వాడిని ఓ కంట కనిపెట్టాలి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో బాలనేరస్తుడిని ఒక కంట కనిపెట్టి ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ సూచించారు. దేశ రాజధాని నగరంలో కదులుతున్న బస్పులో నిర్భయపై డిసెంబర్ 12 సామూహితక అత్యాచారానికి పాల్పడిన కేసులో శిక్ష అనుభవిస్తున్న బాల నేరస్తుడు వచ్చే నెల విడుదల కానున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాంటి వాడిని ఊరికే వదలకూడదన్నారు. అతనిపై పర్యవేక్షణ లేకుండా అలా వదిలేస్తే మరో నేరానికికే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. అందుకే అతనిపై నిఘాకొనసాగాలని మేనకా గాంధీ తెలిపారు.
మరోవైపు ఈ కేసులో న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా అని మీడియా అడిగినపుడు న్యాయం సంగతి తెలియదుకానీ, న్యాయ నిబంధనలను ఫాలో కావాలి కదా అన్నారు. అతడు మరో నేరంచేసే దాకా చూస్తూ ఊరుకుంటే ఎలా అన్నారు. మరోసారి అలాంటి ఘాతుకానికి పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఆమె తెలిపారు. ఈ విషయంలో సంబంధిత అధికారులతో మాట్టాడి చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు.
కాగా బాలనేరస్థుల చ ట్టం ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్షా కాలాన్ని పూర్తిచేసుకుని వచ్చే నెల విడుదల కానున్నాడు.