misguided
-
Vijayawada: ఉత్సవాలపై ‘పచ్చ’విషం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు రోజుకో దుష్ప్రచారాన్ని తెరపైకి తెస్తున్న విపక్ష టీడీపీ చివరికి పవిత్ర ఉత్సవాలను సైతం విడిచి పెట్టలేదు. దసరా ప్రాశస్త్యం, భక్తుల మనోభావాలను గాయపరుస్తూ అపచారానికి తెగించింది. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకల కోసం అమ్మవారి ఆలయానికి చేసిన విద్యుద్దీపాలంకరణ ఫొటోలను మార్ఫింగ్ చేసి తనకు అలవాటైన రీతిలో దుష్ప్రచారానికి పాల్పడింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో కూడా విపక్షం ఇలా వ్యవహరించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. పోలీసు శాఖ ఫ్యాక్ట్ చెక్ ఈ కుట్రను బట్టబయలు చేసింది. మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం.. ఇంద్రకీలాద్రిపై విద్యుద్దీపాలంకరణ దృశ్యాలంటూ టీడీపీతోపాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు గురువారం ఓ ఫొటోను సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చాయి. కనకదుర్గమ్మ ఆలయం చుట్టూ కేవలం నీలం రంగు విద్యుద్దీపాలనే అలంకరించినట్లుగా ఆ ఫొటోలో ఉంది. ‘వైఎస్సార్ పార్టీ కార్యాలయం అనుకునేరు.. కాదు... విజయవాడ కనకదుర్గమ్మ గుడి’ అంటూ ఆ ఫొటోపై వ్యాఖ్యను జోడించింది. ఇంద్రకీలాద్రిని వైఎస్సార్సీపీ కార్యాలయంగా మార్చేశారంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటోను వైరల్ చేశారు. వాస్తవం ఏమిటంటే... ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. కనకదుర్గమ్మ ఆలయంతోపాటు ఇంద్రకీలాద్రి మొత్తాన్ని రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించించింది. ఆలయ స్వర్ణ గోపురం శోభాయమానంగా భాసిల్లుతుండగా ప్రాకారం చుట్టూ అలంకరించిన విద్యుద్దీపాలు సప్తవర్ణ శోభితంగా కాంతులీనుతూ కన్నుల పండుగ చేస్తున్నాయి. అన్ని రంగుల విద్యుద్దీపాలూ వరుస క్రమంలో(సీరియల్ లైట్లు) వెలుగుతూ సముద్రతీరంలో కెరటాలను తలపించే రీతిలో కాంతి తరంగాలను ప్రసరింపజేస్తూ అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక శోభను కలిగిస్తున్నాయి. ఇందులో ఏ ఒక్క రంగూకు ప్రత్యేక ప్రాధాన్యమంటూ లేదు. ఏ ఒక్క రంగూ స్థిరంగా ఉండదు. అన్ని రంగుల్లోనూ విద్యుద్దీపాలు కాంతులీనుతూ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలను మరింత శోభాయమానం చేస్తున్నాయి. ‘ఫ్యాక్ట్ చెక్’ ఏం తేల్చింది? టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చిన ఫొటోను గుర్తించిన కొందరు భక్తులు నిజానిజాలు తెలుసుకునేందుకు చొరవ చూపారు. పోలీసు శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి ఈ విషయాన్ని నివేదించడంతో వెంటనే స్పందించింది. ఫ్యాక్ట్‌చెక్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిశితంగా పరిశీలించగా అవి మార్ఫింగ్ చేసిన ఫొటోలని నిగ్గు తేలింది. ఇంద్రకీలాద్రిపై సీరియల్ లైట్లతో విద్యుద్దీపాలంకరణలో ఏ ఒక్క రంగుకూ ప్రాధాన్యమివ్వలేదని, సప్త వర్ణాల విద్యుద్దీపాలతో అలంకరించారని వెల్లడైంది. అదే విషయాన్ని పోలీసు శాఖ సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడించింది. దుష్ప్రచారంపై విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
సోనియా, రాహుల్‌లను తప్పుదోవ పట్టించకండి
చండూరు(మునుగోడు): ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర నాయకులు కొందరు.. సోనియా, రాహుల్ గాంధీలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అలాంటివి మానివేయండి’అని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన నల్లగొండ జిల్లా చండూరులో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. చిన్న తప్పులతో కాంగ్రెస్‌కు దెబ్బ తగిలే అవకాశాలున్నాయన్నారు. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసుకుని టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ అభివృద్ధికి కష్టపడే నాయకులను గుర్తించి పదవులు ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి అలాంటి వారిని పక్కన పెడుతున్నారన్న ఆవేదనతో మాట్లాడిన మాటలు వాస్తవమేనన్నారు. తనకు షోకాజ్ ఎందుకు ఇచ్చారని, సరైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోతే పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని మాట్లాడినందుకు.. తిరిగి మరోసారి షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. దీనికి మాత్రం వివరణ ఇవ్వలేకపోయానన్నారు. తమ బావ మృతిచెందడంతో అంత్యక్రియల్లో బిజీగా గడపడమే కారణమన్నారు. -
ప్రైవేటు విద్యుత్ వదులుకోవచ్చు
► వీలు కాదంటూ ప్రభుత్వాన్ని, మంత్రిని తప్పుదారి పట్టించిన అధికారులు ► వదులుకుంటే మళ్లీ తీసుకోవడం కుదరదన్న మంత్రి ►కానీ కొనుగోళ్లకు రోజువారీగానే షెడ్యూలింగ్ ► కావాల్సిన విద్యుత్ ఎంతో ముందు రోజు తెలిపితే చాలు ► ఎలాంటి పెనాల్టీ లేకుండా 15 శాతం వదులుకోవచ్చు ► మిగిలిన 85శాతంలోనూ వదులుకున్న మొత్తంపైనే 20 శాతం పెనాల్టీ ►ఈ జరిమానా కూడా ఏడాది సగటున 85 శాతానికి తగ్గితేనే.. ► తర్వాతిరోజు కోరితే ఒప్పందం మేరకు మొత్తం కరెంటు ఇవ్వాల్సిందే ఓ ప్రైవేటు సంస్థ పీపీఏల పరిశీలనలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: అవసరం లేని సమయంలో ప్రైవేటు విద్యుత్‌ను వదిలేసుకోవచ్చు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, ప్రైవేటు కంపెనీల మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని (పీపీఏల్లోని) నిబంధనలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓ ప్రైవేటు కంపెనీతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) కుదుర్చుకున్న స్వల్పకాలిక పీపీఏను పరిశీలించగా ఈ అంశాలు వెల్లడయ్యాయి. అందులోని నిబంధనలు సైతం విద్యుత్‌ను వదులుకోవచ్చన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గడంతో ‘ప్రైవేటు’ కొనుగోళ్లను కొనసాగించడానికి వీలుగా తరచూ జెన్కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి బ్యాక్‌డౌన్ చేస్తున్నారు. దీంతో జెన్కో ఉత్పత్తి సామర్థ్యం గతంలో ఎన్నడూ లేనివిధంగా 73.21 శాతానికి పతనమైంది. దీనివల్ల జెన్కో రూ.800 కోట్ల ఆదాయాన్ని నష్టపోగా.. ప్రైవేటు విద్యుత్ కారణంగా ప్రజలపై రూ.600 కోట్ల అనవసర భారం పడింది. ఈ అంశాన్ని వెలుగులోకి తెస్తూ.. ప్రైవేటు కరెంటుపై అంత ప్రేమెందుకు.. అయ్యో పాపం జెన్కో శీర్షికన సాక్షి మంగళవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి... 15 శాతానికి మించి ప్రైవేటు విద్యుత్‌ను వదులుకోలేమని, అంతకు మించాల్సి వస్తే జెన్కో విద్యుత్‌నే వదులుకోక తప్పదని వివరణ ఇచ్చారు. ఓ రోజు డిమాండ్ తగ్గిందని ప్రైవేటు విద్యుత్‌ను వదులుకుంటే మరుసటి రోజు తీసుకోవడం వీలుకాదని సైతం పేర్కొన్నారు. కానీ ఇవన్నీ సత్యదూరమని పీపీఏల్లో ఉండే పెనాల్టీ క్లాజ్ నిబంధనలు చెబుతున్నాయి. దీనిని బట్టి ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఉన్నతాధికారులు మంత్రిని కూడా తప్పుదోవ పట్టించారని స్పష్టమవుతోంది. ఒక రోజు ముందు కూడా వదులుకోవచ్చు తర్వాతి రోజు ఎంత విద్యుత్ అవసరమో ఒక రోజు ముందే బెంగళూరులోని దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్సారెల్డీసీ)కు డిస్కంలు తెలియజేస్తాయి. దీనినే షెడ్యూలింగ్ అంటారు. అవసరమైనప్పుడు పూర్తిస్థాయిలో తీసుకోవడం, అవసరం లేని రోజు వదులుకోవడానికి షెడ్యూలింగ్ చేస్తుంటారు. ఒప్పందం ప్రకారం పెనాల్టీ లేకుండా 15 శాతం ప్రైవేటు విద్యుత్‌ను వదులుకోవచ్చు. వినియోగం తగ్గినప్పుడు ఓ రోజు ముందే నోటీసిచ్చి అంతకు మించి కూడా విద్యుత్‌ను వదులుకోవచ్చు. 15శాతానికి మించి అదనంగా వదులుకున్న విద్యుత్ ధరలో 20శాతాన్ని పెనాల్టీగా చెల్లిస్తే సరిపోతుంది. అసలు రోజువారీగా తగ్గించుకున్నా వార్షిక సగటు 85 శాతానికి తగ్గితేనే 20 శాతం పెనాల్టీ వర్తిస్తుంది. ఇలా ఓ రోజు తగ్గించుకున్నా మరుసటి రోజు అవసరమైన మొత్తం విద్యుత్‌ను ప్రైవేటు కంపెనీ సరఫరా చేయాల్సిందే. ఒకవేళ విద్యుత్ సరఫరాకు నిరాకరించి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే... ప్రైవేటు కంపెనీల నుంచే యూనిట్‌కు ఏకంగా రూ.10 చొప్పున డిస్కంలు నష్టపరిహారాన్ని రాబట్టవచ్చు. ఇక అత్యవసరంగా సైతం విద్యుత్‌ను వదులుకునే అవకాశం కూడా ఉంది. ముందస్తు నోటీసులో పేర్కొన్న దానికన్నా అధికంగా వదులుకున్న విద్యుత్‌లో 10 శాతం విద్యుత్ ధరను పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది.