Mowgli
-
రోషన్ కనకాల మోగ్లీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న సాక్షి మడోల్కర్ (ఫొటోలు)
-
ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో
జాతి వివక్షత, కుల వివక్ష.. పేద, ధనిక వంటి కారణంగా చాలామంది నిరాదరణకు గురవ్వడం చూసి ఉంటాం. కానీ రూపం కారణంగా నిరాదరణకు గురై దూరంగా అడవిలో జీవించాల్సి రావడం అంటే అది అత్యంత అమానుషమే. రువాండాకు చెందిన ఒక వ్యక్తి అసాధారణ రూపం కారణంగా నిరాదరణకు గురైనప్పటిక ఒక చానల్ సాయంతో మళ్లీ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. అతనెవరో ఏంటో చూద్దాం రండి. (చదవండి: లక్కీ హ్యండ్! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!) రువాండాకు చెందిన జాంజిమాన్ ఎల్లీని రియల్ లైఫ్‌లో మోగ్లీగా పిలిచేవారు. కారణం అతని రూపం. అయితే ఈ 22 ఏళ్ల జాంజిమాన్ ఎల్లీ మైక్రోసెఫాలీ అనే రుగ్మతతో బాధపడుతున్నాడు (శిశువు తల ఊహించిన దాని కంటే చాలా చిన్నదిగా ఉంటుంది). ఈ వ్యాధి అతన్ని ప్రజలకు దూరంగా అడవిలో నివశించేలా చేసింది. ఈ రూపం కారణంగా కర్కశత్వానికి, నిరాదరణకు గురయ్యాడు. దీనికి తోడు అతనికి వినికిడి, మాట్లాడలేని సమస్యలు కూడా ఉన్నాయి. పైగా ఎల్లీ తల్లికి అతను పుట్టక ముందే ఐదుగురు పిల్లలను కోల్పయింది. ఆమె దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేయగా ఎల్లీ పుట్టాడు. అంతేకాదు ఈ ఒంటరి తల్లి ఎల్లిని పెంచలేక అడవికి వెళ్లి గడ్డి తినమని బలవంతం చేస్తుండేది. అయితే అఫ్రిమాక్స్ అనే ప్రాంతీయ టీవి చానల్ గో ఫండ్ అనే వెబ్సైట్ ద్వారా ప్రజలకు అతనికి మనమందరం సాయం చేద్దాం అంటూ ప్రచారం చేసింది. దీంతో ఇప్పుడూ ఎల్లీ రువాండాలోని గిసేనీలోని ఉబుమ్వే కమ్యూనిటీ సెంటర్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలో చేరాడు. పైగా అతని స్కూల్ యూనిఫాం అయిన కస్టమ్ మేడ్ సూట్ ధరించి కెమెరాకు ఫోజులిస్తున్నాడు. ఈ మేరకు ఎల్లి తల్లి మాట్లాడుతూ..."ఒకప్పుడూ నా కొడుకుని చూసి అందరూ ఎగతాళి చేసేవారు. ఇప్పుడూ మా జీవితాలు మారాయి. నా కొడుకు ఆనందంగా స్కూల్‌కి వెళ్తున్నాడు. మాకు ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు. నా బాధలన్నింటిన మీరు ఒక్క నిమిషంలో దూరం చేశారు" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయిలే ఎల్లి సూట్ ధరించి నవ్వుతూ ఫోజులిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు మనం అందరూ కృషి చేస్తే ఇలాంటి వాళ్ల ఎందరికో సాయం చేయగలం అంటూ రకరకలుగా ట్వీట్ చేశారు. (చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా!) The story of Zanziman Ellie Mowgli transformation is inspirational, Everyone this a happy life, We can all work to eliminate stigmatization in our respective societies. pic.twitter.com/bQhwIm02Tf — Sam Wamalwa🇰🇪 (@samsmoothke) October 28, 2021 -
వనమంత మానవత్వం
‘మన మధ్యే పెరగినా వాడికీ జీవితం ఉండాలి. మనుషుల మధ్య జీవించాలి’ అని అడవిలోని జంతువులన్నీ అనుకున్నాయి.‘మీలోనే మనుషులు కనపడుతున్నారు. నాకు మీరే జీవితం’ అని అడవిలోనే ఉండిపోయాడు మోగ్లీ.వనమంత మానవత్వాన్ని మన కళ్లకు కట్టింది ‘ది జంగిల్ బుక్’. మీరు 90ల కాలం నాటి పిల్లలా? అయితే, జంగల్ బుక్ అని పేరు వినగానే మీ చెవుల్లో ఓ పాట సందడి చేస్తుండాలి. ‘జంగిల్ జంగిల్ బాత్ చలీ హై పతా చలా హై... అరె చడ్డీ పెహన్‌కే ఫూల్ కిలాహై..’ అంటూ ఓ కుర్రాడు అటవీ జంతువులతో కలిసి చేసే విన్యాసాలూ కళ్ల ముందు మెదులుతూ ఉండాలి. ఆ విన్యాసాలను అప్పటి పిల్లలందరూ కళ్లప్పగించి చూశారు. ఇప్పటికీ కిడ్స్ చానెల్స్‌లో నాటి జంగిల్‌బుక్ వీరుడు మోగ్లీ అల్లరి చేస్తూనే ఉన్నాడు. 90 ల కాలంలో దూరదర్శన్‌లో ఏడాది పాటు వచ్చిన ఈ సీరియల్ అప్పటి పిల్లలకు ఓ మంచి ఫ్రెండ్ అయ్యింది. వన్యమృగాలున్న అడవిలో ఒంటరిగా ఒక పిల్లవాడు, ఆ పిల్లవాడు అక్కడి జంతువుల్లో ఒకడిగా పెరగడం.. అబ్బురంగా చూశారు. ఆ అటవీ ప్రపంచంలో తామూ తిరిగారు. వన్యప్రాణులతో దోస్తీ కట్టారు. ఆటలు ఆడారు. పాటలు పాడారు. నాటి–నేటి పిల్లల ప్రియనేస్తం మోగ్లీని మరో మారు పరిచయం చేసుకుందాం. మొట్టమొదటి యానిమేషన్ సీరియల్ అప్పట్లో పిల్లల కోసం ప్రత్యేక ఛానళ్లేవీ లేవు. పిల్లల కోసం ప్రత్యేకించి ప్రోగ్రాములూ లేవు. అప్పుడొచ్చింది జంగిల్‌బుక్. దూరదర్శన్‌లో సోప్ సీరియల్స్ స్టార్ట్ అయిన తొమ్మిదేళ్లకు ఎంటర్ అయ్యింది ఈ యానిమేషన్ సీరియల్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు పిల్లలతో పాటు పెద్దలనూ తన ముందు కూచోబెట్టింది. మూలం రడ్ యార్డ్ ఆంగ్ల రచయిత్ రడ్ యార్డ్ కిప్లింగ్ జంగిల్‌బుక్ సృష్టికర్త. రడ్యార్డ్ ఇండియాలో పుట్టి, ఇంగ్లండ్‌లో పెరిగిన వ్యక్తి. 1894లో ‘ది జంగిల్ బుక్’ రాశాడు. ఈ పుస్తకం ఆధారంగా మోగ్లీ స్టోరీస్‌ను వాల్ట్ yì స్నీ అంతర్జాతీయంగా అన్ని దేశాలకూ పరిచయం చేసింది. 1989లో జపాన్‌లో మొదటిసారి వచ్చిన ఈ యానిమేషన్ సీరియల్ అదే సంవత్సరం హిందీ డబ్బింగ్‌తో మన దేశంలో ప్రసారమై ఎంతగానో ప్రాచుర్యం పొందింది. 52 ఎపిసోడ్లతో ఏడాది పాటు పెద్దలనూ, పిల్లలను అలరించింది ఈ సీరియల్. మోగ్లీ అనే పిల్లవాడి కథ చాలా చిన్నగా ఉన్నప్పుడు తల్లితండ్రి నుంచి తప్పిపోయి దట్టమైన అడవికి చేరుకుంటాడు మోగ్లీ. ఒకచోట పడి ఉన్న మోగ్లీని బగీరా అనే నల్ల పులి కనిపెడుతుంది. మోగ్లీని అకెలా, అలెగ్జాండర్ అనే తోడేళ్ల దగ్గరికి తీసుకెళ్తుంది బగీరా. అకేలాకి చిన్న చిన్నపిల్లలు ఉంటారు. తన పిల్లలతో పాటు మోగ్లీని కూడా పెంచుతుంటుంది. రోజూ తోడేలు పిల్లలతో ఆడుకుంటూ పెరుగుతుంటాడు మోగ్లీ. బగీరా అనే నల్ల పులి, బాలూ అనే ఎలుగుబంటి, కా అనే పైథాన్..లు మోగ్లీ స్నేహితులు. జంతువులతో ఆడుకుంటూ, జంతువుల మధ్య ఉండటంతో త్వరగానే అడవి జీవులతో కలిసిపోతాడు మోగ్లీ. ‘కా’ టీచర్‌గా మోగ్లీకి కొండలు, చెట్లు ఎక్కడం, ఊడలు పట్టుకొని ఊగడం.. వంటి ఎన్నో విషయాల్లో తర్ఫీదు ఇస్తుంది. ఒక రోజు అర్ధరాత్రి అడవిలోని జంతువులన్నీ గాఢనిద్రలోకి జారుకుంటాయి. రాత్రిపూట మనుషుల్ని తినే షేర్‌ఖాన్ అనే పులి అడవిలోకి చొరపడుతుంది. ముందుగానే పసిగట్టిన బగీరా మోగ్లీ గురించి ఆలోచిస్తుంది. అడవిలో ఉంచడం మంచిది కాదని, మనుషులున్న చోటుకు చేర్చాలని మోగ్లీని తీసుకొని బయల్దేరుతుంది. మోగ్లీని తినాలనే ప్రయత్నం చేస్తున్న షేర్‌ఖాన్ నుంచి బగీరా కాపాడుతుంది. ఒకానొక సమయంలో మోగ్లీకి అడవిలో గుర్తింపు సమస్య ఎదురవుతుంది. విలన్లయిన జంతువుల నుంచి ప్రమాదం ఉంటుందని, మనుషులు ఉన్న చోటుకి చేరుస్తామని మోగ్లీ స్నేహితులు చెబుతారు. ఎవరు ఎంత నచ్చజెప్పినా అడవిలోనే ఉంటానంటాడు మోగ్లీ. అడవి జంతువులతోనే జీవిస్తుంటాడు. ఆ తరం నుంచి ఈ తరం వరకు, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది ది జంగిల్‌బుక్. మోగ్లీ వయసు సుమారు 6 నుంచి 10 ఏళ్ల మధ్యన ఉంటుంది. అడవిలో ఎన్నో సాహసవిన్యాసాలు చేస్తుంటాడు. మోగ్లీ పనులు ఒక్కోసారి ఆలోచించేలా, మరోసారి నవ్వు తెప్పించేలా ఉంటాయి. జంతువుల పట్ల ప్రేమగా ఉంటాడు. ఇవన్నీ ఆ వయసు పిల్లలను బాగా కట్టిపడేశాయి. పెద్దలను కూడా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. కల్మషం లేని ప్రేమకు ముగ్దులవనిది ఎవరు. ఒక్క మన దేశంలోనే కాదు, ‘ది జంగిల్ బుక్’ ప్రపంచ దేశాల్లోని పిల్లలందరికీ పరిచయమే. -
‘మోగ్లీ’ ట్రైలర్ విడుదల
-
జంగిల్ బుక్ కథతో మరో సినిమా
జంగిల్ బుక్ సినిమా ఇండియన్ స్క్రీన్‌పై సృష్టించిన ప్రభంజనం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం ఇండియాలోనే 250 కోట్ల వరుకు వసూళ్లు సాధించి సత్తా చాటింది ఈ సినిమా. గ్రాఫిక్స్, జంతువులు, చిన్న పిల్లాడు చేసే విన్యాసాలు ఈ సినిమా పట్ల ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమా మల్టిప్లెక్స్‌లో భారీ కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం జంగిల్‌బుక్ తరహాలోనే ‘మోగ్లీ’ సినిమా రాబోతోంది. టార్జన్ కాన్సెప్ట్‌తో ఇది వరకే ఎన్నో సినిమాలు వచ్చాయి. అడివినే ప్రపంచంగా బతికే బాలుడు జన సంచారంలోకి వస్తే ఏవిధమైన కష్టాలు పడాల్సి వస్తుంది. అరణ్యంలో జంతువులతో ఏర్పడే ప్రేమానురాగాలు, వీటన్నింటికి తోడు మరో అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లే గ్రాఫిక్స్ మాయాజాలంతో మన ముందుకు రాబోతోంది ‘మోగ్లీ’. వార్నర్ బ్రదర్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఆండీ సెర్కిస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోహణ్ చంద్ మోగ్లీగా నటిస్తుండగా జంతువుల పాత్రలకు క్రిస్టీన్ బాలే, కేట్ బ్లాంచెట్, నోమీ హేరిస్లు గాత్రధానం చేస్తున్నారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేం ఫ్రిదా పింటో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జంగిల్ బుక్ ఆధారంగా తెరకెక్కించినా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మరింత సీరియస్‌గా ఉండనుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు. -
మోగ్లీ గర్ల్ మచ్చికవుతోంది
జంగిల్ బుక్ ఎంత పాపులరో అందరికీ తెలుసు కదా! ఆ పుస్తకాన్ని, సినిమాను చదివి ఎంజాయ్ చెయ్యని చిన్నారులే కాదు, పెద్దలు కూడా ఉండరేమో బహుశా! అచ్చం ఆ పుస్తకంలోని మోగ్లీ బాయ్ క్యారక్టర్ లాగే ఇటీవలే కోతులతో ఆడుకుంటూ పోలీసుల కంట పడింది ఓ మోగ్లీ గర్ల్. దాదాపు ఏడెనిమిదేళ్ల వయసున్న ఆ బాలిక కోతుల గుంపుతో కలిసి జీవిస్తూ, వాటిలాగే ఆహారం తీసుకుంటూ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిన్ అడవిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఎస్సై సురేష్ యాదవ్ రెండు నెలల క్రితం మోతీపూర్ పరిధిలోని కర్ణిఘట్ అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో ఆ పాప కోతుల గుంపులో తాను కూడా కలిసిపోయి, వాటితో ఎంతో సహజంగా ఆడుకుంటూ కనిపించింది. సురేష్‌కుమార్‌కు ఆ పాపను ఎలాగైనా రక్షించాలనిపించింది. అతికష్టం మీద ఆ కోతుల గుంపును అక్కడినుంచి చెదరగొట్టి, ఆ పాపను వాటినుంచి వేరు చేసి జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. రెండునెలలుగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఈ కోతిపిల్లను మామూలు మనిషిగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో కొంత మేరకు సక్సెస్ అయ్యారు. దాంతో పత్రికలకు ఓ వారం క్రితమే ఈ పాపకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. అచ్చం జంగిల్ బుక్ స్టోరీలోని మోగ్లీ అనే కుర్రాడితో పోలి ఉన్నందువల్ల ఆసుపత్రిలోని వారు ఈ పాపను ముద్దుగా మోగ్లీ గర్ల్ అని పిలుస్తూ, ఎంతో ఓపిగ్గా చికిత్స చేస్తున్నారు. చేతులతో కాకుండా నేరుగా నోటితో ఆహారం తీసుకోవడం, జంతువులానే నాలుగు కాళ్లతో నడవడం, తనకు కొంతకాలంగా అలవాటయిన వాళ్లు గాక కొత్తవాళ్లెవరయినా కంటపడితే చాలు బెదిరిపోయి, మంచం కింద దాక్కోవడం, ఎక్కడ ఉంటే అక్కడే మలమూత్ర విసర్జన చేయడం, కోతుల్లాగే పళ్లికిలించడం, తనకు నచ్చిన వస్తువులేమైనా ఎదుటి వారి చేతిలో కనిపిస్తే గభాల్న లాగేసుకోవడం వంటి కోతి చేష్టలను మాత్రం ఈ పాప ఇంకా మానుకోలేకపోతోంది. ఇప్పుడిప్పుడే నిల» డేందుకు ప్రయత్నం చేస్తోంది. అసలు ఈ పాప ఎక్కడినుంచి అడవిలోకి వచ్చింది, తప్పిపోయిందా లేక ముందరే లోపాలతో ఉన్న పాపను ఎలాగైనా వదిలించుకోవాలని తల్లిదండ్రులే ఆమెను సమీపంలోని అడవిలో కావాలనే వదిలిపెట్టారా... వంటి సమాధానాలు లేని సందేహాలు అందరి బుర్రలనూ తొలిచేస్తున్నాయి. కాగా, ఎంతోకాలంగా తమతో కలిసి ఉన్న తమ నేస్తాన్ని చూసేందుకు, ఆమెతో ఆటలాడుకునేందుకు మర్కట నేస్తాలు ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో తచ్చాడుతున్నాయట. పాపం! చుట్టుపక్కల ఉన్నవారెవరైనా కనిపించకపోతేనో, ఉన్నట్టుండి మాయం అయిపోతేనో మనలా వదిలేసి ఊరుకోవవి, వాటి ప్రేమ స్వచ్ఛమైనది మరి! -
త్వరలో... జంగిల్‌బుక్-2
అమెరికాలో రిలీజ్ కాక ముందే సంచలనం మన దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు నాట ఇప్పుడు జనమంతా చెప్పుకుంటున్న సినిమా - ‘ది జంగిల్ బుక్’. అమెరికాలో ఈ 15న రిలీజ్ కానున్న ఈ హాలీవుడ్ చిత్రం ఇక్కడ మాత్రం అంత కన్నా ఒక వారం ముందే మొన్న ఉగాది నాడు రిలీజైంది. 1967లో వాల్ట్‌డిస్నీ సంస్థ నుంచి కార్టూన్ యానిమేషన్ చిత్రంగా వచ్చి, బుల్లి, వెండితెరలపై ఆకట్టుకున్న ఈ కథ ఇప్పుడు అధునాతన లైవ్ యాక్షన్ -యానిమేషన్ (కంప్యూటర్ గ్రాఫిక్స్ హైబ్రిడ్) రూపంలో పిల్లల్నీ, వారితో పాటు పెద్దల్నీ ఆకర్షిస్తోంది. ఇంగ్లీష్‌లోని ఈ హాలీవుడ్ చిత్రం తాలూకు హిందీ, తెలుగు, తమిళ తదితర భారతీయ భాషా డబ్బింగ్‌లకు భారతీయ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. మన దేశంలో దాదాపు 1700 థియేటర్లలోవిడుదలైన ఈ చిత్రం ఇప్పుడు వసూళ్ళలో పెను సంచలనం. ఇప్పటికే రికార్డ్ కలెక్షన్స్! అమెరికాలో ఈ వారం రిలీజ్! చాలా ఏళ్ళ క్రితం రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన నవల - ‘ది జంగిల్ బుక్’. అడవిలోని పసిబాలుడు మోగ్లీని తోడేళ్ళు పెంచడం, ఎలుగుబంటి, కొండ చిలువ లాంటి రకరకాల అడవి జంతువులతో అతని స్నేహం మధ్య ఈ కథ తిరుగుతుంది. భారతీయ సంతతికి చెందిన నీల్‌సేథీ ఈ సినిమాలో మోగ్లీ పాత్ర పోషించగా, హైదరాబాద్‌కు చెందిన ఏడోతరగతి కుర్రాడు పదేళ్ళ సంకల్ప్ ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. నిజానికి, పెద్ద నగరాల్లో ఇంగ్లీషే తప్ప ఈ ప్రాంతీయ భాషా వెర్షన్ల ప్రదర్శనలు తక్కువగా వేస్తున్నారు. దాంతో, ఉన్న ఒకటీ, అరా థియేటర్లలో రోజుకు ఒకటి, రెండు ఆటలతో టికెట్లు దొరక్క జనం అసంతృప్తితో వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అయితేనేం, త్రీడీలోనూ రిలీజైన ఈ సినిమాకు ఒక్క మన దేశంలో తొలి రోజే సుమారు రూ.10.09 కోట్ల వసూళ్ళు వచ్చాయి. రెండో రోజున వసూళ్ళ స్థాయి ఇంకా పెరిగి, రూ.13.5 కోట్లు వచ్చాయి. మూడో రోజు రూ. 16.6 కోట్లు వసూళ్ళయ్యాయి. అన్నీ కలిపి, రిలీజైన తొలి వారాంతానికే రూ. 40 కోట్ల పైగా ఆర్జించింది. గత ఏడాది రిలీజైన హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ అప్పట్లో తొలి మూడు రోజులకే రూ. 48 కోట్లు వసూలు చేసింది. దాని తరువాత మన దేశంలో తొలి మూడు రోజులకే ఇంత భారీ వసూళ్ళు సాధించిన రెండో హాలీవుడ్ చిత్రం -‘ది జంగిల్ బుక్’! ఈ ఊపులో తొలివారంలోనే థియేటర్లలో రూ. 50 కోట్ల మార్కు దాటేయనుంది. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా మన దేశంలో అతి పెద్ద బాక్సాఫీస్ హిట్ ఇదే! స్కూల్ పిల్లలకు సెలవులు కూడా వచ్చేస్తుండడంతో, ఈ సినిమా కొద్దిరోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కు సునాయాసంగా దాటేస్తుందని మార్కెట్ వర్గాల కథనం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు రెంటిలోనూ కలిపి ఇప్పటికే ఈ చిత్రం 3.17 కోట్ల డాలర్లు (మన లెక్కలో రూ. 200 కోట్ల పైగా) వసూలు చేసి, సంచలనం రేపుతోంది. వార్నర్ బ్రదర్స్ పోటీ ‘జంగిల్ బుక్’ వాయిదా! నిజానికి, డిస్నీ సంస్థతో పాటు వార్నర్ బ్రదర్స్ సంస్థ కూడా ఇదే ‘జంగిల్ బుక్’ కథతో ఒక సినిమా చేసే పనిలో ఉంది. మోషన్ క్యాప్చర్ విధానంలో ఆండీ సెర్కిస్ దర్శకత్వంలో ‘జంగిల్ బుక్ - ఆరిజిన్స్’ పేరిట తీయాలనుకున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 6కు రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, తాజాగా దాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేశారు. 2018 అక్టోబర్ 19కి రిలీజ్ చేసేలా, నిర్మించాలని భావిస్తున్నారు. దాంతో, వాల్ట్‌డిస్నీ, వార్నర్ బ్రదర్స్ స్టూడియోల మధ్య పోటీలో ఒక రకంగా డిస్నీ సంస్థది ఇప్పుడు పైచేయి అయింది. రెండో పార్ట్‌కీ అదే టీమ్ మొత్తానికి, గతంలో తీసిన ‘అలైస్ ఇన్ వండర్ల్యాండ్’, ‘మ్యాలెఫిషెంట్’, ‘సిండెరెల్లా’ల ఫక్కీలో ఇప్పుడీ ‘ది జంగిల్ బుక్’ కూడా భారీ హిట్టవడంతో డిస్నీ సంస్థ ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఇంకా రిలీజైనా కాక ముందే వాల్ట్‌డిస్నీ సంస్థ ‘ది జంగిల్ బుక్’ చిత్రానికి సీక్వెల్ తీయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ తొలి భాగానికి దర్శకత్వం వహించిన ‘ఐరన్‌మ్యాన్’ చిత్ర ఫేమ్ జాన్ ఫావ్రీవ్ సారథ్యంలోనే ఈ రెండో భాగాన్ని కూడా రూపొందించనున్నారు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన అసలు కథను ఆధారంగా చేసుకొని ‘టాప్‌గన్2’ చిత్ర స్క్రీన్‌ప్లే రచయిత జస్టిన్ మార్క్స్ తాజా ‘జంగిల్ బుక్’కు సినీ రచన చేశారు. ఇప్పుడు త్వరలోనే నిర్మించాలనుకుంటున్న రెండోభాగానికి సైతం రచన చేయాల్సిందిగా ఆయనతో ప్రస్తుతం సంప్రతింపులు జరుగుతున్నాయి. నిజానికి, డిస్నీటూన్ స్టూడియోస్ సంస్థ గతంలో 2003లోనే ‘జంగిల్ బుక్-2’ అంటూ యానిమేషన్ చిత్రం తీసి, నేరుగా డి.వి.డి. విడుదల చేసింది. అయితే, ఇప్పుడు తీసిన సరికొత్త లైవ్ యాక్షన్ చిత్రం సీక్వెల్ కోసం ఆ యానిమేషన్ కథను వాడకపోవచ్చు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ‘జంగిల్ బుక్’ కథలు, నవలల నుంచి బోలెడన్ని అంశాల్ని తవ్వితీసి, స్క్రిప్ట్ తయారు చేసే అవకాశం ఉంది. ‘అవతార్’తో పోలుస్తున్న విమర్శకులు అత్యధిక శాతం ఫోటో రియలిస్టిక్ సి.జి.లతో తయారైన ఈ ‘ది జంగిల్ బుక్’ పార్ట్1 సినిమాను లాస్ ఏంజెల్స్‌లో తీశారు. నీల్ సేథీ నటించిన మోగ్లీ పాత్ర మినహా మిగతా జంతువుల పాత్రలు, వాటి హావభావాలన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సృష్టించిన వర్కే! ఈ 3డి యానిమేషన్ చూసిన విమర్శకులు అదిరిపోయి, దీన్ని ‘అవతార్’ సినిమా తాలూకు సి.జి. వర్క్స్‌తో పోలుస్తున్నారు. అయితే, షేర్‌ఖాన్, బాలూ, బఘీరా లాంటి జంతువుల పాత్రలన్నిటికీ ప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు తమ గాత్రంతో ప్రాణం పోసి, కథాకథనంలోని భావోద్వేగాల్ని ప్రేక్షకులు అనుభవించేలా చేశారు. మొత్తానికి, ఒక హాలీవుడ్ సినిమా హాలీవుడ్లో రిలీజ్ కాకుండానే ఇన్ని కోట్ల వసూళ్ళు, ఇంత భారీ జనాదరణ పొందడం, అప్పుడే సీక్వెల్ ఆలోచనతో సిద్ధం కావడం విశేషమే కదూ! -
మౌగ్లీ ఎక్కడి అమ్మాయి?
మన ఊళ్లోనే పెరుగుతూ... తప్పిపోయి అడవుల్లో తిరుగాడుతున్నట్లు అనిపించే అమ్మాయి మౌగ్లీ. నిజానికి ఈ పాత్ర రూపొందింది అమెరికాలో. రడ్యార్డ్ కిప్లింగ్ పిల్లల కథలు రాసేవారు. ఆయన ‘జంగిల్‌బుక్’ పేరుతో సంకలనాలు విడుదల చేశారు. ఆ జంగిల్‌బుక్ కథల కోసం సృష్టించిన పాత్ర మౌగ్లి. ఈ పాత్ర ఆధారంగా టెలివిజన్‌లో అనేక కామిక్ స్టోరీలు వస్తున్నాయి. అడవిలో జంతువులతో కలిసి మౌగ్లీ చేసే సాహసాలు చూసి తీరాల్సిందే. వీటిని తెలుగులోకి అనువదించి కూడా ప్రసారం చేశారు. -
షాయరీ షహర్
గుల్జార్.. అక్షరానికి ఆత్మబంధువు! కవిత్వం ఆయన కలానికి క్లోజ్‌ఫ్రెండ్! మధ్యలో మనసు కొన్నాళ్లు సినిమాలెన్స్ను పెట్టుకున్నా రచనావ్యాసంగం దారిమళ్లలేదు!. రొమాంటిక్ కవితలను రాసి యువతను ఆకట్టుకున్నా చిన్నపిల్లలనెప్పుడూ చిన్నబుచ్చలేదు!. మోగ్లీతో మురిపించారు! ఇప్పటికీ వాళ్లకు ఆత్మీయ రచయితే! ఉర్దూ యూనివర్సిటీకి అతిథిగా.. హైదరాబాద్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను అందుకోవడానికి నగరానికి వచ్చిన గుల్జార్ చెప్పిన సంగతులు కొన్ని.... హైదరాబాద్‌తో నా అనుబంధం ఈనాటిది కాదు. నేను ఉర్దూ నేర్చుకుంటున్నప్పటిది. ఎన్నిసార్లు వచ్చానో ఈ నగరానికి. ఇది కులీ కుతుబ్‌షాహీల నగరమైనా నేను మాత్రం కవిత్వానికి చిరునామాగా చూస్తాను. నా దృష్టిలో హైదరాబాద్ ప్రాముఖ్యాన్ని పెంచేది ఇక్కడి ఉర్దూ భాషే! ఆ ప్రేమతో ఎన్నో సార్లు ఈ ఊరికొచ్చాను. చిన్నపిల్లల సాహిత్యమంటే ఉన్న అభిమానంతో చిల్డ్రన్ ఫెస్టివల్ కోసమూ కొంత పనిచేశాను. జయాబచ్చన్ హయాంలో చిన్న పిల్లల సినిమా పండగకు ఓ శాశ్వత వేదికను ఏర్పాటు చేయాలనుకున్నాం. అది హైదరాబాద్ అయితే బాగుంటుందని ఈ ఊరునే ఖాయం చేశాం. అలా కిందటేడు ఈ సినిమా పండుగకు హైదరాబాద్ వచ్చాను. ఈ ఊరుతో నాకున్న అటాచ్మెంట్ అలాంటిది. నడిపించే శక్తి.. ప్రతి కళాకారుడికి, రచయితకు ముఖ్యంగా నాలాంటి వాడికి ప్రశంసల అవసరం ఉంటుంది. ఎందుకంటే మేంవెళ్తున్న దారి సరైనదేననే మా నమ్మకాన్ని మరింత బలపర్చడానికి. ఈ తరానికి నా దరఖాస్తు ఒక్కటే.. మీరు కొత్త కొమ్మలు. కొత్త ఆలోచనల సరికొత్త చిగుర్లు. మాలాంటి వాళ్ల చేయిపట్టుకొని నడిపించే శక్తిమంతులు. అందుకే మా వేలు పట్టుకుని నడిపించండని కోరుతుంటాను. కానీ ఈ తరాన్ని చూస్తే కలవరమూ కలుగుతోంది. ఈ తరానికి ఓపిక తక్కువైంది. పఠనాసక్తి పోయింది. సినిమాల మీదున్న మోజు చదవడం మీద చూపించట్లేదు. నేను తీసిన సినిమాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే టక్కున చెప్తారు కానీ నేను రాసిన పుస్తకాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే... జవాబు ఉండదు. సాహిత్యానికి దూరమైన ఈ తరాన్ని చూస్తుంటే జాలేస్తోంది. మంచి సినిమా వినోదాన్ని మాత్రమే ఇస్తుంది కానీ పఠనం విజ్ఞానాన్నిస్తుంది. విజ్ఞతను పెంచుతుంది. జీవించే తోవను చూపిస్తుంది. మూసిన అలమార తలుపుల వెనకున్న పుస్తకాలు నెలలకు నెలలుగా నిరీక్షిస్తున్నాయి.. మీ సాంగత్యం కోసం. ఇది వరకు సాయంకాలాలు పుస్తకాల పుటలమీదుగా జారిపోయేవి కానీ ఇప్పుడు మీ కనురెప్పలు కంప్యూటర్ వీక్షణతో బరువెక్కిపోతున్నాయి. అందుకే యువతరానికి నా విన్నపం.. పుస్తకాలు బాగా చదవండి ! ..:: సరస్వతి రమ