Minister harisravu
-
ప్రజలను భ్రమల్లో ముంచుతున్న కేసీఆర్,హరీశ్‌రావు
మేము అధికారంలోకి వస్తే కేసీఆర్, హరీశ్ జైలుకే.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మల్యే తూర్పు జగ్గారెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీ :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులనే తిరిగి ప్రారంభిస్తూ వాటికి కొబ్బరికాయలు కొడుతూ ప్రజలను భ్రమల్లో ముంచుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావును తాము అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తామని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి తూర్పు జగ్గారెడ్డి అరోపించారు. శనివారం అయన విలేకరులతో మట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, తాము ఎప్పుడూ ప్రాజెక్టులను అడ్డుకోలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాలోనే ప్రాణహిత-చేవెళ్లు ప్రాజెక్టును చేపడితే టీఆర్ఎస్ ప్రభుత్వం అదే ప్రాజెక్టుకు పేర్లు మార్చి, వేల కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నారని ఆరోపించారు. తాము మల్లన్నసాగర్‌కు వ్యతిరేకం కాదని కాని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో సెప్టెంబర్17ను అధికారికంగా నిర్వహించాలని అందోళనలు చేపట్టి కేసీఆర్, హరీశ్‌రావులు ఈ రోజు ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. -
దసరా నాడు సిద్దిపేటకు రానున్న సీఎం
కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతన జిల్లా కార్యకలాపాలు రాష్ర్టనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్ : సీఎం కేసీఆర్ దసరా నాడు సిద్దిపేట జిల్లా ఏర్పాటును లాంఛనంగా ప్రారంభిస్తారని రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం అమర్నాధ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఐదు వేల మట్టి వినాయక ప్రతిమలను స్థానిక వెంకటేశ్వర దేవాలయం వద్ద మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ప్రతి యేట పర్యావరణ పరిరక్షణకు అమర్నాధ్ సేవా సమితి మట్టి విగ్రహాలను ఉచితంగా అందించడం అభినందనీయన్నారు. పండుగ నాడు రంగు రంగుల, భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడం ముఖ్యంకాదని, భక్తి శ్రద్ధలతో పూజ చేయడం ప్రధానమన్నారు. వివిధ రకాల రసాయనాల వల్ల చెరువుల్లో కాలుష్యంతో పాటు జీవరాసులకు నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్‌లోని ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో మంత్రులందరికి మట్టి వినాయక ప్రతిమలను ఇంటింటికి పంపిణీ చేశారని ఇదే స్ఫూర్తితో రాష్ర్ట ప్రజలు పర్యావరాణాన్ని పరిరక్షించాలన్నారు. పట్టణంలోని చెరువుల అభివృద్ధికోసం కోట్లాది నిధులు ఖర్చుపెడుతున్నామని, కోమటి చెరువు వద్ద రూ. 15కోట్లతో అధునీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. అదే విధంగా రూ. 6.5 కోట్లతో ఓపెన్ అడిటోరియం నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో సిద్దిపేటలో ఇంటింటికి తాగునీటిని అందిస్తామన్నారు. నీటి వృధాపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ప్రస్తుతం మున్సిపాల్టీ తాగునీటి సరఫరా కోసం రూ. 1.15 కోట్ల విద్యుత్ బిల్లును చెల్లిస్తోందన్నారు. ఇప్పటి వరకు రాష్ర్ట ప్రభుత్వం రూ. 12 కోట్ల విద్యుత్ బిల్లుల భారాన్ని మున్సిపాల్టీపై పడకుండా చూసిందన్నారు. 30 నుంచి 40 శాతం అవుతున్న నీటి వృధాను నియంత్రిస్తే సుమారు రూ. 4 కోట్ల విద్యుత్ బిల్లులు మున్సిపాల్టీకి ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. పట్టణంలోని నాలుగు చెరువుల అభివృద్ధి భాగంగా నర్సాపూర్ చెరువు శివారులో రూ. 14 కోట్లతో మురికి నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సిద్దిపేటలో ప్రభుత్వ స్థలాలు సమస్యగా మారిందని నిధులు పుష్కలంగా ఉన్న స్థల సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. రూ. 5 కోట్లతో ఎస్ఎంహెచ్ వసతి గృహం, నాలుగు కోట్లతో ఐబీ గెస్ట్ హౌస్ నిర్మాణం, ఎస్పీ కలెక్టర్, జెడ్పి, ఎస్సీ కార్యాలయాలకు భవన నిర్మాణానికి నిధులున్నాయని , స్థల సేకరణ చేస్తున్నామన్నారు. అంతకు ముందు మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ అమర్నాథ్ సేవా సమితి స్పూర్తిదాయకమన్నారు. లంగర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రితో మాట్లాడి చర్యలు చేపడతానన్నారు. అనంతరం మంత్రి పలువురికి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి , మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, చిప్ప ప్రభాకర్, బ్రహ్మం, చిన్నా, లలితరామన్న, సేవ సమితి ప్రతినిధులు ఇల్లందుల అంజయ్య, చీకోటి మదుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు మాదిరి విహారానికి వెళ్లలేదు..
- కేసీఆర్ దేశం కోసం చైనా వెళ్లారు - ఏపీ సీఎం బాబుకు మంత్రి హరీశ్‌రావు చురకలు రామాయంపేట : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా కుటుంబ సభ్యులతో కాకుండా, దేశ ప్రతిష్ట ఇనుమడింప చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన శనివారంరాత్రి రామాయంపేట వచ్చిన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏ హోదాతో బాబు కుమారుడు లోకేశ్ పరిశ్రమల శాఖ కార్యదర్శితో కలిసి అమెరికా వెళ్లారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పారిశ్రామిక విధానానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తుండటంతో ఓర్వలేక కొందరు తెలంగాణ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాబు ప్రత్యేక విమానంలోరూ.20 కోట్ల ప్రజాధనంతో కనీసం 65 సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఎప్పటికైనా విడవాల్సిన హైదరాబాద్‌లో సచివాలయం మరమ్మతులకు బాబు రూ.45 కోట్లు ఖర్చు పెట్టాడని ఎద్దేవా చేశారు. బాబు అధికార దాహంతో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, ఢిల్లీలో రూ. కోట్ల ఖర్చుతో అధికారిక కాన్వాయ్‌లను ఏర్పాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు చైనాలో జరుగుతున్న ఎకనమిక్ ఫోరం సదస్సుకు రావాలని ఆహ్వానం అందడం గర్వకారణమన్నారు. -
రైతుకు భరోసానిస్తూ..
అభివృద్ధిని జపిస్తూ.. - జిల్లాలో మంత్రి హరీష్‌రావు మొదటి రోజు పర్యటన - పెన్‌గంగ చనాక బ్యారేజీ స్థల పరిశీలన - అక్కడి అధికారులు, ప్రజలతో చర్చలు - కుప్టి ప్రాజెక్టు స్థల పరిశీలన - నిర్మల్, బోథ్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన - పలు ప్రారంభోత్సవాలు ఆదిలాబాద్ : రైతులకు భరోసానిస్తూ.. అభివృద్ధి జపం చేస్తూ.. జిల్లాలో భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు పర్యటన గురువారం సాగింది. గత పాలకుల వైఫల్యాలను ఒక పక్క తూలనాడుతూనే.. వారి వల్లే అభివృద్ధిలో వెనుకబడిందని ధ్వజమెత్తారు. మరో పక్క కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతులకు కొండంత అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు అయిన లోయర్ పెన్‌గంగ కింద మహారాష్ట్రలోని చ నాక వద్ద తెలంగాణ రాష్ట్ర నిధులతో నిర్మించదలచిన బ్యారే జీ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి సాగునీటి శాఖ అధికారు లు ముంపునకు గురయ్యే ప్రజలతో చర్చించారు. ఇచ్చోడ, నే రడిగొండ మధ్యలో కుప్టి ప్రాజెక్టు స్థలాలను పరిశీలించారు. పర్యటన ఇలా.. బుధవారం రాత్రి నిర్మల్‌కు చేరుకున్న మంత్రి హరీష్‌రావు స్థానిక ఐబీ విశ్రాంతి గృహంలో బస చేశారు. గురువారం ఉ దయం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ శోభారాణితో కలిసి నిర్మల్ పట్టణంలో పర్యటించారు. గాంధీ కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు. కూరగాయలు విక్రయించే రైతులు ప్రజలతో మాట్లాడారు. మార్కెట్లో షెడ్లు ఏర్పాటు చేయమని కోరగా అందుకు ఆయన సమ్మతించారు. ఈ సం దర్భంగా మంత్రి హరీష్‌రావును మంత్రి ఐకేరెడ్డి, కార్యకర్తలు సన్మానించారు. నిర్మల్ పెయింటింగ్స్‌ను బహూకరించారు. త్వరలోనే సాగునీటి శాఖలో పోస్టుల భర్తీ పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు రూ.7 కోట్లు మంజూరు చేయగా.. నిర్మల్‌లో రూ.2.50 కోట్లలో నిర్మించిన సాగునీటి పారుదల శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. సాగునీటి శాఖలో ఖాళీగా ఉన్న 30 ఏఈ పోస్టులను త్వరలో నే భర్తీ చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిర్మల్ మా ర్కెట్ యార్డులో రైతు విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. చించోలి గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మిస్తున్న గోదాముకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మా ట్లాడారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు బారు లు తీరేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని వివరించారు. వచ్చే ఖరీఫ్‌కు 9 గంటల విద్యుత్‌ను ఇస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలో రూ.158 కోట్లతో 46 గోదాములు నిర్మిస్తున్నట్లు తెలి పారు. ప్రతి మండలంలో గోదాము ఏర్పాటు చేస్తామన్నారు. ఆశ కార్యకర్తల నిరసన రూ.17వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దేనని హరీష్‌రావు పేర్కొన్నారు. వడ్డీ కోసం బ్యాంకులు వేధిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. స్వర్ణ ప్రాజెక్టును ఆ ధునీకరిస్తామని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కాగా.. చించోలి గ్రామం నుంచి వస్తుం డగా ఆశ వర్కర్లు హరీష్‌రావును అడ్డుకునే ప్రయత్నం చేశా రు. పోలీసులు వారిని తొలగించారు. వాహనంలో నుంచే వినతిపత్రం తీసుకుని వెళ్లిపోయారు. దీంతో తమ సమస్య లు వినలేదని ఆశ కార్యకర్తలు మంత్రి హరీష్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి బోథ్ మండలం కరత్వాడ చేరుకున్న మంత్రి హరీష్‌రావు రూ.13 కోట్లతో కాలువ ఆధునీకరణ, రూ.7 కో ట్ల చింతల్బోరి చెరువు తుము, కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తుమ్మిడిహెట్టితో 1.56 లక్షల ఎకరాల ఆయకట్టు.. బోథ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్రా వు మాట్లాడుతూ.. గత పాలకుల వైఫల్యాలను ఎండగట్టారు. కుప్టి హైడల్ ప్రాజెక్టును గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై ప్ర త్యేక ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు. రూ.1.58 కోట్లతో ప్రాజెక్టు డిటైల్ సర్వే చేపడుతున్నామని.. సర్వే పూర్తి కాగానే ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుందని వివరించారు. గతంలో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తుమ్మిడిహెట్టి నుంచి జిల్లాలో కేవలం 56 వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే డిజైన్ ఉందని, ప్రస్తుతం రీడిజైన్‌లో తుమ్మిడిహెట్టి వద్ద 1.56 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందనుందని చెప్పారు. పెన్‌గంగతో 46 వేల ఎకరాలకు నీరు.. గతంలో లోయర్ పెన్‌గంగ అనగానే ధర్నాలు, రాస్తారోకో లు, పాదయాత్రలు కనిపించేవని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జోగురామన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి చనాక వద్ద బ్యారేజీ నిర్మించుకునేందుకు అనుమతి పొందారని అన్నారు. తద్వారా జిల్లాలో 46 వేల ఎకరాల ఆయకట్టు కు నీరందుతుందని వివరించారు. జిల్లాలో 39 లక్షల ఎకరా ల వ్యవసాయ భూమి ఉండగా 19 లక్షల ఎకరాల భూమికే సాగునీరు అనుకూలంగా ఉందని, వర్షపాతాన్ని పూర్తిగా స ద్వినియోగం చేసుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరందేలా ప్రాజెక్టులు నిర్మిస్తామని పేర్కొన్నారు. అంతకుముం దు బజార్హత్నూర్ మండలంలో పలు పంటపొలాలకు వెళ్లి రైతులతో మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. మద్దతు ధరలు దిగుబడుల విషయమై ప్రశ్నించారు. బజార్హత్నూర్ మండ లం దహెగామలో రూ.13 కోట్లతో కాలువ పనులను ప్రారంభించారు. గేర్జం చెరువును పరిశీలించారు. లోయర్ పెన్‌గంగ కింద బ్యారే జీ స్థల పరిశీలన.. బోథ్ నియోజకవర్గం నుంచి నేరుగా ఆదిలాబాద్ పట్టణానికి చేరుకున్న మంత్రి హరీష్‌రావుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఘ నంగా స్వాగతం పలికారు. రిమ్స్ ఎదుట ఉన్న చాకలి ఐల మ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలో సాగునీటి పారుదల శాఖ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు కింద జైనథ్ మండలం కోర్ట, మహారాష్ట్ర పాండ్రకౌడ తాలుకాలోని చనాక వద్ద రెండో బ్యారేజీ రూ.300 కోట్ల తెలంగాణ నిధులతో నిర్మిస్తుండగా ఆ గ్రామాన్ని మంత్రి సందర్శించారు. కిలో మీటరు నడుచుకుంటూ వెళ్లి ఆ గ్రామానికి చేరుకున్నా రు. చనాకలో మహారాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులతోపాటు జిల్లా సాగునీటి పారుదల శాఖ అధికారులతో బ్యారేజీ విషయమై చర్చించారు. అక్కడి నిర్వాసితులకు తె లంగాణ నిధులతో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చా రు. వచ్చే వేసవిలోగా ఈ బ్యారేజీ పనులను ప్రారంభిస్తామ ని పేర్కొన్నారు. కాగా అక్కడి నుంచి మంత్రి రాత్రి ఆదిలాబాద్‌కు చేరుకుని ఇక్కడే బస చేశారు. మంత్రి వెంట పలువురు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. కుప్టి ప్రాజెక్టు స్థల పరిశీలన.. బోథ్ నుంచి మంత్రి హరీష్‌రావు ఇచ్చోడ, నేరడిగొండ మధ్యలో కడెం నదిపై కట్టనున్న కుప్టి ప్రాజెక్టు కోసం స్థలాన్ని పరిశీలించారు. అటవీశాఖ మంత్రి జోగురామన్న, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రాజెక్టుపై మంత్రి హరీష్‌రావుకు వివరించారు. -
భోరుబండ
వట్టిపోయిన జలాశయం - ఆందోళనలో రైతాంగం - పాతికేళ్లుగా అధికారుల నిర్లక్ష్యం - ‘మిషన్ కాకతీయ’లో చేర్చని వైనం - ప్రవాహానికి నోచుకోని కాల్వలు గజ్వేల్: బహుళ ప్రయోజన రిజర్వాయర్ ‘బోరబండ’ చుక్కనీరు లేక వెలవెలబోతోంది. చినుకు పడక.. రిజర్వాయర్ నిండక, సాగు సాగక చిన్నబోతోంది. నిర్మాణం పూర్తయి పాతికేళ్లవుతున్నా.. కాల్వలు ప్రవాహానికి నోచుకోవడం లేదు. జలాశయం నిండితే మరెన్నో చెరువులను నీటితో నింపొచ్చు. కానీ, ఆదిశగా అధికారుల చొరవ కరువైంది. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నందు వల్ల నిధులెన్నైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. మంత్రి హరీష్‌రావు సహకారం ఉన్నా.. అధికారుల్లో స్పందన లేదు. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి-ధర్మారం గ్రామాల మధ్య 1990లో రూ.56 లక్షలతో బోరబండ రిజర్వాయర్ నిర్మించారు. 115 ఎకరాల విస్తీర్ణం.. 36.80 మిలియన్ ఘనపుటడుగుల నీటినిల్వ సామర్థ్యం దీని సొంతం. క్షామంతో తల్లడిల్లుతున్న జగదేవ్‌పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆరుతడి పంటలకు కాల్వల ద్వారా సాగునీటిని అందించడం, గజ్వేల్ నియోజకవర్గంలో భూగర్భజలాల పెంపు దీని లక్ష్యం. 2.6 కి.మీ. పొడవున కుడి, 1.94 కి.మీ. పొడవున ఎడమ కాల్వ నిర్మించారు. ప్రాజెక్టు పరిధిలో 832 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కుడి కాల్వ ద్వారా ధర్మారం, వర్దరాజ్‌పూర్, ఇటిక్యాల, కొత్తపేట, పీర్లపల్లిలోని 568 ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా ధర్మారం, పీర్లపల్లిలోని మరికొంత భాగంలో వున్న 264 ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరందిం చాలని నిర్ణయించారు. అయితే, రిజర్వాయర్ ప్రారంభం నుంచీ కాల్వలు ప్రవాహానికి నోచుకోలేదు. ఆయకట్టు తడిచింది లేదు. చుక్క పారని కాలువలు నాలుగేళ్లుగా తక్కువ వర్షపాతం కారణంగా ఎగువ నుంచి వరద నీరు రాక జలాశయం ఎండుముఖం పట్టింది. కొద్దోగొప్పో వర్షాలతో ప్రాజెక్టు నిండుతున్నా.. కాల్వల ద్వారా నీరందించేందుకు తూములను ఎత్తకపోవడంతో ఆయకట్టుకు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదు. మరోపక్క కాల్వల నిర్మాణమూ సరిగా లేదు. ప్రస్తుతం ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మించాలంటే రూ. 20 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెబుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు.. 25 ఏళ్ల క్రితమే తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన రిజర్వాయర్‌ను మాత్రం వినియోగంలోకి తేవడం లేదు. అరకొరగా అభివృద్ధి పనులు సామూహిక చెరువుల యాజమాన్య పథకం కింద బోరబండ రిజర్వాయర్ అభివృద్ధికి 2008లో రూ.84 లక్షలు మంజూరయ్యాయి. వీటి విడుదల కోసం ప్రణాళికలు తయారు చేసి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉండగా అధికారులు చొరవ చూపడం లేదు. ఎట్టకేలకు రెండేళ్ల క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులు చేపట్టారు. శిథిలమైన కాల్వల పటిష్టం, తూము ల మరమ్మతు, కట్ట పటిష్టం వంటి పనులు అరకొరగా సాగాయి. ఎతైన ప్రదేశంలో ఉన్న బోరబండ రిజర్వాయర్ నిండితే జగదేవ్‌పూర్ మండలంలోని పలు చెరువులకు ప్రవాహపు నీటిని పంపవచ్చు. అలాగే, జలాశయం నుంచి భారీ గా పూడికతీయాల్సి ఉంది. ‘మిషన్ కాకతీయ’లోనూ దీన్ని చేర్చకపోగా, ప్రాజెక్ట్‌కు రూ.15 లక్షలు పూడికతీత పనుల కింద కేటాయించాలని ప్రతిపాదించి చేతులు దులుపుకున్నారు. ‘ప్రాణహిత’తో అనుసంధానిస్తే మేలు ‘బోరబండ’ను ‘ప్రాణహిత’ ఎత్తిపోతల పథకంతో అనుసంధానించి, నింపగలిగితేనే రైతులకు మేలు జరుగుతుంది. భారీ వర్షాలు కురిస్తే తప్ప ఈ రిజర్వాయర్ నిండదు. కాబట్టి ‘ప్రాణహిత’తో అనుసంధానించడమే మార్గం. దీనిపై సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇస్తామని ధర్మారం గ్రామానికి చెందిన రైతు మల్లేశం ‘సాక్షి’కి తెలిపారు. ‘బోరబండ’ప్రాధాన్యత గుర్తిస్తాం బోరబండ రిజర్వాయర్ అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాం. ‘మిషన్ కాకతీయ’ మొదటి విడత పనుల్లో చేర్చలేకపోయాం. రిజర్వాయర్‌ను సందర్శించి అభివృద్ధికి ఏ చర్యలు తీసుకోవచ్చనే దానిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తా. - శ్రీనివాసరావు, ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ -
గ్రామజ్యోతిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి
మంత్రి హరీశ్‌రావు పటాన్చెరు : గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన పటాన్చెరు మండలం లక్డారంలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామజ్యోతి కార్యక్రమం విశిష్టతను వివరించారు. కాగా మంత్రి గ్రామ ప్రజలను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. వేదికపై ఆయన నిలబడి ఉన్నంత సేపు గ్రామ ప్రజలను నవ్వించారు. గ్రామజ్యోతి విశిష్టతను సూటిగా అర్థమయ్యేలా వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన గంగదేవిపల్లి ఎలా ఆదర్శ గ్రామంగా మారిందో ఆ విధంగానే తెలంగాణలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామాభివృద్ధి ప్రణాళికలకు ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. అందుకోసమే ఏడు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. డంప్ యార్డుకు స్థలం కేటాయించండి అన్ని గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డు కోసం స్థలాన్ని వెంటనే కేటాయించాలని తహశీల్దార్లకు మంత్రి సూచించారు. లక్డారంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయించక పోవడంపై మంత్రి స్థానిక తహశీల్దార్ ఫర్హీన్ షేక్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. గ్రామజ్యోతి ప్రారంభించి మూడు రోజులైనా డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించక పోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గ్రామంలో అంగన్వాడీ, వైద్యం, ఆరోగ్యం పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రాంలో కలెక్టర్ రొనాల్డ్ రాస్, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీశైలం యాదవ్, జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్రహీంపట్నంను సస్యశ్యామలం చేస్తాం
మంత్రి హరీష్‌రావు హయత్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని, నాలుగున్నర కోట్ల ఖర్చుతో బాచారంలోని మూసీనదిపై ఉన్న కత్వాను, కుత్బుల్లాపూర్‌లోని నారాయణరెడ్డి కత్వాలను అభివృద్ధి చేస్తామని భారీ నీటి పారుదల శాఖామంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువును ఆయన పరిశీలించారు. అనంతరం ఇంజాపూర్, తొర్రూరు, తారామతిపేటలో విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించారు. కొహెడలో మంచినీటి సంపు, లక్ష్మారెడ్డిపాలెంలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణం పనులు, అబ్దుల్లాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఘట్కేసర్- అబ్ధుల్లాపూర్ రోడ్డు పనులను, గౌరెల్లిలో రోడ్డు వెడల్పు పనులను, కుంట్లూరులో ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గదులను ఆయన రవాణా శాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. మిషన్ కాకతీయలో భాగంగా ఇబ్రహీంపట్నం చెరువు అభివృద్ధికి రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తామని, వచ్చే రెండేళ్లలో వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మాసబ్చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. హయత్‌నగర్ మండలంలో స్థలం కేటాయిస్తే ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మార్కెట్ గోదామును ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1300 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో బస్సులు వెళ్లడం లేదని గుర్తించామని, వాటికి రోడ్డు ఏర్పాటు చేసి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందుకు అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నామని వెల్లడించారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హయత్‌నగర్ మండలంలో యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, పరిశ్రమల కోసం 2,600 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, ఆర్జేడీ వరప్రసాద్‌రెడ్డి, ఈఈ వెంకటరమణ, ఎస్ఈ వెంకటేశం, ఎంపీపీ జి.హరిత, జెడ్పీటీసీ టీ.నర్సింహ్మ, పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీ చైర్మన్ ఈ.ధనలక్ష్మీ, వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సానెం కృష్ణగౌడ్, ఎంపీడీఓ జ్యోతి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఫర్నీచర్, వైద్య పరికరాలు లేకుండానే ఆస్పత్రి ప్రారంభం అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్మించిన ప్రాథమిక ఆస్పత్రిలో ఫర్నీచర్, మందులు, వైద్య పరికరాలు లేకుండానే మంత్రులు ఆస్పత్రిని ప్రారంభించారు. భవనం నిర్మించి 9 నెలల పూర్తయినా నేటి వరకు ఎలాంటి ఫర్నీచర్, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఆస్పత్రి ప్రారంభం సందర్భంగా రోగులను పరీక్షించడానికి కూడా ఎలాంటి వసతులు లేకపోవడంతో అక్కడికి వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. -
పంటలకు గిట్టుబాటు ధర కల్పించరా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎల్.రమణ, ఎర్రబెల్లి హైదరాబాద్: వర్షాభావం ఒకవైపు, కరెంటు కోత మరోవైపుతో అష్టకష్టాలు పడి రైతులు పండించిన కొద్దిపాటి పంటకైనా ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేకపోతోందని, సీసీఐ, మార్క్‌ఫెడ్‌ల ద్వారా పత్తి, మొక్కజొన్న, ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తానని కరపత్రాలు పంచిన మంత్రి హరీష్‌రావుకు వాస్తవ పరిస్థితి తెలియడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విమర్శించింది. బుధవారం టీడీపీ కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైఫల్యం వల్ల కరెంటు, సాగునీరు లేక అధిక శాతం పంటలు ఎండిపోయాయని, మిగిలిన పంటలను అమ్ముకుందామన్నా రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని వారు విమర్శించారు. పేదల తరఫున ఉద్యమిస్తాం: ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మెడలు వంచైనా అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు, పింఛన్లు ఇప్పిస్తామని టీటీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి అన్నారు. పింఛన్ల కోత, రేషన్‌కార్డుల ఏరివేతను నిరసిస్తూ జూబ్లీహిల్స్ నియోజక వర్గం టీడీపీ బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని ఖైరతాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు.