తల్లీకూతుళ్ల దారుణ హత్య
బషీరాబాద్/యాలాల: తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. దాదా పు ఏడాది తర్వాత విషయం వెలుగుచూసింది. వివాహిత భర్తే దారుణా నికి ఒడిగట్టాడు. శుక్రవారం పోలీసు లు వివాహిత మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించా రు. పోలీసుల కథనం ప్రకారం.. యాలాల మండలం బెన్నూరు గ్రా మానికి చెందిన అమృత(20)ను ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన అబ్దుల్లా ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు అనీసా(16 నెలలు) ఉంది. రెండేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి.
భర్త వేధింపులు భరించలేక అమృత వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో కక్షగట్టిన అబ్దుల్లా దాదాపు ఏడాది క్రితం భార్యకు మాయమాటలు చెప్పి బషీరాబాద్ మండలం నీళ్లపల్లి సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ భార్యను రాయితో మోది హత్య చేశాడు. అనంతరం నీళ్లపల్లి-పర్వత్పల్లి మార్గంలో ఓ గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అనంతరం అబ్దుల్లా కూతురిని కూడా స్వగ్రామంలో చంపేసి పూడ్చివేశాడు. కొద్దికాలానికి ముంబై వెళ్లిపోయాడు. ఇటీవల ఒంటరిగా అబ్దుల్లా గ్రామానికి వచ్చాడు. కూతురు, మనవరాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అమృత తల్లిదండ్రులు యాలాల ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు తాండూరు రూరల్ సీఐ శివశంకర్ అనుమానంతో ఇటీవల అబ్దుల్లాను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు అబ్దుల్లా.
అతడు చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం రూరల్ సీఐతో పాటు బషీరాబాద్, యాలాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తవ్వకాలు జరుపగా అమృత అస్థిపంజరం లభ్యమైంది. పోలీసు లు అక్కడే వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. చిన్నారి మృతదేహాన్ని శనివారం వెలికి తీస్తుండొచ్చని సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది.