mortality in control
-
భారత్‌లో థర్డ్ వేవ్ ప్రభావం తక్కువే.. కారణమిదే!
న్యూఢిల్లీ: గతేడాది దేశాన్ని కుదిపేసిన కరోనా సెకండ్‌వేవ్‌తో పోలిస్తే ప్రస్తుత థర్డ్ వేవ్ వల్ల మరణాలు, ఆస్పత్రిపాలవడం తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. ప్రస్తుత వేవ్‌లో కేసులు పెరుగుతున్నా, వ్యాక్సినేషన్ కార్యక్రమం స్పీడందుకోవడంతో భారీగా అనారోగ్యాలపాలవడం, చావులు పెరగడం కనిపించడంలేదని తెలిపింది. ఈ మేరకు రెండు, మూడు వేవ్స్‌ను పోల్చిచెప్పే కీలక సూచీలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియా సమావేశంలో గురువారం ప్రదర్శించారు. దేశంలో 2021 ఏప్రిల్ చివరకు 3.86 లక్షల కొత్త కేసులు, 3,059 మరణాలు, 31.70 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఆ సమయంలో దేశంలో రెండు డోసుల టీకా తీసుకున్నవారి సంఖ్య మొత్తం జనాభాలో 2 శాతమని చెప్పారు. 2022 జనవరి 20న దేశంలో 3.17 లక్షల కొత్త కేసులు, 380 మరణాలు, 19.24 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఈ సమయానికి పూర్తిడోసులందుకున్న వారి సంఖ్య 72 శాతానికి చేరిందని వివరించారు. టీకా కార్యక్రమం వల్ల థర్డ్ వేవ్‌లో మరణాలు తగ్గాయన్నారు. 18ఏళ్లకు పైబడినవారిలో 72 శాతం మంది రెండు డోసులు, 94 శాతం మంది తొలిడోసు అందుకున్నారని చెప్పారు. 15– 18 ఏళ్ల కేటగిరీ ప్రజల్లో 52 శాతం మంది తొలిడోసు టీకా తీసుకున్నారన్నారు. ఈ కేటగిరీలో టీకాలందుకున్నవారిలో ఏపీ టాప్‌లో ఉందని చెప్పారు. -
ముందుగానే స్పందిస్తే మరణాలు తగ్గించొచ్చు
న్యూయార్క్: కరోనా వైరస్ వంటి అంటువ్యాధుల సమయంలో ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం వల్ల మరణాల సంఖ్య తగ్గేందుకు అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు అంటున్నారు. 1918–19 సంవత్సరాల్లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో అమెరికాలోని కొన్ని నగరాల్లో ముందుగానే అప్రమత్తమై చేపట్టిన నిర్బంధ, నివారణ చర్యల కారణంగా మరణాలు తగ్గినట్లు లయోలా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ బారినపడి 5 కోట్ల మంది చనిపోగా అమెరికాలో 6.75 లక్షల మంది బలయ్యారు. శాన్ఫ్రాన్సిస్కో, సెయింట్ లూయిస్, కన్సాస్ సిటీ, మిల్వాకీ నగరాలు చేపట్టిన.. పాఠశాలల మూసివేత, సభలు, సమావేశాలపై నిషేధం, కఠినమైన ఐసోలేషన్ విధానాలు, పరిశుభ్రత పాటించడం, తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చేయడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. ‘ఈ చర్యలు వ్యాధి తీవ్రతను 30 నుంచి 50 శాతం వరకు తగ్గించాయి. ఆలస్యంగా స్పందించిన/ ముందు జాగ్రత్తలు తక్కువగా తీసుకున్న నగరాలతో పోలిస్తే ఇవి మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఈ నగరాల్లో మరణాల రేటు గరిష్ట స్థాయిని చేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టింది. మొత్తం మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ పరిశోధన ఫలితాలు తాజాగా అమెరికన్ సొసైటీ ఆఫ్ సైటోపాథాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ‘ఇలాంటి కఠినచర్యలతో ఎలాంటి ఫలితం ఉండదని అప్పట్లో జనం అనుకునేవారు. కానీ, అది తప్పు అని మా అధ్యయనంలో తేలింది’అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘1918లో అమెరికాలో పేదరికం, పోషకాహార లోపం, అపరిశుభ్రత, జనం ఎక్కువగా గుమికూడటం ఎక్కువగా ఉండేవి. అప్పటి పరిస్థితులతో పోల్చుకుంటే ప్రపంచం నేడు చాలా మారింది. అయినప్పటికీ, వందేళ్ల క్రితం తీసుకున్న నివారణ చర్యలు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణకూ అనుసరణీయాలే’అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేదు వాషింగ్టన్: కరోనా ముప్పు వృద్ధులకే అధికమన్న వాదనలో నిజం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆరోగ్యం.. అనారోగ్యం అన్నవే కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కరోనా బారినపడే అవకాశాలు తక్కువని తేల్చిచెప్పింది. సహజంగా వృద్ధుల్లో అరోగ్యవంతులు అంతంతమాత్రమే కాబట్టి అలాంటి వారే బలయ్యే ప్రమాదం ఉందంది. -
మన్యంలో మరణాలను అరికట్టండి
{పసవాలపై ప్రత్యేక శ్రద్ధ ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్ పాడేరు: ఏజెన్సీలో వివిధ వ్యాధుల వల్ల చోటుచేసుకుంటున్న మరణాల నియంత్రణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్ వైద్యాధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో గురువారం ఏజెన్సీలోని ఎస్పీహెచ్వోలు, వైద్యాధికారులు, ఐసీడీఎస్ అధికార్లతో సమీక్షించారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో మలేరియాకు తోడు క్షయ కూడా మరణాలకు కారణమవుతోందన్నారు. క్షయ రోగులను గుర్తించిన వెంటనే వైద్యసిబ్బందిని అప్రమత్తం చేసి చికిత్స అందించే బాధ్యత ఎస్పీహెచ్వోలదేఅన్నారు. ఏజెన్సీలో 589 టీబీ కేసులు ఉన్నాయని, వీటిలో 492 మం దికి పౌష్టికాహారం లేక క్షయ సోకినట్లు గుర్తించినట్టు తెలిపారు.గర్భిణులు అధికశాతం మంది రక్తహీనతకు గురవ్వడం, కాన్పులకు సకాలంలో ఆస్పత్రులకు చేరకపోవడం వల్ల, నెలలు నిండక ముందు ప్రసవం, ఇళ్ల వద్ద ప్రసవాలు వంటి కారణాలతో చోటుచేసుకుంటున్న మరణాలను నియంత్రించాలన్నారు. గిరిజన మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి సంబంధిత పీహెచ్సీ పరిధిలోని వైద్యాధికారి, ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ వర్కర్లు నిర్ణీత సమయానికి మందులు, పౌష్టికాహారం అందించి ప్రసవతేదీకి రెండు రోజుల ముందే ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మరణాలు నియంత్రించ వచ్చని సూ చించారు. ఐటీడీఏలో ఏర్పాటు చేస్తున్న హెల్త్ కాల్‌సెంటర్ పనితీరును పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. కాల్ సెంటర్ టోల్‌ఫ్రీకి1800 4250 0004 నంబ రును కేటాయించినట్లు తెలిపా రు. గర్భిణులు, పిల్లలకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు సకాలంలో అందించడంపై ఎస్పీహెచ్వోలు పర్యవేక్షించాలన్నారు. సికిల్‌సెల్ ఎనీమియాపై దృష్టి సారించాలన్నారు. ఆశ్రమాల్లో బాలికలకు హెమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ సరోజిని మాట్లాడుతూ ఆస్పత్రి కాన్పుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరణాలను నివారించాలన్నారు. జి.మాడుగుల, దారకొండ, తాజంగి పీహెచ్‌సీల పరిధిలో ఇటీవల సంభవించిన 5 బాలింత మరణాలపై సంబంధిత వైద్యాధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్, జేడీ అరుణ్‌కుమారి మాట్లాడుతూ ఏఎన్ఎంలు సమర్థంగా విధుల నిర్వహణకు ట్యాబ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వాటి వినియోగంపై 8 నుంచి 11వ తేదీ వరకు శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టన్ ఎన్.వసుంధర, డీఎంవో తులసి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయలక్ష్మి, ఎన్ఆర్హెచ్ఎం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ దేవి, ఏడీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.