modernisation
-
మిలటరీ నవీకరణకు 9.32 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాబోయే 5–7 ఏళ్లలో ఏకంగా రూ.9.32 లక్షల కోట్ల(130 బిలియన్ డాలర్ల)ను ఖర్చుపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ విషయమై కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళంలో ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కీలకమైన ఆయుధాలు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా పదాతి దళాలను ఆధునీకరించడంతో పాటు ఆర్మీ కోసం 2,600 పదాతిదళ పోరాట వాహనాలు(ఐఎఫ్వీ), 1,700 అత్యాధునిక పోరాట వాహనాలను సమకూర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఐఏఎఫ్‌కు 110 ఫైటర్ జెట్లు.. అలాగే వాయుసేన(ఐఏఎఫ్) కోసం 110 మల్టీరోల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ముఖ్యమైన నగరాలపై శత్రుదేశాల క్షిపణి దాడులు జరగకుండా గగనతలాన్ని సురక్షితంగా ఉంచేందుకు మరో మెగా ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టిందని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే 5,000 కి.మీ దూరం లోని శత్రు లక్ష్యాలను ఛేదించే అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని–5’ భారత అమ్ములపొదిలో చేరనుందన్నారు. -
ఎగువ మానేరు ఎడారేనా..?
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల) : రాజన్న సిరిసిల్ల జిల్లా వరప్రదాయని ఎగువ మానేరు ప్రాజెక్టు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోనే మొదటి చిన్నతరహ నీటి ప్రాజెక్టు. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆధునీకీకరణ పనులు అటకెక్కాయి. మిషన్ కాకతీయ, నీటి ప్రాజెక్టులకు వేలాది కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుండగా.. అధికారుల ఉదాసీనత ఈ ప్రాజెక్టుకు శాపంగా మారింది. వేలాది ఎకరాలకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా సాగునీరందిస్తూ.. ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఎగువ మానేరుపై పాలకులు శీతకన్ను వీడాలి. ఈ ఏడాది మరమ్మతు పనులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని ఎదురు చూసిన రైతన్నలకు చివరకు నిరాశే మిగిలింది. ఈ వర్షాకాలానికి ముందే పనులు పూర్తవుతాయని భావించారు. మరింత ఆయకట్టు సాగులోకి వస్తుందనకున్న అన్నదాతలకు ఎదురు చూపులే దక్కాయి. కొట్టుకుపోతున్న స్పిల్‌వే.. చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ 1945లో కూడవెళ్లి, పల్వంచ వాగులపై నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టును నిర్మించారు. 1948లో పనులు పూర్తయ్యాయి. 2టీఎంసీలతో 17వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే పనులకు శ్రీకారం చుట్టారు. కుడికాలువ ద్వారా అంటే ఇప్పటి ముస్తాబాద్ మండలానికి 10వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా గంభీరావుపేట మండలానికి 7వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. కాలక్రమంలో ప్రాజెక్టును అధికారులు పట్టించుకోలేదు. దీంతో సిల్ట్ పేరుకుపోయి నీటి సామర్థ్యం తగ్గింది. అలాగే కుడి, ఎడమ కా లువలు మట్టిలో కూరుకుపోయి చెట్లు మొలిచి నీ రు ముందుకు సాగని విధంగా తయారైంది. ఇక కుడి కాల్వలోని డిస్ట్రిబ్యూటరీ 17 వరకు షట్టర్లు ధ్వంసం అయ్యాయి. ఎడమ కాల్వలోని డీ–10 వ రకు శిథిలం అయ్యాయి. స్పిల్‌వే పై మొక్కలు మొ లిచి నెర్రెలు పెట్టింది. కొంత భాగం వరదకు కొ ట్టుకుపోయింది. చివరకు 5వేల ఎకరాలకు మాత్ర మే సాగునీరందించే ప్రాజెక్టుగా మిగిలిపోయింది. ప్రతిపాదనలకు మోక్షం కలిగేనా.. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ అ« దికారులు ఎట్టకేలకు కుడి, ఎడమ తూముల మరమ్మతు, షట్టర్ల మరమ్మతు, కుడికాలువ పది కిలో మీటర్లు, షట్టర్లు, ఎడమ కాలువ 5 కిలోమిటర్ల కా ల్వ లైనింగ్, ముఖ్యంగా యాభై ఏళ్లుగా నిండుకు న్న సిల్ట్ తొలగింపు తదితర పనులు చేపట్టేందుకు రూ. 49 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆరునెలల క్రితం పంపించిన ప్రతిపాదనలు ఈఎస్సీ వరకు వెళ్లి ఆగినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలోనే సిల్ట్ తొలగించి కనీసం 13వేల ఎకరాలకు నీరందించాలనుకున్న ప్రతిపాదనలు దాటలేదు. మళ్లీ వర్షాలు మొదలైతే ఇక సిల్ట్పనులు చేయరాదు. భారీ వర్షాలు పడితే వచ్చే వెసవి నాటికి కూడా పూడిక తీసే అవకాశాలు తక్కువే. ష ట్టర్ మరమ్మతు చేయరాదు. మరోసారి రబీలో 5వేల ఎకరాలకు మాత్రమే నీరందించే అవకాశాలున్నాయి. 9వ ప్యాకేజీలోకి గెస్ట్‌హౌస్, బోటింగ్ నిజాం నిర్మించిన గెస్ట్‌హౌజ్ శిథిలావస్థలో ఉండగా.. ఉద్యానవనం రూపు కోల్పోయింది. దీంతో అధికారులు రూ.2 కోట్లతో ఆధునిక హంగులతో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. టూరిజం శాఖ ఉద్యానవనం, గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపట్టనుండగా.. దీనిని కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కింద చేపట్టనున్నారు. -
మంత్రి చెబితే అంతేమరి!
సాక్షి, అమరావతి: ఏలేరు రిజర్వాయర్ ఆధునికీకరణ రెండో దశ టెండర్లను తన సన్నిహితుడికి కట్టబెట్టి, రూ.40 కోట్లకు పైగా కమీషన్లు కొల్లగొల్లడానికి కీలక మంత్రి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ పనులకు రూ.200 కోట్లు అంతర్గత అంచనా విలువ(ఐబీఎం)గా నిర్ణయించి శుక్రవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. బిడ్ దాఖలు చేయడానికి ఈ నెల 25ను తుది గడువుగా నిర్ణయించారు. 26న టెక్నికల్(సాంకేతిక) బిడ్, 30న ప్రైస్(ఆర్థిక) బిడ్ తెరిచి టెండర్లను ఖరారు చేసి, కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. జలవనరుల శాఖలో ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో నిర్వహించిన టెండర్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ టెండర్లలో ఈ నెల 19న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా ప్రీ బిడ్ సమావేశంలో బెదిరించి, సన్నిహితునికే పనులు కట్టబెట్టేందుకు కీలక మంత్రి స్కెచ్ వేసినట్లు సమాచారం. సింగిల్ బిడ్‌ను ఆమోదించాలట! తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ కింద 67,614 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. దాంతో ఏలేరు ఆధునికకీరణ పనులను 2007లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ పనులకు ఇప్పటికే రూ.102.70 కోట్లు ఖర్చు చేశారు. రెండోదశ కింద రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఆధునికకీరణ పనులకు గతేడాది మార్చి 3న రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులను తనకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు కీలక మంత్రి వ్యూహం రచించారు. ఈపీసీ విధానంలో గతేడాది పిలిచిన టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దంటూ కాంట్రాక్టర్లను బెదిరించారు. దాంతో కీలక మంత్రి సన్నిహితుడు మినహా ఇతరులెవరూ బిడ్లు దాఖలు చేయలేదు. తన సన్నిహితుడు దాఖలు చేసిన సింగిల్ బిడ్‌నే ఆమోదించాలని ఏలేరు రిజర్వాయర్ ఎస్ఈపై మంత్రి ఒత్తిడి తెచ్చారు. దాంతో సింగిల్ బిడ్‌ను ఆమోదించిన ఎస్ఈ.. ఆ పనులు అప్పగించడానికి అనుమతి కోరుతూ హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం సింగిల్ బిడ్‌ను ఆమోదించాలని ఎలా ప్రతిపాదిస్తారని జలవనరుల శాఖ అధికారులపై హైపవర్ కమిటీ చైర్మన్, సీఎస్ దినేష్‌కుమార్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమాలకు తాను బాధ్యత వహించలేనని, హైపవర్ కమిటీ నుంచి తనను తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ఆయనను ప్రభుత్వం ఇటీవల తప్పించింది. ఎల్ఎస్–ఓపెన్ విధానం తరహాలోనే ఈపీసీ విధానంలో నిర్వహించిన టెండర్లను ఖరారు చేసే బాధ్యతను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. పట్టువదలని అక్రమార్కుడు హైపవర్ కమిటీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తప్పించిన నేపథ్యంలో సీవోటీకి ప్రతిపాదనలు పంపి.. సన్నిహిత కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని జలవనరుల శాఖపై కీలక మంత్రి ఒత్తిడి తెచ్చారు. నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు నిర్వహిస్తామని అధికారులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తాను సూచించిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి, టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. దాంతో అధికారులు విచిత్రమైన నిబంధనలు పెట్టారు. ఒకరి కంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడి(జాయింట్ వెంచర్) టెండర్లలో పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధనలు విధిస్తున్న జలవనరుల శాఖ.. ఏలేరు ఆధునికకీరణ టెండర్లలో మాత్రం ముగ్గురు కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడి బిడ్లు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. విదేశీ కాంట్రాక్టర్లు బిడ్ దాఖలు చేయడానికి అనర్హులని మెలిక పెట్టింది. మంత్రి బెదిరింపుల నేపథ్యంలో బిడ్లు దాఖలు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. మంత్రి సన్నిహిత కాంట్రాక్టర్ మాత్రమే బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాత్ర లేకపోవడంతో ఈసారి సింగిల్ బిడ్‌నే ఆమోదించి, సదరు సన్నిహితుడికి పనులు కట్టబెట్టనున్నారు. ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన మంత్రికి రూ.40 కోట్లకుపైగా కమీషన్లు ముట్టనున్నట్లు తెలుస్తోంది. -
రూ.2.8 కోట్లతో పోలీస్స్టేషన్ల ఆధునికీకరణ
పాతపట్నం: జిల్లాలో ఉన్న పలు పోలీస్స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపడతున్నట్లు రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ డీఈఈ బి.ఎస్.ఎస్.ఆర్.కె.సాయిబాబు తెలిపారు. స్థానిక కోర్టు కూడలిలో పశు వైద్యశాల భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టెక్కలి, ఆమదాలవలస పోలీస్స్టేషన్లకు రూ.2.8కోట్లు నిధులు మంజురయ్యాయని, టెక్కలి పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. సోంపేట, రాగోలు, కళింగపట్నం, వీరఘట్టంలో పశువైద్యశాల భవనాలకు రూ.90లక్షలు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. నరసన్నపేట, రణస్థలంలో రూ.4కోట్ల శాప్ నిధులతో రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని వివరించారు. పాత్రునివలస స్టేడియం పనులకు రూ.6కోట్లు నిధులు విడుదలయ్యాయని అన్నారు. ఆయనతో పాటు ఏఈ టి.కోదండరామ్ ఉన్నారు. -
అటకెక్కిన ఆధునికీకరణ..
- అధ్వానస్థితిలో పిల్లకాల్వలు - పాత అలుగులో లీకేజీలు - చివరి ఆయకట్టుకు అందని సాగునీరు మహబూబ్‌నగర్: ప్రస్తుతం రిజర్వాయర్‌గా ఉపయోగిస్తున్నా.. కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. నిజాం నవాబుల కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు క్రస్టుగేట్ల షట్టర్లకు ఇప్పటివరకూ మరమ్మతులు చేపట్టలేదు. రబ్బర్ వాచర్లు పూర్తిగా అరిగిపోయి పాత అలుగుస్థాయి 26.6 అడుగులకు నీరు చేరగానే లీకేజీలు ప్రారంభమవుతున్నాయి. అధికారులు కొత్తగా రబ్బరు వాచర్లను వేయడంలో శ్రద్ధచూపడం లేదు. గతంలో ఉన్న అధికారులు ఏటా లీకేజీలు అరికట్టడానికి తాత్కలికంగా గోనే సంచులను షట్టర్ల కిందకు జొప్పించేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదు. కోయిల్‌సాగర్ అలుగుపై పిచ్చిమొక్కలు మొలచినా తొలగించడం లేదు. నెరవేరని ఎత్తిపోతల లక్ష్యం వర్షాభావ పరిస్థితుల కారణంగా కోయిల్‌సాగర్‌లోకి పెద్దవాగు నీటి ప్రవాహం లేకపోవడంతో జూరాల బ్యాక్‌వాటర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని పంపింగ్ చేసినా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపలేకపోయారు. షట్టర్ లేవల్ 32.6 అడుగులు ఉండగా, అలుగు లెవల్ 26.6 అడుగుల సామర్థ్యం మేరకు నీటిని నింపారు. అయితే గొటుసు కట్టు చెరువులకు నీటిని వదిలి పూర్తిస్థాయిలో నింపలేకపోయారు. దాదాపు రూ.400కోట్లు వెచ్చించి కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పనులు పూర్తిచేసినా ఇతర సమస్యలను గాలికొదిలారు. గతంలో వర్షాధారంగా ప్రాజెక్టు నిండినప్పడు 12వేల ఎకరాలకు సాగునీటిని అందించేవారు. ప్రస్తుతం కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా తీసుకురావడం వల్ల ఆయకట్టు 50,250 ఎకరాలకు పెరగాల్సి ఉంది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో చివరి ఆయకట్టు భూములకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. తూములు లేని కాల్వలు కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల తూములకు షట్టర్లు లేకపోవడంతో నీరంతా వృథా అవుతుంది. ఇక పిల్లకాల్వల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. కాల్వల ద్వారా పంటపొలాలకు నీరు వదిలితే.. పది అడుగులు కూడా పారడం లేదు. కుడి కాల్వ కింద ధన్వాడ, చిన్నచింతకుంట మండలాలతో పాటు నర్వ మండలంలోని కొంతమేర భూములు సాగవుతాయి, ఎడమ కాల్వ ద్వారా ప్రస్తుతం దేవరకద్ర మండలం గూరకొండ వరకు భూములు సాగవుతుండగా కొత్త ఆయకట్టు కింద కౌకుంట్ల రాజోలి వరకు సాగులోకి వస్తాయి. గొలుసు కట్టు చెరువుల కోసం నీటిని వదలడానికి కొత్త కాల్వలకు తూములు నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుకు రెండువైపులా ఉన్న ఆనకట్ట ఫుట్‌పాత్‌పై కాంక్రీట్ పనులు చేపట్టాలి. పర్యాటకం కల నెరవేరేనా..? జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు నిండినప్పుడు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సెలవుదినాల్లో పిల్లలు, పెద్దలు పెద్దఎత్తున ఇక్కడికి వస్తుంటారు. బోటింగ్ వంటి సౌకర్యం, అలాగే అధ్వానస్థితిలో ఉన్న గెస్ట్‌హౌస్‌ను బాగుచేస్తే పర్యాటక శాఖకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. నేడు జిల్లాకు మంత్రి హరీష్‌రావు రాష్ట్ర నీటిపారుదల, మైనింగ్, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 8.30 గంటలకు అన్నాసాగర్, 10 గంటలకు కోయిల్‌సాగర్ డ్యామ్‌ను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 కోయిలసాగర్ ఎత్తిపోతల పథకం, భూత్పూర్ రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు అమరచింతకు చేరుకుని ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు శుక్రవారం తెలిపారు. -
ఈ ఏడాదీ వృద్ధి బాటలోనే ఐటీ కంపెనీలు
న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలు ఈ ఏడాది కూడా వృద్ధి బాటన పయనిస్తాయని పీడబ్ల్యూసీ సర్వే అంటోంది. అమెరికా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, ఐటీపై బ్యాంకుల వ్యయం పెరగడంతోపాటు భారీ ఒప్పందాలతో ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. నూతన వ్యాపార విధానాలు, టెక్నాలజీ మోసాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కొత్త విభాగాలు, ప్రభుత్వ ఉత్తమ పాలన వంటి అంశాలు అంతర్జాతీయ ఐటీ రంగంలో భారత స్థానాన్ని పదిలం చేస్తాయని పీడబ్ల్యూసీ ఇండియా టెక్నాలజీ లీడర్ సందీప్ లడ్డా అన్నారు. డేటా కేంద్రాల ఆధునీకరణ, వర్చువలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ తదితర విభాగాలు భవిష్యత్ మార్కెట్‌ను నడిపిస్తాయని తెలిపారు. జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళిక, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులు 2014లో దేశీ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు అవకాశాలను తెచ్చిపెట్టాయని చెప్పారు. స్మాక్ టెక్నాలజీదే.. సోషల్, మొబైల్, అనలిటిక్స్, క్లౌడ్(స్మాక్ ) ఆధారిత బీపీవో సేవల కంపెనీలు భవిష్యత్‌ను ప్రభావితం చేస్తాయని ఏజిస్ గ్లోబల్ సీఈవో సందీప్ సేన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఐటీకి డిమాండ్ పెరుగుతుండడంతో ఈ కంపె నీల మధ్య భాగస్వామ్యాలు, ఒప్పందాలు, క్రయ విక్రయాలు నమోదవుతాయని పేర్కొన్నారు.