moddu seenu
-
మొద్దు శీను హత్య కేసు నిందితుడి మృతి
చిత్తూరు అర్బన్/ములకలచెరువు/దొండపర్తి (విశాఖ దక్షిణ): టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీనును హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మదనపల్లె ఓంప్రకాశ్ ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని కేజీహెచ్‌లో మృతి చెందాడు. మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఓంప్రకాశ్.. శనివారం రాత్రి అనారోగ్య సమస్య రావడంతో విశాఖ సెంట్రల్ జైలు అధికారులు అతడిని కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్య, జైలు అధికారులు ప్రకటించారు. ► ఓంప్రకాశ్ మదనపల్లెకు చెందిన వ్యక్తి. 2001లో ఓ లారీని చోరీ చేసి అడ్డొచ్చిన డ్రైవర్‌ను హత్య చేశాడు. ► ఈ కేసులో పుంగనూరు పోలీసులు ఓంప్రకాశ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా, నేరం రుజువుకావడంతో శిక్ష పడింది. ► అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓంప్రకాశ్ 2008 నవంబర్ 9న పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మొద్దుశీనును జైల్లోనే డంబెల్‌తో కొట్టి హత్యచేసి వార్తల్లోకెక్కాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవితఖైదు విధించింది. విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్ మృతి
సాక్షి, అనంతపురం : మొద్దు శ్రీను హత్యకేసులో నిందితుడైన ఓం ప్రకాశ్ అనారోగ్యంతో మృతి చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గతకొంత కాలంగా బాధపడుతున్న ఆయన.. సోమవారం విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును 2008 నవంబర్ 9న జైలులోనే డంబుల్తో కొట్టి హత్య చేశాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవిత ఖైదు విధించింది. 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైలులో ఓం ప్రకాశ్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ.. సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఓం ప్రకాష్ మరణవార్త తెలిసిన అతని కుటుంబ సభ్యులు విశాఖ చేరుకున్నారు. అతని తనయుడు సాయి కుమార్ తన తండ్రి ఇంకో కొంత కాలం జీవిస్తారని అనుకున్నానని ఊహించని రీతిలో మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వస్తే సొంత ఊరు తీసుకుని వెళ్తామని అతని తనయుడు సాయి కుమార్ తెలిపారు. ఓం ప్రకాశ్ తల్లి సరోజనమ్మ కూడా అనారోగ్యంతో గత ఏప్రిల్ మృతిలో మృతిచెందారు. -
మల్లెల ఓం ప్రకాష్‌కు కట్టుదిట్ట భద్రత
కేజీహెచ్ : మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీనును అనంతపురం జిల్లా రాప్తాడు జైల్లో మట్టుబెట్టిన కేసులో ముద్దారుు అరుున మల్లెల ఓం ప్రకాష్‌కు పోలీస్ యంత్రాంగం భద్రతను కట్టు దిట్టం చేసింది. మూడు నెలలుగా విశాఖ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉంటున్న ఓం ప్రకాష్ కిడ్నీ సమస్యతో బాధపడుతుండంతో డయాలసిస్ కోసం కేజీహెచ్‌కు బుధ, శనివారాల్లో తీసుకువస్తున్నారు. జైలు నుంచి భారీ భద్రత మధ్య ఆయనను కేజీహెచ్‌కు తీసుకురావాల్సి ఉంది. అరుుతే పోలీసులు, ముద్దాయి అన్న తేడా లేకుండా కలసిమెలసి, చెట్టపట్టాలు వేసుకొని కేజీహెచ్‌కు ఓం ప్రకాష్‌ను తీసుకు వస్తుండడంపై ‘సాక్షి’ బృందం కొన్ని రోజుల పాటు నిఘా వేసింది. మల్లెల ఓం ప్రకాష్, ఆయన రక్షణ కోసం వస్తున్న పోలీసుల తీరును ప్రత్యేక కథనం ద్వారా ఎండగట్టింది. ‘ముద్దాయి అయినా.. మల్లెల మజా’ పేరిట ఈనెల 6న ప్రచురితమైన కథనం పోలీస్ యంత్రాంగంలో వణుకు పుట్టించింది. అప్రమత్తమై డయాలసిస్‌కు వస్తున్న మల్లెల ఓం ప్రకాష్‌ను భద్రతను కట్టుదిట్టం చేసింది. మప్తీలో వచ్చిన పోలీసుల తీరుపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఏఆర్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను రక్షణగా నియమించింది. ప్రతి బుధ, శనివారాల్లో ఆయుధాల సహాయంతో రక్షణ కల్పించి, ఆయనను కేజీహెచ్‌కు తీసుకొస్తున్నారు.