mulapeta port
-
బాబు ‘ప్రైవేటు’ మమకారానికి.. 3 పోర్టులు బలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంలో మరెవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పిన సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మూడు ప్రధాన పోర్టులపై కన్నేశారు. వీటిని ప్రైవేటు పరం చేసేందుకు శర వేగంగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని ప్రైవేట్ పరం చేసి సీఎం చంద్రబాబు చేతులు దులుపుకొంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో వాటిని తన వారికి అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 65 శాతానికి పైగా పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టును, 50 శాతానికి పైగా పనులు జరిగిన మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు పిలవడం అధికార, పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అంతిమంగా ఇది న్యాయ వివాదాలకు దారి తీసి పోర్టుల నిర్మాణాలు నిలిచిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు పోర్టుల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సమకూర్చింది. వివిధ బ్యాంకుల, ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసిన తర్వాతే పనులు ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు ఈ పోర్టుల నిర్మాణ పనులు కొనసాగించడానికి నిధుల కొరత కూడా లేదు. నిర్మాణ పనులు దాదాపు సగానికిపైగా పూర్తయి వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న తరుణంలో అసంబద్ధంగా ప్రైవేటీకరణ చేయడంలో ఎటువంటి ప్రజా ప్రయోజనాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే పోర్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దీని వెనుక ఏదో కుంభకోణం ఉండవచ్చని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో మత్స్యకారులకు మేలు జరిగేలా, లక్షల మందికి ఉపాధి కల్పించి వలసలను నివారించేలా, మత్స్య సంపదను పెంపొందించే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన 10 ఫిషింగ్ హార్బర్లను సైతం ప్రైవేటుకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. వాణిజ్యం, ఉపాధికి ఊతమిచ్చేలా రాష్ట్రానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తొలిదశలో రూ.13వేల కోట్లకు పైగా వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని గత ప్రభుత్వమే చేపట్టింది. కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టింది. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో నిర్మిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం ఉండదన్న ఉద్దేశంతో గత సర్కారు ల్యాండ్‌లార్డ్ మోడల్లో పోర్టుల నిర్మాణం చేపట్టింది. ప్రతి పోర్టుకు ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకొని వేగంగా పనులు చేపట్టింది. న్యాయ వివాదాలతో ఆగిపోయే ప్రమాదం..! ఇప్పటికే మూడు పోర్టు పనులను మూడు సంస్థలు చేస్తుండగా.. కొత్తగా తిరిగి నిర్మాణ పనుల కోసం మారిటైమ్ బోర్డు ఈవోఐ పిలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ టెండర్ల గురించి తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఓపక్క తాము పనులు చేస్తుండగా మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారో అర్థం కావడంలేదని కాంట్రాక్టు సంస్థలు వాపోతున్నాయి. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే అప్‌గ్రెడేషన్, పోర్టు మోడర్నైజేషన్ అంటూ టెండర్లు ఎలా పిలుస్తారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎక్కడివక్కడ నిలిపేసి మొత్తం మూడు పోర్టులను ప్రైవేటు పార్టీలకు అప్పగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఈ వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు చేస్తున్న సంస్థలను బెదిరించడానికి టెండరు నోటీసు ఇచ్చినట్లుగా ఉందని మరో సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలుచోట్ల భూసేకరణ వివాదాలు నడుస్తున్నాయని, పోర్టులు ప్రైవేటు పరమైతే ఇవి మరింత జటిలమై న్యాయపరమైన చిక్కులతో నిర్మాణాలు ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య నుంచి వివరణ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. గతంలో పీపీపీ విధానంలో నిర్మించిన గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం సొంతంగా పనులు చేపట్టిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టనర్íÙప్ (పీ 4) పేరుతో అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ హార్బర్లు కూడా.. మన మత్స్యకారులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లకూడదనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,500 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పది హార్బర్లు అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది. వీటిలో ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు పూర్తి కాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పోర్టుల నిర్మాణం, నిర్వహణ కోసం బిడ్లు ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన టెండర్ మిగిలిన హార్బర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మొత్తం పది పిషింగ్ హార్బర్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా టెండర్లను పిలిచింది.ఒకేసారి 3 పోర్టులు చరిత్రలో తొలిసారిప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 3 పోర్టుల నిర్మాణాన్ని చేపట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఈ ఘనతను గత వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించింది. రామాయపట్నం పోర్టు పనులను అరబిందో, మచిలీపట్నం పోర్టును మెగా, మూలపేట పోర్టు నిర్మాణ పనులను విశ్వసముద్ర సంస్థలు దక్కించుకున్నాయి. రామాయపట్నం పోర్టులో బల్క్ కార్గో బెర్తు పనులు 100 శాతం పూర్తయ్యాయి. కేంద్రం నుంచి అనుమతులు వస్తే బెర్త్ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఈ దశలో చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడిచి ప్రైవేటుకు లబ్ధి చేకూర్చేందుకు సన్నద్ధమైంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను నిర్మించి అభివృద్ధి చేసి నిర్వహించడంపై ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్ల (ఈవోఐ)ను ఆహ్వానిస్తూ ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లను పిలిచింది. నవంబర్ 4లోగా బిడ్లు దాఖలు చేయాలని టెండర్ నోటీసులో పేర్కొంది. -
టీడీపీ నాయకుల హౌస్ అరెస్ట్ మూలపేట పోర్టుకు గట్టి భద్రత
-
శరవేగంగా మూలపేట పోర్టు నిర్మాణ పనులు
-
మూలపేట పోర్టు పనులపై సీఎం జగన్ ఏరియల్ సర్వే (ఫొటోలు)
-
‘తోడేళ్లన్నీ కలిసి చీకటి యుద్ధం.. పెత్తందార్ల కోసం టీడీపీ.. పేదల కోసం నేను’
నౌపడ నుంచి సాక్షి ప్రతినిధి/అరసవల్లి/ సంతబొమ్మాళి/కోటబొమ్మాళి: ‘తమ పాలనలో ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పుకోలేని వారు, మంచి చేయలేని వారంతా ఇప్పుడు ఏకమవుతున్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. తోడేళ్లలా ఏకమై ఈ రోజు ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి, అదే నిజమని నమ్మించే చీకటి యుద్ధం రాష్ట్రంలో జరుగుతోంది. ఈ చీకటి యుద్ధాన్ని గమనించండి’ అని సీఎం జగన్ అన్నారు. బుధవారం ఆయన మూలపేట పోర్టు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘ఈ రోజు పెత్తందార్ల పక్షాన నిలబడ్డ టీడీపీకి, పేదవాడి పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు మ«ద్య యుద్ధం జరుగుతోంది. వ్యవస్థల మేనేజ్‌ను నమ్ముకున్న వారికి, ప్రజలను నమ్ముకుని ప్రజల కోసమే బతుకుతున్న మీ బిడ్డకు మధ్య యుద్ధం జరుగుతోంది. వారి మాదిరిగా మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేవు. దత్తపుత్రుడూ లేడు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నా నమ్మకం,నా ఆత్మవిశ్వాసం మీరు. మీ బిడ్డ నమ్ముకున్నది ఒక్క దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు మాత్రమే. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి. కానీ మీ బిడ్డకు భయం లేదు. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నాను. ఈ అబద్ధాలను నమ్మకండి.వీళ్ల మాదిరిగా అబద్ధాలు చెప్పే అలవాటు మీ బిడ్డకు లేదు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలబడండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా కదలండి’ అని కోరారు. పేరుపేరునా పలకరింపు మూలపేట పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రతినిధులతో సీఎం ఆప్యాయంగా మాట్లాడారు. పేరు పేరునా పలకరిస్తూ.. భూములు ఇచ్చిన వారి త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని చెబుతూ ధన్యవాదాలు తెలిపారు. వారంతా బహిరంగ సభలో సీఎం జగన్‌ను సత్కరించారు. సంప్రదాయ బోటు జ్ఞాపిక, శ్రీవారి ప్రతిమ అందజేశారు. కాగా, పోర్టు నిర్వాసితులు 594 మందికి నౌపడ వద్ద 58 ఎకరాల్లో పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. రూ.34.98 కోట్లతో పనుల ప్రారంభానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స , గుడివాడ, ధర్మాన, అంబటి, సీదిరి, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్రలో కొత్త చరిత్ర.. నౌపడ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
మనం అధికారంలోకి రాక ముందు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులు మాత్రమే ఉన్నాయి. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక, ఈ 46 నెలల కాలంలో మరో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. మరో మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు అప్రూవల్ తీసుకున్నాం. వేగవంతంగా నిర్మాణంలోకి తీసుకువస్తాం. తద్వారా పారిశ్రామికాభివృద్ధికి తీర ప్రాంతం వేదిక అవుతుంది. లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నౌపడ నుంచి సాక్షి ప్రతినిధి: మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజీ ఎత్తిపోతల పథకం, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టుల ద్వారా రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. విశాఖ నుంచి 170 కిలోమీటర్లు, చెన్నై– కోల్‌కతా నేషనల్ హైవేకు కేవలం 14 కిలోమీటర్లు, ప్రధాన రైల్వే మార్గానికి 11 కిలోమీటర్ల దూరంలో 1,250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న మూలపేట పోర్టు.. రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇక్కడే 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని చెప్పారు. పోర్టు ఆధారిత, అనుబంధ పరిశ్రమలు, ఇతరత్రా లక్షల్లో మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందివచ్చే కార్యక్రమం చేపడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని మూలపేట తీరంలో పోర్టు నిర్మాణానికి, ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్ ఎత్తిపోతల పథకానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా సంతబొమ్మాళి మండలంలోని నౌపడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉంటే, అందులో ఏకంగా 193 కిలోమీటర్లు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఉందన్నారు. అయినా ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, కనీసం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఉండి ఉంటే ఈ జిల్లా చెన్నై, ముంబయిగా అభివృద్ధి చెంది ఉండేదని చెప్పారు. ఈ విషయం తెలిసీ కూడా దశాబ్దాలుగా ఎవ్వరూ ఈ దిశగా అడుగులు వేసి, చిత్తశుద్ధి చూపలేదన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ఇంకా ఏమన్నారంటే.. అభివృద్ధికి మూల స్తంభం ► మూలపేట ఇక మూలనున్న గ్రామం కాదు. ఇది అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తుంది. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలు రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మరో చెన్నై, ముంబయి కాబోతున్నాయి.మూలపేటలో మనం కట్టబోతున్న పోర్టు సామర్థ్యం ఏకంగా ఏడాదికి 24 మిలియన్ టన్నులు. ఈ పోర్టులో 4 బెర్తులు నిర్మిస్తున్నాం. ► ఈ రోజు నుంచి 24 నెలల్లో ఈ పోర్టు నిర్మాణం పూర్తవుతుంది. దాదాపు రూ.2,950 కోట్ల ఖర్చుతో పోర్టు నిర్మాణం చేపడుతున్నాం. ఇక్కడ ట్రాఫిక్ పెరిగి ఈ పోర్టు సామర్థ్యం వంద మిలియన్ టన్నులకు పెరిగే రోజు సమీపంలోనే ఉంది. దీన్ని ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడానికి 14 కిలోమీటర్ల పొడవున రోడ్డు, 11 కిలోమీటర్ల పొడవున రైలుమార్గం నిర్మిస్తున్నాం. ► ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టా బ్యారేజీ నుంచి పైపులైన్ వేసి 0.5 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి సరఫరా చేయడానికీ శ్రీకారం చుడుతున్నాం. ఇలా మౌలిక వసతులకు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తదితర వ్యయాలను కలిపితే మూలపేట పోర్టు నిర్మాణానికి మనందరి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము రూ.4,362 కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా. గంగపుత్రుల కళ్లల్లో మరింత కాంతి గంగపుత్రుల కళ్లల్లో మరిన్ని కాంతులు నింపడానికి, మత్స్యకార సోదరులకు మరింత అండగా ఉండేందుకు మూలపేట పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. రూ.365.81 కోట్లతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. మంచినీళ్లపేటలో రూ.12 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి 2019 సెప్టెంబర్‌లో శ్రీకారం చుట్టాం. దాన్ని మరో రూ.85 కోట్ల ఖర్చుతో ఫిషింగ్ హార్బర్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. రైతుల శ్రేయస్సే లక్ష్యం ► వంశధార, నాగావళి నదులు ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల శ్రీకాకుళం జిల్లా ఇప్పటికీ సస్యశ్యామలం కాని పరిస్థితి. అప్పట్లో దివంగత నేత, నాన్న గారు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వంశధార ఫేజ్ 2, స్టేజ్ 2 కింద 33 కిలోమీటర్ల పొడవున కాలువల తవ్వకం, హిరమండలం రిజర్వాయర్‌ను 19 టీఎంసీల కెపాసిటీతో నిర్మాణ పనులకు అడుగులు వేగంగా వేయించారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఆ అడుగులు ముందుకు పడలేదు. ► నేరడి బ్యారేజ్ పూర్తయితే తప్ప హిరమండలం రిజర్వాయర్‌లో 19 టీఎంసీల కెపాసిటీతో నీరు పెట్టడం సాధ్యం కాదు. మీ బిడ్డ గతంలో ఏ ముఖ్యమంత్రి చూపని చొరవ చూపించారు. ఒడిశాకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలిసి నేరడి బ్యారేజ్ గురించి మాట్లాడారు. దాని పరిస్థితి అలానే ఉన్నా మధ్యేమార్గంగా మన రైతన్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి జరగాలన్న ఉద్దేశంతో రూ.176.35 కోట్లతో గొట్టా బ్యారేజ్‌పై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తున్నాం. ► మరోవైపు వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా ఆగçస్టు నెలలోనే పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం. మహానేత రాజశేఖరరెడ్డి మొదలు పెట్టిన మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేసేందుకు, మూడు నియోజకవర్గాల రూపురేఖలను మార్చేందుకు మరో రూ.400 కోట్లు ఖర్చయ్యే పనులకు ఈ రోజు శ్రీకారం చుట్టాం. ఉద్దానంలో కిడ్నీ బాధితులకు ఊరట ► ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మొదలు పెట్టిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూన్‌లో ప్రారంభోత్సవం చేస్తాను. ► హిరమండలం రిజర్వాయర్ నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమానికి రూ.700 కోట్లతో నాంది పలికాం. దీన్ని జూన్ మాసంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను. అదే రోజున పాతపట్నం నియోజకవర్గంలో మరో రూ.265 కోట్లతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తూ శంకుస్థాపన చేస్తాను. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బేరీజు వేయండి ► ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించిన పరిస్థితులను ఒక్కసారి బేరీజు వేయండి. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, పార్వతీపురం, నర్సీపట్నం, విజయనగరంలో మెడికల్ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ► ఈ ప్రాంతంలో ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్న విషయం గమనించాలి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీకి జూన్‌లో శంకుస్థాపన చేస్తాం. మే 3వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి వీలుగా రూ.6,200 కోట్లతో ఆరు లైన్ల రహదారిని నిర్మించబోతున్నాం. తీర ప్రాంతంలో ఇలాంటి అభివృద్ధి గతంలో ఎందుకు జరగలేదో ఆలోచించండి. సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం ► ఏపీలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి మీ బిడ్డ విశాఖలో కాపురం పెడతాడని తెలియజేస్తున్నా. ► ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా, ఏ గ్రామం తీసుకున్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి కనిపిస్తోంది. స్కూళ్లు మారుతున్నాయి. కొత్తగా మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఉన్న ఆస్పత్రులన్నీ రూపురేఖలు మారుతున్నాయి. ► ప్రతి ఇల్లూ అభివృద్ధి కావాలి. నా అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనపడాలి. 46 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా సొమ్మును నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసింది. ► మీ బిడ్డ జగన్ డీబీటీ బటన్ నొక్కటం మాత్రమే కాదు... కులాలు, కుటుంబ చరిత్రలను మార్చాలన్న తపన, తాపత్రయంతో పని చేస్తున్నాడని గుర్తించాలి. నవరత్నాల పాలనతో ఇంటింటి చరిత్రను, సామాజిక వర్గాల చరిత్రను తిరగ రాస్తున్న ప్రభుత్వంగా, ప్రాంతాల చరిత్రలను, పారిశ్రామిక వాణిజ్య చరిత్రను కూడా మారుస్తున్నాం. -
CM Jagan Srikakulam Tour: సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం (ఫొటోలు)
-
కార్యకర్తలను ప్రేమగా పలకరించిన సీఎం జగన్
-
మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
-
సీఎం జగన్ ను చూసేందుకు జనం ఉరుకులు పరుగులు
-
శ్రీకాకుళం జిల్లా మూలపేటకు చేరుకున్న సీఎం జగన్
-
కాసెపట్లో మూలపేట గ్రీన్ ఫిల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
-
ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే: సీఎం జగన్
Updates దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా.. ‘‘మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు’’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ కీలక ప్రకటన ►శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామన్నారు. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం తెలిపారు. ►ఇవాళ నాలుగు మంచి కార్యక్రమాలు జరుపుకున్నాం: సీఎం జగన్ ►మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం ►నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేసుకున్నాం ►ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిప్ట్ లిరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నాం ►ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చివేస్తాయి ►గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారు ►ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుంది ►భవిష్యత్‌లో మూలపేట, విష్ణు చక్రం మరో ముంబై, మద్రాస్ కాబోతున్నాయి ►24 నెలల్లో పోర్ట్ పూర్తవుతుంది ►పోర్టు నిర్మాణానికి రూ.4,362 కోట్లు ఖర్చు చేస్తున్నాం ►పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 35వేల మందికి ఉపాధి లభిస్తుంది ►పోర్టు వస్తే.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి ►అప్పుడు లక్షల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ►మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు ►గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ►గంగపుత్రులు వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండేందుకు కృషి ►పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ►బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ►రాష్ట్రంలో ఇప్పటివరకు 4 పోర్టులు మాత్రమే ఉండగా.. మనం అధికారంలోకి వచ్చాక మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం తీరప్రాంత అభివృద్ధికి సంబంధించి గతంలో ఇలాంటి అభివృద్ధి ఎందుకు జరగలేదు? ►సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన చరిత్రలో గుర్తుండిపోయేలా.. ►చరిత్రలో గుర్తుండిపోయేలా మూలపేట పోర్టుకు ఈ రోజు శంకుస్ధాపన జరిగిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దాదాపు 30 నెలల్లో పూర్తి చేయనున్న ఈ పోర్టు ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది స్ధానిక యువతకు ఉపాధి కల్పించబోతున్నారన్నారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను అనేక ప్రభుత్వాలను చూశాం, ఈ రోజు మన రాష్ట్రానికి సహజసిద్దంగా ఉన్నటువంటి సముద్రతీరాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలని, తద్వారా ఈ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో సీఎం 2019లో ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏర్పాటు చేసి దాదాపు రూ. 16 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. దీంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టు, మరో 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నారు. ఈ ఘట్టం శ్రీకాకుళం చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతుంది.రానున్న కాలంలో ఈ ప్రాంతంలో మరిన్ని మంచి కార్యక్రమాలు సీఎంద్వారా చేస్తామని మంత్రి అన్నారు. 75 ఏళ్ల చరిత్రలో ఇవాళ చరిత్రాత్మక ఘట్టం: ఎమ్మెల్సీ దువ్వాడ ►నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిరహిత పాలన అందిస్తున్నారన్నారు. రైతులను విత్తనం నుంచి విక్రయం వరుకు ఆదుకుంటున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. ►మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిప్ట్ లిరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు ►సీఎం జగన్ మూలపేటలో పర్యటిస్తున్నారు. గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ►సీఎం వైఎస్ జగన్ మూలపేటకు చేరుకున్నారు. కాసేపట్లో మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ►శ్రీకాకుళం జిల్లా మూలపేట పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని నిర్ణయించారు. ►విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. అంతేగాక వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీని సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. ►శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా బుధవారం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం కాగా, కాకినాడ సెజ్ పోర్టులో శరవేగంగా పనులు సాగుతున్నాయి. ►వచ్చే నెలలో మచిలీపట్నం (బందరు) పోర్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. పదేళ్లలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్ల లోపే నాలుగు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విశేషం. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుకే ఎగుమతులు జరగనున్నాయి. -
మూలపేట పోర్టుకు భూమి పూజ.. పోర్టు విశేషాలివే..
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు బుధవారం సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని నిర్ణయించారు. విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. అంతేగాక వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీని సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. మరికొన్ని ప్రాజెక్టులకు కూడా శ్రీకారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా బుధవారం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం కాగా, కాకినాడ సెజ్ పోర్టులో శరవేగంగా పనులు సాగుతున్నాయి. వచ్చే నెలలో మచిలీపట్నం (బందరు) పోర్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. పదేళ్లలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్ల లోపే నాలుగు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విశేషం. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుకే ఎగుమతులు జరగనున్నాయి. మూలపేట పోర్టు విశేషాలు – పోర్టు సామర్థ్యం ఏడాదికి 23.5 మిలియన్ టన్నులు – బెర్తుల సంఖ్య 4 – ఎన్‌హెచ్ 16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ నాలుగు లైన్ల రహదారి – నౌపడ జంక్షన్ నుంచి పోర్టు దాకా 10.6 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం – గొట్టా బ్యారేజ్ నుంచి 50 కి.మీ. పైప్‌లైన్‌తో 0.5 ఎంఎల్డీ నీటి సరఫరా – పోర్టుకు అనుబంధంగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో కార్గో హ్యాండ్లింగ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు సిక్కోలు మత్స్యకారులకు బాసటగా.. 2018 నవంబర్ 27న పాకిస్తాన్ భద్రతా దళాలకు పట్టుబడి 13 నెలలు కరాచీలో జైలు జీవితం గడిపిన 20 మంది మత్స్యకారులను గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం విదేశాంగ శాఖతో పలుసార్లు మంతనాలు జరిపి 2020, జనవరి 6న వారిని విడుదల చేయించడంలో సఫలీకృతమైంది. అలాగే కరోనాతో లాక్డౌన్ విధించినప్పుడు గుజరాత్లో చిక్కుకున్న 3,064 మంది శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను రూ.3 కోట్ల ఖర్చుతో 46 బస్సుల ద్వారా ప్రభుత్వం స్వస్థలాలకు చేర్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే సంకల్పంతో రాష్ట్రంలో 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్న 6 పోర్టులతో పాటు త్వరలో నిర్మాణం కానున్న 4 పోర్టులతో ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ విలసిల్లనుంది. మారనున్న ఉత్తరాంధ్ర ముఖచిత్రం ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వచ్చే నెలలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురం–విశాఖపట్నం మధ్య ఆరు లైన్ల రహదారి పూర్తయింది. మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదేవిధంగా వచ్చే నెలలోనే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, పాడేరులో వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాల, అనకాపల్లి, విజయనగరం వైద్య కళాశాలల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పార్వతీపురం వైద్య కళాశాల పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఏకంగా రూ.700 కోట్లతో వంశధార నీటితో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో ఇళ్లకు నీరందించే పనులు 95 శాతం పూర్తయ్యాయి. దీన్ని త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. అలాగే దీన్ని పాతపట్నం నియోజకవర్గానికి కూడా విస్తరిస్తూ మరో రూ.265 కోట్ల పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తారు. సాలూరులో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి జూన్‌లో ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల పరిధిలో విస్తారంగా లభిస్తున్న మత్స్య సంపద, టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ఖ్యాతి గాంచిన నీలి గ్రానైట్‌కు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సదుపాయం కల్పించనుంది. కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు, థర్మల్ కోల్, కోకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి మూలపేట పోర్టు కేంద్రం కానుంది. అదేవిధంగా ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు, మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి ఇక్కడి నుంచి అవకాశముంటుంది. పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్ ఏర్పాటు ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే సౌలభ్యం కూడా లభిస్తుంది. సుమారు రూ.35 కోట్లతో తీరప్రాంత–పోర్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, పారిశ్రామికీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అతి పెద్ద సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళుతోంది. -
ఈనెల 19న సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి(బుధవారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా, శ్రీకాకుళం పర్యటనలో మూలపేట పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఈ కార్యక్రమం జరుగనుంది. -
భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం
సాక్షి, విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం చేస్తూ రాష్ట్ర పెట్టుబడులు మరియు మౌలిక వసతుల (పోర్టులు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టుకు భూసమీకరణ నిమిత్తం జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు సంబంధించిన రైతులతో సమావేశం నిర్వహించినప్పుడు గ్రామస్థులు పోర్టు సంబంధింత భూములన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లోనే ఉన్నాయని, పోర్టు ప్రతిపాదిత ప్రాంతంలో భావనపాడు లేనందున పోర్టుకు మూలపేట పోర్టుగా పేరు పెట్టాలని కోరినట్లు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి విన్నవించారన్నారు. పోర్టు నిర్మాణ ప్రాంతంలోని భూములు, నిర్వాసిత కుటుంబాలన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల పరిధిలో ఉన్నందున గ్రామస్థుల కోరిక మేరకు భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గతంలో భావనపాడు పోర్టుగా నోటిఫై చేసిన ప్రాంతాన్ని ఇకపై మూలపేట పోర్టుగా పరిగణించాలని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సదరు మూలపేట పోర్టుకు ఏప్రిల్ 19వ తేదీన భూమిపూజ చేయనున్నారని పెట్టుబడులు మరియు మౌలిక వసతుల (పోర్టులు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ. కరికాల్ వలవన్ తెలిపారు.