తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య తన శాఖను నిర్వహిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య తన శాఖను నిర్వహిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. బాధ్యత గల, అందులోనూ అతి ముఖ్యమైన వైద్యశాఖను నిర్వహిస్తూ ప్రజలకు మంచి వైద్య సౌకర్యాలను కలగ చేసే విధంగా చర్యలు చేపట్టవలసింది పోయి తప్పు చేసిన అధికారులను వెనకేసుకు రావటం, ఆసుపత్రులలో సిబ్బంది వందా రెండొందలు తీసుకుంటే తప్పేమిటని సమర్థించడం ఆశ్చర్య కరమైన విషయం. పేదరికంలో మగ్గుతున్న నిరుపేద కుటుంబాల వాళ్లు వైద్యం కోసం ఆసుపత్రికి వెళితే వాళ్లకు ఉచిత సేవలు అందిస్తా మని ఒకవైపు ఊదర గొడుతూ మరోవైపు మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి.
అలాగే విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ మరణాలపై కూడా లెక్క సరిగా తెలియ కుండా నోటికి వచ్చిన సంఖ్య చెప్పడం. ఇంత జరుగుతున్నా కనీస వసతులపై అవగాహన లేకుండా మంత్రి నిర్లక్ష్యంతో వ్యవహరించి స్వైన్ ఫ్లూ వైరస్‌ను కట్టడి చేయలేకపోవడం చూస్తే ఆ శాఖ నిర్లక్ష్య ధోరణి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వం సత్వరం ప్రభు త్వాసుపత్రులలో సౌకర్యాలపై ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని నియ మించాలి. అలాగే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మాస్కులు పంపిణీ చేయాలి.
శొంఠి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్