Mixed Team Championship in Asia
-
మకావును మట్టికరిపించి...
కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. మకావు జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓడిన మకావు జట్టు వరుసగా రెండో ఓటమితో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన దక్షిణ కొరియా నేడు భారత జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలుస్తుంది. తొలి మ్యాచ్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్యా వరియత్ జోడీ 21–10, 21–9తో లోక్ చోంగ్ లియోంగ్–వెంగ్ చి ఎన్జీ జంటను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–16, 21–12తో పాంగ్ ఫాంగ్ పుయ్‌పై గెలవడంతో భారత ఆధిక్యం 2–0కు పెరిగింది.మూడో మ్యాచ్‌లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–15, 21–9తో హావో వాయ్ చాన్‌ను ఓడించడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.నాలుగో మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి–అర్జున్ ద్వయం 21–15, 21–19తో చిన్ పోన్ పుయ్–కోక్ వెన్ వోంగ్ జోడీపై... ఐదో మ్యాచ్‌లో ట్రెసా జాలీ–పుల్లెల గాయత్రి జంట 21–10, 21–5తో ఎన్జీ వెంగ్ చి–పుయ్ చి వా ద్వయంపై గెలుపొందడంతో భారత విజయం 5–0తో సంపూర్ణమైంది. 2023లో దుబాయ్‌లో జరిగిన ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. -
Badminton Asia Mixed Team Championships 2023: తొలిసారి సెమీస్‌లో భారత్
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. దుబాయ్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో హాంకాంగ్‌పై నెగ్గింది. 0–2తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–13, 21–12తో ఎన్జీ సాజ్ వైయు–ఎన్జీ వింగ్ యుంగ్ జోడీపై నెగ్గి భారత్‌కు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇషాన్–తనీషా 24–26, 17–21తో లీ చున్ రెగినాడ్–ఎన్జీ సాజ్ వైయు చేతిలో... లక్ష్య సేన్ 22–20, 19–21, 18–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–చిరాగ్ శెట్టి జోడీ 20–22, 21–16, 21–11తో తాంగ్ చున్ మన్–యెంగ్ షింగ్ చోయ్ ద్వయంపై నెగ్గగా... నాలుగో మ్యాచ్‌లో పీవీ సింధు 16–21, 21–7, 21–9తో సలోని మెహతాను ఓడించడంతో భారత్ 2–2తో స్కోరును సమం చేసింది. -
మరో స్వర్ణంపై సురేఖ గురి
బ్యాంకాక్: మిక్స్డ్ టీమ్ విభాగంలో కనబరిచిన ప్రదర్శనను మహిళల టీమ్ విభాగంలోనూ పునరావృతం చేయడంతో... ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణ పతకం రేసులో నిలిచింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి ఇప్పటికే ఫైనల్ చేరిన జ్యోతి సురేఖ... మంగళవారం జరిగిన మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్లతో కలిసి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ)పై నిషేధం ఉండటంతో... ఈ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రపంచ ఆర్చరీ పతాకం కింద పోటీపడుతున్నారు. మహిళల టీమ్ కాంపౌండ్ సెమీఫైనల్లో సురేఖ, ముస్కాన్, ప్రియ బృందం 229–221తో సయ్యదా, ఫార్సి, అరెజులతో కూడిన ఇరాన్ జట్టును ఓడించింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 226–225తో కన్యవీ, కనోక్నాపుస్, నారెయుమోన్‌లతో కూడిన థాయ్‌లాండ్ జట్టుపై గెలిచింది. నేడు జరిగే టీమ్ ఫైనల్లో కొరియాతో భారత్ తలపడుతుంది. ఈ ఫైనల్ తర్వాత మిక్స్డ్ టీమ్ ఈవెంట్ తుది పోరులో సురేఖ–అభిõÙక్ వర్మ జంట చైనీస్ తైపీకి చెందిన యి సువాన్ చెన్–చియె లున్ చెన్ జోడీతో ఆడుతుంది. మూడు కాంస్యాలు... మంగళవారం భారత ఆర్చర్లు మూడు కాంస్య పతకాలు గెలిచారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో అతాను దాస్ 6–5తో జిన్ హాయెక్ ఓ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. పురుషుల రికర్వ్ టీమ్ విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, జయంత తాలుక్దార్లతో కూడిన భారత జట్టు 6–2తో చైనాను ఓడించింది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంకాంస్య పతక మ్యాచ్‌లో దీపిక కుమారి, బొంబేలా దేవి, అంకితలతో కూడిన భారత జట్టు 5–1తో జపాన్‌పై గెలిచింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిõÙక్ వర్మ, రజత్ చౌహాన్, మోహన్ భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో భారత్ 229–221తో ఇరాన్‌పై గెలిచి నేడు జరిగే ఫైనల్లో కొరియాతో పోరుకు సిద్ధమైంది. -
కొరియా చేతిలో ఓడినా...
క్వార్టర్స్‌లో భారత్ ► ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్ షిప్ హో చి మిన్ (వియత్నాం): ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్ షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–4తో కొరియా చేతిలో ఓడినప్పటికీ గ్రూప్ ‘డి’ విభాగంలో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 24–22, 21–9తో వాన్ హో సాన్ పై గెలుపొందగా... మిగిలిన అన్ని మ్యాచ్‌లో్లనూ భారత క్రీడాకారులకు పరాజయాలే ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్‌లో యూ జంగ్ చై– సోల్గ్యు చోయ్ జోడి 21–17, 17–21, 21–17తో అశ్విని పొన్నప్ప– సుమీత్ రెడ్డి జంట పై, పురుషుల డబుల్స్‌లో జి జంగ్ కిమ్– యెన్ సియోంగ్ యూ 21–15, 28–26తో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టిపై నెగ్గగా... మహిళల డబుల్స్‌లో యె న చంగ్– సీ హీ లీ జంట 21–13, 21–19తో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీపై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లోనూ తన్వి లాడ్ 8–21, 15–21తో జి హ్యూన్ సంగ్ చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత్, థాయిలాండ్‌తో తలపడుతుంది.