Minister Rajaiah
-
మంత్రిగారూ జర జాగ్రత్త
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య తన శాఖను నిర్వహిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. బాధ్యత గల, అందులోనూ అతి ముఖ్యమైన వైద్యశాఖను నిర్వహిస్తూ ప్రజలకు మంచి వైద్య సౌకర్యాలను కలగ చేసే విధంగా చర్యలు చేపట్టవలసింది పోయి తప్పు చేసిన అధికారులను వెనకేసుకు రావటం, ఆసుపత్రులలో సిబ్బంది వందా రెండొందలు తీసుకుంటే తప్పేమిటని సమర్థించడం ఆశ్చర్య కరమైన విషయం. పేదరికంలో మగ్గుతున్న నిరుపేద కుటుంబాల వాళ్లు వైద్యం కోసం ఆసుపత్రికి వెళితే వాళ్లకు ఉచిత సేవలు అందిస్తా మని ఒకవైపు ఊదర గొడుతూ మరోవైపు మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి. అలాగే విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ మరణాలపై కూడా లెక్క సరిగా తెలియ కుండా నోటికి వచ్చిన సంఖ్య చెప్పడం. ఇంత జరుగుతున్నా కనీస వసతులపై అవగాహన లేకుండా మంత్రి నిర్లక్ష్యంతో వ్యవహరించి స్వైన్ ఫ్లూ వైరస్‌ను కట్టడి చేయలేకపోవడం చూస్తే ఆ శాఖ నిర్లక్ష్య ధోరణి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వం సత్వరం ప్రభు త్వాసుపత్రులలో సౌకర్యాలపై ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని నియ మించాలి. అలాగే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మాస్కులు పంపిణీ చేయాలి. శొంఠి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ -
వైద్యుల పక్షమే..!
సాక్షి, మంచిర్యాల : జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో రాత్రి బస చేసి న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య ప రోక్షంగా వైద్యులకే మద్దతు తెలిపారు. అవినీతిమయమైన మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో ఇటీవల ప్రసవం చేసేందుకు లంచం అడిగి శిశువు మృతికి కారణమైన వైద్యురాలిపై విచారణకు ఆదేశించి చేతులు దులుపుకున్నారు. ఆస్పత్రిలో పడకేసిన వైద్యం గురించి మంగళవారం పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లినా.. ఆస్పత్రిలో వైద్యం అందుతున్న తీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆస్పత్రి నుంచి బయల్దేరే ముందు విలేకరులతో మాట్లాడారు. పారిశుధ్యం.. సెక్యూరిటీ.. పలు విభాగాల నిర్వహణపై ప్రసంశల జల్లు కురిపించారు. హైదరాబాద్ తర్వాత ఇక్కడే మూడు వేల యూనిట్ల బ్లడ్ స్టోరేజీ సౌకర్యం ఉండడం విశేషమన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది రూ.100, రూ.200 అడిగితే అది తప్పు కాదన్నారు. సమయపాలన పాటించాలని వైద్యులను సున్నితంగా మందలించారు. చికిత్స పేరిట రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు.. తప్పుడు రిపోర్టులు ఇస్తున్న వ్యాధి నిర్ధారణ కేంద్రాలు.. అనుమతి లేని ఆస్పత్రులపై చర్యల విషయాన్ని మంత్రి ప్రస్తావించలేదు. ‘ప్రైవేట్’ దోపిడి గురించి మీడియా మంత్రి వివరణ కోరగా.. డీఎంహెచ్‌వోల ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ. 3.15 కోట్లతో అభివృద్ధి పనులు.. జిల్లావ్యాప్తంగా అన్ని ఏరియా, సామాజిక ఆస్పత్రులు, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.3.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి రాజయ్య తెలిపారు. జైపూర్‌లో రూ.40 లక్షలు, ఇచ్చోడలో రూ.55 లక్షలు, గుడిహత్నూర్‌లో రూ.50 లక్షలు, ఆదిలాబాద్‌లోని భీంపూర్, తిర్యాణిలో రూ.40 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నట్లు వివరించారు. రూ.11 కోట్లతో ఆసిఫాబాద్ ఏరియా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి వెంట.. మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, వైద్యారోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్ నాగేశ్వరరావు, కలెక్టర్ జగన్మోహన్, డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, ఆర్డీవో ఆయేషా మస్రత్‌ఖానం ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు.. మంచిర్యాల టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో వైద్యులు కానీ సిబ్బంది కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని ఉప ముఖ్యమంత్రి రాజయ్య హెచ్చరించారు. రాత్రి సమీక్ష సమావేశంతోపాటు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేస్తామన్నారు. వైద్య శాఖలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిపి అవినీతికి స్థానం లేకుండా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రాత్రి సమీక్ష సమావేశం అనంతరం ఒంటి గంటకు భోజనం పూర్తి చేసి ఆస్పత్రిలో మరోసారి పర్యవేక్షణ జరిపారు. నైట్ డ్రెస్ ధరించి ఆస్పత్రి ఆవరణలో కలియతిరిగారు. తాను వచ్చింది నిద్రావస్థలో ఉన్న వైద్య వ్యవస్థను మేల్కొల్పడానికని అందుకే తాను నిద్రపోను.. ఎవ్వరినీ నిద్ర పోనివ్వను అంటూ స్పష్టం చేశారు. దాదాపు గంటపాటు ఆస్పత్రిలో రోగులను పరిశీలిస్తూ.. పరీక్షిస్తూ వార్డులో తిరిగారు. రాత్రి రెండు గంటల ప్రాంతంలో తనకు కేటాయించిన ప్రత్యేక గదికి వెళ్లారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో గది నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలోనే ఆస్పత్రిలోని సిబ్బంది క్వార్టర్స్‌ను పరిశీలించారు. 6.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో మార్చురీ వైపు ఖాళీ ప్రదేశంలో మామిడి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఆర్డీవో అయేషా మస్రత్ ఖానమ్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రుక్మిణమ్మ, మంచిర్యాల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్రావు పాల్గొన్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో సన్మానం... ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాతమంచిర్యాలలోని ఐఎంఏ భవన్లో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సాల్మన్‌రాజ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిప్రసాద్, సీనియర్ వైద్యులు ఎన్.మల్లేశ్, ఫణికుమార్, రమణ, ఉదయ్‌కుమార్, అన్నపూర్ణ, సమత, జయలలిత, సుమబిందు, డ్రగ్గిస్ట్, కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులు మోటూరి చంద్రశేఖర్, తొగరు సుధాకర్, రావుల రాజశేఖర్ పాల్గొన్నారు. -
జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల!
రూసా కింద ఏడు ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రతిపాదనలు మండలిలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, రాజయ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చే సేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య తెలిపారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిస్తూ ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద రాష్ట్రంలో ఏడు ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేంద్రం అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాకో ప్రభుత్వ ఇం జనీరింగ్ కళాశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని స్పష్టంచేశారు. విద్యాశాఖను నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్గామార్చాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేసే అంశంకూడా ప్రభుత్వపరిశీలనలో ఉందన్నారు. వచ్చే ఏడాది వరంగల్ వర్సిటీలో అడ్మిషన్లు వరంగల్‌లో కాళోజీ నారాయణరావు పేరిట హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిందని, వచ్చే ఏడా ది నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి రాజయ్య చెప్పారు. కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలోనే 126 ఎకరాల స్థలంలో ఈ హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు నమోదైనప్పటికీ ఒక్క మరణం కూడా సంభవించలేదన్నా రు. ఎక్కడా మందులు, సిబ్బంది కొరత లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికే ఆరోగ్యశ్రీకి నిధులను తగ్గించామన్నారు. వైఎస్ హయాంలో ప్రైవేటు ఆసుపత్రుల కోసమే ఆరోగ్యశ్రీ పెట్టారని ఆరోపణలు వచ్చాయని మంత్రి అనడంతో... ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు కొందరు ఎ మ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత రాజయ్య మాట్లాడుతూ... వైఎస్ మహానుభావుడని, ఆయన పెట్టిన పథకం అమలుపై ఆరోపణలొచ్చాయే గానీ, పథకం ఎంతోమంది పేదలకు మేలు చేకూర్చిందని వివరించారు. 85 శాతం కొలువులు స్థానికులకే: కేటీఆర్ ఐటీ కంపెనీల్లో 85 శాతం సెమీస్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేందుకు పలు సం స్థలు సానుకూలత వ్యక్తం చేశాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదిభట్లలో టీసీఎస్ సంస్థ 28 వేల మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం గల ఐటీ కంపెనీని ఏర్పాటు చేసిందని, అందులో స్థానికులకు అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు వివరించారు. విత్తన భాండాగారంగా రాష్ర్టం: పోచారం తెలంగాణను దేశానికే విత్తన భాండాగారంగా మార్చేందుకు చర్యలు చేపట్టామని వ్యవసాయ మంత్రి పి.శ్రీనివాసరెడ్డి చెప్పారు. పంటలకు నాణ్యమైన విత్తనాలను తయారు చేసేలా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రణాళికలు రచిస్తోందన్నారు. మూతపడిన సీడ్ ఫామ్స్‌ను తెరిపిస్తామని, పది హెక్టార్లు యూని ట్‌గా సీడ్ విలేజ్లను ఏర్పాటు చేస్తామన్నారు.