రైతుకు భరోసానిస్తూ.. | First day of the visit Minister harisravu | Sakshi
Sakshi News home page

రైతుకు భరోసానిస్తూ..

Published Fri, Sep 11 2015 4:53 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రైతుకు భరోసానిస్తూ.. - Sakshi

రైతుకు భరోసానిస్తూ..

అభివృద్ధిని జపిస్తూ..
- జిల్లాలో మంత్రి హరీష్‌రావు మొదటి రోజు పర్యటన
- పెన్‌గంగ చనాక బ్యారేజీ స్థల పరిశీలన
- అక్కడి అధికారులు, ప్రజలతో చర్చలు
- కుప్టి ప్రాజెక్టు స్థల పరిశీలన
- నిర్మల్, బోథ్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- పలు ప్రారంభోత్సవాలు
ఆదిలాబాద్ :
రైతులకు భరోసానిస్తూ.. అభివృద్ధి జపం చేస్తూ.. జిల్లాలో భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు పర్యటన గురువారం సాగింది. గత పాలకుల వైఫల్యాలను ఒక పక్క తూలనాడుతూనే.. వారి వల్లే అభివృద్ధిలో వెనుకబడిందని ధ్వజమెత్తారు. మరో పక్క కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతులకు కొండంత అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు అయిన లోయర్ పెన్‌గంగ కింద మహారాష్ట్రలోని చ నాక వద్ద తెలంగాణ రాష్ట్ర నిధులతో నిర్మించదలచిన బ్యారే జీ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి సాగునీటి శాఖ అధికారు లు ముంపునకు గురయ్యే ప్రజలతో చర్చించారు. ఇచ్చోడ, నే రడిగొండ మధ్యలో కుప్టి ప్రాజెక్టు స్థలాలను పరిశీలించారు.  
 
పర్యటన ఇలా..
బుధవారం రాత్రి నిర్మల్‌కు చేరుకున్న మంత్రి హరీష్‌రావు స్థానిక ఐబీ విశ్రాంతి గృహంలో బస చేశారు. గురువారం ఉ దయం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ శోభారాణితో కలిసి నిర్మల్ పట్టణంలో పర్యటించారు. గాంధీ కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు. కూరగాయలు విక్రయించే రైతులు ప్రజలతో మాట్లాడారు. మార్కెట్లో షెడ్లు ఏర్పాటు చేయమని కోరగా అందుకు ఆయన సమ్మతించారు. ఈ సం దర్భంగా మంత్రి హరీష్‌రావును మంత్రి ఐకేరెడ్డి, కార్యకర్తలు సన్మానించారు. నిర్మల్ పెయింటింగ్స్‌ను బహూకరించారు.
 
త్వరలోనే సాగునీటి శాఖలో పోస్టుల భర్తీ
పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు రూ.7 కోట్లు మంజూరు చేయగా.. నిర్మల్‌లో రూ.2.50 కోట్లలో నిర్మించిన సాగునీటి పారుదల శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. సాగునీటి శాఖలో ఖాళీగా ఉన్న 30 ఏఈ పోస్టులను త్వరలో నే భర్తీ చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిర్మల్ మా ర్కెట్ యార్డులో రైతు విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. చించోలి గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మిస్తున్న గోదాముకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మా ట్లాడారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు బారు లు తీరేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని వివరించారు. వచ్చే ఖరీఫ్‌కు 9 గంటల విద్యుత్‌ను ఇస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలో రూ.158 కోట్లతో 46 గోదాములు నిర్మిస్తున్నట్లు తెలి పారు. ప్రతి మండలంలో గోదాము ఏర్పాటు చేస్తామన్నారు.
 
ఆశ కార్యకర్తల నిరసన
రూ.17వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దేనని హరీష్‌రావు పేర్కొన్నారు. వడ్డీ కోసం బ్యాంకులు వేధిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. స్వర్ణ ప్రాజెక్టును ఆ ధునీకరిస్తామని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కాగా.. చించోలి గ్రామం నుంచి వస్తుం డగా ఆశ వర్కర్లు హరీష్‌రావును అడ్డుకునే ప్రయత్నం చేశా రు. పోలీసులు వారిని తొలగించారు. వాహనంలో నుంచే వినతిపత్రం తీసుకుని వెళ్లిపోయారు. దీంతో తమ సమస్య లు వినలేదని ఆశ కార్యకర్తలు మంత్రి హరీష్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి బోథ్ మండలం కరత్వాడ చేరుకున్న మంత్రి హరీష్‌రావు రూ.13 కోట్లతో కాలువ ఆధునీకరణ, రూ.7 కో ట్ల చింతల్‌బోరి చెరువు తుము, కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
 
తుమ్మిడిహెట్టితో 1.56 లక్షల ఎకరాల ఆయకట్టు..
బోథ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్‌రా వు మాట్లాడుతూ.. గత పాలకుల వైఫల్యాలను ఎండగట్టారు. కుప్టి హైడల్ ప్రాజెక్టును గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుపై ప్ర త్యేక ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు. రూ.1.58 కోట్లతో ప్రాజెక్టు డిటైల్ సర్వే చేపడుతున్నామని.. సర్వే పూర్తి కాగానే ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుందని వివరించారు. గతంలో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తుమ్మిడిహెట్టి నుంచి జిల్లాలో కేవలం 56 వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే డిజైన్ ఉందని, ప్రస్తుతం రీడిజైన్‌లో తుమ్మిడిహెట్టి వద్ద 1.56 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందనుందని చెప్పారు.
 
పెన్‌గంగతో 46 వేల ఎకరాలకు నీరు..
గతంలో లోయర్ పెన్‌గంగ అనగానే ధర్నాలు, రాస్తారోకో లు, పాదయాత్రలు కనిపించేవని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జోగురామన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి చనాక వద్ద బ్యారేజీ నిర్మించుకునేందుకు అనుమతి పొందారని అన్నారు. తద్వారా జిల్లాలో 46 వేల ఎకరాల ఆయకట్టు కు నీరందుతుందని వివరించారు. జిల్లాలో 39 లక్షల ఎకరా ల వ్యవసాయ భూమి ఉండగా 19 లక్షల ఎకరాల భూమికే సాగునీరు అనుకూలంగా ఉందని, వర్షపాతాన్ని పూర్తిగా స ద్వినియోగం చేసుకోవడం ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరందేలా ప్రాజెక్టులు నిర్మిస్తామని పేర్కొన్నారు. అంతకుముం దు బజార్‌హత్నూర్ మండలంలో పలు పంటపొలాలకు వెళ్లి రైతులతో మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. మద్దతు ధరలు దిగుబడుల విషయమై ప్రశ్నించారు. బజార్‌హత్నూర్ మండ లం దహెగామలో రూ.13 కోట్లతో కాలువ పనులను ప్రారంభించారు. గేర్జం చెరువును పరిశీలించారు.
 
లోయర్ పెన్‌గంగ కింద బ్యారే జీ స్థల పరిశీలన..
బోథ్ నియోజకవర్గం నుంచి నేరుగా ఆదిలాబాద్ పట్టణానికి చేరుకున్న మంత్రి హరీష్‌రావుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘ నంగా స్వాగతం పలికారు. రిమ్స్ ఎదుట ఉన్న చాకలి ఐల మ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలో సాగునీటి పారుదల శాఖ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు కింద జైనథ్ మండలం కోర్ట, మహారాష్ట్ర పాండ్రకౌడ తాలుకాలోని చనాక వద్ద రెండో బ్యారేజీ రూ.300 కోట్ల తెలంగాణ నిధులతో నిర్మిస్తుండగా ఆ గ్రామాన్ని మంత్రి సందర్శించారు. కిలో మీటరు నడుచుకుంటూ వెళ్లి ఆ గ్రామానికి చేరుకున్నా రు. చనాకలో మహారాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులతోపాటు జిల్లా సాగునీటి పారుదల శాఖ అధికారులతో బ్యారేజీ విషయమై చర్చించారు. అక్కడి నిర్వాసితులకు తె లంగాణ నిధులతో పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చా రు. వచ్చే వేసవిలోగా ఈ బ్యారేజీ పనులను ప్రారంభిస్తామ ని పేర్కొన్నారు. కాగా అక్కడి నుంచి మంత్రి రాత్రి ఆదిలాబాద్‌కు చేరుకుని ఇక్కడే బస చేశారు. మంత్రి వెంట పలువురు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
 
కుప్టి ప్రాజెక్టు స్థల పరిశీలన..
బోథ్ నుంచి మంత్రి హరీష్‌రావు ఇచ్చోడ, నేరడిగొండ మధ్యలో కడెం నదిపై కట్టనున్న కుప్టి ప్రాజెక్టు కోసం స్థలాన్ని పరిశీలించారు. అటవీశాఖ మంత్రి జోగురామన్న, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రాజెక్టుపై మంత్రి హరీష్‌రావుకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement