
సాక్షి, యాదాద్రి: ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తనను నమ్మించి బజారున పడేశారని మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన ‘మోత్కుపల్లి శంఖారావ’బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
చంద్రబాబు తనను మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్లే తెలంగాణలో టీడీపీ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడంకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని అడిగితే ఇవ్వలేదన్నారు. టీడీపీ ఆగమైందని, ఓటుకు నోటుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు ఆలోచన చేశారన్నారు.