mpp chairman
-
ఎంపీపీ ఎన్నికలు: కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు ముగిసిన నామినేషన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. చేతులు ఎత్తే పద్దతిలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకుంటారు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల కాగా వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు గెలుపొంది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంపీపీ స్థానాలు కూడా భారీగా వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకోనుంది. చదవండి: ఏపీ: నేడు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు -
ఏపీ: నేడు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఎంపీపీతో పాటు ప్రతి మండలానికి ఒకరు చొప్పున కో ఆప్టెడ్ సభ్యునితో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. మండల పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అన్ని చోట్ల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన మొత్తం ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లోని 9,583 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ఆ సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత కో ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు మరొకసారి సమావేశం నిర్వహించి, తొలుత ఎంపీపీ పదవికి ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. కాగా, ఉదయం 10 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏదైనా సమస్య వస్తే ఇలా.. ► ఏదైనా కారణం వల్ల కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండలాల్లో తదుపరి జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తారు. ఒకవేళ కో ఆప్టెడ్ ఎన్నిక పూర్తయి, ఎంపీపీ ఎన్నికకు ఆటంకం ఏర్పడితే, సంబంధిత మండలంలో ఆ తర్వాత జరగాల్సిన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట్ర కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ► శుక్రవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన మండలాల్లో శనివారం ఎన్నిక నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రెండో రోజు కూడా వివిధ కారణాలతో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా పడినప్పటికీ, సరిపడా కోరం ఉంటే ఎంపీపీ.. ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించవచ్చని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘పరిషత్’ పీఠాలలో మహిళలకు అగ్రాసనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జెడ్పీ చైర్మన్ పదవులు, 335 ఎంపీపీ పదవులను ప్రభుత్వం మహిళలకు రిజర్వు చేసింది. ఇందుకు సంబంధించిన రిజర్వేషన్లను 2020 మార్చిలో ఖరారు చేసి, అప్పట్లోనే గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీంతో ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులకు ఎన్నికలు ఈ రిజర్వేషన్ల ప్రతిపాదికనే జరగనున్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 13 జెడ్పీ చైర్మన్లకుగానూ ఎస్టీ, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, బీసీ జనరల్‌కు ఒక్కొక్కటి చొప్పున, బీసీ మహిళలకు రెండు, జనరల్ మహిళకు మూడు, జనరల్ కేటగిరికి నాలుగు జెడ్పీ చైర్మన్ల పదవులను రిజర్వు చేశారు. 660 ఎంపీపీ పదవులకు గాను 338 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు. మైనార్టీలకు 686 కోఆప్టెడ్ పదవులు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవుల ఎన్నికలతో పాటు అదే రోజుల్లో మండల, జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. ప్రతి మండలానికి ఒకరు చొప్పున 660 మండల పరిషత్‌లలో, జిల్లాకు ఇద్దరేసి చొప్పున 13 జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం మైనార్టీ వర్గాలకు చెందిన వారిని మాత్రమే మండల, జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు తదితరులతో పాటు తెలుగు మినహా మిగిలిన భాషలను మాతృభాషగా గుర్తింపు పొందిన వారు కోఆప్టెడ్ పదవులు పొందేందుకు అర్హులవుతారని వారు తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్‌లలో 660 మంది.. జిల్లా పరిషత్‌లలో 26 మంది కోఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశముంది. -
పీఠం దిగనున్న పరిషత్ పాలకులు
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ఐదేళ్ల పాటు ‘పరిషత్’లను ఏలిన పాలకులు పీఠం దిగే సమయం ఆసన్నమైంది. మండలాల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జెడ్పీ అధ్యక్షురాలి పదవీ కాలం ముగియనుంది. ఎన్ని కల నిబంధనల ప్రకారం ఈ నెల 3వ తేదీతో ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఈ నెల 4తో జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మాజీలు కానున్నారు. జిల్లాలో అన్ని మండలా ల్లోనూ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ జె.నివాస్, జేసీ శ్రీని వాసులు, తదితర ఉన్నతాధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామ పంచా యతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మండలాల్లో కూడా ప్రత్యేకాధికారుల పాలన రంగంలోకి రానుంది. జిల్లాలో ఉన్న 38 మండలాల్లో మళ్లీ ఎన్నికలయ్యేంతవరకు ప్రత్యేకాధికారులు విధుల్లో ఉండనున్నారు. తాజా పరిస్థితుల ప్రకారం జిల్లా వ్యా ప్తంగా మండల, జిల్లా పరిషత్ స్థాయి పాలకులు మొత్తం 753 మంది ప్రతినిధులు మాజీలు కానున్నారు. జెడ్పీ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ మండలాల్లో ప్రత్యేకాధికారులుగా జిల్లా స్థాయి అధికారులను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో మండల స్థాయి అధికారులు, మండలాల్లో జిల్లా స్థాయి అధికారుల పాలన ఉండాలనే నిబంధన మేరకు చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న మొత్తం 37 మంది జిల్లా పరిషత్ ప్రాధేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీ), ఇద్దరు కో ఆప్షన్ మెంబర్లతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న చౌదరి ధనలక్ష్మి కూడా ఈ నెల 4వ తేదీనే పీఠం దిగనున్నారు. అనంత రం జెడ్పీ పాలక బాధ్యతలు జిల్లా కలెక్టర్ జె. నివాస్ చేపట్టనున్నారు. దీంతో జిల్లా పరిషత్‌లో మళ్లీ పాలక వర్గం నియామకం అయ్యేంత వరకు ఇక్కడ కలెక్టర్ పాలన కొనసాగనుంది. ఇందుకోసం జెడ్పీలో ప్రత్యేక కార్యాలయాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. 3న ‘పరిషత్’ ఓటర్ల జాబితాలు విడుదల.. జిల్లాలో అన్ని మండలాలు, జిల్లా పరిషత్‌ల్లో ప్రత్యేక అధికారుల పాలన కోసం ఓ వైపు అధికా రులు కసరత్తు చేస్తుండగా, మరోవైపు పరిషత్ ఎన్నికల నిర్వహణకు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మండలాల వారీగా ఈ నెల 3న ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నా రు. ఈ మేరకు ఎంపీటీసీల ఓటర్ల జాబితాలను ఎంపీడీవోలు, జెడ్పీటీసీల ఓటర్ల జాబితాలను జెడ్పీ సీఈవో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పంచా యతీల్లో ఎన్నికల కోసం ఎస్సీలు, ఎస్టీలు, బీసీల వారీగా ఓటర్లను ఫొటోలు, డోర్ నంబర్లతో సహా సిద్ధం చేశారు. వీటి ద్వారా ఎంపీటీసీల పరిధి మేరకు అధికారులు ప్రత్యేక జాబితాలను తయారు చేయించారు. జెడ్పీటీసీల ఎన్నికలకు కూడా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జూలై 3వ తేదీ నాటికి ఈ జాబితాలను అందుబాటులో ఉండేలా ప్రచురణ చేయాలని సూచిం చారు. ఈ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యా రు. దీంతో మండల స్థాయిలో ఎన్నిక ల వాతావరణం కన్పిస్తోంది. ఎక్కడికక్కడ చర్చలు సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అత్యధిక మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు, త్వరలో జరుగున్న ‘స్థానిక’ ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో మెజార్టీ ఇస్తారనే చర్చలు జోరందుకున్నాయి. అరసవల్లి: ఐదేళ్ల పాటు ‘పరిషత్’లను ఏలిన పాలకులు పీఠం దిగే సమయం ఆసన్నమైంది. మండలాల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జెడ్పీ అధ్యక్షురాలి పదవీ కాలం ముగియనుంది. ఎన్ని కల నిబంధనల ప్రకారం ఈ నెల 3వ తేదీతో ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఈ నెల 4తో జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మాజీలు కానున్నారు. జిల్లాలో అన్ని మండలా ల్లోనూ ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ జె.నివాస్, జేసీ శ్రీని వాసులు, తదితర ఉన్నతాధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామ పంచా యతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మండలాల్లో కూడా ప్రత్యేకాధికారుల పాలన రంగంలోకి రానుంది. జిల్లాలో ఉన్న 38 మండలాల్లో మళ్లీ ఎన్నికలయ్యేంతవరకు ప్రత్యేకాధికారులు విధుల్లో ఉండనున్నారు. తాజా పరిస్థితుల ప్రకారం జిల్లా వ్యా ప్తంగా మండల, జిల్లా పరిషత్ స్థాయి పాలకులు మొత్తం 753 మంది ప్రతినిధులు మాజీలు కానున్నారు. జెడ్పీ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ మండలాల్లో ప్రత్యేకాధికారులుగా జిల్లా స్థాయి అధికారులను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో మండ ల స్థాయి అధికారులు, మండలాల్లో జిల్లా స్థాయి అధికారుల పాలన ఉండాలనే నిబంధన మేరకు చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న మొత్తం 37 మంది జిల్లా పరిషత్ ప్రాధేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీ), ఇద్దరు కో ఆప్షన్ మెంబర్లతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న చౌదరి ధనలక్ష్మి కూడా ఈ నెల 4వ తేదీనే పీఠం దిగనున్నారు. అనంత రం జెడ్పీ పాలక బాధ్యతలు జిల్లా కలెక్టర్ జె. నివాస్ చేపట్టనున్నారు. దీంతో జిల్లా పరిషత్‌లో మళ్లీ పాలక వర్గం నియామకం అయ్యేంత వరకు ఇక్కడ కలెక్టర్ పాలన కొనసాగనుంది. ఇందుకోసం జెడ్పీలో ప్రత్యేక కార్యాలయాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మొత్తం 637 మంది మండల పరిషత్ ప్రాధేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీ)తో పాటు 38 మంది మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), 38 మంది మండల కో ఆప్షన్ మెంబర్లకు కూడా ఈ నెల 3వ తేదీతో పదవీకాలం ముగియనుంది. 4వ తేదీ నుంచి మండలాల్లో ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ఇందుకోసం జిల్లా స్థాయి అధికారులను గుర్తించే పనిలో ఉన్నతాధికారులు బిజీ అయ్యారు. ఇందులో పలు అత్యవసర ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులను మినహాయింపు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
‘గులాబీ’కే పీఠాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కారు జోరుమీదుంది. పరిషత్ ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. 20 మండల పరిషత్‌లకుగాను.. 17 మండలాధీశుల పదవులను కైవసం చేసుకుంది. సంఖ్యాపరంగా టీఆర్ఎస్కే బలం ఉన్నా.. ఎంపీపీ పదవిపై నెలకొన్న పోటీ వల్ల ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ సమావేశానికి హాజరుకాకపోవడంతో కూసుమంచి ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. దాదాపు జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. 2014 ఎన్నికల్లో అనేక ఎంపీపీ పదవులను గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి ఒక్క ఎంపీపీ పదవిని సైతం చేజిక్కించుకోలేదు. అయితే బోనకల్, ఏన్కూరులో ఆ పార్టీ బలపరిచిన సీపీఎం, టీడీపీ అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ మాత్రం మెజార్టీ మండలాల్లో అప్రతిహతంగా తన విజయాన్ని కొనసాగించింది. కూసుమంచిలో ఎంపీపీ పదవిని టీఆర్ఎస్కు చెందిన బాలాజీనాయక్‌కు ఇవ్వాలని కోరుతూ ఆయన మద్దతుదారులు కూసుమంచిలోని ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ పదవికి శ్రీనునాయక్, బాలాజీనాయక్ పోటీ పడుతుండడంతో ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చి.. ఎన్నికకు మార్గం సుగమం చేయాలని వారికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సూచించారు. దీంతో పదవీ కాలాన్ని చెరి సగం పంచుకోవాలని భావించినా.. ముందు ఎవరు పదవి చేపట్టాలనే అంశంపై సందిగ్ధత నెలకొనడంతో ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ సమావేశానికి సకాలంలో చేరుకోలేదు. దీంతో ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. ఇక చింతకాని మండలంలో ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ మండలంలో టీఆర్ఎస్, సీపీఎంలు మిత్రపక్షం గా వ్యవహరించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేశాయి. జెడ్పీటీసీ టీఆర్ఎస్కు, ఎంపీపీ సీపీఎంకు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. జెడ్పీటీసీని టీఆర్ఎస్ గెలుచుకుంది. ఎంపీపీ పదవిని టీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీటీసీ పూర్ణయ్య పార్టీ విప్‌ను ధిక్కరించి ఎంపీపీ పదవికి నామినేషన్ వేయడంతో ఆయనకు కాంగ్రెస్, సీపీఐలకు చెందిన ఎంపీటీసీలు మద్దతు ప్రకటించారు. దీంతో అనూహ్య రీతిలో పూర్ణయ్య ఎంపీపీగా విజయం సాధించారు. అయితే పూర్ణయ్య పార్టీ విప్‌ను ధిక్కరించారంటూ పార్టీ మండల నాయకులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఇక కారేపల్లి ఎంపీపీ పదవి కోసం టీఆర్ఎస్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి కోసం ముగ్గురు ఎంపీటీసీలు పోటీ పడ్డారు. టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యురాలు మాలోతు శకుంతల, భాగ్యనగర్‌తండా నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ఈశ్వరీనందరాజ్తోపాటు గుంపెళ్లగూడెం ఎంపీటీసీ ధరావత్ అచ్చమ్మ ఎంపీపీ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి శకుంతలను ఎంపిక చేసినట్లు మిగిలిన ఇద్దరికి నాయకులు నచ్చజెప్పడంతో ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగింది. ప్రశాంతంగా ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక.. ఇక జిల్లాలో ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. బోనకల్, ఏన్కూరులలో మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. ముదిగొండ ఉపాధ్యక్ష పదవిని సీపీఎం దక్కించుకుంది. వైరా ఉపాధ్యక్షురాలిగా ఎంపీటీసీగా టీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేసిన లక్ష్మీనరసమ్మ విజయం సాధించింది. మండల పరిషత్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించిన అధికారులు మధ్యాహ్నం మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ కైవసం చేసుకున్న జెడ్పీటీసీలైన తిరుమలాయపాలెం, కామేపల్లిలో సైతం టీఆర్ఎస్ అభ్యర్థులే ఎంపీపీలుగా గెలుపొందారు. బోనకల్లో మాత్రం కాంగ్రెస్, సీపీఎం కూటమికి ఎంపీపీ పదవి దక్కింది. ఇక కారేపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని టీఆర్ఎస్ తరఫున ఇమ్మడి రమాదేవికి ఇచ్చేందుకు నిర్ణయించగా.. అప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చిన 8 మంది ఎంపీటీసీలు రావూరి శ్రీనివాసరావుకే వైస్ ఎంపీపీ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కారేపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, స్థానిక వార్డు సభ్యుడు గంగరబోయిన సత్యం పెట్రోల్ బాటిల్‌ను తీసుకొచ్చి.. రావూరికి వైస్ ఎంపీపీ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ మీద పోసుకోబోగా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఎంపీటీసీ సభ్యుల నిర్ణయం మేరకు రావూరి శ్రీనివాసరావుకు వైస్ ఎంపీపీ పదవిని కేటాయించారు. -
మండల పరిషత్ బాద్‌షాలెవరో
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల్లో కీలకమైన మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక శుక్రవారం జరగనుంది. వీలైనన్ని ఎక్కువ ఎంపీపీ పదవులను సొంతంచేసుకోవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు క్యాంప్‌లు జోరుగా నిర్వహిస్తున్నాయి. క్యాంపుల్లో ఉన్న ఎంపీటీసీ సభ్యులను శుక్రవారం నేరుగా ఎన్నిక నిర్వహించే మండల పరిషత్ కార్యాలయాలకు తరలించేందుకు ఆయా పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. కొన్ని మండలాల్లో ఎంపీపీ స్థానాలను దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం ఇరుపార్టీలకు ఉన్నా.. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని ముందు జాగ్రత్తగా ఎంపీటీసీలను ఒక చోటుకు చేర్చారు. ఇంకొన్ని మండలాల్లో సంఖ్యాబలం లేకున్నా ఎంపీపీ పీఠాలను సొంతం చేసుకునేందుకూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు క్యాంప్ నిర్వహించాయి. కొన్నిచోట్ల కీలకంగా మారిన చిన్నాచితక పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులతో ఆయా పార్టీలు బేరసారాలు జరుపుతున్నాయి. జిల్లాలో 21 మండలాల్లో 9 ఎంపీపీ స్థానాలు దక్కించుకునేందుకు టీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాబలం ఉంది. ఇక.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉన్న మండలాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించారు. ఆ స్థానాలను చేజిక్కించుకునేందుకు ఆపరేషన్ ఆకర్‡్ష మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఎంపీపీ స్థానాలపై గురిపెట్టింది. ఇప్పటివరకు అబ్దుల్లాపూర్‌మెట్ మాత్రమే ఆ పార్టీ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిపోను చేవెళ్ల, మంచాల, కొందుర్గు, చౌదరిగూడ, కొత్తూరు, మాడ్గుల, కడ్తాల్, యాచారం, ఫరూఖ్‌నగర్ ఎంపీపీ స్థానాలను దక్కించుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇక్కడ అధికార పార్టీ ఎంపీటీసీలకు కూడా గాలం వేసినట్లు తెలుస్తోంది. తమకు మద్దతు ఇస్తే ఎంపీపీ పదవి సైతం కట్టబెడతామన్న ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక బీజేపీ.. మహేశ్వరం, కందుకూరు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ ఎంపీటీసీలను, స్వతంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కోఆప్షన్ సభ్యులకు పోటాపోటీ.. ప్రతి మండలానికి ఒకరి చొప్పున కోఆప్షన్ సభ్యునిడిని ఎన్నుకుంటారు. ఈ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. ఎంపీటీసీలతోపాటు సమానంగా వీరికి గౌరవం లభిస్తుండటం, గౌరవ వేతనం అందుతుండడం.. సర్వసభ్య సమావేశాల్లో సైతం చర్చల్లో పాల్గొనే అవకాశం ఉండటం తదితర సానుకూలతల నేపథ్యంలో ఈ పదవులను కోరుకుంటున్నారు. వీరికి ఓటు హక్కుమాత్రం ఉండదు. స్థానిక మండలంలో ఓటరుగా నమోదై ఉంటే ఈ పదవికి అర్హులు. ఈ క్రమంలో కోఆప్షన్ పదవుల కోసం పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాపరిషత్‌లో కోఆప్షన్ సభ్యులు ఇద్దరు ఉంటారు. అన్నింటికీ కోరం తప్పనిసరి కోఆప్షన్ సభ్యుని ఎన్నికతోపాటు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు కోరం తప్పనిసరి. మండల పరిధిలోని మొత్తం ఎంపీటీసీల్లో కనీసం 50 శాతం సభ్యులు ఉంటేనే ఎన్నిక నిర్వహిస్తారు. తగిన కోరం లేకుంటే ఎన్నికను మరుసటి రోజుకు ప్రిసైడింగ్ అధికారి వాయిదా వేస్తారు. ఆ తర్వాత రోజు కూడా కోరం లేకపోతే ఎన్నికల సంఘం ఓ తేదీని సూచిస్తుంది. ఆ రోజున కోరం లేకున్నా ఎంపీపీ, వైస్ ఎంపీపీని ఎన్నుకుంటారు. ఆ మూడు చోట్ల తాత్కాలిక భవనాల్లో.. మూడు మండలాల్లో ఎంపీపీల ఎన్నిక నిర్వహించేందుకు తాత్కాలిక భవనాలను సిద్ధం చేశారు. కొత్తగా మండలాలుగా ఏర్పడిన నందిగామ, కడ్తాల్, చౌదరిగూడలో మండల పరిషత్ భవనాలు లేవు. ఈ నేపథ్యంలో ఎంపీపీల ఎన్నికకు అందుబాటులో ఉన్న భవనాలను తాత్కాలికంగా వినియోగించుకుంటున్నారు. నందిగామలో జిల్లా పరిషత్ హైస్కూల్లో, కడ్తాల్, చౌదరిగూడ మండలాల్లో స్థానిక గ్రామ పంచాయతీ భవనాల్లో ఎన్నిక జరుగుతుంది. రేపు జిల్లాపరిషత్ ఎన్నిక ఇక జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా.. ఎంపీపీల ఎన్నిక తరహాలోనే జరుగుతుంది. లక్డీకపూల్‌లోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఈ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. -
వీడనున్న పీటముడి!
సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఎవరికి దక్కనున్నాయనే అంశంపై నెలకొన్న సస్పెన్స్ శుక్రవారం ఉదయానికి వీడిపోనుంది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లా పరిషత్ చైర్మన్లు గెలుచుకునేంత స్థాయిలో స్పష్టమైన మెజార్టీ టీఆర్ఎస్కు లభించింది. దీంతో పాటు 70కి 70 ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో 62 ఎంపీపీ స్థానాలకు గాను సరిపడా సంఖ్యాబలం ఉన్నప్పటికీ మిగతా ఎనిమిది స్థానాలను కూడా దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారితో మంతనాలు జరుపుతున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని 70 మంది జెడ్పీటీసీల్లో 62 మందిని, 781 ఎంపీటీసీ సభ్యుల్లో 541కి పైగా సభ్యులను క్యాంపులకు తరలించారు. నేడు ఎంపీపీల ఎన్నిక ఎంపీపీల ఎన్నిక శుక్రవారం జరగనుండగా ఉదయం 10 గంటల నుంచి ప్రక్రియ మొదలవుతుంది. అధికారికంగా సాయంత్రం 4 గంటలకు ఎంపీపీని ప్రకటించనున్నారు. ఇక శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమాలోచన చేసిన అనంతరం చైర్మన్లు, అధ్యక్షులపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. చైర్మన్లు, అధ్యక్షుల పేర్లను సీల్డ్ కవర్లో ఎన్నికలకు కొద్ది గంటల ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఇన్‌చార్జ్‌లకు చేరవేస్తే.. ఆ మేరకు చైర్మన్లు, అధ్యక్షులను ఎన్నుకుంటారు. విడుదలైన నోటిఫికేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు జిల్లా పరిషత్ చైర్మన్లు, 70 మండల పరిషత్ అధ్యక్ష పదవుల ఎన్నికలు శుక్రవారం, శనివారం న్నికలు జరగనున్నాయి. మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల కాగా, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు రేపు ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికలకు కొన్ని గంటల ముందే చైర్మన్లు, అధ్యక్షులెవరనే అంశంపై స్పష్టత రానుంది. మూడు ఓకే... ములుగు జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కుసుమ జగదీష్ పేరును మొదటల్లోనే ప్రకటించగా, ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డి భార్య గండ్ర జ్యోతికి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్మన్ ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె శాయంపేట జెడ్పీటీసీ బరిలోకి దిగి విజయం సాధించారు. వరంగల్ అర్బన్‌కు సంబంధించి ఎల్కతుర్తి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన భీమదేవరపల్లికి చెందిన డాక్టర్ సుధీర్‌కుమార్ పేరు ఖాయం చేసినట్లు చెబుతున్నారు. ఈ మూడు మినహాయిస్తే మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జయశంకర్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్సీ మహిళకు కేటాయించిన భూపాలపల్లి జయశంకర్ జెడ్పీ చైర్మన్ పీఠం కోసం జక్కు శ్రీహర్షిణి(కాటారం జెడ్పీటీసీ) పేరు ఖరారైనట్లు గురువారం ప్రచారం మొదలైంది. జనగామ జెడ్పీ చైర్మన్ కోసం జనగామ, చిల్పూరు, లింగాల గణపురం, తరిగొప్పుల నుంచి జెడ్పీటీసీలుగా గెలిచిన నిమ్మతి దీపికారెడ్డి, పాగాల సంపత్ రెడ్డి, గుడి వంశీధర్‌రెడ్డి, ముద్దసాని పద్మజారెడ్డి జెడ్పీ చైర్మన్ కోసం పదవి పోటీపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ కోసం మొదటి నుంచి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కోడలు నిత్య రవిచంద్ర పేరు వినిపించినా ఆమె పోటీకే దిగలేదు. ప్రస్తుతం గూడూరు, బయ్యారం, నర్సింహులపేట నుంచి జెడ్పీటీసీలుగా గెలిచిన గుగులోతు సుచిత్ర, అంగోతు బిందు, భూక్యా సంగీత నడుమ పోటీ ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆరుగురు జెడ్పీ చైర్మన్లతోపాటు మండల పరిషత్ అధ్యక్షులెవరనేది ఎన్నికకు కొద్దిగంటల ముందు మాత్రమే వెల్లడి కానుంది. క్యాంపుల్లో ఇన్‌చార్జ్‌ల చర్చలు ఆరు జెడ్పీ పీఠాలు, మొత్తానికి మొత్తం మండల పరిషత్‌లను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో ఫలితాలు వెలువడిన రోజునే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను అధికార టీఆర్ఎస్ పార్టీ క్యాంపులకు తరలించింది. హైదరాబాద్‌తో పాటు చుట్టూ ఉన్న రిసార్ట్‌లతో పాటు యాదగిరిగుట్ట, పాపికొండలు తదతర ప్రాంతాల్లో ఈ క్యాంపులు కొనసాగుతున్నాయి. జెడ్పీ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై చర్చించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం తీసుకెళ్లిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేటీఆర్, కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఈ అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. అంతే కాకుండా వైస్ చైర్మన్లు, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికపై కూడా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇదే సమయంలో అన్నీ జెడ్పీ చైర్మన్ల ఎంపిక ప్రక్రియను సమన్వయం చేసేందుకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు క్యాంపుల్లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికి తోడు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల అభిప్రాయాలు, అధినేత కేసీఆర్ సూచన మేరకు శుక్రవారం ఉదయమే ఎంపీపీలు, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుల పేర్లు, శనివారం ఉదయం జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, కో–ఆప్షన్ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్ల ద్వారా వెల్లడించేందుకు సన్నాహాలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. -
ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు!
సాక్షి, అచ్చంపేట: వరుస ఎన్నికలతో మరోసారి పల్లెలు సందడిగా మారనున్నాయి. లోక్‌సభతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ వరకు ఎన్నికల కోలాహలం ఉండడంతో రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. ఇక అధికారులు ఓటర్లు, మున్సిపల్ వార్డులు, పరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఒక్కో తంతు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మమ్మురమైంది. ఇప్పటికే ఎంపీపీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలోని 71మండల ప్రజాపరిషత్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఒక మండలం ఏజెన్సీ ఏరియాలో ఉంది. మిగిలిన 70మండలాల్లో 50శాతం అంటే 35మండలాల ఎంపీపీ స్థానాలను జనరల్‌కు కేటాయించారు. మిగిలిన వాటిలో ఏడు ఎస్టీలకు, 14 ఎస్సీలకు, 14 బీసీలకు రిజర్వ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరిలో అన్ని స్థానాల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన, బీసీ రిజర్వేషన్లు ఓటర్ల ప్రకారం నిర్ణయించారు. గతంలో ఇలా.. గతంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీలు జిల్లా పరిషత్‌లో నామినేషన్లు వేయగా, ఎంపీటీసీలు ఆయా మండలాల్లో సమర్పించేవారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని సవరించి జెడ్పీటీసీలు మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. అదేవిధంగా మూడు ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించి నామినేషన్లు స్వీకరించే విధంగా నిర్ణయించారు. దీంతో ఇటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ అభ్యర్థులకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో జిల్లాలో దూర ప్రాంతాల నుంచి జిల్లాకేంద్రానికే వచ్చి నామినేషన్ల పత్రాలు సమర్పించే విషయంలో ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు ఎన్నికల సంఘం వెసులుబాటు కలిగించడంతో ఊరట కలగనుంది. 600–700మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం 600 మంది నుంచి 700 మంది ఓటర్ల వరకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు ఓటరు జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం తిరిగి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టింది. ఈ ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతు కావడంతో వాటిని తిరిగి చేర్పించేందుకు ఓటర్ల నమోదు ముసాయిదా నిర్వహించారు. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారు. అసెంబ్లీ ఓటర్లతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపు 2లక్షల ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తుది జాబితాను ఫిబ్రవరి 22వ తేదీన ప్రకటించారు. ఈ జాబితాను ఆధారంగా చేసుకునే ఈ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్లను విభజించనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల నూతనంగా తయారు చేసిన ఓటర్ల జాబితాను కలెక్టర్ ద్వారా తీసుకున్నారు. దాని ఆధారంగానే గ్రామాల వారీగా ఆయా వార్డుల జాబితాను తయారు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వీటి ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. అనంతరం ఎంపీటీసీల నియోజకవర్గాల వారీగా తయారు చేసి ఈ నెల 27న తుది జాబితాను ప్రకటించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొత్తగా పదర, చారకొండ, పెంటవెల్లి, ఊర్కొండ, వనపర్తి జిల్లాలో చిన్నంబావి, మదనాపురం, శ్రీరంగాపూర్, జోగుళాంబ జిల్లాలో కేటీ దొడ్డి, రాజోళి, ఉండవెల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మరికల్, మూసాపేట, రాజాపూర్, కృష్ణా మండలాలు ఏర్పడ్డాయి. పాత మండల పరిషత్‌లో ఉన్న ఈ మండలాల్లో కొత్త పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఏ జిల్లాకు ఆ జిల్లా జెడ్పీటీసీలతో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. మొత్తం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపి ప్రస్తుతం 71 జెడ్పీటీసీ, 804 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్లకు లక్కీడిప్.. గద్వాల అర్బన్: ఎట్టకేలకు జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీనికోసం మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో కలెక్టర్ కె.శశాంక ఆధ్వర్యంలో లక్కీడిప్ తీశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాములు, డీపీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కేవీబీపురం ఎంపీపీగా సులోచన
కేవీబీపురం : కేవీబీపురం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి, కళత్తూరు ఎంపీటీసీ సభ్యురాలు తుపాకుల సులోచన (ఎస్టీ) ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి సోడవరం రాజు ఎన్నికలు నిర్వహించా రు. గతంలో ఇప్పటివరకు నాలుగు సార్లు ఎన్నికల కోసం సమావేశం నిర్వహించారు. కోరం లేదని రెండుసార్లు, మద్దతు లేదని రెండు సార్లు ఎన్నిక ను వాయిదా వేశారు. తాజాగా మంగళవారం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు నందకుమార్, సులోచన మాత్రమే హాజరయ్యూరు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీపీ పదవికి అర్హతగల అభ్యర్థి తుపాకుల సులోచన ఒక్కరే ఉండడంతో ఆమెను ఎన్నుకోవాలని ఆదేశాలు అందించారు. దీంతో సులోచన ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఉత్తర్వులు అందజేశారు. చట్టపరంగా సులోచనను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపా రు. ఈ ఎన్నికల సందర్భంగా స్థానిక ఎస్ఐ విశ్వనాథ్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీడీవో మోహన్‌రావు, చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి, పుత్తూరు సీఐ చంద్రశేఖర్, పిచ్చాటూరు ఎస్ఐ పురుషోత్తంరెడ్డి, నారాయణవనం ఎస్ఐ శివకుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇదీ సంగతి : కేవీబీ పురం ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అరుుంది. మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలుండగా, పదింటిని టీడీపీై కెవశం చేసుకుంది. అరుుతే వారిలో ఒకరు కూడా ఎస్టీ మహిళ లేరు. కష్టానికి ఫలితం దక్కింది ఎన్నికల్లో పడిన కష్టానికి ఫలితం దక్కిం దని ఎంపీపీ తుపాకుల సులోచన చెప్పా రు. మంగళవారం ఆమె ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడుతూ మూడు నెలలుగా ఎంతో ఉత్కంఠ రేపిన ఎంపీ పీ ఎన్నికలకు ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నానని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయడంతో అధికారులు న్యాయంగావ్యవహరించారని సులోచన చెప్పారు. అధికార పార్టీ నాయకులు ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా జగనన్నపై ఉన్న అభిమానంతోనే పార్టీలో ఉన్నానన్నారు. తనను ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిపించిన కలత్తూరు గ్రామ ప్రజలకు రుణపడి ఉన్నానని చెప్పారు. -
అసలును మించిన కొసరు ఖర్చు
సాక్షి, కాకినాడ :‘చేతికందిన ముద్ద నోటికందడానికి ఎంత సమయం కావాలి?’ అని అడిగితే ఎవరైనా ఏం చెపుతారు? ‘మహా అయితే కొన్ని క్షణాలు’ అంటారు. అయితే.. పుర, ప్రాదేశిక ఎన్నికల విజేతలను ఇదే ప్రశ్న వేస్తే.. ‘అబ్బో.. రెండు నెలల పైమాటే’ అని నిట్టూరుస్తారు. అవును..మరి పురపోరు జరిగి రెండున్నర నెలలు, ప్రాదేశిక సమరం జరిగి డెబ్భై రోజులైనా వారింకా పదవులను చేపట్టలేదు. ఆ ఎన్నికల్లో ఓడిన వారు ఆశాభంగాన్ని ఈసరికే జీర్ణించుకుని స్థిమితపడి ఉంటారు. అయితే 1,434 మంది విజేతలు మాత్రం ‘పదవులు చేపట్టేది ఇంకెప్పుడు?’ అని అస్థిమితంతో వేగిపోతున్నారు. ఇక ‘అధ్యక్షా!’ అనిపించుకోవాలని ఉబలాటపడుతున్నవారికి ఈ జాప్యం మరింత దుర్భరంగా ఉంది. తమ వారు శత్రుశిబిరంలో చేరకుండా కళ్లలో వత్తులు వేసుకుని కాపలా కాయలేక, అలాగని వారికి ‘మారు మనసు’ కలగకుండా.. వారు మనసు పడిన ముచ్చట్లన్నీ తీరుస్తూ పంటి బిగువునే శిబిరాలను నిర్వహిస్తున్నారు. పుర, ప్రాదేశిక ఎన్నికల తర్వాత జరిగిన సార్వత్రిక సమరం విజేతలు ప్రమాణ స్వీకారం చేయకున్నా పెత్తనం చెలాయిస్తున్నారు. వారిలో అదృష్టం వరించిన వారు మంత్రులుగా అందలాలూ ఎక్కారు. అయినా నేటి వరకు పాలనా పగ్గాలు చేపట్టలేని మున్సిపల్, ప్రాదేశిక విజేతలు ఎన్నికల కమిషన్ ఆదేశాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనట్టు పాలకవర్గాల ఏర్పాటులో జాప్యంతో.. ఎంపీపీ, చైర్మన్ పదవులను ఆశించే వారికి శిబిరాల నిర్వహణ వ్యయం.. ఎన్నికల ఖర్చును మించిపోతూ చుక్కలు చూపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పని నిరీక్షణ కాకినాడ కార్పొరేషన్ మినహా, రాజమండ్రి కార్పొరేషన్లో 50 డివిజన్లు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 264 వార్డులకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఏప్రిల్ 7న మేయర్, చైర్మన్ల ఎన్నిక పూర్తి చేయాలి. ఆ తర్వాత సుప్రీం ఆదేశాలతో 1,063 ఎంపీటీసీ, 57 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. వీటి ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 13న పూర్తి చేసి ఏప్రిల్ 20లోగా ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ ఎన్నిక పూర్తి చేయాలి. అయితే ఈ రెండు ఎన్నికల ఫలితాలప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందన్న సుప్రీం ఆదేశాల మేరకు వీటి ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. మే 12న మున్సిపల్, మే 13న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. అంటే ఫలితాల కోసం మున్సిపల్ బరిలో నిలిచిన వారు 44 రోజులు, ప్రాదేశికబరిలో నిలిచిన వారు 38 రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. అప్పటికీ వారి నిరీక్షణకు తెరపడలేదు. పదవులు చేపట్టేందుకు మున్సిపల్ విజేతలు 31 రోజులుగా, ప్రాదేశిక విజేతలు 30 రోజులుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. మునుపెన్నడూ ‘భారం’ ఇన్నాళ్లు లేదు.. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా శిబిరాలను వారానికి మించి నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు శిబిరాలు ప్రారంభించి నెలరోజులు దాటినా ఇంకా పగ్గాలు చేపట్టేదెప్పుడో తెలియడం లేదు. ఎంపీపీ, చైర్మన్ పీఠాలను ఆశిస్తున్న వారు తమ వర్గపు ఎంపీటీసీలు, వార్డు సభ్యులను శిబిరాలకు తరలించి అన్ని సుఖసదుపాయాలనూ కల్పించి, వారి గొంతెమ్మ కోరికలనూ తీర్చాల్సి వస్తోంది. ఎంపీపీ, చైర్మన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఓటేస్తే అనర్హత వేటు పడే అవకాశాలున్నా ప్రత్యర్థుల ప్రలోభాలకు, ధన ప్రభావానికి లోనై ఎక్కడ అటు జారిపోతారోనన్న శంకతో ఆశావహులు శిబిరాలను నిర్వహిస్తున్నారు. తిప్పలు పడ్డా, అప్పుల పాలైనా తమ వర్గీయులను పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు తిప్పక తప్పడం లేదు. మెట్టలోని టీడీపీకి చెందిన ఎంపీపీ అభ్యర్థి శిబిరాల నిర్వహణకు ఉన్న కొద్దిపాటి పొలాన్నీ కుదువపెట్టాల్సి వచ్చింది. ఆయనే కాదు.. శిబిరాలు నిర్వహిస్తున్న వారిలో ఎక్కువమందిది ఇదే పరిస్థితి. మరింత నిరీక్షణ అనివార్యం.. ప్రమాణ స్వీకారం చేస్తే కానీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదు. ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాల్లో తొలి రెండు రోజులూ ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. తర్వాత నాలుగైదురోజుల్లో ఎన్నికల కమిషన్ ప్రభుత్వ అనుమతితో ఎంపీపీ, చైర్మన్, మేయర్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. అయితే ప్రస్తుతమున్న ఎన్నికల కమిషన్ ఏ రాష్ర్ట ప్రభుత్వానికి చెందుతుందన్నది ఇంకా తేలలేదు. అది తేలితే కానీ స్థానిక సంస్థల పాలకవర్గాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ కాదు. ఎంత తక్కువ లెక్కేసుకున్నా జూన్ చివరి వారంలో కానీ, జూలై మొదటి వారంలో కానీ మున్సిపల్, ప్రాదేశిక విజేతలు పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. అప్పటివరకూ శిబిరాల నిర్వహణ అంటే.. తమకు వేసవిలో మొదలైన కాక తొలకరి అనంతరమూ తప్పనట్టేనని ఎంపీపీ, చైర్మన్ ఆశావహులు నిట్టూరుస్తున్నారు.