mrps activits
-
మాదిగలను మోసగించిన బాబు: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిగలను ఉపయోగించుకుని మోసం చేశారని, ఇపుడు వరంగల్‌కు అపరిచితులను తీసుకువచ్చి ఎంఆర్పీఎస్ కార్యకర్తలపై దాడులు చేయించారని టీఆర్ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘టీడీపీ పారిపోయే పార్టీ, చంద్రబాబు యాత్రను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని అన్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ ముసుగులో టీఆర్ఎస్ దాడులు చేసిందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు ఎలాగో తమకు ఏపీ సీఎం కూడా అంతేనని, తమ ప్రభుత్వం బాబు యాత్రకు కావాల్సినంత భద్రత కల్పించిందని పేర్కొన్నారు. వరంగల్‌లో జరిగిన సంఘటనలకు చంద్రబాబు, ఎర్రబెల్లి దయాకర్‌రావులే బాధ్యత వహించాలని అన్నారు. -
టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విధ్వంసకాండ
హైదరాబాద్: నిజామాబాద్‌లో టీడీపీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విధ్వంసకాండ సృష్టించారు. శనివారం మధ్యాహ్నం నిజామాబాద్ టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు రమణ, రేవంత్ రెడ్డిని ఘోరావ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తీర్మానం చేయలేదని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. టీడీపీ కార్యకర్తలు ఎమ్మార్పీఎస్ నాయకులపై దాడికి దిగి చితకబాదారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు 30 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.