ఉమా.. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు
దివీస్ భూముల విషయంలో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాచినోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. ''ఉమా.. నీకు సిగ్గు, లజ్జ ఉంటే ఇడుపులపాయ వెళ్దాం. అక్కడ ప్రతి అంగుళం వెతుక్కోండి. అక్కడ ఏమీ దొరక్కపోతే మీ నాయకుడితో క్షమాపణ చెప్పిస్తావా'' అని అడిగారు. ఈ అంశంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పరిశ్రమలకు వైఎసార్సీపీ ఎప్పుడూ అడ్డం రాదని, అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు కప్పం కట్టలేకనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదని పార్థసారథి అన్నారు. దివీస్ సంస్థ ఇచ్చే ముడుపులకు ఆశపడే పేదల భూములను వాళ్లకు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధపడ్డారని ఆరోపించారు. మంత్రి ఉమా మహేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకోవాలని, అడ్డగోలుగా మాట్లాడకూడదని పార్థసారథి అన్నారు.