ప్రజలను భ్రమల్లో ముంచుతున్న కేసీఆర్,హరీశ్‌రావు | KCR people immersed in illusion , harisravu | Sakshi
Sakshi News home page

ప్రజలను భ్రమల్లో ముంచుతున్న కేసీఆర్,హరీశ్‌రావు

Published Sat, Sep 17 2016 8:39 PM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM

ప్రజలను భ్రమల్లో ముంచుతున్న కేసీఆర్,హరీశ్‌రావు - Sakshi

ప్రజలను భ్రమల్లో ముంచుతున్న కేసీఆర్,హరీశ్‌రావు

  • మేము అధికారంలోకి వస్తే కేసీఆర్‌, హరీశ్‌ జైలుకే..
  • కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మల్యే తూర్పు జగ్గారెడ్డి
  • సంగారెడ్డి మున్సిపాలిటీ :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులనే తిరిగి ప్రారంభిస్తూ వాటికి కొబ్బరికాయలు కొడుతూ ప్రజలను భ్రమల్లో ముంచుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావును తాము అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తామని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి తూర్పు జగ్గారెడ్డి అరోపించారు. శనివారం అయన విలేకరులతో మట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, తాము ఎప్పుడూ ప్రాజెక్టులను అడ్డుకోలేదన్నారు.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాలోనే ప్రాణహిత-చేవెళ్లు ప్రాజెక్టును చేపడితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే ప్రాజెక్టుకు పేర్లు మార్చి, వేల కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నారని ఆరోపించారు. తాము మల్లన్నసాగర్‌కు వ్యతిరేకం కాదని కాని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.  గతంలో సెప్టెంబర్‌17ను అధికారికంగా నిర్వహించాలని అందోళనలు చేపట్టి కేసీఆర్, హరీశ్‌రావులు ఈ రోజు ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement