'మైనర్లకు గర్బ నిర్ధారణ పరీక్షలు చేయలేదు'
న్యూఢిల్లీ: మహిళా మైనర్ బాక్సర్లకు గర్బ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వచ్చిన వార్తలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) తోసిపుచ్చింది. ప్రపంచ చాంఫియన్ షిప్ లో పాల్గొనబోతున్న ఎనిమిది మంది మహిళా బాక్సర్లకు గర్బ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన విషయం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది.
తాము ఎంపిక చేసిన బృందంలో 18 ఏళ్ల లోపు వారు ఎవరూ లేరని, వరల్డ్ కప్ లో పాల్గొనడానికి కనీస వయసు 19 ఏళ్లు అని సాయ్ డైరెక్టర్ జనరల్ జిజీ థామ్సన్ తెలిపారు. ఇలాంటప్పుడు మైనర్లకు పరీక్షలు నిర్వహించడమన్న ప్రశ్న ఎక్కడిదని ఆయన అన్నారు. 1994లో జన్మించిన యువతే తాము ఎంపిక చేసిన బృందంలో పిన్నవయస్కురాలని వెల్లడించారు.