్నట్టు స్థానిక పోలీసులకు తెలియందీమే కాదు. వీరికి పలమనేరుకు చెందిన ఈ జేసీబీ యజమాని, గంగవరం మండలానికి చెందిన ఇరువురు కీలకంగా ఉన్నట్టు సమాచారం. పలమనేరు డీఎస్పీ కార్యాలయంలోని ఓ కీలక వ్యక్తి అండదండలు వీరికున్నాయని తెలిసింది. ఈ విషయమై స్థానిక సీఐ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ చాలా లారీలు సిలికాన్ పేరిట ఇసుకను తరలిస్తున్నాయనే మాట వాస్తవేమన్నారు. త్వరలో ఈ ముఠా గుట్టురట్టు చేస్తామన్నారు. -
మైనింగ్ పర్మిట్ల మాయాజాలంమైనింగ్ పర్మిట్ల మాయాజాలం
=అనుమతికి మించి తరలింపు =ప్రభుత్వ ఆదాయానికి గండి =విజిలెన్స్ దాడులతో వెలుగులోకి గనుల లీజులకు తిలోదకాలిస్తున్నారు. పర్మిట్ల మాయాజాలంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జిల్లాలోని పలు గనుల క్వారీల్లో ఈ తంతు యథేచ్ఛగా సాగిపోతున్నా సంబంధిత అధికారులు నియంత్రించలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో నిఘా లేకపోవడంతో లీజుదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం : క్వారీలు లీజుకిచ్చినప్పుడు నిర్దేశిత విస్తీర్ణంలో తవ్వకాలు జరపాలని మంజూరు పత్రంలో స్పష్టంగా ఉంటుంది. తవ్వకాలు జరిపిన గ్రావెల్, గ్రానైట్, ఖనిజాలను తీసుకున్న పర్మిట్ల మేరకే రవాణా చేయాలి. గ్రావెల్‌కైతే ఒకటి రెండు రోజులకు, స్టోన్స్/ ఖనిజాలకైతే నెలకోసారి భూగర్భ గనుల శాఖ నుంచి పర్మిట్లు తీసుకోవాలి. క్యూబిక్ మీటరు స్టోన్స్ పర్మిట్‌కు రూ.50లు, ఖనిజాలకు రూ.1875 నుంచి రూ.2400లు, మట్టికి రూ.22 లు చెల్లించి పర్మిట్లు తీసుకుని రవాణా చేయాలి. ఇలా ప్రస్తుతం జిల్లాలోని విశాఖ ఏడీ పరిధిలో 143, అనకాపల్లి పరిధిలో 343 లీజులున్నాయి. రోడ్డు మెటల్, భవన నిర్మాణ రాయి, గ్రావెల్, కాల్షైట్, మైకా, బంకమట్టి, క్వార్ట్స్, లేటరైట్, లైమ్‌స్టోన్ తదితర ఖనిజాల తవ్వకాలు జరు గుతున్నాయి. అయితే తవ్వకా లు, రవాణా కొచ్చేసరికి పలువు రు లీజు యజమానులు అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారు. అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా తవ్వకాలు జరిపి తరలిస్తున్నారు. ఉదాహరణకు నెలకు 50 పర్మిట్లు తీసుకుంటే 200 పర్మిట్లకు పైగా ఖనిజాలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. సాధారణంగా 24 గంటల్లోగా ఒక పర్మిట్‌తో ఒక లోడును రవాణా చేయవచ్చు. ఇదే అవకాశంగా తీసుకుని అదే పర్మిట్‌తో రోజు కు నాలుగైదు లోడ్లు తరలించేస్తున్నారు. అదనం గా తరలించినదంతా లెక్కలోకి రావడం లేదు. ఫలితంగా వాటి ద్వారా రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీల్లో ఇవన్నీ వెలుగు చూస్తున్నాయి. ప్రతీ నెలా సరాసరి ఈ తరహా కేసులు 50కి పైగా పట్టుబడుతున్నాయి. దాదాపు రూ.10 లక్షల మేర అపరాధ రుసుం కింద వసూలవుతోంది. దీనికంతటికీ క్షేత్రస్థాయి నిఘా లేకపోవడమే కారణమని తెలుస్తోంది. క్వారీలో ఎప్పటికప్పుడు ఎంతమేరకు తవ్వకాలు జరుపుతున్నారో, రోజుకి ఎన్ని పర్మిట్లు వాడుతున్నారో పరిశీలించాలి. రవాణా చేస్తున్న వాటికి పర్మిట్లు ఉన్నాయో లేదో తనిఖీలు చేయాలి. గతంలో ఈ తరహా తనిఖీలు జరిగేవి. కానీ ఇప్పుడు జరగడం లేదు. లీజు వ్యవధి పూర్తయ్యే వరకు క్వారీల వద్ద తనిఖీలు చేసే అధికారం లేదని, పర్మిట్లను నిత్యం పరిశీలించే సమయం దొరకడం లేదంటూ మైనింగ్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీన్నే ఆవకాశంగా తీసుకుని పలువురు లీజుదారులు రెచ్చిపోతున్నారు.