Money Management
-
డబ్బు లెక్క... ఓ కొలిక్కి వస్తోంది
ఇటీవల ఒక సర్వేలో వెల్లడైన నిజాలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళ బ్యాంకు పోపుల డబ్బానే! ఆర్థిక వ్యవహారాలకు మహిళలు దూరంగానే ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల ఏటీఎమ్ కార్డుల నిర్వహణ భర్తదే! అందుకే... ఫైనాన్షియల్ లిటరసీ అవసరం అంటారు శుభ్రా మహేశ్వరి. ‘‘చాలామంది మహిళలకు ఆర్థిక వ్యవహారాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. ఇది గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులైన మహిళల విషయం కాదు. బాగా చదువుకున్న వాళ్లు కూడా కనీస అవగాహన లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. నగరంలో ఇంటిని నిర్వహించే గృహిణి నెల ఖర్చులకు ముప్పై – నలభై వేల వరకు ఆమె చేతుల మీదుగా ఖర్చు చేస్తుంటుంది. కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో దాస్తే డబ్బే డబ్బును రెట్టింపు చేస్తుందనే చిన్న లాజిక్‌ని మిస్ అవుతున్నారు. ఇది వెల్త్ క్రియేషన్‌లో వెనుకబాటుతనమేనంటారు శుభ్ర. అక్షరాలు వచ్చు! లెక్క తేలదు!! ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే... పెద్ద చదువులు చదువుకున్న మహిళలు కూడా బంగారాన్ని ఆభరణం రూపంలో కొని బీరువాలోనో, బ్యాంకు లాకర్లోనో దాచుకుంటున్నారే తప్ప గోల్డ్‌బాండ్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. బాండ్ రూపంలో ఉన్న బంగారం విలువను అర్థం చేసుకోవడంలో నిరక్షరాస్యతలో ఉన్నారనే చెప్పాలి. బ్యాంకులు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. కానీ చిన్న మొత్తమైనా సరే బ్యాంకులో దాచుకుని బ్యాంకు ద్వారా కానీ యాప్ ద్వారా కానీ లావాదేవీ నిర్వహించడం నేర్చుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నారు. కాలేజీల్లో కూడా విద్యార్థులకు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే నేర్పిస్తారు. డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పించడం మీద దృష్టి వెళ్లడం లేదు. ‘‘పరిశ్రమలు స్థాపించిన మహిళలు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టిన మహిళలు శ్రమించడంలో ఏ మాత్రం అలసత్వం ఉండదు. నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్లనే లాభాల బాట పట్టాల్సిన పరిశ్రమలు పట్టాలు తప్పుతున్నాయి. ఒక చార్టెడ్ అకౌంటెంట్‌గా నేను గమనించింది ఒక్కటే. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ వారికి సరైన మార్గదర్శనం చేసే వారు లేకపోవడంతో ఆ మహిళల శ్రమ వృథా అవుతోంది. వర్క్‌లో డెడికేషన్ ఎంత ముఖ్యమో, రైట్ డైరెక్షన్లో చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నా వంతు సామాజిక బాధ్యతగా మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాను. ఇటీవల మనదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు గణనీయంగా పెరిగారు. ఈ దశలో ఈ చైతన్యం చాలా అవసరం. ఇందుకోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వర్క్ షాపులు చేపడుతున్నాం. భారీ సమావేశాలకు బదులు చిన్న చిన్న క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద విషయాన్ని సరళంగా వివరించడానికి స్థానిక బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాం. సమావేశంలోనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడం కూడా జరుగుతుంది’’ అన్నారు శుభ్రా మహేశ్వరి. కలను దర్శించాలి! ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్‌గా ఆమె మహిళను మానసికంగా శక్తిమంతం చేయడానికి ‘స్ట్రాంగర్ షీ’ అనే కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా ఈ ఏడాది చేపట్టిన అంశం ‘ఫైనాన్షియల్ లిటరసీ’. దేశంలోని గ్రామీణ, పేద మహిళ నుంచి మధ్య తరగతి మహిళలు, వైట్ కాలర్ జాబ్‌లో ఉన్న మహిళలను కూడా కలుసుకుంటారు. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు, డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా నేర్పించడం, డబ్బుతో డబ్బును ఎలా పెంపొందించుకోవాలో తెలియచేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ‘‘భూమ్మీద నీకంటూ ఒక స్థానం ఉంది. ఆకాశంలోనూ నీ కంటూ కొంత భాగం ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ ఎదగడానికి నీకంటూ ఒక కల ఉండాలి. నీ జ్ఞానంతో ఆ కలను దర్శించగలగాలి. ఆ కలను నిజం చేసుకోవడానికి నీ శ్రమను అనుసంధానం చేసుకోవాలి. నీ కలను నిజం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే. కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయంగా ఉండే వారే, ఫలితం పూర్తిగా నీదే. అది విజయం అయినా అపజయం అయినా పూర్తి బాధ్యత నీదేననే విషయాన్ని మర్చిపోకూడదు’’ మహిళలకు నా సందేశం ఇదేనన్నారు శుభ్రా మహేశ్వరి. రోజూ తెల్లకాగితమే! శుభ్రా మహేశ్వరి పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే. తండ్రి పారిశ్రామికవేత్త. ఆమె మాత్రం చార్టెడ్ అకౌంటింగ్ వైపు ఆసక్తి చూపించింది. పెళ్లి తర్వాత ఇరవై ఏళ్ల కిందట భర్తతో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బ్లూ స్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల డైరెక్టర్‌గా విధులు నిర్వహణతోపాటు చార్టెడ్ అకౌంటెంట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానమ్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, నేషనల్ హైవేస్తోపాటు దాదాపుగా మూడు వందల కార్పొరేట్ కంపెనీలకు ఆడిటర్‌గా సేవలందించిన, అందిస్తున్న అనుభవం ఆమెది. ‘‘మన జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త రోజే. డైరీలో కొత్త పేజీనే. ఏమీ రాయని తెల్లకాగితమే. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి కాగితాన్నీ మంచి విషయంతో నింపాలి. అదే అందమైన కథ అవుతుంది. అంటే ఏ ఒక్క రోజునూ నిరుపయోగంగా గడపవద్దు. ప్రయోజనకరంగా గడపాలి’’ అంటారు శుభ్రా మహేశ్వరి. – వాకా మంజులారెడ్డి -
ఏడేళ్ల కొడుక్కి మామ్స్ మనీలెసన్! మీరూ ట్రై చేయండి..
చిన్నప్పుడు నేర్చుకున్న విద్యాబుద్ధులే రేపటి బంగారు భవిష్యత్‌కు దారిచూపుతాయి. చుట్టూ ఉన్న పరిస్థితులు, తల్లిదండ్రులు, గురువులు నేర్పిన పాఠాలే జీవితంలో ఉన్నతస్థానంలో నిలబెడతాయి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల్ని విలువలతో పెంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు ఫ్లోరిడాకు చెందిన ఓ తల్లి. ఈమె పేరు తెలియనప్పటికీ ఆమె ఐడియా మాత్రం ఎందరో తల్లిదండ్రులకు ప్రేరణగా నిలుస్తోంది. ఫ్లోరిడాకు చెందిన ఓ తల్లికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. అబ్బాయికి మంచి విద్యాబుద్ధులతోపాటు, డబ్బు విలువను తెలియజేయాలనుకుంది ఆమె. ఈ క్రమంలోనే రోజూ తన కొడుకుతో కొన్నిరకాల పనులు చేయిస్తోంది. రోజూ బెడ్‌ను తనే సర్దుకోవడం, పళ్లు తోముకోవడం, తన బాత్రూంను శుభ్రపరచడం, మురికి బట్టలను వాషింగ్మిషన్లో వేయడం వంటి పనులు అన్ని అతనే చేయాలి. ఆ రోజున మొత్తం పనులు పూర్తయితే ఒక డాలరు ఇస్తుంది. నెల మొత్తం వచ్చిన డాలర్లన్నింటిని కలుపుకుని తనకిష్టమైన బొమ్మలు, చాక్లెట్లు కొనుక్కుంటాడు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆ కుర్రాడు తనకు వచ్చిన నెల జీతాన్ని ఇంటికి అద్దెకట్టడం, తన రూమ్‌లో విద్యుత్‌ను ఉపయోగించినందుకు కరెంట్ బిల్లు, వాడిన నెట్‌కు ఇంటర్నెట్ బిల్లుని కడుతున్నాడు. ఒకనెల ఏదైనా కారణంతో బిల్లులు కట్టకపోతే వాటిని తరువాతి నెలలో కట్టేలా అమ్మతో ఒప్పందం చేసుకుంటున్నాడు. ఇలా చిన్నవయసు నుంచే డబ్బు ప్రాముఖ్యత, విలువను అర్థం చేసుకోవడం ద్వారా తన భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దుకోగలడని ఆ తల్లి చెబుతోంది. తన కొడుకుకి డబ్బు విలువ గురించి ప్రాక్టికల్‌గా చెబుతోన్న తల్లి వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో చాలామంది నెటిజన్లు కొడుకుని బాగా పెంచుతున్నారు అని అభినందిస్తున్నారు. మరికొంతమంది ఈ ఐడియా బాగుంది కానీ పిల్లాడికి ఇంకా ఏడేళ్లే కదా! అంటున్నప్పటికీ, మొక్కై వంగనిది మానై వంగునా అంటారు కదా! లేతవయసులో ఏది చెప్పినా వెంటనే నేర్చుకునే మానసిక స్థితిలో పిల్లలు ఉంటారు. అందువల్ల ఆ తల్లి కొడుకులు చేస్తున్నది చాలా మంచి పని. చిన్న వయసు నుంచే పిల్లలకు ఇంతటి లోతైన విషయ అవగాహన కల్పించడం వల్ల భవిష్యత్‌ను మరింత మంచిగా నిర్మించుకోగలుగుతారు. చదవండి: మీకు కుక్కలంటే చచ్చేంత భయమా? ఐతే మీ కోసమే.. -
పిల్లల కోసం తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే మంచిదే
‘నగదు నిర్వహణ’ (మనీ మేనేజ్మెంట్/ఫైనాన్షియల్ మేనేజ్మెంట్)కు జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘మనీ’ పాఠాలను ఎంత ముందుగా నేర్చుకుంటే ఆర్థికంగా అంత మెరుగైన స్థానానికి బాటలు వేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న నాటి నుంచే డబ్బు విషయాలను తెలియజేస్తూ వెళితే భవిష్యత్తులో వారికి స్పష్టమైన బాట ఏర్పాటు చేసినవారవుతారని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా స్కూళ్లలో మనీ పాఠాలకు చోటుండదు. కనుక తల్లిదండ్రులే ఈ విషయంలో చొరవ చూపించాలి. ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పాకెట్ మనీ ఇస్తుంటారు. కొందరు అయితే పిగ్గీ బ్యాంకు (డిబ్బీ) ఇచ్చి అందులో పొదుపు దిశగా ప్రోత్సహిస్తుంటారు. ప్రేమతో ఇలా ఇచ్చే డబ్బును పిల్లల పేరిట బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను ప్రారంభించి.. అందులోకి మళ్లించడం మంచి ఆలోచన అవుతుంది. పిల్లలకు బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ప్రారంభించడం వల్ల వారి కంటూ తల్లిదండ్రులు ఓ ఆదాయ వనరును సమకూర్చినవారు అవుతారు. దీనివల్ల బ్యాంకు ఖాతా అవసరం, ప్రయోజనాలను చిన్నారులు తెలుసుకుంటారు. సంపాదన వయసుకు వచ్చే నాటికి బ్యాంకింగ్ లావాదేవీలపై వారికి చక్కటి అవగాహన ఏర్పడుతుంది. చిన్నప్పుడే బ్యాంకు లావాదేవీలకు సన్నిహితంగా మెలగడం వారిపై ఆర్థికంగా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణుల విశ్లేషణ. పిగ్గీ బ్యాంకులో ఎంత వేస్తే అంతే ఉంటుంది. కానీ, బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తంపై ఎంతో కొంత వడ్డీ జమ అవుతూ, కాంపౌండింగ్‌తో మరింత వృద్ధి చెందుతుంది. అందుకే పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని బ్యాంకు పొదుపు ఖాతాలో పొదుపు చేసుకునే దిశగా పిల్లలను ప్రోత్సహించాలి. అసలు.. వడ్డీ.. వడ్డీపై వడ్డీ అంతా కలసి.. మైనర్లు కాస్తా మేజర్లు అయ్యే నాటికి కొద్ది మొత్తమే మంచి నిధిగా మారుతుంది. పిల్లలు దీన్ని బాగా అర్థం చేసుకుంటే, వారి భవిష్యత్తుకు ప్రయోజనం. అర్హతలు పిల్లల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బ్యాంకులో ఖాతాను ప్రారంభించుకునేందుకు అవకాశం ఉంది. పిల్లలకు ఎంత వయసు ఉండాలి? అన్న సందేహం అక్కర్లేదు. రోజుల వయసు ఉన్నా కానీ ఎటువంటి అభ్యంతరం లేదు. చాలా బ్యాంకుల్లో మైనర్ ఖాతా గరిష్ట వయసు 18 ఏళ్లుగా అమలవుతోంది. 18 ఏళ్లు నిండిన తర్వాత మైనర్ ఖాతాను పూర్తి స్థాయి సాధారణ ఖాతాగా మార్చేందుకు అర్హత లభిస్తుంది. కాకపోతే ఆ సమయంలో పూర్తి స్థాయి కేవైసీ వివరాలను సమరి్పంచాలి. వార్షిక వడ్డీ ఆదాయం సంగతి... మైనర్ ఖాతాలకు సంబంధించి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అంశం పన్ను. పిల్లల పేరిట బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక ఆదాయానికే కలిపి చూపించుకోవాల్సి ఉంటుంది. పలు రకాల ఖాతాలు.. తల్లి లేదా తండ్రి ఉమ్మడి ఖాతాదారుగా జాయింట్ అకౌంట్‌ను ప్రారంభించుకునేందుకు వీలుంది. లేదా చిన్నారి పేరు మీదే ఖాతాను తెరవొచ్చు. ఎస్బీఐ ‘పెహ్లాకదమ్’, ఐసీఐసీఐ బ్యాంకు ‘యంగ్ స్టార్స్ సేవింగ్స్ అకౌంట్’లకు కచ్చితంగా తల్లిదండ్రులు జాయింట్ అకౌంట్ హోల్డర్‌గా ఉండాలన్న నిబంధన అమల్లో ఉంది. మరి కేవలం చిన్నారి పేరుతోనే ఖాతా తెరవాలనుకుంటే ఎస్బీఐలో పెహ్లీఉడాన్ అనే పథకం ఉంది. కాకపోతే 15-18 ఏళ్ల వయసు వారికే ఇది పరిమితం. అదే పదేళ్లు దాటిన చిన్నారులకు ప్రత్యేకమైన ఖాతా తెరవాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు ‘స్మార్ట్స్టార్ సేవింగ్స్ అకౌంట్’ పథకం అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంకు ‘ఫ్యూచర్ స్టార్స్ సేవింగ్స్ అకౌంట్’లో అయితే పిల్లలకు పదేళ్లు వచ్చే వరకు వారి తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులే లావాదేవీలు నిర్వహించేందుకు వీలుంటుంది. ఒకవేళ చిన్నారుల పేరిట ఖాతాను ప్రారంభించేట్టు అయితే.. అదే బ్యాంకు శాఖలో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సైతం ఖాతా ఉండాలని చాలా బ్యాంకులు కోరుతున్నాయి. వడ్డీ రేట్లు/ చార్జీలు చాలా బ్యాంకులు సాధారణ సేవింగ్స్ ఖాతాల మాదిరే వడ్డీ రేటును మైనర్ ఖాతాలకూ అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు వివిధ బ్యాంకుల పరిధిలో 2.7 శాతం నుంచి 7 శాతం మధ్యలో ఉన్నాయి. కాకపోతే పిల్లల పేరిట తెరిచే ఖాతా విషయంలో వడ్డీ రేటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖాతాకు ఉన్న సదుపాయాలు, సౌకర్యాలనే ప్రధానంగా చూడాలి. ప్రారంభ డిపాజిట్ ఎంత చేయాలి?, కనీస నెలవారీ బ్యాలన్స్ నిర్వహించలేకపోతే విధించే చార్జీలు ఎలా ఉంటాయి?, నగదు ఉపసంహరణకు పరిమితులు? ఇతరత్రా నియమ నిబంధనలను ప్రధానంగా చూడాలి. ఉదాహరణకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో మైనర్ సేవింగ్స్ ఖాతా ప్రారంభానికి రూ.25,000 ఉండాలి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే ‘కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్’లో మైనర్లు నెలవారీ కనీసం రూ.5,000ను బ్యాలన్స్‌గా నిర్వహించాలని కోరుతోంది. రూ.5,000 నిర్వహణలో విఫలమైతే తిరిగి కనీస బ్యాలన్స్ ఖాతాలో చేరే వరకు రూ.150–300 మధ్య చార్జీలను అమలు చేస్తోంది. అదే ఎస్బీఐ ‘పెహ్లీ ఉడాన్’ ఖాతాలో ఎటువంటి బ్యాలన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. అంటే ఇది జీరో బ్యాలన్స్ అకౌంట్. గరిష్టంగా ఖాతాలో రూ.10లక్షల వరకు బ్యాలన్స్‌ను నిర్వహించుకోవచ్చు. సాధారణ ఖాతాలకు మాదిరే మైనర్ ఖాతాదారులూ చెక్కు బుక్, ఏటీఎం కార్డు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను పొందొచ్చు. ఉపసంహరణ పరిమితులు, తల్లిదండ్రుల ప్రమేయం అన్నది బ్యాంకుల మధ్య మార్పు చెందొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ‘కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్’ అయితే చిన్నారుల పేరిటే ఏటీఎం/డెబిట్ కార్డులను జారీ చేస్తారు. రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ.2,500గా ఉంది. వర్తకుల వద్ద ఒక్కరోజులో రూ.10,000కు మించి కార్డుతో చెల్లించడానికి అవకాశం లేదు. అదే ఎస్బీఐ అయితే పీవోఎస్ వద్ద రోజువారీ పరిమితిని రూ.5,000గానే అమలు చేస్తోంది. తల్లిదండ్రుల నియంత్రణలు చాలా బ్యాంకులు మైనర్ ఖాతాలకు సంబంధించి ఎటువంటి ఆంక్షల్లేకుండా ఏటీఎం/డెబిట్ కార్డుల సదుపాయాలను కలి్పస్తున్నాయి. కనుక కార్డుల దురి్వనియోగం రిస్క్ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాంకులు మైనర్ ఖాతాల లావాదేవీలపై తల్లిదండ్రులు లేదా సంరక్షకుల మొబైల్ నంబర్లకు అలర్ట్ సందేశాలను పంపిస్తున్నాయి. అంతేకాదు, నెట్‌బ్యాంకింగ్ ద్వారా లావా దేవీలను పరిశీలించుకునేందుకు అనుమతిస్తున్నా యి. తమ పిల్లల కార్డు ల పరిమితులను ఎప్పటికప్పుడు మా ర్చుకునేందుకూ అవకాశం కల్పిస్తున్నాయి. సిటీ బ్యాంకు జూనియర్ అకౌంట్, ఏయూ స్మాల్ ఫైనాన్స్‌కు చెందిన ఏయూ కిడ్స్ అకౌంట్ ఇందుకు ఉదాహరణలు. పిల్లల చేతికే తాళాలు ఇవ్వడం నచ్చని తల్లిదండ్రులు ఖాతాల కంట్రోలింగ్‌ను తమ చేతుల్లోనే ఉంచుకునే సదుపాయం ఉంది. అదనపు ప్రయోజనాలు.. కొన్ని బ్యాంకులు మైనర్ ఖాతాలపై అదనపు ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐ ‘పెహ్లీ ఉడాన్’ పెహ్లాకదమ్’ ఖాతాలకు ఆటో స్వీప్ ఫిక్స్డ్ డిపాజిట్ (బ్యాలన్స్ కనీస పరిమితి మించిన సందర్భాల్లో అదనపు బ్యాలన్స్‌ను డిపాజిట్‌గా మార్చే ఆటో సదుపాయం) సదుపాయాన్ని అందిస్తోంది. రికరింగ్ డిపాజిట్‌పై స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ సదుపాయాన్ని కూడా కలి్పస్తోంది. వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని, ఎస్బీఐ లైఫ్ తరఫున మార్కెట్ లింక్డ్ ప్లాన్ ‘స్మార్ట్ స్కాలర్’ను ఆఫర్ చేస్తోంది. పెహ్లాకదమ్ ఖాతాలో అయితే ఎఫ్డీపై ఓడీ సదుపాయాన్ని తల్లిదండ్రులు/సంరక్షకులు తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంకు కిడ్స్ అడ్వాంటేజ్ ఖాతాదారులకు రూ.లక్ష విలువతో ఉచితంగా ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణించినట్టయితే మైనర్ ఖాతాదారులకు బ్యాంకు రూ.లక్ష పరిహారంగా చెల్లిస్తుంది. చదవండి: రేషన్ కోసం ప్రత్యేక యాప్ లాంచ్ చేసిన కేంద్రం సామాన్యుల కోసం ఎల్ఐసీ సరికొత్త భీమా పాలసీ -
అమ్మా.. నాన్నా... అలవాట్లు!!
► అప్పు తీర్చటం నుంచి బీమా దాకా వారే గురువులు ► మనీ మేనేజిమెంట్‌లో తల్లిదండ్రుల ప్రభావమే అధికం మనం ఏం నేర్చుకున్నా దాన్లో తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. పొదుపు, ఖర్చు అలవాట్లు కూడా వచ్చేది వారి నుంచే. నిజం చెప్పొద్దూ!! ఎవరైనా తమ కలల్ని, జీవిత లక్ష్యాల్ని సాకారం చేసుకోవటానికి ఆర్థిక విషయాలు తెలిసి ఉండటమనేది అత్యంత కీలకం. అందుకని మనకు సంక్రమించిన ఖర్చు, పొదుపు అలవాట్లను విశ్లేషించుకోవటంలో తప్పు లేదు. చక్కని జీవితానికి చక్కని అలవాట్లే పునాది. దాన్లో చెడు ఉంటే గనక... ఆదిలోనే తుంచేయాలి. సదరు అలవాట్ల సింçహావలోకనమే ఈ ప్రయత్నం. రుణాల చెల్లింపులెలా ఉన్నాయ్? ఆ మధ్య కోపెన్హెగన్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్లు ఓ ఆసక్తికరమైన అధ్యయనం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న 50 లక్షల మందికి చెందిన 3 కోట్ల రుణాలను విశ్లేషించారు. 2011– 2014 మధ్య తీసుకున్న రుణాలవి. వాళ్లు కనుక్కున్నదేమిటంటే... తల్లిదండ్రులు గనక రుణాలు తిరిగి చెల్లించటంలో డీఫాల్ట్ అయితే... వారి పిల్లలూ డీఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువని. ఇవి ఎంత ఎక్కువంటే... డీఫాల్ట్ కాని తల్లిదండ్రుల పిల్లలకంటే దాదాపు నాలుగు రెట్లు!!. కుటుంబ ఆదాయాలు, తెలివితేటలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలూ ఇలాగే ఉండటం గమనార్హం. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే... మీ తల్లిదండ్రులు రుణాల చెల్లింపులు ఎలా చేశారో తెలుసుకోవటమే కాదు. రుణాల విషయంలో మీ వైఖరినీ విశ్లేషించుకోండి. ఒక్కటి గుర్తుంచుకోండి!! తీసుకున్న అప్పును తిరిగి చెల్లించటమనేది నైతికంగా, చట్టపరంగా మీ బాధ్యత. అదేకాదు! చక్కని చెల్లింపు అలవాట్లు మీ క్రెడిట్ స్కోరునూ పెంచుతాయి. తద్వారా తక్కువ వడ్డీకే కొత్త రుణాలు దొరుకుతాయి. సంప్రదాయ పాలసీలను కొనొద్దు... ఓ తెలిసిన బంధువో, మిత్రుడో వచ్చి గ్యారంటీ లాభాలుంటాయంటూ సంప్రదాయ బీమా పాలసీలను అంటగట్టడం మనకు కొత్తేమీ కాదు. దీర్ఘకాలంలో ఇవన్నీ అర్థంలేని పాలసీలుగా మిగిలిపోతాయి. ఇలాంటి బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయటమనేది ఓ సమస్య కూడా. ఎందుకంటే ఈ ప్లాన్లలోని తప్పనిసరి లాకిన్ పీరియడ్ మిమ్మల్ని వాటి నుంచి బయటపడకుండా చేస్తుంది. ఒక వాటిపై వచ్చే రాబడి అత్యంత తక్కువ. దాని బదులు తగినంత కవరేజీ ఉండేలా టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ల వంటి ఎక్కువ రాబడినిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయటం తెలివైన పని. తగినంత కవరేజీ ఉందా? భారతీయుల్లో చాలామంది జీవిత బీమాను తీసుకునేది పన్నుల నుంచి బయటపడటానికే. కొందరు దాన్నో ఇన్వెస్ట్మెంట్లా కూడా చూస్తుంటారు. బీమా ఉన్న వ్యక్తి ఒకవేళ మరణించినా, ఆసుపత్రిలో ఉన్నా ఆ కుటుంబానికి వాస్తవంగా ఎంత రక్షణ కావాలన్నది మాత్రం వారు చూడరు. మీ కుటుంబ సభ్యులు కనక మీపై ఆధారపడి ఉంటే... మీపై ఆధారపడ్డ భార్య/భర్త తాలూకు ఆదాయ అవసరాలు, రుణ చెల్లింపులు, పిల్లల చదువు ఖర్చులు, ఆరోగ్య ఖర్చులు, ఇతర రోజువారీ అవసరాల వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని అందుకు తగినంత బీమాను టర్మ్ ప్లాన్ రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మీపై ఆధారపడ్డ వారిని అలా వదిలేయలేరు కదా!! ఆరోగ్య బీమా లేదా? చాలామంది ఆరోగ్య బీమా లేకుండానే తమ జీవితంలో చివరి మజిలీని చేరుకుని ఉంటారు. ఆ సమయంలో వారి ఆరోగ్యం చాలా ఒడిదుడుకులకు గురవుతుంటుంది. మరోవంక బీమా ఉండదు. ఆ సమయంలో ఆరోగ్య బీమా కొనుగోలు చేయటం కూడా చాలా కష్టం. పొరపాటున ఆసుపత్రి పాలయితే కుటుంబ పొదుపు, పెట్టుబడులు ఠక్కున ఆవిరయిపోతుంటాయి. ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే యుక్త వయసు నుంచే చక్కని ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవటంతో పాటు దాన్ని చిరకాలం కొనసాగించాలి. తెలివైన పెట్టుబడి సాధనాలున్నాయ్ మీకు కావాల్సినప్పుడు మీ డబ్బు మీ చేతికిరావాలి. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చాలావరకూ ఒక మోస్తరు రాబడినిస్తాయి కానీ పన్ను పరంగా అంత సమర్థమైనవి కావు. ఎండోమెంట్ బీమా పాలసీలంటే తక్కువ రాబడితో పాటు లాకిన్లూ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. కానీ పన్ను తప్పదు. అందుకని మెరుగైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలు వెతుక్కోవాలి. వీటన్నిటికీ జవాబిచ్చే మ్యూచువల్ ఫండ్లలో గడిచిన రెండేళ్లుగా ఇన్వెస్ట్మెంట్లు బాగా పెరుగుతున్నాయి. వాటిలో పన్ను ఆదాతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవేశించొచ్చు... బయటపడొచ్చు కూడా. రిస్కును బట్టే రాబడులుంటాయి. నెలకు రూ.500 నుంచి మొదలుపెట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పుత్తడి ఎల్లవేళలా మెరవదు... సంప్రదాయంగా బంగారం కూడా పెట్టుబడి సాధనంగా వస్తోంది. దాని ప్రయోజనాలు దానికున్నాయి. ఈ లోహాన్ని కావాల్సినట్టు మార్చుకోవచ్చు. పాడైపోదు. ఆభరణంగానూ వాడొచ్చు. కానీ పెట్టుబడిగా వచ్చేసరికి ప్యూరిటీ, మార్కెట్ రాబడి, దాచుకోవటమనే సమస్యలు దీనికీ ఉన్నాయి. ఆభరణంగా వాడుకోవాలంటే ‘బంగారం’లా కొనుక్కోవచ్చు. కానీ పెట్టుబడిగా అయితే మాత్రం మీ పోర్టుఫోలియోలో దాన్ని కొంతవరకే పరిమితం చేయాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ సావరిన్ బాండ్ల వంటి సాధనాలను పరిశీలించొచ్చు. -
ఇంటి మనీ మేనేజర్ మీరేనా!
కుటుంబ ఆర్థిక నిర్వహణ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. సంపాదిస్తే సరిపోదు. ఆ సంపాదనని సరిగ్గా వినియోగించుకోవడమూ ఎంతో ముఖ్యం. డబ్బు నిర్వహణ సమర్ధంగా ఉంటే ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడుతుంది. విహార యాత్రలు, పిల్లల పెళ్లిళ్లు, భవిష్యత్తులో ఆస్తుల కొనుగోలు, ఒకవేళ రుణాలు ఏవైనా ఉంటే వాటిని సకాలంలో తీర్చడం.. ఇలా పలు కోణాల్లో కుటుంబ ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలను అందజేస్తుంది. తగిన ప్రణాళిక, ఆ ప్రణాళిక నిర్వహణ ద్వారా కుటుంబ ఆర్థిక బాట ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ఇక ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ సంపాదించేవారే అయితే... ఆ డబ్బు సమర్థవంతమైన నిర్వహణలో కుటుంబ సారథికి ఎన్నో మెళకువలు అవసరం. సంపాదించే వారికి వారివారి వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి. వారి ఇష్టాలు-అయిష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి. అదే సమయంలో కుటుంబ వ్యయాల విషయాలను ఆలోచించాలి. ఆయా అంశాల ప్రాతిపదికన ఇంటి పెద్ద డబ్బు నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. ఆర్థిక నిర్వహణ భారం కాకుండా తేలిగ్గా సాగిపోయేలా కొన్ని మెళకువలను చూస్తే... ఉమ్మడి అవగాహన ఉండాలి... ఇంట్లో సంపాదించేవారందరి మధ్యా రాబడి-వ్యయాల అంశాలపై ఉమ్మడి అవగాహన అవసరం. దీనివల్ల సంపాదించే కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి పొరపొచ్చాలకూ వీలుండదు. గృహ రుణం ఏదైనా ఉంటే- చెల్లింపులు, పిల్లల చదువులకు సంబంధించి ఫీజులు, టెలిఫోన్ చార్జీల వంటి ఇతర నెలవారీ చెల్లింపులు, కుటుంబ ఖర్చులు ఇలా ప్రతి అంశంపై ఉమ్మడి అవగాహనతో ముందుకు వెళ్లాలి. స్టీరింగ్ ఒకరివద్దే ఉండాలి... డబ్బు కుటుంబంలో పెద్దలందరూ సంపాదిస్తున్నా... నిర్వహణ ఒకరి చేతుల్లోనే ఉండడం మంచిది. దీనివల్ల కుటుంబంలో చక్కని ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది. సహజంగా మన సమాజంలో కుటుంబ పెద్దే ఇంటి ఆర్థిక బాధ్యతల నిర్వహిస్తుంటాడు. వ్యయానికి ఉమ్మడి నిబంధనలు..: వ్యయాల విషయంలో కుటుంబ సభ్యులు అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు ఉండాలి. కొందరికి మినహాయింపులు ఇవ్వడం వల్ల అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చుచేయడంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి కుటుంబంలోని సభ్యులు అందరికీ మంచి అవగాహన అవసరం. ఈ విషయంలో కుటుంబ పెద్ద చేయాల్సింది ఎంతో ఉంటుంది. వ్యక్తిగత ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి... ఇంట్లో పలువురు సంపాదించేవారుంటే... మనీ మేనేజ్మెంట్ చేసే కుటుంబ పెద్ద వారి వ్యక్తిగత ప్రాధాన్యతలను అర్థం చేసుకోవాలి. అలాగే కుటుంబం పెద్దదైతే... డబ్బు ఆర్జించేవారి అలాగే సంపాదించనివారి ప్రాధాన్యతలనూ, అవసరాలనూ గుర్తెరగాలి. డబ్బు ఎవరికి ఎలా కేటాయించాలన్న అంశంపై ఒక నిర్దిష్టమైన అవగాహన అవసరం. ప్రాధాన్యతల క్రమంలో వ్యక్తుల అవసరాలకు డబ్బు కేటాయింపులు జరపాలి. పొదుపు ప్రాముఖ్యత గురించి కుటుంబ సభ్యులు అందరి మధ్యా అవగాహన పెంచడానికి కూడా కుటుంబ పెద్ద ప్రయత్నం చేయాలి. డబ్బు కేటాయింపు.. రుణ బకాయిల నెలవారీ చెల్లింపులు, చదువుకు సంబంధించి ఫీజులు, బీమా చెల్లింపులు వంటి అత్యవసర, తప్పనిసరి పేమెంట్లకు డబ్బు అప్పటికప్పుడు కాకుండా ముందే కేటాయింపులు జరుపుకుని, ముందుగానే డబ్బు సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల ఆర్థిక ఒత్తిడులను నివారించే వీలుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆయా అంశాలపై ముందుగానే చక్కటి అవగాహన అవసరం. ప్రతి ఒక్కరూ కుటుంబ వ్యయాల పైన పూర్తి బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో మెలగడానికి వీలవుతుంది. -
మీ ఇంటికి మీరే ఫైనాన్స్ మినిస్టర్!
వాయనం: ఇంటిని బాగా మేనేజ్ చేయాలంటే డబ్బుని మేనేజ్ చేయడం రావాలి. చాలామంది గృహిణులు డబ్బు వ్యవహారాలు మగాళ్లకు సంబంధించినవని అనుకుంటారు. అది సరికాదు. ఇంట్లో దేనికి ఖర్చు చేయాలి, ఎంత చేయాలి, ఎంత నిల్వ చేయవచ్చు వంటి విషయాలు ఇంటిని చక్కబెట్టే మహిళలకు తెలిసినంతగా వారి భర్తలకు తెలియవు. కాబట్టి మనీ మేనేజ్మెంట్ మీద గృహిణులు దృష్టి పెట్టి తీరాలి. ఆర్థికాంశాలను అర్థం చేసుకోవడం, ఆర్థిక వ్యవహారాలను సమగ్రంగా నిర్వహించడం పెద్ద పనేమీ కాదు. ఎంత వస్తుంది, ఎన్ని ఖర్చులున్నాయి అన్న విషయాలు స్పష్టంగా తెలిస్తే చాలు. చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగా మీకున్న ఖర్చులన్నీ ఓ చోట రాసుకోండి. ఆపైన వచ్చే ఆదాయం ఎంత ఉందో చూసుకోండి. ఆదాయం కంటే ఖర్చు ఎప్పుడూ తక్కువగానే ఉండాలన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా చేసుకోవడం రాక చాలామంది అవస్థ పడుతుంటారు. కానీ కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే అది సాధ్య పడుతుంది. ఇంటి ఖర్చులకెంత, పిల్లలకెంత, మీవారి పాకెట్ మనీకి ఎంత అంటూ అవసరాలను విడగొట్టుకోవాలి. ఆపైన వాటిలో ఎంత పొదుపు చేయగలం అని చూడాలి. ఇంటి ఖర్చులనే తీసుకోండి. ఉప్పు దగ్గర్నుంచి ఏసీ వరకూ ఇప్పుడు ప్రతి వస్తువుకీ రెండు మూడు ఆప్షన్స్ ఉంటున్నాయి. వాటిలో ఏది బెస్ట్ అని చూడటం మానేసి, వాటిలో మన దగ్గరున్న డబ్బుకి ఏది బెస్ట్ అని చూసుకోవడం ఉత్తమం. అలా అని చెత్త వస్తువు కొనమని కాదు. మంచి వాటిలోనే కొంతలో కొంత తక్కువకు వచ్చేది తీసుకోమని. పిల్లల ఫీజుల విషయంలో ఏమీ చేయలేం. కాకపోతే వారికి కొనే వస్తువుల విషయంలో కొంత పొదుపు చేయవచ్చు. ఇప్పుడు ప్రతి చిన్న ఊరిలోనూ ఇంటర్నెట్ ఉంటోంది. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ చేయడం నేర్చుకోండి. వంట సామాన్ల దగ్గర నుంచి బేబీ డైపర్స దాకా అక్కడ దొరికినంత తక్కువగా మరెక్కడా దొరకవు. పది నిమిషాల పని. పది రూపాయలు మిగిలినా పొదుపే కదా! మొదట ప్లాన్ చేసుకున్నప్పుడే ఈ నెల ఇంత మిగల్చాలి అను కుని, ఆ మొత్తాన్ని పక్కన పెట్టేసి, అది లేదనుకుని మిగతావన్నీ చేసుకోండి. లేకపోతే పొదుపు చేయడం జన్మలో అలవడదు. పొదుపు మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అర్థమైందిగా, మరి మీ ఇంటి ఫైనాన్స్ మినిస్టర్ పదవిని చేపట్టండిక! ఐస్‌క్యాండీ... మీరే చేయండి! చల్లచల్లని, తీయతీయని ఐస్‌క్యాండీ తినడం పిల్లలకే కాదు... పెద్దలకూ సరదానే. ఉత్తర భారతదేశంలో అందరికీ ప్రీతిపాత్రమైన ఈ ఐస్... మెల్లగా మనవాళ్లకూ దగ్గరయ్యింది. అయితే రోడ్ల పక్కన అమ్మే వీటిని పిల్లలకు కొనివ్వాలంటే తల్లిదండ్రులు కాస్త భయపడుతుంటారు... దుమ్మూ ధూళీ వచ్చి పడివుంటుందని. అలా చెబితే పిల్లలు ఊరుకుంటారా? తినాల్సిందేనని మారాం చేస్తారు. కాబట్టి మీరే ఇంట్లో చేసిచ్చేశారనుకోండి... వాళ్ల కోరికా తీరుతుంది, కలుషితమయ్యిందన్న భయమూ మీకుండదు. ఇదిగో... ఈ బుజ్జి మెషీన్ ఐస్క్యాండీలను చకచకా చేసేస్తుంది. దీని పైభాగం తీసి, ట్రేలాంటి దాంట్లో ఐస్ ముక్కలు వేయాలి. మూత పెట్టేసి, హ్యాండిల్ పట్టుకుని తిప్పితే... మెత్తటి ఐస్ముద్ద కిందపడుతుంది. దీన్ని తీసుకుని, స్టిక్ చుట్టూ పెట్టి ఐస్‌లాగా చేసి... చక్కెర, రంగు కలిపిన నీటిని దానిమీద పోయాలి. అంతే... ఐస్‌క్యాండీ రెడీ! మీకు నచ్చిన రంగులు వేసుకోవచ్చు. వెనిల్లా కలిపిన పాలు, బాదంపాలు వంటివి వేసినా కూడా సూపర్‌గా ఉంటుంది. ఐస్‌క్యాండీ మెషీన్లు సైజును బట్టి రూ. 400 నుంచి రూ. 700 ఖరీదులో లభిస్తున్నాయి. బాగా తక్కువలో కావాలంటే ఆన్లైన్ స్టోర్స్‌లో కొనడం మంచిది. అందులో అయితే రూ. 250కే వచ్చేస్తుంది. -
సిరి.. నడమంత్రం కాకూడదంటే..
హాలీవుడ్ సెలెబ్రిటీలపై డాలర్ల వర్షం కురుస్తుంటుంది. హీరో, హీరోయిన్ల సంగతైతే చెప్పనవసరమే లేదు. వారి నట్టింట్లో లక్ష్మీదేవి నడయాడుతూ ఉంటుంది. అయితే, ఆడంబరంగానో, అనాలోచితంగానో చేసిన ఖర్చులు, పెట్టుబడులతో ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయి దివాలా తీసిన వారు కొందరుంటే జైలుపాలైన వారు మరికొందరున్నారు. డెమాలిషన్ మ్యాన్ వంటి సుప్రసిద్ధ సినిమాల్లో నటించిన వెస్లీ స్నైప్స్... పన్ను సంబంధ కేసుల్లో చిక్కుకుని కటకటాలపాలయ్యాడు. విమానాలు, విలాసవంతమైన కార్ల వంటివి కొనుగోలు చేసిన హీరో నికొలస్ కేజ్... ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నాడు. జెన్నిఫర్ లోపెజ్, బ్రిట్నీ స్పియర్స్ కూడా వ్యాపారం చేసి చేతులు కాల్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ జాబితాలో చాలామందే ఉన్నారు. వీరంతా ఎందుకు పప్పులో కాలేశారని అడిగితే, ఆర్థిక నిపుణులు చెప్పిన ఐదు కారణాలివీ... మనీ మేనేజ్మెంట్ తెలియదు సెలెబ్రిటీల్లో ఎక్కువ మంది చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. కానీ, బిజినెస్ విషయాలకు తగినంత సమయం కేటాయించడానికి మాత్రం ఇష్టపడరు. ఫైనాన్షియల్ ప్లానర్లు, బిజినెస్ మేనేజర్ల సలహాలను వీరు తీసుకుంటారు. కానీ, వాటిని పట్టించుకోరు. తమ ఇష్టాయిష్టాల ప్రకారమే వ్యవహరిస్తారు. తగిన అడ్వయిజర్లు లేకపోవడం తమకు తగిన బిజినెస్, ఫైనాన్షియల్ మేనేజర్లను ఎంపిక చేసుకునే నైపుణ్యం కొంతమంది సెలెబ్రిటీలకు లేకపోవడం కూడా సమస్యలకు దారితీస్తోంది. తమ పెట్టుబడులపై అధిక ఆదాయం సంపాదించడమెలా అన్న అంశంపై వీరు దృష్టిపెట్టరు. తాము తర్వాత చేయబోయే పాత్ర గురించి ఆలోచిస్తారుగానీ, పెట్టుబడి ప్రణాళికలను పట్టించుకోరు. నమ్మకద్రోహం ఎంత గొప్ప సెలెబ్రిటీలైనా సాధారణ మనుషులే కదా. అందుకే, కుటుంబ సభ్యులనో, స్నేహితులనో పూర్తిగా నమ్మేసి మునిగిపోతుంటారు. చాలామంది సెలెబ్రిటీలు తమ స్నేహితులకు సాయం చేసే ఉద్దేశంతో వారిని వ్యాపారంలోకి భాగస్వాములుగానో, ఉద్యోగులుగానో తెస్తుంటారు. ఈ స్నేహితులు అవసరం తీరాక ముఖం చాటేసిన సంఘటనలెన్నో ఉన్నాయి. డ్రగ్స్, దురలవాట్లు సెలెబ్రిటీల పార్టీల్లో మద్యం ఏరులై పారుతుంటుంది. కొందరు డ్రగ్స్‌కు బానిసలవుతుంటారు. మద్యం, మత్తు ప్రభావంతో ఉన్న వారు తగిన వ్యాపార, పెట్టుబడి నిర్ణయాలను తీసుకోలేరు. గతంలో ఓ వెలుగు వెలిగిన కొందరు సెలెబ్రిటీలు దురలవాట్ల కారణంగా బికారులుగా మారిన సంఘటనలున్నాయి. ఆర్భాటం సెలెబ్రిటీలుగా మారి సంఘంలో కొంత గుర్తింపు రాగానే కుక్, డ్రైవర్, పర్సనల్ సై ్టలిస్ట్, పర్సనల్ అసిస్టెంట్... ఇలా బోలెడు మంది ఉద్యోగులను నియమించుకుంటారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. సినిమాల్లో అవకాశాలు ఆగిపోయినప్పటికీ తమకు మళ్లీ మంచి రోజులొస్తాయనే ఆశతో సిబ్బందిని కొనసాగిస్తారు. తద్వారా జేబులో చిల్లిగవ్వ మిగలని స్థితికి చేరుకుంటారు. హాలీవుడ్ సెలెబ్రిటీల కథలన్నీ సంతోషంగా ముగియవు. కానీ, మెరుగైన ఆర్థిక సలహాలు, సూచనలతో వీరి కథలు కనీసం విషాదాంతం కాకుండా ఉంటాయి.