motkupally narasimhulu
-
ట్రాన్స్‌కో సీఎండీని కలిసిన బీజేపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధిక విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ నేతలు ట్రాన్స్ కో సీఎండీ రఘమా రెడ్డిని బుధవారం కలిశారు. వీరిలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు. సీఎండీని కలిసిన అనంతరం మోత్కుపల్లి మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా ప్రజలెవ్వరూ మూడు నెలలుగా బయటకు రాలేదన్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు వేల రూపాయల కరెంట్ బిల్లులు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని కోరారు. కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ మొదట్లో ఒక మాట ఇప్పడు ఒక మాట మాట్లాడుతున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. కరోనా రోగులందరికి ప్రభుత్వమే చికిత్సనందించాలని డిమాండ్ చేశారు. (‘కోవిడ్’ కేసుల్లో చార్జ్‌షీట్స్! ) అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, రావాల్సిన కరెంట్ బిల్లులకంటే రెండు రెట్లు అధికంగా కరెంట్ బిల్లు వచ్చిందన్నారు. కరెంట్ బిల్లులను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సముచితం కాదన్నారు. దీని గురించి ట్రాన్స్‌కో సీఎండీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. (వాహనాలను ఆ మార్గంలో అనుమతించడం లేదు) -
‘నందమూరి’కి జెండా అప్పజెప్పు
సాక్షి,హైదరాబాద్: ‘చంద్రబాబూ..నీ వల్లే తెలంగాణలో టీడీపీ పార్టీ బలైపోయింది. ఆంధ్రాలో పతనమైపోయింది. నీవు ఉన్నంత కాలం పార్టీ బతకదు. ఇక పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ పార్టీని నందమూరి వంశానికి అప్పజెప్పు’ అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయిన సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నివాళులు అర్పించి, పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ ప్రజలందరూ ఎన్నో ఏళ్లుగా చంద్రబాబు అరాచకాలను భరించి చివరకు రాజకీయ సమాధి చేశారన్నారు. వెన్నుపోటుతో పార్టీని లాక్కున్న చంద్రబాబు రాజకీయ పతనాన్ని కోరుతూ.. ఎన్టీఆర్ ఆత్మ ఆంధ్రా ప్రజలందర్నీ ఆవహించి బాబును ఓడించి, జగన్‌ను గెలిపించిందని చెప్పారు. తెలంగాణలో పార్టీ బలైపోవడానికి కారణం చంద్రబాబేనని, ఓటుకు నోటు కేసులో పార్టీ పరువును బజారుకీడ్చి, దొంగలా పట్టుబడి, కేసీఆర్‌కు భయపడి తెలంగాణ నుంచి పారిపోయాడని మండిపడ్డారు. జగన్‌ను గెలిపించిన ఆంధ్ర ప్రజలకు కృతజ్ఞతలని, కనీ వినీ ఎరుగని రీతిలో మెజార్టీ సాధించి ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆయనకు మాల, మాదిగల తరఫున అభినందనలు తెలుపుతున్నానన్నారు. బాబుపై సీబీఐ విచారణ జరపాలని ప్రధానిని కోరతానన్నారు. -
చంద్రబాబు ఓటమిపై మోత్కుపల్లి హర్షం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై ఆ పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మోత్కుపల్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘దుర్మార్గుడి పీడ వదిలినందుకు రేపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తా’ అని అన్నారు. -
మోసగాళ్లకు మారుపేరు చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు ఒకప్పుడు అన్నదమ్ముల్లా ఉండేవారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు అందరి మధ్య చిచ్చు పెట్టిండు. ఐక్యంగా ఉన్న సమాజాన్ని తన స్వార్థపూరిత రాజకీయాల కోసం నిట్టనిలువునా చీల్చివేశాడు. అలాంటి మోసగాడు.. దగాకోరు చంద్రబాబును ఏపీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల వ్యతిరేకి చంద్రబాబును సార్వత్రిక ఎన్నికల్లో ఓడించి.. వైఎస్ జగన్‌కు పట్టంకట్టాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ గెలవొద్దని చంద్రబాబు కుట్ర పన్ని వైఎస్సార్ సీపీ ఓట్లు తీసివేశారని చెప్పారు. మోసగాళ్లకు మారుపేరు చంద్రబాబు అన్న విషయం ఏపీ ఓటర్లు మరువకూడదని సూచించారు. చంద్రబాబు ముఖంలో ఓటమి ఛాయలు కనిపిస్తున్నాయని.. ఆ భయంతోనే జగన్ కుటుంబంపై అవాకులు చెవాకులు పేల్చుతున్నాడని విమర్శించారు. బాబు ఓటమి ఖాయం... ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని.. అదే సందర్భంలో జగన్ సీఎం కావడం తథ్యం అని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. చంద్రబాబుతో పొత్తు వల్లే ఓడిపోయామని టీకాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు తరిమితే ఆంధ్రాలో పడ్డారని... 11న జరిగే ఎన్నికల్లో ఏపీ ప్రజలు తరిమికొడితే ఎక్కడ పడతారోనన్నారు. హరికృష్ణ మృతదేహం ముందు కేటీఆర్‌తో పొత్తుల గురించి చంద్రబాబు ఎందుకు చర్చించినట్లు అని ప్రశ్నించారు. తాను ఏది చేసినా రైటని.. ఇతరులు ఏది చేసినా తప్పన్నది చంద్రబాబు తీరని చెప్పారు. కేసీఆర్ తెలివి గలవాడు కాబట్టి ‘ఓటుకు కోట్లు’దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్ దెబ్బకు పదేళ్ల ఉమ్మడి రాజధాని వదిలి చంద్రబాబు అమరావతి పారిపోయాడన్నారు. టీడీపీ.. బీసీల పార్టీ అంటాడు తప్ప ఆ వర్గాల వారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వరని మండిపడ్డారు. సొంత మామకే వెన్నుపోటు.. సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీ జెండాను దొంగిలించాడన్నారు. వైఎస్ జగన్ సొంత జెండా పెట్టుకొని పార్టీని నిలుపుకొని అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడని, 40 ఇయర్స్ ఇండస్ట్రీకి నిద్ర లేకుండా చేస్తున్నాడని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని 20 ఏళ్లుగా మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారన్నారు. మాదిగలను తన స్వార్థం కోసం వాడుకొన్నారని, కాపులను సైతం వంచిస్తున్నారని పేర్కొన్నారు. బలహీన వర్గాల వారిని జడ్జీలుగా హైకోర్టు రికమండ్ చేస్తే వారికి ఇవ్వకూడదని కేంద్రానికి లేఖ రాశాడన్నారు. నాలుగేళ్లపాటు ప్రధాని మోదీతో కలసి సహజీవనం చేసిన చంద్రబాబు కాపు రిజర్వేషన్లు ఎందుకు సాధించలేక పోయారని నిలదీశారు. వైఎస్సార్ కుటుంబం ఎప్పుడు ప్రజాసేవలో ఉండే కుటుంబం అని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ వైఎస్సార్ ప్రాణాలు వదిలారన్నారు. మాట తప్పనిదిగా వైఎస్సార్ కుటుంబం ప్రజల్లో ముద్ర వేసుకుంటే... ప్రజలను వంచించే కుటుంబంగా నారా వారి కుటుంబం ముద్ర వేసుకొందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు బాబు ఎంతటి మోసానికైనా పాల్పడతాడని ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని... వైఎస్ జగన్‌ని గెలిపించాలని దళిత నేతగా ఏపీ ఓటర్లకు పిలుపునిస్తున్నానని మోత్కుపల్లి వివరించారు. -
చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు
-
వెన్నుపోటుదారు చంద్రబాబు: మోత్కుపల్లి
సాక్షి, యాదాద్రి: ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తనను నమ్మించి బజారున పడేశారని మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన ‘మోత్కుపల్లి శంఖారావ’బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు తనను మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్లే తెలంగాణలో టీడీపీ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడంకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని అడిగితే ఇవ్వలేదన్నారు. టీడీపీ ఆగమైందని, ఓటుకు నోటుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు ఆలోచన చేశారన్నారు. -
హాట్ టాపిక్‌గా మారిన ముద్రగడ,మోత్కుపల్లి భేటీ
-
'కేసీఆర్ ముఖ్యమంత్రా లేక రౌడీనా?'
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రా లేక రౌడీనా అంటూ ధ్వజమెత్తారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. రాజీనామా చేయకుండా పార్టీలు మారే వారికి టీఆర్ఎస్ కండువాలు ఎలా కప్పుతారని నిలదీశారు. దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిచిపించుకోవాలని కేసీఆర్ కుమోత్కుపల్లి సవాల్ విసిరారు.