mother kills daughter
-
దారుణం.. ప్రియుడితో కలిసి కూతుర్ని కడతేర్చిన తల్లి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహాలో షాకింగ్ ఘటన జరిగింది. సొంత తల్లే కూతుర్ని దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి ఈ క్రూర చర్యకు పాల్పడింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసులకు దొరికిపోయింది. పోలీసులు నిందితులిద్దరినీ శనివారం అరెస్టు చేశారు. హసన్పూర్ కోత్వాలి పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం.. నిందితురాలి పేరు స్మృతి రాణి వర్మ. ఆమె ప్రియుడి పేరు అనిల్ కుమార్. హత్యకు గురైన 16 ఏళ్ల బాలిక పేరు కుష్బూ వర్మ. అయితే స్మృతి రాణి చాలా ఏళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయింది. ప్రియుడు అనిల్‌తో కలిసి జీవిస్తోంది. కూతురు కుష్బూ కూడా ఈమెతోనే ఉంటోంది. రాణి అనిల్‌తో ఉండొద్దని కుష్బూ తరచూ ఆమెకు చెప్పేది. తల్లి ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసేది. దీంతో తన కూతురు అడ్డుగా ఉందని బావించిన రాణి ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే తన కుమార్తె మృతిపై సుషీల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాణే ఆమెను చంపి ఉంటుందని అనమానం వ్యక్తం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రాణి ఆమె ప్రియుడ్ని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు.. -
ఘాతుకం: కన్నతల్లి కంటే ప్రియుడే ఎక్కువయ్యాడు..
తిరువొత్తియూరు(చెన్నై): బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడడాన్ని ఖండించిందనే కోపంతో ఓ బాలిక తన తల్లిని హత్య చేసింది. వివరాలు.. తూత్తుకుడి కార్పొరేషన్ చాకలిపేట రెండో వీధిలో మాడస్వామి. మునిలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో మునిలక్ష్మి శనివా రం రాత్రి హత్యకు గురైంది. తూత్తుకుడి పోలీసు లు మునిలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణలో మునిలక్ష్మి కుమార్తె (17) రాజీవ్‌నగర్‌కు చెందిన కన్నన్ (20), ముత్తయ్యపురానికి చెందిన తంగకుమా ర్ (22)తో స్నేహం కలిగి ఉందని తేలింది. అలాగే తంగ కుమార్‌కు, ఈ బాలికకు ప్రేమ వ్యవహారం నడుస్తుండడంతో మునిలక్ష్మి దాన్ని తీ వ్రంగా ఖండించినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహించిన బాలిక, కన్నన్, తంగకుమార్, మరోస్నేహితుడితో కలిసి మునిలక్ష్మిపై దాడి చేసి నోటిలో గుడ్డపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. పోలీసులు కన్నన్ను అరెస్టు చేశారు. తంగకుమార్, అతని స్నేహితుడు పరారీలో ఉన్నారు. -
వరంగల్‌లో పరువు హత్య.. అంజలి ప్రేమవ్యవహారం నచ్చక..
సాక్షి, వరంగల్ క్రైం/పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన ఉబ్బని అంజలి ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మృతురాలి తల్లి, అమ్మమ్మలు తమ మాట వినడం లేదని హత్య చేసినట్లు ధ్రువీకరించారు. దీంతో పర్వతగిరి పోలీసులు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాలను ఈస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వెంకటలక్ష్మి వివరించారు. మృతురాలు ఉబ్బని అంజలి తల్లి సమ్మక్క భర్త చనిపోవడంతో జీవనోపాధి కోసం పర్వతగిరిలో కూరగాయల వ్యాపారం కొనసాగిస్తుంది. సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె వివాహం జరిగింది. రెండో కుమార్తె అంజలి తల్లి వద్ద ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఇదే క్రమంలో అంజలి అదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ ప్రేమ వ్యవహారం తల్లికి తెలియడంతో పాటు తమ కులానికి చెందిన వ్యక్తికాకపోవడంతో అంజలి ప్రేమను అంగీకరించలేదు. ప్రశాంత్‌తో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించవద్దని నిందితురాళ్లు తల్లి, అమ్మమ్మలు మృతురాలిని పలుమార్లు హెచ్చరించారు. చదవండి: (విషాదం: 'నాకు అక్కడ చదవడం ఇష్టం లేదు.. ప్రైవేట్ కాలేజీకి పంపండి') అయినా అంజలి వ్యవహారక శైలిలో మార్పు రాకపోవడంతో ఎలాగైనా అంజలిని చంపాలని సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే గత నెల(నవంబర్) 19న అర్ధరాత్రి 3గంటల సమయంలో నిద్రిస్తున్న అంజలిని తల్లి గొంతు నులుమగా, అమ్మమ్మ అంజలి ముఖంపై దిండుతో అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు ఇద్దరు ఇంటి నుంచి బయటికి వచ్చి చుట్టుపక్కల వారికి వినబడే విధంగా గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ తమ కుమార్తె ఏదో మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు అరిచారు. దీంతో చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి చేరుకోవడంతో పాటు పర్వతగిరి పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: (వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..) మృతురాలి తల్లి, అమ్మమ్మతో పాటు చుట్టు పక్కల వారు ఇచ్చిన వాంగ్మూలంతో పర్వతగిరి పోలీసులు అంజలిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మృతిపై మామునూరు ఏసీపీ నరేష్కుమార్ పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి మృతురాలి తల్లి, అమ్మమ్మలను విచారించడంతో తామే హత్యచేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ నేరాన్ని నిరూపించడంలో ప్రతిభ కనబర్చిన మామునూరు ఏసీపీ నరేష్కుమార్, పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, ఐనవోలు, సంగెం, ఎస్సైలు భరత్, హరిత, కానిస్టేబుళ్లు రాజు, లింగమూర్తి, మహిళా కానిస్టేబుల్ విజయలను సీపీ తరుణ్ జోషి అభినందించారు. -
నీటి తొట్టిలో 12 రోజుల పసికందు.. వీడిన మిస్టరీ.. తల్లే హంతకురాలు
ఏలూరు టౌన్: మాతృత్వం మంటకలిసింది. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లే కసాయిలా మారింది. అభం శుభం తెలియని 12 రోజుల పసికందును కనికరం లేకుండా నీళ్ల తొట్టిలో పడేసి హతమార్చింది. ఆపై ఏమీ తెలీదని నాటకాలాడింది. పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. బిడ్డను తనే నీటి తొట్టిలో పడేసినట్లు ఒప్పుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల క్రితం చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. సీతామహాలక్ష్మి ఏలూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జూలై 30న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. అయితే బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో ఈనెల 8న ఏలూరు శంకరమఠం వీధిలోని సాయి చిల్ట్రన్ హాస్పిటల్లో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉండడంతో ఈఎన్టీ వైద్యునితో చికిత్స చేయించారు. పరిస్థితి మెరుగుపడటంతో బుధవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. హాస్పిటల్లో సీతామహాలక్ష్మి, ఆమె తల్లి, భర్త హరికృష్ణ ఉన్నారు. హరికృష్ణ తండ్రి నాగేశ్వరరావు రేమల్లి నుంచి బస్సులో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో దిగి కుమారుడికి ఫోన్ చేసి చెప్పగా బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హరికృష్ణ వెళ్లి తండ్రిని హాస్పిటల్‌కు తీసుకువచ్చాడు. అయితే అప్పటికే పసిబిడ్డ కనిపించటంలేదని సీతామహాలక్ష్మి భర్తకు చెప్పడంతో ఆందోళనకు గురైన హరికృష్ణ, అతని తండ్రి గాలించగా హాస్పిటల్ ఆవరణలోని నీటి తొట్టిలో పసికందు మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డీఎస్పీ డాక్టర్ దిలీప్‌కిరణ్ పర్యవేక్షణలో టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్, ఎస్ఐ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో హరికృష్ణ తండ్రిని తీసుకురావడానికి వెళ్లిన సమయంలో తాను బాత్రూమ్కి వెళ్లానని సీతామహాలక్ష్మి చెప్పగా, ఆమె తల్లి తాను హాస్పిటల్ పైకి వెళ్లానని చెప్పారు. అయితే, పోలీసులకు తల్లి సీతామహాలక్ష్మీపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా, బిడ్డను తనే నీటి తొట్టిలో పడేశానని తల్లి అంగీకరించింది. దీంతో ఆమె పోలీసులు అదుపులోకి తీసుకుని కన్నబిడ్డను ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. -
రోజూ పూజలే.. ఇదేంటని అడిగితే ఎదురు సమాధానం
మోతె (సూర్యాపేట): ఆరునెలల పసిబిడ్డ బలితో మేకలపాడు తండాలో విషాదం అలుముకుంది. మూఢ నమ్మకాలతో కన్న తల్లే గొంతుకోసి పసిపాప ప్రాణాలు తీయడంతో తండా వాసులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఈ దారుణ ఘటనకు ముం దు పరిస్థితుల గురించి ఆరా తీస్తే.. వారం రోజులుగా ఆ పాప తల్లి భారతి ఇంట్లో పూజలు చేస్తోంది. అదీ ఎవరూ లేనప్పుడు.. అగర్బత్తీ లు ముట్టించి కొబ్బరికాయలు కొడుతోంది.. దీనిపై భర్త కృష్ణ ఇవేం పూజలు? అని ప్రశ్నిస్తే ఏమీ లేదులే .. అంటూ దాటవేస్తూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ తండ్రి చిన్న ఆదమరుపు ఆ పసిబిడ్డ ప్రాణాలు తీసింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల ఆవాసమైన మేకలపాడు తండాలో గురువారం భారతి తన ఆరునెలల కూతురును గొంతుకోసి బలిచ్చిన విషయం తెలిసిందే. దీం తో తండాఒక్కసారిగా ఉలిక్కిపడింది. శుక్రవారం ఆ తండావాసులను ఎవరినీ పలకరించినా భయాందోళనలోనే ఉన్నారు. భారతికి ఇది రెండో వివాహం తండాకు చెందిన భారతికి కృష్ణతో రెండో వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్లక్రితం మొదటి వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియ దు కానీ విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కృష్ణను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఆమె మానసికస్థితి బాగా ఉండడం లేదని పలు ఆలయాలు, చర్చిలు, దర్గాలు తిప్పారు. అందరితో కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఉంటుందని, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆమె మానసిక పరిస్థితి భిన్నంగా ఉంటుందని తండావాసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులక్రి తం ఒకరిని కత్తితో బెదిరించినట్లు సమాచారం. నిందితురాలు భారతి నిలదీస్తే ఎదురు సమాధానాలు.. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు శివుడు ఫొటోతోపాటు యూట్యూబ్‌లో చూసి వారం రోజులుగా వివిధ దేవుళ్ల ఫొటోలకు అగర్బత్తీలు ముట్టించి, కొబ్బరికాయలు కొడుతోంది. చుట్టుపక్కల వారికి అగర్బత్తీల వాసన వచ్చి రోజూ ఏం పూజలు చేస్తున్నావని ప్రశ్నిస్తే ‘మీకేం అవసరం. దేవుడికి నా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటా’అని ఎదురు సమాధానం చెబుతుండడంతో వారు కూడా మిన్నకుండిపోయారు. ఈ విషయాన్ని భర్త కృష్ణ కూడా గమనిస్తూ వస్తున్నాడు. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కూతురు రీతును జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. గురువారం సూర్యాపేటకు వెళ్లిన ఆయన.. అత్తామామలకు చెప్పినా వారు కొంత ఆలస్యం చేయడంతో ఘోరం జరిగిపోయింది. అంతలోనే భారతి కూతురును గొంతుకోసి చంపింది. ప్రస్తుతం తండాలో భారతి అంటేనే భయపడుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. భారతి భర్త కృష్ణ్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం నిందితురాలు భారతిని అదుపులోకి తీసుకొంటామని చెప్పారు. రోదిస్తున్న రీతు నానమ్మ తండా నుంచి వెళ్లగొట్టండి అభంశుభం తెలియని పసిబిడ్డ రీతును గొంతుకోసి హత్య చేసిన భారతిని తండానుంచి వెళ్లగొట్టండి. నా మనుమరాలిని హత్య చేసింది. రేపు నా కొడుకును, నన్ను హత్య చేయదని గ్యారటీ ఏమిటీ. ఆమెపై మాకు అనుమానం ఉన్నా బిడ్డను చంపుతుందా? అని అనుకున్నాం. కానీ అన్నంత పనిచేసింది. మళ్లీ ఏమీ తెలియనట్లు ఉంది. ఇలాంటి కర్కోటకురాలిని కఠినంగా శిక్షించాలి. – కృష్ణ తల్లి చంద్రమ్మ ఏమీ గుర్తులేదంటున్న భారతి.. నిందితురాలు భారతి ప్రస్తుతం తన తల్లిగారింటి వద్ద ఉంది. నీ బిడ్డను ఎందుకు హత్య చేశావని బంధువులు ప్రశ్నించగా.. ‘రీతును నేను ఎందుకు హత్య చేశానో నాకే తెలియడం లేదు’అని తాపీగా సమాధానం చెబుతోంది. అసలు హత్య చేసింది కూడా గుర్తులేదని బదులిస్తోంది. చదవండి: తన దోషం పోతుందని బిడ్డను బలిచ్చింది -
మూఢనమ్మకంతో ఓ తల్లి కిరాతకం
-
యూట్యూబ్‌లో పూజలు చూసి బిడ్డను బలిచ్చిన తల్లి
సూర్యాపేట /మోతె: కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. మూఢనమ్మకంతో కసాయిలా మారింది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ప్రాణం తీసింది. విద్యావంతురాలైనా.. విచక్షణ కోల్పోయింది. కత్తితో గొంతు కోసి హతమార్చింది. నాగదేవతల రూపంలో ఉన్న చిత్రపటాల ఎదుట చిన్నారిని బలిచ్చింది. నా బిడ్డను చంపేశా.. నాకిక ఎలాంటి దోషం లేదంటూ కేకలు వేసింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామ ఆవాసం మేకలపాటి తండాలో గురువారం సాయంత్రం ఈ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య మూఢ నమ్మకానికి తన బిడ్డ బలయ్యిందంటూ తండ్రి రోదించడం అందరి హృదయాలనూ కదలించింది. వివాహమైనప్పటినుంచే: పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేకలపాటి తండాకు చెందిన బానోతు కృష్ణకు అదే తండాకు చెందిన భారతి అలియాస్ లాస్య, అలియాస్ బుజ్జితో మూడేళ్ల క్రితం వివాహమైంది. డిగ్రీ వరకు చదువుకున్న కృష్ణ వికలాంగుడు. వీరు తండాలోనే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా భారతి 6 నెలల క్రితమే ఆడబిడ్డ (రీతు)కు జన్మనిచ్చింది. అయితే కృష్ణ, భారతిల వివాహమైన ఏడెనిమిది నెలల తర్వాత క్షుద్ర పూజలు చేస్తూ జోస్యం చెప్పేవాడు తండాకు వచ్చాడు. భారతి.. తనకు భయం భయంగా ఉంటోందని, ఈ భయం పోవాలంటే ఏం చేయాలని అతన్ని అడిగింది. నీకు సర్పదోషముందని, ఆ దోషం తొలగాలంటే నాగపూజలు చేయాలని, అంతేకాకుండా నీకు జన్మించే మగ, ఆడబిడ్డ ఎవరైనా సరే వారిని బలివ్వాలని అతను చెప్పినట్లు సమాచారం. అప్పటినుంచి వారంలో రెండు మూడు రోజులు భారతి నాగపూజలు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే భారతికి ఆరు నెలల క్రితం ఆడ బిడ్డ రీతు పుట్టింది. తర్వాత చిన్నారిని బలిచ్చేందుకు భారతి రెండుమూడు సార్లు ప్రయత్నించిందని బంధువులు చెబుతున్నారు. భర్త లేకుండా చూసి.. భార్య ప్రవర్తనను కృష్ణ కూడా పసిగట్టాడు. గురువారం మధ్యాహ్నం సూర్యాపేటకు పనిపై వెళుతూ అత్తమామల వద్దకు వెళ్లాడు. భారతికి మతిస్థితిమితం సరిగా లేదని, రీతును ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి వెళ్ళాడు. అయితే వారు పట్టించుకోలేదు. ఇదే అదనుగా భారతి తాను అనుకున్న పని చేసేసింది. నాకిక ఏ దోషం అడ్డురాదు ‘నా బిడ్డ రీతును చంపేశా. ఇక నాకు నాగసర్ప దోషమే కాదు.. ఏ దోషం కూడా అడ్డురాదు..’ అంటూ భారతి.. చిన్నారి గొంతు కోసిన కత్తి చేతపట్టుకుని తండాలోని తల్లి గారింటికి కేకలు వేసుకుంటూ వెళ్లింది.తనకు పుట్టిన పాపతోనే తన ప్రాణానికి ముప్పు ఉందని, ఈ రోజు నుంచి నా ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదంటూ తల్లిదండ్రుల ఎదుట రోదించింది. వెంటనే తల్లిదండ్రులకు భారతి నివాసానికి చేరుకొని చూడగా.. రీతు తెల్లని గుడ్డలో రక్తపు మడుగులో కన్పించింది. సూర్యాపేటలో పనిముగించుకుని వచ్చిన కృష్ణ – రక్తపుమడుగులో ఉన్న బిడ్డను చూసి కుప్పకూలిపోయాడు. అత్తమామలకు విషయం చెప్పినా పట్టించుకోలేదంటూ రోదించాడు. చిత్రపటాల ముందు పసుపు, కుంకుమలు, కొబ్బరి చిప్పలు ఉండటంతో ఈ దారుణానికి ముందు భారతి పూజలు నిర్వహించిందని భావిస్తున్నారు. భారతి ఎప్పుడూ మొబైల్లో యూట్యూబ్ చూస్తూ కాలక్షేపం చేస్తుండేదని, ఎక్కువగా నాగపూజలకు సంబంధించిన వీడియోలు చూసేదని తెలుస్తోంది. వీడియోలు చూస్తూ నాగపూజలు చేయడం ప్రారంభించిందని చెబుతున్నారు. చిన్నారి హత్యతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. డిగ్రీతో పాటు బీఈడీ చేసిన భారతి పోటీ పరీక్షలకు సైతం సిద్ధమైంది. విద్యావంతురాలైనప్పటికీ మూఢ నమ్మకంతో కన్న బిడ్డ ప్రాణాలు తీయడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. మోతె పోలీసులు భారతిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: బెడిసికొట్టిన విషప్రయోగం, తల్లి గొంతు నులిమిన కొడుకు -
కన్నతల్లి కర్కశత్వం
సాక్షి, కామారెడ్డి క్రైం: చున్నీతో ఐదేళ్ల కూతురుకు ఉరి బిగించి చంపిన తల్లి.. ఆపై తాను యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట కాలనీలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బతుకమ్మ కుంటకు చెందిన షేక్ తాజొద్దీన్ ఇటీవలే గల్ఫ్ నుంచి తిరిగివచ్చాడు. అతడికి భార్య వసీమా, కూతురు ఒమెజా (05) ఉన్నారు. కొంతకాలంగా వసీమా మానసిక పరిస్థితి సక్రమంగా లేదు. ఆమె వింతవింతగా ప్రవర్తించేదని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం బంధువుల ఇంట్లో శుభాకార్యం ఉండడంతో తాజొద్దీన్ తన భార్య పిల్లలను అదే కాలనీలో నివసించే బంధవుల ఇంట్లో వదిలి హైదరాబాద్‌కు వెళ్లాడు. సాయంత్రం వరకు వసీమా తన కూతురుతో కలిసి బంధువుల ఇంట్లోనే ఉంది. సాయంత్రం సమయంలో ఇంటివరకు వెళ్లి వస్తానని చెప్పి కూతురును తీసుకుని బయలుదేరింది. ఇంటికి చేరిన తర్వాత కూతురు ఒమెజా మెడకు చున్నీచుట్టి గొంతు నులిమింది. దీంతో ఆ చిన్నారి చనిపోయింది. అనంతరం ఇంట్లో ఉన్న స్క్రూ డ్రైవర్‌తో కడుపులో పొడిచింది. ఆ తర్వాత ఆమె యాసిడ్ తాగింది. వసీమా ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె బంధువులు ఆందోళన చెంది ఆమె ఇంటికి వచ్చి చూశారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. వసీమా పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. మానసిక పరిస్థితి సరిగా లేకే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని పట్టణ ఎస్‌హెచ్‌వో రామకృష్ణ, ఎస్సై గోవింద్ తెలిపారు. వసీమా స్పృహలోకి వస్తేగానీ ఎందుకు ఇలా చేసిందో తెలిసే పరిస్థితి లేదు. -
అనుమానం.. పెనుభూతం
జీడిమెట్ల: అనుమానం పెనుభూతమై అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాన్ని బలిగొంది.. మరొకరు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. భర్త అనుమానిస్తున్నాడని మనస్తాపానికిలోనైన ఓ మహిళ క్షణికావేశంలో తన కుమార్తె (13నెలలు) గొంతు కోసి హత్య చేయడమే కాకుండా తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.. జీడిమెట్ల సీఐ రమణారెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, తుర్లపాడు మండలం, జగన్నాథపురం గ్రామానికి చెందిన వెన్న నారాయణ రెడ్డి, సుశీల(28) దంపతులు నగరానికి వలసవచ్చి కుత్బుల్లాపూర్, సూరారం డివిజన్లోని హెచ్ఎంటీ సొసైటీలో ఉంటున్నారు. నారాయణరెడ్డి జీడిమెట్ల సబ్‌స్టేషన్ సమీపంలోని శ్రీసాయి మనోజ్ఞ ప్యాబ్రికేషన్ పరిశ్రమలో పనిచేసే వాడు. వారిక ఒక కుమార్తె దీక్ష (13నెలలు). అయితే భార్యపై అనుమానం పెంచుకున్న నారాయణ రెడ్డి తరచూ సుశీల వేధించేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి కూడా ఆమెతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికిలోనైన సుశీల మంగళవారం తెల్లవారు జామున భర్త నిద్రిస్తుండగా బెడ్రూమ్కు బయటి నుంచి గడియపెట్టింది. కుమార్తె దీక్షను బాల్కానీలో ఉన్న బాత్రూమ్లోకి తీసుకెళ్లి కూరగాయల కత్తితో గొంతు కోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో దీక్ష అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి ఏడుపులు విన్న నారాయణ రెడ్డి తలుపులు కొడుతుండటంతో తలుపు తీసిన సుశీల పరుగు పరుగున బాత్రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుని తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వారి అరుపులు విన్న పక్కింటివారు బాత్రూమ్ గడియ తీసి సుశీలను సూరారంలోని నారాయణ మల్లారెడ్డి అస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గాంధీ అస్పత్రికి తరలించారు. సుశీల తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉలిక్కిపడ్డ స్థానికులు.. తెల్లవారు జామున పోలీసులు రావడాన్ని గుర్తించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. 13నెలల చిన్నారిని తల్లి హత్య చేసిందని తెలియడంతో నివ్వెరపోయారు. -
కన్నకూతురిపై అనుమానం పెంచుకుని...
సాక్షి, ముంబై : కట్టుకున్న భర్తకు, కన్నకూతురిపై సంబంధం అంటగట్టిన ఆ తల్లి.. కూతురిని రోజూ వేధించసాగింది. చివరకు విచక్షణ కోల్పోయి కూతురిని పైశాచికంగా హత్య చేసింది. నవీ ముంబైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లో వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్‌కు భార్య, నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు పిల్లలు సొంతూళ్లో నాన్నమ్మ ఇంట్లో ఉంటుండగా.. మరో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులతో ఖర్‌ఘడ్(నవీ ముంబై)లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఆ గృహిణి తన కూతురి(16)పై అనుమానం పెంచుకుంది. తండ్రితో లైంగిక సంబంధం పెట్టుకుంటుందంటూ ఆరోపిస్తూ హింసించసాగింది. ఈ క్రమంలో మార్చి 4న కూతురిని చున్నీతో ఉరేసి హత్య చేసింది. ఆపై కూతురు విగతజీవిగా మారిందంటూ కుటుంబ సభ్యులతో కలిసి రోదించింది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. రాజస్థాన్‌లోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లి బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. చిక్కుముడి వీడిందిలా... ఇక పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమె గొంతు నులమటంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలటంతో పోలీసులు కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని స్కూల్లో విచారణ చేపట్టగా.. బాలిక స్నేహితురాలు ఒకరు పోలీసులకు ఓ విషయం వెల్లడించారు. తండ్రితో సంబంధం అంటగట్టి బాలిక తల్లి హింసించేదని.. విషయం తెలిసి కూడా ఆ తండ్రి మౌనంగా ఉండేవాడని.. చివరకు వేధింపులు తాళలేక ఈ ఫిబ్రవరిలో ఆ బాలిక ఆత్మహత్యా యత్నం కూడా చేసినట్లు స్నేహితురాలు వెల్లడించింది. దీంతో ఈ మధ్యే రాజస్థాన్ నుంచి సదరు మహిళ తిరిగి రాగా.. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించటంతో నిజం వెలుగు చూసింది. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
రికార్డింగ్ డాన్సుకు ఆటంకం కలిగిస్తుందని..
పూటుగా తాగి.. రికార్డు డాన్సులు చేసే.. వారికి అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి అడ్డుగా మారింది. బిడ్డ తరచూ ఏడుస్తూ.. డాన్స్‌కు అంతరాయం కలిగిస్తుండడాన్ని తల్లితో పాటు ఆమె ప్రియుడు జీర్ణించుకోలేక పోయా రు. తాగిన మైకంలో అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. తల్లి సూచనతో ప్రియుడు గొంతునులిమి పైకెత్తగా బిడ్డ ఆటోకమ్మీ తగిలి అక్కడే ప్రాణాలు విడిచింది. మదనపల్లె క్రైం: గత నెల 25న వెలుగులోకి వచ్చిన చిన్నారి హత్యకేసును ఎట్టకేలకూ ఛేదించినట్లు రూరల్ సీఐ మురళీ, ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. స్థానిక రూరల్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం చిన్నారి శివాని(2) హత్యకేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఐరాల మండలం మొరంపల్లెకు చెందిన పి.శాంత(22) నిమ్మనపల్లె మండలం మాసిరెడ్డిగారిపల్లెకు చెందిన బోయకొండను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. వీరికి కృష్ణ(3), శివాని(2) అనే పిల్లలు ఉన్నారు. భర్త ఏడాదిన్నర క్రితం శాంతను వదిలేసి మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో శాంత ఒంటరిగా ఉంటోంది. అప్పటి నుంచి మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన రెడ్డిశేఖర్ రికార్డు డాన్స్ గ్రూపులో పనిచేస్తోంది. అదే గ్రూపులో రికార్డు డాన్స్‌లు వేసే రామసముద్రం గాజులనగర్ కాలనీకి చెందిన ఎస్వీ శ్రీనివాసులు(27)తో శాంత సహజీవనం సాగిస్తోంది. ఇద్దరూ కలిసి శ్రీనివాసులు ఆటోలో పల్లెలు తిరిగి రికార్డులు వేసి వచ్చే ఆదాయంతో బతికేవారు. రోజూ మాదిరిగానే నవంబర్ 22న పుంగనూరు మండలం సుగాలిమిట్టకు రికార్డు డాన్సులు వేసేందుకు వెళ్లారు. అక్కడ పీకల వరకూ మద్యం తాగారు. డాన్సులు వేసే సమయంలో వీరి వెంట ఉన్న చిన్నారి శివాని అనారోగ్యంతో ఏడుస్తోంది. ఇది వారికి అంతరాయంగా మారింది. దీంతో ఆగ్రహించిన తల్లి శాంత.. శివానిని చంపేయాలని ప్రియుడిని ఆదేశించింది. వెంటనే అతను చేతితో గొంతునులిమి పైకి ఎత్తడంతో ఆటో టాప్ కమ్మి తగిలి గాయపడి ప్రాణాలు విడిచింది. ఇంటికి తీసుకెళ్తే స్థానికులు గుర్తించి కొడుతారని చెంబకూరు రోడ్డు మార్గంలో రామసముద్రానికి వెళ్తూ దండువారిపల్లె వంకలో శివాని మృతదేహానికి దుప్పటి చుట్టి మోరీకింద నీటి కాలువలో పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు పత్రికల్లో ‘చిన్నారి హత్యకేసు వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మంగళవారం ఉదయం లాభాల గంగమ్మ గుడి వద్ద అనుమానస్పద స్థితిలో ఆటోలో ఉన్న శాంత, ఆమె ప్రియుడు శ్రీనివాసులను అదుపులోకి తీసుకుని విచారించగా శివాని హత్యకేసు వివరాలు తెలిసినట్లు సీఐ మురళి పేర్కొన్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
మూడేళ్ల కూతురిని చంపి.. దాచిపెట్టిన తల్లి
మూడేళ్ల కూతురిని చంపి.. ఆ విషయాన్ని ఐదేళ్ల పాటు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిందో కన్నతల్లి. ఆలియా లన్స్‌ఫర్డ్ (3) అనే అమ్మాయిని ఆమె తల్లి లీనల్ లన్స్‌ఫర్డ్ స్వయంగా చంపిందన్న విషయాన్ని పోలీసులు ప్రకటించేసరికి అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తలమీద బలమైన వస్తువుతో కొట్టి ఆమెను చంపేసిందని తెలిపారు. ఆమె మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి, తన కూతురు కనిపించడం లేదంటూ 2011 సెప్టెంబర్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి పోలీసులు ఆ చిన్నారి ఎక్కడుందా అని వెతుకుతూనే ఉన్నారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరకు.. కన్నకూతుర్ని చంపిన కేసులో లీనల్ లన్స్ఫర్డ్ను అరెస్టుచేశారు. అయితే, చిన్నారి మృతదేహం మాత్రం ఎక్కడుందన్న విషయం ఇంతవరకు తెలియలేదు. ఇంట్లోనే ఉన్న తన కూతురు కనిపించడం లేదని సెప్టెంబర్ 24న లన్స్‌ఫర్డ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆరు నెలల తర్వాత.. ఎవరో ఇంట్లోకి వచ్చి పిల్లను ఎత్తుకెళ్లిపోయారంటే నమ్మబుద్ధి కావడం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చిన్నారి ఎక్కడుందన్న సమాచారం తెలిపినా, నిందితుల అరెస్టుకు దారితీసే విషయాలు ఏవైనా వెల్లడించినా రూ. 13 లక్షల బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు. వయసు పెరిగేకొద్దీ ఆలియా ఎలా ఉంటుందో అనే ఊహా చిత్రాలను కూడా రూపొందించి.. వాటితో కూడిన పోస్టర్లు అన్నిచోట్లా అతికించారు. అయినా, ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు, ఎవరూ అరెస్టు కాలేదు. చివరకు పోలీసులకు స్టన్నింగ్ వాస్తవం తెలిసింది. కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడిందని వెల్లడించి.. ఆమెను అరెస్టుచేశారు. కూతురిఉ కనిపించడం లేదని ఫిర్యాదు చేసే సమయానికి లన్స్‌ఫర్డ్ గర్భవతి. తర్వాత ఆమెకు కవలలు పుట్టారు. తర్వాత ఆమకు మొత్తం ఆరుగురు పిల్లలుండగా వారిపై మాతృత్వ హక్కులను కూడా ఆమె కోల్పోయింది. తల్లిగా ఉండే అర్హత ఆమెకు లేదని కోర్టు తెలిపింది. -
పరువు కోసం పేగుబంధాన్ని తెంచుకుంది!
ప్రేమలో పడిందని కూతుర్ని కడతేర్చిన తల్లి * విజయవాడలో దారుణం వీరులపాడు: పేగుబంధం విలువ.. నవమాసాలు మోసిన తల్లికి మాత్రమే తెలుస్తుందంటారు. కానీ ఓ కన్నతల్లి పరువు కోసం కూతురి ఉసురు తీసింది. పెళ్లయి ఓ పాప కూడా ఉన్న వ్యక్తి ప్రేమలో పడిందంటూ కుమార్తెను కడతేర్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరుకు చెందిన మైసూర్ జానీకి 20 ఏళ్ల కిందట బీబీజానీతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. విజయవాడ వాంబే కాలనీలో నివాసముంటున్నారు. చిన్న కుమార్తె నజ్మా(16) నగరంలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తోంది. ఆమె వారు నివాసముంటున్న అపార్ట్మెంట్ పైఅంతస్తులో ఉండే దీపక్ అనే వివాహితుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లికి తెలియడంతో నజ్మాను మందలించింది. అయినా వినకపోవడంతో బుధవారం నిద్రపోతున్న కుమార్తెను హతమార్చింది. కాగా, నజ్మా మృతిపై దీపక్ ఫిర్యాదు చేయడంతో విజయవాడ నున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జుజ్జూరులో కూతురి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న తల్లిదండ్రులను విచారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అదేరోజు రాత్రి కుటుంబసభ్యులకు అందజేయడంతో వారు కూతురి అంత్యక్రియలు నిర్వహించారు. చెప్పినా వినలేదని.. బీబీజానీ గురువారం జుజ్జూరులో విలేకరులతో మాట్లాడింది. వివాహితుడైన దీపక్‌తో నజ్మా ప్రేమలో పడిందని తెలిసి మందలించానని చెప్పింది. తన కూతురి జీవితం నాశనం చేయొద్దని దీపక్‌ను వేడుకున్నానంది. కానీ అతను వినకపోగా నజ్మాతో తన పెళ్లి జరిపించాలని, లేకుంటే తామిద్దరం దిగిన ఫొటోలను నెట్లో పెడతానని బెదిరించాడని తెలిపింది. దీంతో బుధవారం మధ్యాహ్నం దీపక్‌తో కలసి ద్విచక్రవాహనంపై వచ్చిన నజ్మాను మరోసారి మందలించగా తనను ఇష్టమొచ్చినట్లు తిట్టిందని చెప్పింది. కుటుంబ పరువు పోతుందన్నా వినలేదనే ఆక్రోశంతో నిద్రపోతున్న కూతురి మొహంపై దిండును అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు చెబుతూ కన్నీటిపర్యంతమైంది. కన్న కూతురిని కడతేర్చినట్లు బీబీ జానీ స్వయంగా ఒప్పుకోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
కన్నకూతురిని హతమార్చిన తల్లి
విజయవాడ: బెజవాడ వాంబే కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లే రక్తం పంచుకు పుట్టిన కూతురిని హతమార్చింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే పేగు బంధాన్ని మర్చిపోయింది. తన కుటుంబం పరువు పోతుందని భావించి... కన్న కూతుర్నే కడతేర్చింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఆగ్రహించిన తల్లి పరువు పోతుందని కూతురి మొహంపై దిండుతో అదిమి హత్య చేసింది. అనంతరం అనారోగ్యంతో చనిపోయినట్లు చుట్టుపక్కలవారిని నమ్మించింది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన బీబీజాన్‌కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని తల్లికి అనుమానం వచ్చింది. దీంతో కుటుంబాన్ని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు మార్చింది. అయినా కూతురు వ్యవహారంలో మార్పు రాలేదు. మళ్లీ మూడు నెలల కిందట విజయవాడలోని వాంబే కాలనీకి వచ్చారు. అక్కడ కూడా కూతురు మాట వినకపోవడంతో బీబీజాన్‌కు కోపం వచ్చింది. దీంతో కూతుర్ని హతమార్చాలని పథకం వేసింది. భర్తను బయటకు పంపి నజ్మా మొహంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం కూతురు కడుపు నొప్పితోనే చనిపోయిందంటూ భర్తకు కట్టుకథ చెప్పింది. స్వస్థలం కంచికచర్లలో అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అయితే చలాకీగా కనిపించిన యువతి ఆకస్మాత్తుగా చనిపోవడంపై ప్రియుడికి అనుమానం వచ్చింది. అతడు సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు. నజ్మా మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపగా, నివేదికలో హత్యగా తేలింది. దీంతో బీబీజాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
రేపు పెళ్లనగా.. కూతుర్ని చంపేసిన తల్లి!
ఒక్క రోజులో పెళ్లి ఉందనగా.. కన్న కూతురి ముఖంపై దిండు పెట్టి తల్లే చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో జరిగింది. మరొక్క రోజులో పెళ్లి ఉండటంతో షాపింగ్ పని మీద బయటకు వెళ్లి వచ్చిన తల్లికి.. తన కూతురు తమ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో అభ్యంతరకరమైన పరిస్థితిలో కనిపించడంతో ఆమె ఆవేశం పట్టలేకపోయింది. అతడు ఎలాగోలా పారిపోగా.. కూతురిని ఏం చేయాలో తెలియక, చివరకు ముఖం మీద దిండు పెట్టి నొక్కి చంపేసింది. తర్వాత కొడుకుని పిలిచి, జరిగిన విషయం అంతా చెప్పింది. ఆ సమయానికి ఇంటి నిండా బోలెడంత మంది చుట్టాలు కూడా ఉన్నారు. వాళ్లతో.. కూతురికి గుండెపోటు వచ్చిందని, దాంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పింది. తన కొడుకుతో కలిసి, కూతురి మృతదేహాన్ని లోక్‌నాయక్ ఆస్పత్రికి తీసుకెళ్లి, అక్కడి వైద్యులకు ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పింది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు బాధితురాలి తల్లిమీద, సోదరుడి మీద కేసు నమోదుచేసి వారిని అరెస్టు చేశారు. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమెకు పెళ్లి కావాల్సి ఉంది. కానీ, ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో ఆమెకు ఎప్పటి నుంచో సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆమె తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు. తర్వాతి నుంచి ఆమె సోదరుడు ఓ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లితో కళకళలాడాల్సిన కుటుంబంలో ఇప్పుడు అనుకోని విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణించగా, తల్లీకొడుకులు జైల్లో ఉన్నారు. -
ఆస్తి కోసం కూతురిని చంపిన తల్లి
ఆస్తిపాస్తుల కోసం తల్లిదండ్రులను గెంటేసే పిల్లలను ఇంతకుముందు చూశాం. కానీ, కన్నతల్లే.. తన పేగు తెంచుకుని పుట్టిన కూతురిని కత్తితో నరికి చంపిన సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ సంఘటన యూసుఫ్‌గూడ లక్ష్మీనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే కళ్యాణి (25)ను ఆమె కన్నతల్లి లక్ష్మి (50) కత్తితో నరికి చంపడమే కాక.. శవం పక్కనే కత్తిపట్టుకుని నిలబడింది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు. అంతా కలిసి లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటారు. తల్లీ కూతుళ్ల మధ్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. వీటి కారణంగా మిగిలిన ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్నింటినీ ధ్వంసం చేసి.. ఆ తర్వాత ఆమె ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.