mudunuri prasada raju
-
YSRCPకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై అనర్హత వేటు వేయాలి
-
పార్టీ వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: ప్రసాద్ రాజు
-
పార్టీ వల్ల బ్రతుకుతూ, పార్టీకి ద్రోహం చేసే వాళ్లపై చర్యలు
-
పశ్చిమగోదావరి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడి గ్రామంలో ఆదివారం పర్యటించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కుమార్తె డాక్టర్ సింధు వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను సీఎం ఆశీర్వదించారు. సీఎం జగన్‌కు మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ రవి ప్రకాష్ స్వాగతం పలికారు. చదవండి: నాడు చంద్రబాబు అలా.. నేడు సీఎం జగన్ ఇలా.. -
సీఎం జగన్ పశ్చిమగోదావరి పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడిలో పర్యటించనున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుంటారు. 4.30 గంటలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. అనంతరం 5.15 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 5.55 తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. చదవండి: GIS: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్ -
AP Govt: వశిష్ట నిర్మాణానికి ఓకే.. రూ.490 కోట్ల వ్యయంతో వారధి..
సాక్షి, ఏలూరు: తీరప్రాంత ప్రజల చిరకాల కోరికగా మిగిలిన వశిష్ట గోదావరి వారధి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక అడ్డంకులు, అవరోధాలు, కోర్టు కేసులను దాటుకుని వచ్చే జనవరిలో టెండర్లు నిర్వహించి యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహించనున్నారు. వశిష్ట గోదావరిపై వంతెన కట్టి ప్రజల చిరకాల కల నెరవేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నర్సాపురం పర్యటనలో ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాలను కలిపే కీలక బ్రిడ్జి కావడంతో ముఖ్యమంత్రి ప్రకటనతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రిటీష్ హయాంలోనే అంకురార్పణ జరిగిన ఈ వంతెన నిర్మాణం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వంతెన నిర్మాణం ప్రారంభమవుతుందన్న తరుణంలో ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం కూడా ఆగిసోయింది. మళ్లీ ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంతెన నిర్మాణంపై దృష్టి పెట్టారు. 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించి.. రూ.490 కోట్లతో నరసాపురం మండలం రాజుల్లంక గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకూ నిర్మించిన 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించడం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టబోతున్నారు. కోనసీమ జిల్లా శివకోడు నుంచి టేకిశెట్టిపాలెం మీదుగా ఉన్న స్టేట్‌హైవేను జాతీయ రహదారిగా మార్పుచేసి రామేశ్వరం మీదుగా ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోని రాజుల్లంక, వైఎస్ పాలెం, సీతారామపురం మీదుగా 216 జాతీయ రహదారికి బైపాస్ హైవే రోడ్డు నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. పనులు మైథాస్ సంస్థకు అప్పగించారు. అయితే ఈ సంస్థ సంక్షోభంలోకి వెళ్లడంతో మళ్లీ మరో కంపెనీకి వంతెన పనులు అప్పగించారు. కానీ ఆయన మృతితో పనులు నిలిచిపోయాయి. తరువాత టీడీపీ ప్రభుత్వం వంతెన విషయంలో అనేక డ్రామాలు నడిపింది. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి పేరు వస్తుందనే వంతెన నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలో వంతెన పనులకు టెండర్లు పిలుస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యత తీసుకుని, బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్‌గా ఉన్న వంతెన నిర్మాణానికి పూనుకుంటున్నారు. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ దశాబ్దాల కలల వారధి 1910లో నరసాపురం పట్టణం వద్ద వంతెన నిర్మాణానికి అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కేవలం రూ.70 వేలతో అంచనాలు తయారు చేసింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇక అప్పటి నుంచి నరసాపురం వశిష్ట వంతెన కథ నడుస్తూనే ఉంది. ప్రతీ ఎన్నికల సమయంలోనూ నేతలు హామీలు ఇవ్వడం, మరిచిపోవడం జరుగుతోంది. 1986లో మొదటిసారిగా నరసాపురం వశిష్ట వంతెనకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శంకుస్థాపన చేశారు. అయితే తరువాత రాజకీయ కారణాలతో ఇక్కడ నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. 2003లో చంద్రబాబు హయాంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి అంటూ హడావిడి చేసి శంకుస్థాపన చేశారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండగా కూడా వశిష్ట వంతెన నిర్మాణంపై సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటన చేసి హడావిడి చేయడం జరిగింది. కోర్టులకెక్కి ఆపే ప్రయత్నం.. నిజానికి ఈ నెల 18న నరసాపురంలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో శంకుస్థాపనలు జరిగిన రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లతో పాటే వశిష్ట వంతెనకు కూడా శంకుస్థాపన జరగాలి. అయితే స్థలసేకరణ విషయం వచ్చేసరికి ఈ ప్రభుత్వం హయాంలో వంతెన నిర్మాణానికి బీజం పడితే జగన్ సర్కారుకు ఎక్కడ పేరు వస్తుందేమోనని.. ప్రతిపక్షాలు కుట్రలకు తెరలేపాయి. కావాలని అడ్డంకులు సృష్టించడానికి స్థల సేకరణ అంశంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు. అయితే ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు గట్టి ప్రయత్నం చేసి స్టేను వెకేట్ చేయించి, ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించాలని నిర్ణయించారు. తీరా ముఖ్యమంత్రి పర్యటన దగ్గరికి వచ్చే సమయానికి మళ్లీ రెండోసారి కోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు. దీని వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నట్టు సమాచారం. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో.. చించినాడ 216 జాతీయ రహదారికి కోనసీమ జిల్లా నుంచి నరసాపురం వరకూ బైపాస్ నిర్మించి, మధ్యలో వంతెన నిర్మిస్తే ఈ ప్రాజెక్ట్‌కు మోక్షం కలుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గట్కరీకి లేఖ రాయడం, శివకోడు సఖినేటిపల్లి మీదుగా రామేశ్వరం నుంచి నరసాపురం వరకూ 25 కిలోమీటర్ల మేర స్టేట్ హైవేను 216కు బైపాస్‌గా నేషనల్ హైవేగా మార్పు చేయాలని, మధ్యలో రాజుల్లంకవద్ద గోదావరిపై వంతెన నిర్మించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖకు స్పందించిన గట్కరీ వెంటనే ఆమోదం తెలపడంతో దశాబ్దాల వంతెన సమస్యకు లైన్ క్లియర్ అయ్యింది. -
జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులకి అండగా నిలిచింది : ఏపీ చీఫ్ విప్ ప్రసాద రాజు
-
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం
సాక్షి, అమరావతి: అభివృద్ధితో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మొహం చూపించలేకే చంద్రబాబు సభకు రావడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. చర్చ అంటూ బయట సవాళ్లు విసరడం కాదని, చంద్రబాబు సహా ప్రతిపక్షం సభకు వచ్చి చర్చించాలని కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానం అని, మూడు రాజధానుల మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని, ఎన్నిరోజులు జరగాలనేది 10 గంటలకు జరిగే బీఏసీ సమావేశంలో ఫిక్స్ అవుతుందని చెప్పారు. పలు కీలక అంశాలను ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నామని, ప్రతిపక్షాలు కూడా సభకు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. సభలో ఎటువంటి చర్చకైనా తాము సిద్ధం అని చెప్పారు. వాళ్ల దగ్గర మాట్లాడటానికి ఏమీ లేక గైర్హాజరవుతున్నారని తెలిపారు. అమరావతి పాదయాత్ర ఉద్దేశం ఏమిటో.. దాని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. ఒకసారి హైదరాబాద్‌ను కోల్పోయి మన రాష్ట్రం నష్టపోయిందని, మళ్లీ మళ్లీ అదే తప్పు చేసేది లేదన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని ప్రసాదరాజు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశంపై సమాధానం చెప్పటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూడు రాజధానుల విషయంలో గత అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం జగన్ చాలా స్పష్టంగా చెప్పారని, అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందన్నారు. -
మళ్లీ అదే తప్పు చేసేది లేదు.. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం: ప్రసాదరాజు
సాక్షి, తాడేపల్లి: అభివృద్ధితో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మొహం చూపించలేకే చంద్రబాబు సభకు రావడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ ముదనూరి ప్రసాదరాజు అన్నారు. చర్చ అంటూ ప్రతిపక్షం బయట సవాళ్లు విసరడం కాదు.. సభకు వచ్చి చర్చించాలని కోరారు. ఈ మేరకు ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ.. 'రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. పది గంటలకు బీఏసీ సమావేశం జరుగుతుంది. అజెండా ఫిక్స్ అవుతుంది. అనేక కీలక అంశాలను ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నాము. ప్రతిపక్షాలు కూడా సభకు రావాలని నేను కోరుకుంటున్నా. సభలో ఎటువంటి చర్చకైనా మేము సిద్ధం. వాళ్ల దగ్గర మాట్లాడటానికి ఏమీ లేక గైర్హాజరవుతున్నారు. అమరావతి పాదయాత్ర ఉద్దేశ్యం ఏమిటో దాని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. ఒకసారి హైదరాబాద్ కోల్పోయి మన రాష్ట్రం నష్టపోయింది. మళ్లీ మళ్లీ అదే తప్పు చేసేది లేదు.. అభివృద్ది వికేంద్రీకరణే మా విధానం. దానికోసమే మేము కట్టుబడి ఉన్నాం.. మూడు రాజధానులు పెట్టి తీరతాం' అని ముదనూరి ప్రసాదరాజు వ్యాఖ్యానించారు. చదవండి: (దమ్ముంటే అసెంబ్లీకి రా.. చంద్రబాబుకు పార్థసారథి సవాల్) -
అర్హులందరికీ పథకాల వర్తింపే లక్ష్యం
నరసాపురం రూరల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు వలంటీర్లు కీలకమని చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. లిఖితపూడిలో శుక్రవారం వలంటీర్ల సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీడీఓ ఎన్వీ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తోందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం విశిష్ట సేవలందించిన వలంటీర్లు చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. సేవా దృక్పథంతో సమర్థవంతంగా సేవలందిస్తున్నారన్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఐదుగురు సేవా వజ్రా, 15 మంది సేవారత్న, 960 మంది సేవామిత్ర పురస్కారాలను అందుకున్నారన్నారు. అవినీతికి తావు లేకుండా పథకాలను అందించడంలో వలంటీర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. అనంతరం మండలంలోని గొంది, చిట్టవరం, పాతనవరసపురం, కొత్తనవరసపురం, సరిపల్లి, లిఖితపూడి, మల్లవరం, మల్లవరంలంక, కొప్పర్రు, కే.బేతపూడి, సీతారాంపురం నార్త్, సీతారాంపురంసౌత్, రాజుగారితోట తదితర గ్రామాలకు చెందిన వలంటీర్లకు ఆయన పురస్కారాలు అందజేశారు. మార్కెట్‌యార్డు చైర్మన్ కొల్లాబత్తుల రవికుమార్, బొక్కా రాధాకృష్ణ, ఉంగరాల రమేష్, దొంగ మురళీకృష్ణ, పోతురాజు చిట్టిబాబు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
అమాత్య యోగం.. అద్వితీయం.. కీలక నేతలకు కేబినెట్లో స్థానం
సాక్షి, ఏలూరు: సీనియార్టీకి సముచిత స్థానం, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా జిల్లాలో కీలక నేతలకు మంత్రి పదవులు దక్కాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు నేతలకు తొలిసారి కేబినెట్లో చోటు దక్కగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తానేటి వనితకు మరలా అమాత్య యోగం దక్కింది. నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముదునూరు ప్రసాదరాజుకు చీఫ్ విప్‌గా అవకాశం రాగా మొత్తంగా కేబినెట్లో జిల్లాకు కీలక ప్రాధాన్యం దక్కింది. అంకితభావానికి పెద్దపీట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు యధావిధిగా మూడు మంత్రి పదవులు దక్కాయి. గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాదిరిగానే ఇప్పుడూ ప్రాధాన్యమిచ్చారు. ఈసారి అదనంగా ప్రభుత్వ విప్ పదవిని కూడా అప్పగించారు. పార్టీపై విధేయత, పాల నపై అంకితభావం చూపిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమ ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గంలో బెర్తులు ఖరారు చేశారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ యాదవ), తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనా రాయణ (కాపు), కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత (ఎస్సీ), న రసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు (క్షత్రి య)కు పదవియోగం దక్కింది. సామాజిక కూర్పు లు, పార్టీల విధేయత ఇలా పలు అంశాలను ప్రామా ణికంగా తీసుకుని మంత్రి పదవులకు ఎంపిక చేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా వారికి ఆహ్వానాలు అందాయి. తొలిసారిగా కేబినెట్లోకి.. తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు తొలిసారి కేబినెట్లో చోటుదక్కించుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆయా ప్రాంతాల్లో బాణసంచా కాల్పులు, మోటార్ సైకిల్ ర్యాలీలు జరిగాయి. తణుకులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం నిర్వహించారు. మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి చరిత్రలో బీసీ సామాజిక వర్గంలో శెట్టిబలిజకు మా త్రమే కేబినెట్లో అవకాశం దక్కగా.. ఈసారి ఇందుకు భిన్నంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరికి అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలు వనిత, కొట్టు, కారుమూరి, ముదునూరి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, పార్టీకి విధేయులుగా ఉంటూ పాలనలో తమ మార్కును చూపిస్తున్నారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవులు, ఒకరికి చీఫ్ విప్ పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా నూతన పశ్చిమగోదావరిలో ఇద్దరికి అవకాశం రాగా ఏలూరు జిల్లాలో ఎవరికీ చాన్స్ దక్కలేదు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యానికి జై‘కొట్టు’ తాడేపల్లిగూడెం: సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, ని రంతరం ప్రజలను వె న్నంటి ఉండే గుణంతో బలమైన నాయకుడిగా ఎదిగారు ప్రభుత్వ హా మీల అమలు కమిటీ చై ర్మన్, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. 1994 నుంచి సుమారు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన పలు సమస్యలపై పోరాడారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సందర్భంలో పట్టణంలో అ భివృద్ధి ఎలా ఉంటుందో ల్యాండ్ మార్కులతో చేసి చూపించారు. 2004లో దివంగత వైఎస్సార్ సారథ్యంలో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఐదేళ్ల పదవీ కాలంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. పీసీసీ సభ్యునిగా, మెంబర్ ఆఫ్ ఎస్యూరెన్స్ కమిటీ ఏపీ లెజిస్లేటివ్, మెంబర్ ఆఫ్ హౌస్ కమిటీ ఇరిగ్యు లారిటీస్ ఆఫ్ మిల్క్‌డైరీస్ సభ్యునిగా పనిచేశారు. గత సాధారణ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు వైఎస్సార్ సీపీలో చేరిన ఆయన 2019లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజ యం సాధించారు. ప్రభుత్వ హామీల అమలు కమి టీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1955 అక్టోబర్ 19న కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతి దంపతులకు ఆ యన జన్మించారు. భార్య సౌదామిని, ఇద్దరు కుమారులు బాలరాజేష్, విశాల్, కుమార్తె కంచన్ ఉన్నా రు. పుస్తకాలు చదవడం, బ్యాడ్మింటన్ ఆడటం ఆయన అలవాట్లు. నిత్యం యోగా చేస్తుంటారు. అందరివాడు.. కారుమూరి తణుకు అర్బన్ : తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. వి ద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లపాటు సేవలందించారు. 2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్ సారథ్యంలో 2009లో తణుకు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తర్వాత కాలంలో వైఎస్సార్ పార్టీలో చేరి 2014లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరలా 2019 ఎన్నికల్లో తణుకు నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ న్యూ అలుమ్నీ అసోసియేషన్ వెస్ట్ బ్రుక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. వైఎస్సార్ విద్యుత్ ఎంప్లా యీస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. మీ ఇంట్లో మంత్రిగా ఉంటా.. ‘నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది దివంగత ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే మంత్రి పదవి ఇచ్చి నన్ను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది సీఎం జగన్. బీసీ నేతగా నన్ను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎప్పటిలాగే నియోజకవర్గంలో ప్రజానీకానికి అందుబాటులోనే ఉంటూ మీ ఇంట్లో మంత్రిగానే ఉంటాను’ అని ఆయన స్పష్టం చేశారు. విధేయతలో రా‘రాజు’ నరసాపురం: పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసి విధేయతలో రారాజుగా నిలిచారు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. దివంగత సీఎం వైఎస్సార్ స్ఫూర్తితో 2002లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ అంచెలంచెలుగా ముందుకు సాగారు. యలమంచిలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో నరసాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప తేడాతో పరాజయం పొందారు. ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం ఎమ్మెల్యే అప్పటినుంచి 2009 వరకూ నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా గెలుపొందారు. వైఎస్సార్ అకాల మరణం అనంతరం జరిగిన పరిణామాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచి 2012లో ఎమ్మె ల్యే పదవిని త్యాగం చేశారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అతిస్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. మరలా 2014లో ఆచంట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి వైఎస్సార్ సీపీ ఇన్చార్జిగా వ్యవహరించి నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజర్టీతో గెలుపొందారు. 1974 మే 29న సత్యనారాయణరాజు, వెంకట సరోజినీదేవి దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు భార్య శారదావాణి, కుమారుడు శ్రీకృష్ణంరాజు, కుమార్తె సింధూజ ఉన్నారు. -
మొగల్తూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి ప్రసాదరాజు ఏన్నికల ఫ్రచారం
-
ప్రజల్ని మభ్యపెట్టడానికే చంద్రబాబు దీక్ష
నరసాపురం రూరల్: నాలుగున్నరేళ్లుగా ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చిన సీఎం ఇప్పుడు ఎన్నికల వేళ దీక్షలపేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొన్నటి వరకు బీజేపీ నేతలను పొగిడిన చంద్రబాబు అభివృద్ధికి సహకరించలేదంటూ ఇప్పుడు దొంగ దీక్షలకు దిగుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రానికి జరిగిన నష్టానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమన్నారు. సీఎం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ప్రజల్ని తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేసుకోవడం కోసం పాఠశాలలకు శెలవులిస్తున్నారని, ఈ ఏడాది 38 సెలవులివ్వడంతో బోధనకుంటుపడిందన్నారు. కలెక్టర్ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని విమర్శించారు. -
రైతులను ఆదుకున్నది వైఎస్ ఒక్కరే
భీమవరం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని రైతులను అన్ని విధాలా ఆదుకున్నది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. గురువారం ఆయన భీమవరంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రుణమాఫీ చేసి రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. జలయజ్ఞం, డెల్టా ఆధునికీకరణ వంటి పనులకు శ్రీకారం చుట్టి రైతుల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. ప్రాంతాలకతీతంగా రైతులకు అండగా నిలిచి వారి కష్టాలు, బాధల ను తీర్చారన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉండుంటే ఆయన చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేదన్నారు. రాష్ట్రంలో తిరిగి రైతు రాజ్యం రావాలంటే వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్ సీపీ స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు ముదునూరి చెప్పారు. టీడీపీ పాలనలో చంద్రబాబు వ్యవసాయాన్ని దండగగా చేశారని, అన్నదాతలను అన్ని విధాలా నట్టేట ముంచారని విమర్శించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని వైఎస్ ప్రవేశపెడితే కరెంట్ తీగలపై దుస్తులు ఆరేసుకుంటామంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబే వైఎస్ అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని చూసి తాను కూడా ఇస్తానంటూ హామీ ఇవ్వడం ప్రజలు గమనించాలని కోరారు. రైతులను అన్నివిధాలా దగా చేసిన చంద్రబాబు నేడు ఓట్ల కోసం ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. మన ప్రాంతానికి ఎంతో అవసరమైన పోలవరం ప్రాజెక్టును టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చకపోవటంతో ఆయన నిజస్వరూపం తేటతెల్లమవుతుందన్నారు. రైతులు, రైతు కూలీల పట్ల చంద్రబాబుకు ఏమాత్రం విశ్వాసం లేదన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని ముదునూరి ప్రసాదరాజు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
వైసీపీతోనే గ్రామాల అభివృద్ధి
భీమవరం, న్యూస్‌లైన్ : తీర ప్రాంత గ్రామాల అభివృద్థి వైఎస్సార్ సీపీకే సాధ్యమని ఆ పార్టీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో, ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోగ్రామాలు అభివృద్ధిబాటలో పయనించాయన్నారు. ఆయన మృతి తరువాత ప్రభుత్వం నిర్లక్ష్యంతో తాగునీరు, సాగునీరుకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మౌలిక సదుపాయాలు కూడా సక్రమంగా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే రాజన్న రాజ్యం తిరిగి రావాలన్నారు. అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. తద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే గ్రామాలకు మహర్దశ పట్టనుందన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను విస్మరించిందన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థిని రేవు వెంకట సత్యవతి, లోసరి ఎంపీటీసీ అభ్యర్థి బొమ్మిడి వాణి, కొత్తపూసలమర్రు ఎంపీటీసీ అభ్యర్థి తిరుమాని తులసీరావు, గూట్లపాడు అభ్యర్థి కొప్పర్తి లక్ష్మిమంగతాయారు, గొల్లవానితిప్ప అభ్యర్థి మల్లాడి లక్ష్మికుమారి పాల్గొన్నారు.