Mirror Image
-
సాంకేతిక విద్యలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలు
అనంతపురం విద్య: సాంకేతిక విద్యలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఒకే పుస్తకంలో ఒక పేజీలో ఇంగ్లిష్, మరొక పేజీలో తెలుగు కంటెంట్ ఉంటుంది. ఇవి తెలుగు మీడియం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం సాంకేతిక విద్యా కోర్సులైన ఇంజినీరింగ్, డిప్లొమా పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. ఈ మేరకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్దేశించింది. ఇంజినీరింగ్, డిప్లొమా పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించే బాధ్యతను జేఎన్టీయూ(అనంతపురం)కు అప్పగించింది. దీంతో ఇప్పటికే మొదటి సంవత్సరం డిప్లొమా పుస్తకాలు 11, బీటెక్‌లో తొమ్మిది పుస్తకాలు ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేశారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇదే తరహాలోనే బీటెక్, డిప్లొమాలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలకు రూపకల్పన చేశారు. దీనివల్ల తెలుగు మీడియం విద్యార్థులు విషయాన్ని త్వరగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. ఆత్మన్యూనతా భావం తగ్గించేలా.. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి అడుగుపెట్టే విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటోంది. విషయ పరిజ్ఞానంలో ఇంగ్లిష్ మీడియం వారితో పోటీపడలేమని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారిలో ధైర్యాన్ని నింపేలా మిర్రర్ ఇమేజీ పుస్తకాలు రూపొందించాం. 2022–23 విద్యా సంవత్సరం నుంచి బీటెక్, డిప్లొమా రెండో సంవత్సరం విద్యార్థులకు సైతం తెలుగు భాషలో కంటెంట్ అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ కె.శేషమహేశ్వరమ్మ, ఏఐసీటీఈ టెక్నికల్ బుక్స్ రైటింగ్ కోఆర్డినేటర్ (రీజినల్ లాంగ్వేజెస్) (చదవండి: పల్లె జనం.. పట్టణ జపం) -
నా పెళ్లి రోజులు గుర్తుకొచ్చాయి..
‘మీ ప్రదర్శన చూస్తుంటే నా పెళ్లినాటి రోజులు గుర్తుకొస్తున్నాయి..’ అని ఒకప్పుడు బాలీ వుడ్‌ను ఒక ఊపు ఊపిన అందాల హీరోయిన్ మాధురీ దీక్షిత్ వ్యాఖ్యానించింది. కలర్స్ చానల్లో ప్రసారమవుతున్న ‘జలక్ధిఖ్ లాజా -7’ డ్యాన్స్ పోటీలకు న్యాయనిర్ణేతల్లో మాధురి ఒకరిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో భాగంగా పోటీదారు మౌనీ, ఆమె కొరియోగ్రాఫర్ పునీత్ కలిసి ప్రదర్శించిన ‘మిర్రర్ ఇమేజ్’ ప్రదర్శన సందర్భంగా మాధురీ పై విధంగా స్పందించింది. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎడబాటును ఈ ప్రదర్శనలో మైనీ, పునీత్ కళ్లకు కట్టినట్లుగా చూపించారని, వారి హావభావాలు చూస్తే తన పెళ్లినాటి రోజులు గుర్తుకొచ్చాయని మాధురి అంది. ‘నాకు శ్రీరాంతో పెళ్లి కాగానే యూఎస్ వెళ్లిపోయా. తర్వాత ‘దేవదాస్’ సినిమా షూటింగ్ నిమిత్తం తిరిగి ఇండియా రావాల్సి వచ్చింది. నాలుగైదు నెలలు పాటు ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఇండియాలోనే గడిపా. షూటింగ్లో ఎప్పుడూ నవ్వుతూ కనిపించేదాన్ని.. కాని మనసు మాత్రం అమెరికాలో ఉన్న నా భర్త చుట్టూనే తిరుగుతుండేది.. అతడిని చాలా మిస్ అవుతున్నాననే బాధను బయటకు కనిపించకుండా ఉంచేందుకు చాలా శ్రమపడేదాన్ని. ఆ నాలుగైదు నెలలూ మేమిద్దరం ‘ఐ మిస్ యూ’ అని చెప్పుకోని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో.. అంతలా బాధపడ్డాం.. మీ ఇద్దరి నటన చూసేసరికి ఆ రోజులు గుర్తుకొచ్చాయి..’ అంటూ మౌనీ జంటను ఆమె అభినందించింది. ఈ కార్యక్రమం వచ్చే వారం ప్రసారం కానుంది. కాగా, మాధురి పెళ్లినాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నప్పుడు ఆమె భర్త శ్రీరామ్ మాధవ్ నెనే పక్కనే ఉండటం విశేషం. కాగా, మౌనీ, పునీత్ ప్రదర్శన మిగతా న్యాయమూర్తులైన రెమో డీసౌజా, కరణ్ జోహార్ల ప్రశంసలను సైతం అందుకుంది. ఇదిలా ఉండగా, మాధురీ దీక్షిత్ ప్రస్తుతం 47 యేళ్ల వయసులోనూ అందచందాల్లో యువ హీరోయిన్లతో పోటీపడుతోంది. యోగా, డ్యాన్స్ తన గ్లామర్ రహస్యమని ఆమె తెలిపింది. ఇటీవల ఆమె నటించిన ‘దేడ్ఇష్క్’ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. -
నా పెళ్లి రోజులు గుర్తుకొచ్చాయి..
ముంబై: ‘మీ ప్రదర్శన చూస్తుంటే నా పెళ్లినాటి రోజులు గుర్తుకొస్తున్నాయి..’ అని ఒకప్పుడు బాలీ వుడ్‌ను ఒక ఊపు ఊపిన అందాల హీరోయిన్ మాధురీ దీక్షిత్ వ్యాఖ్యానించింది. కలర్స్ చానల్లో ప్రసారమవుతున్న ‘జలక్ధిఖ్ లాజా -7’ డ్యాన్స్ పోటీలకు న్యాయనిర్ణేతల్లో మాధురి ఒకరిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో భాగంగా పోటీదారు మౌనీ, ఆమె కొరియోగ్రాఫర్ పునీత్ కలిసి ప్రదర్శించిన ‘మిర్రర్ ఇమేజ్’ ప్రదర్శన సందర్భంగా మాధురీ పై విధంగా స్పందించింది. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎడబాటును ఈ ప్రదర్శనలో మైనీ, పునీత్ కళ్లకు కట్టినట్లుగా చూపించారని, వారి హావభావాలు చూస్తే తన పెళ్లినాటి రోజులు గుర్తుకొచ్చాయని మాధురి అంది. ‘నాకు శ్రీరాంతో పెళ్లి కాగానే యూఎస్ వెళ్లిపోయా. తర్వాత ‘దేవదాస్’ సినిమా షూటింగ్ నిమిత్తం తిరిగి ఇండియా రావాల్సి వచ్చింది. నాలుగైదు నెలలు పాటు ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఇండియాలోనే గడిపా. షూటింగ్లో ఎప్పుడూ నవ్వుతూ కనిపించేదాన్ని.. కాని మనసు మాత్రం అమెరికాలో ఉన్న నా భర్త చుట్టూనే తిరుగుతుండేది.. అతడిని చాలా మిస్ అవుతున్నాననే బాధను బయటకు కనిపించకుండా ఉంచేందుకు చాలా శ్రమపడేదాన్ని. ఆ నాలుగైదు నెలలూ మేమిద్దరం ‘ఐ మిస్ యూ’ అని చెప్పుకోని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో.. అంతలా బాధపడ్డాం.. మీ ఇద్దరి నటన చూసేసరికి ఆ రోజులు గుర్తుకొచ్చాయి..’ అంటూ మౌనీ జంటను ఆమె అభినందించింది. ఈ కార్యక్రమం వచ్చే వారం ప్రసారం కానుంది. కాగా, మాధురి పెళ్లినాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నప్పుడు ఆమె భర్త శ్రీరామ్ మాధవ్ నెనే పక్కనే ఉండటం విశేషం. కాగా, మౌనీ, పునీత్ ప్రదర్శన మిగతా న్యాయమూర్తులైన రెమో డీసౌజా, కరణ్ జోహార్ల ప్రశంసలను సైతం అందుకుంది. ఇదిలా ఉండగా, మాధురీ దీక్షిత్ ప్రస్తుతం 47 యేళ్ల వయసులోనూ అందచందాల్లో యువ హీరోయిన్లతో పోటీపడుతోంది. యోగా, డ్యాన్స్ తన గ్లామర్ రహస్యమని ఆమె తెలిపింది. ఇటీవల ఆమె నటించిన ‘దేడ్ఇష్క్’ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.