Mothkupally
-
‘దళితుడిగా బీజేపీ చర్యలను ఖండిస్తున్నా’
-
తెలుగు తమ్ముళ్ల ‘అధ్యక్ష’ లొల్లి
12న టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నిక బిల్యాను తప్పించాలని ఉమామాధవరెడ్డి వర్గీయుల పట్టు ప్రస్తుత అధ్యక్షుడికి అండగా మోత్కుపల్లి రమేశ్‌రాథోడ్ రూపంలో బిల్యానాయక్‌కు పదవీగండం! తనకే మళ్లీ అధ్యక్ష పదవి దక్కుతుందన్న ధీమాలో బిల్యా అధినేత బాబు నిర్ణయం కోసం ఎదురుచూపులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రూపు తగాదాలు, మాటల తూటాలకు పుట్టినిల్లయిన జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన సారథి ఎవరనే అంశంలో లొల్లి మొదలైంది. ఈనెల 12వ తేదీన జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు బిల్యానాయక్నే పదవిలో కొనసాగిస్తారా? లేక కొత్త నేతను ఎంపిక చేస్తారా అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అయితే, సామాజిక వర్గాల కోటాలో ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్‌ను పదవి నుంచి తప్పిస్తారనే చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాజీ పార్లమెంటు సభ్యుడు రమేశ్‌రాథోడ్‌కు అప్పగించాలని పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారని, అదే జరిగితే రాథోడ్ సామాజిక వర్గానికే చెందిన బిల్యానాయక్‌ను తప్పించవచ్చనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఉమామాధవరెడ్డి వర్గానికి చెందిన కొందరు నేతలు ఆయనను తప్పించాల్సిందేనని అంటుండగా, మోత్కుపల్లి మాత్రం బిల్యానే కొనసాగించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందనేది ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. బిల్యాకు సమాన అవకాశాలు సామాజిక వర్గాల కోటాలో బిల్యానాయక్‌ను పదవి నుంచి తప్పిస్తారనే చర్చ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థాయిలో జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత మళ్లీ నల్లగొండ జిల్లాలో అదే సామాజిక వర్గానికి బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదని పార్టీ నాయకులంటున్నారు. అయితే, జిల్లాలో బలమైన వర్గంగా ఉన్న ఉమామాధవరెడ్డి ఆయనను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా ఆమె ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చకపోయినా, ఆమె వర్గంలో ఉన్న నాయకులు మాత్రం బిల్యాను తప్పించాలని, అవసరమైతే ఎస్టీ సామాజిక వర్గంలోనే మరో వ్యక్తికి ఇవ్వాలి తప్ప బిల్యాకు వద్దని అంటున్నారు. దీనికి మోత్కుపల్లి మాత్రం ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్యాను కొనసాగించాల్సిందేనని ఆయన అధినేత చంద్రబాబు వద్ద స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నేతల కొట్లాట ఏం జరుగుతుందో తేలాల్సి ఉంది. కాగా, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి వర్గాల మధ్య గొడవలు కూడా బిల్యాకు సానుకూలంగా మారుతాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ బిల్యాను తప్పించాలనుకుంటే ఏకగ్రీవంగా మరొకరి పేరు సూచించే పరిస్థితి జిల్లా పార్టీలో లేదు. అది ఎస్టీ సామాజిక వర్గమైనా, మరే ఇతర సామాజిక వర్గమైనా ఒక్క నాయకుడి పేరు మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బిల్యా మాత్రం తనకే మళ్లీ అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు తనను పిలిచి పదవి ఇచ్చారని, ఇప్పుడే అదే జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పోటీకి వెళ్లనని, ఏకగ్రీవంగా ఇస్తేనే పదవిని తీసుకుంటానని ఆయన సన్నిహితుల వద్ద అంటున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల సమావేశాల్లో జాప్యం వాస్తవానికి జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికల నాటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ ఎక్కడా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో 12వ తేదీనాటికే ఈ సమావేశాలన్నీ పూర్తవుతాయా అనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అధ్యక్ష పదవికి 12వ తేదీన ఎన్నిక జరగాలని, జిల్లా మినీ మహానాడు ఈనెల 18న నిర్వహించాలని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గాల సమావేశాలన్నీ పూర్తవుతాయని, 12న జిల్లా పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని జిల్లా టీడీపీ నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. తమ్ముళ్ల తగువులు ఏమవుతాయో? జిల్లాలో తెలుగుదేశం పార్టీ మోత్కుపల్లి నర్సింహులు, ఉమామాధవరెడ్డి గ్రూపులుగా పార్టీ నేతలు విడిపోయారు. గత ఎన్నికలకు ముందు ఇరువర్గాలు ఢీఅంటే ఢీ అనగా, ఎన్నికల అనంతరం మోత్కుపల్లి శిబిరంలో కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్‌తో పాటు ఇతర నేతలంతా ఉమామాధవరెడ్డి పక్షాన చేరారు. సూర్యాపేట నియోజకవర్గ నాయకుడు పటేల్మ్రేశ్రెడ్డి మాత్రం మోత్కుపల్లి వెంటే ఉన్నారు. గత ఎన్నికలలో మోత్కుపల్లి కూడా జిల్లా నుంచి వలస వెళ్లి ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓడిపోయారు. దీంతో పార్టీ నేతలంతా ఆయనపై తిరుగుబాటే ప్రకటించారు. జిల్లాలో కీలకంగా ఉన్న నాయకుడే జిల్లా వదిలి వెళ్లడంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందని, అదే తమ ఓటమికి ప్రధాన కారణమయిందనే భావనలో కొందరు నేతలున్నారు. అసలు జిల్లాతో మోత్కుపల్లికి సంబంధమే లేదనే స్థాయిలో ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంలో గుంభనంగా వ్యవహరించిన మోత్కుపల్లి అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడితో జిల్లా పార్టీలో తన హవాను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్యాను మార్చి వేరే నేతను ఎంపిక చేయాలనుకుంటే ఏ సామాజిక వర్గమైన గొడవలు జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలే అంటున్నారు. ఇప్పటికే వలసలు ఎక్కువయి డీలా పడిపోయిన పార్టీకి త్వరలోనే జరగనున్న జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నిక ఎలాంటి కష్టాలు తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సిందే. -
కేసీఆర్ టీఆర్ఎస్ను రద్దు చేయాలి
టీయూడబ్ల్యూజే ‘మీట్ ది ప్రెస్’లో టీ.టీడీపీ కన్వీనర్ మోత్కుపల్లి శ్రీకాంతచారితల్లికి సీటిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా: ఎర్రబెల్లి హైదరాబాద్: ‘తెలంగాణ వచ్చేదా, సచ్చేదా అనుకున్నడు కేసీఆర్. అందుకె ఎక్కడ మైకు పట్టుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడె, డిప్యూటీ సీఎంగా ముస్లింను చేస్తనన్నడు. తీరా తెలంగాణ వచ్చెటప్పటికి ఇప్పుడు ఊసెత్తుత లేడు. కేసీఆర్ చరిత్రలో నిలిచిపోవాలన్న, ఆదర్శవంతమైన నాయకుడిగా నిలువాలన్న... తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన గద్దర్‌ను, విమలక్కను, జేఏసీ నేతలను, ఉద్యోగ, విద్యార్థి సంఘాలను, రాజకీయ పార్టీలను పిలిచి టీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్టు చెప్పాలె. నేను, నా కొడుకు, కోడలు, అల్లుడు రాజకీయాల్లో ఉండకూడదా అని అడగడం ఏం ఉద్యమం?’ అని తెలంగాణ తెలుగుదేశంపార్టీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్లుగా సజీవంగా ఉందని, రాజకీయ ఉద్యోగం కోసమే కేసీఆర్ ఆ ఉద్యమాన్ని అందుకున్నారని మోత్కుపల్లి దుయ్యబట్టారు. కేసీఆర్ ఉద్యమంలో గానీ, రాజకీయాల్లో గాని నిజాయితీ ఉంటే చెరుకు సుధాకర్ వంటి నాయకుడు ఎందుకు ఆ పార్టీని వీడుతున్నాడని ప్రశ్నించారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని సామాజిక తెలంగాణ నినాదంతో టీడీపీ వెళుతుందని తెలిపారు. ‘‘తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన తొలి వ్యక్తి శ్రీకాంతచారి కుటుంబానికి టిక్కెట్టు ఇవ్వమంటే ఓడిపోయే హుజూర్నగర్ ఇస్తనన్నడు. పాలకుర్తిలో ఇవ్వు. నేను పోటీ చేయ్యకుండ మద్దతిస్త’ అని దయాకర్‌రావు చెప్పారు. చంద్రబాబు బీసీని సీఎం చేస్తానని చెప్పారే తప్ప కృష్ణయ్యను సీఎం చేస్తానని చెప్పలేదన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు రెండు పార్టీలకు అవసరమేనని, పొత్తు వల్ల బీజేపీకి మూడు శాతం ఓట్లు పెరుగుతాయన్నారు. -
మోత్కుపల్లి... పయనమెటు!
టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పయనమెటు..? జిల్లా తెలుగుదేశంలో ఇప్పుడిదో హాట్ టాపిక్. ఆలేరు నుంచి వలసపోయిన ఆయన గత ఎన్నికల్లో తుంగతుర్తిలో పోటీ చేసి గెలిచారు. ఆయనకు ఆ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన ‘సంకినేని’ దూరం కావడంతో.. కేడరూ దూరమైపోయింది. దీంతో తుంగతుర్తి నుంచి సొంత నియోజకవర్గం ఆలేరుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈలోగా కొత్త ప్రచారమూ జరుగుతోంది..!! సాక్షిప్రతినిధి, నల్లగొండ : రాజ్యసభ ఎన్నికల్లో అధినేత చంద్రబాబు చేయి ఇవ్వడంతో జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు పూర్తిగా కామ్ అయ్యారు. వివిధ సమీకరణాల వల్ల తనకు రాజ్యసభ సీటు ఖాయమని భావించిన మోత్కుపల్లి జిల్లా టీడీపీ నేతలెవరితోనూ సత్సంబంధాలు నెరపలేదు. చివరకు రాజ్యసభ ఎన్నికల ముందు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, వేనేపల్లి చందర్రావులతో కనీసం మాట్లాడినట్లు కూడా లేదని చెబుతున్నారు. చివరకు ఆయనకు అవకాశం రాలేదు. ఆయన తరఫున బాబు వద్ద మాట్లాడిన వారూ లేరు. చివరి నిమిషం దాకా ఆశపెట్టుకున్న ఆయనకు బాబు పెద్ద షాకే ఇచ్చారు. దీంతో ఆయన పార్టీ మారుతారని, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని, కాంగ్రెస్ నేత జానారెడ్డితో మంతనాలు కూడా జరిపారని ఇలా.. వివిధ రకాలుగా ప్రచారం జరిగింది. దీంతో కొందరు టీడీపీ నేతలు రంగంలోకి దిగి మోత్కుపల్లిని బుజ్జగించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసి మోత్కుపల్లి టీడీపీలోనే కొనసాగేలా మాట్లాడారని సమాచారం. పార్టీ వర్గాలు చెబుతున్న వివరాల మేరకు మోత్కుపల్లి ఈ సారి తుంగతుర్తి నియోజవర్గం నుంచి పోటీ ఉండరు. ఇక్కడి కేడర్ సంకినేనితో పాటే దాదాపు బయటకు వెళ్లిపోవడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ పరిస్థితుల్లో అక్కడి నుంచి పోటీ చేసి గెలవడం సాధ్యం కాదన్న అభిప్రాయానికే వ చ్చినట్లు చెబుతున్నారు. ఇక సొంత పార్టీ నేతలతో ఏమాత్రం సత్సంబంధాల్లేని ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలతో మాత్రం మంచి సంబంధాలనే కలిగి ఉన్నారని చెబుతున్నారు. తుంగతుర్తి నుంచి బయటకు వచ్చి ఆలేరుకు వెళ్లాలనుకున్నా, జనరల్ స్థానం కావడం ప్రతికూలంగా మారిందంటున్నారు. జిల్లాలోనే మరో ఎస్సీ రిజర్వుడు స్థానమైన నకిరేకల్పైనా ఆయన దృష్టి ఉందని చెబుతున్నారు. నకిరేకల్ టీడీపీ ఇన్చార్జ్ పాల్వాయిరజనీ కుమారి సొంత నియోజకవర్గం తుంగతుర్తి కావడం, ఆమెకు నకిరేకల్ కేడర్‌పై పట్టు చిక్కకపోవడం, ఇక్కడి నాయకలు ఆమెకు సహకరించక పోవడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుని వ్యూహ రచన చేస్తున్నారని తెలుస్తోంది. రజనీకుమారిని తుంగతుర్తికి పంపించి, మోత్కుపల్లి నకిరేకల్ నుంచి బరిలోకి దిగే ఆలోచనాల చేశారన్నది పార్టీ వర్గాల సమాచారం. ఇక, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన ఎన్నికల ఖర్చును తట్టుకునేందుకు మరో కొత్త ఎత్తూ వేశారంటున్నారు. అధినేత చంద్రబాబుకు దగ్గరి నేతగా పేరున్న ఖమ్మం ఎంపీ నాగా నాగేశ్వర్రావు మోత్కుపల్లిని ఖమ్మం జిల్లాకు ఆహ్వానించారని తెలుస్తోంది. మధిర ఎస్సీ రిజర్వుడు స్థానంలో పోటీ చేయాలని, ఎన్నికల ఖర్చులు తాను భరిస్తానని నామా హామీ ఇచ్చారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఖమ్మం జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్రావు దీనికి విముఖంగా ఉన్నాని తెలుస్తోంది. పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్న ఈ ప్రచారాన్ని విశ్లేషిస్తే, మోత్కుపల్లి పయనం ఎటువైపో ఇదమిద్దంగా అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే, తుంగతుర్తిలో పోటీ మాత్రం చేయరన్న ఒక సమాధానం మాత్రం లభిస్తోంది. ఎన్నికల నగరా మోగనున్న తరుణంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. -
టిడిపీలో రాజ్యసభ సీట్ల చిచ్చు