Mumbai Flats
-
బ్రిటీష్ పాలకుల హయాంలోని ఆస్తి కేసు..ఇన్నేళ్ల తర్వాత 93 ఏళ్ల మహిళ..
బ్రిటీష్ పాలకుల టైంలోని ఆస్తి కేసుకి ఇన్నేళ్లకు మోక్షం లభించింది. ఆ కేసు కోసం ఎనిమిది దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళ చివరికి గెలిచింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఈ మేరకు అలిస్ డిసౌజాకు అనే మహిళ దక్షిణ ముంబైలోని రెండు ఫ్లాట్ల కోసం బాంబే హైకోర్టులో ఏళ్ల తరబడి పోరాడుంది. ఈ ఫ్లాట్లు దక్షిణ ముంబైలోని రూబీ మాన్షన్‌లో మొదటి అంతస్తులో 599 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకటి, 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో మరొకటి ఉన్నాయి. మార్చి 28న 1942న అప్పటి బ్రిటీష్ పాలకులు అనుమతించిన డిఫెన్స్ ఇండియా చట్టం ప్రకారం.. ప్రైవేటు ఆస్తులు స్వాధీనం చేయాలని అభ్యర్థిస్తూ..ఈ భవనంపై పిటీషన్ దాఖలు చేసింది డిసౌజా. దీంతో న్యాయమూర్తులు ఆర్డీ ధనుక, ఎంఎం సతయేలతో కూడిని డివిజన్ బెంచ్ మే 4న 1946లో డీ రిక్విజిషన్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఏడాది జులై, 1946 కల్లా యజమాని అలిస్ డిసౌజాకు తిరిగి అప్పగించాలని స్పష్టం చేసింది. కానీ అది జరగలేదు. ప్రస్తుతం సదరు యజమాని డిసౌజాకు 93 ఏళ్లు. ఆమె తన ఆస్తి కోసం దాఖలు చేసిన పిటీషన్లో ఈ విషయాన్ని పేర్కొంది. అయితే అప్పటి మున్సిపాలిటి శాఖలోని ప్రభుత్వాధికారి లాడ్ ఈ ఫ్లాట్లలో నివాసం ఉండేవారు. 1946లో కోర్టు ఉత్తర్వులను నాటి మాజీ ప్రభుత్వాధికారి వారసులు వ్యతిరేకించినట్లు కూడా పిటీషన్లో పేర్కొంది. తాను తన డీ రిక్విజిషన్ ఆర్డర్లను సైతం ఉపసంహరించుకున్నప్పటికీ తన ఫ్లాట్లను అప్పగించలేనట్లు వెల్లడించింది. అదే భవనంలోని ఇతర ఫ్లాట్లు యజమానుకు అప్పగించినట్లు కూడా కోర్టుకి తెలియజేసింది. అందువల్ల జూలై 1946 డీ రిక్విజిషన్ ఉత్తర్వును తిరిగి అమలు చేసి తన ఫ్లాట్లను తనకు అప్పగించేలా మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముంబై కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని డిసౌజా తన పిటిషన్లో కోరారు. దీంతో కోర్టు ప్రస్తుతం నివాసం ఉంటున్న వ్యక్తుల నుంచి ఎనిమిది వారాల్లోపు శాంతియుతంగా స్వాధీనం చేసుకుని సదరు యజమాని డిసౌజాకి అప్పగించాలని బాంబే కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. (చదవండి: ఖర్గే కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది! కాంగ్రెస్ ఆరోపణలు) -
అంతా వట్టిదే
ముంబై: పొవాయిలో చౌక ఇళ్ల పథకం అంతా బోగసేనని తేలిపోయింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇదంతా వట్టిదేనని స్పష్టం చేయడం పొవాయి వాసులను నిర్వేదంలోకి నెట్టేసింది. ఆర్థికంగా వెనుకబడిన తమకు ప్రభుత్వం రూ.54 వేలకే సొంత ఫ్లాట్ ఇస్తుందన్న ఆశతో మంత్రాలయలో రోజంతా నిలబడి చేసుకున్న దరఖాస్తుకు విలువ లేదని తెలుసుకున్న స్థానికులు నిరాశ చెందారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించిన అతి తక్కువ ధరకే ఇళ్ల పథకం కింద రూ.54 వేలకే పొవాయిలో ఫ్లాట్లు లభిస్తుందన్న గంపెడాశతో మంత్రాలయానికి మంగళవారం వచ్చిన వందలాదిమంది దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి సమర్పించారు. దీని గురించి తెలుసుకున్న సీఎం కార్యాలయ వర్గం ప్రభుత్వం అటువంటి పథకాన్ని మంజూరుచేయలేదని వివరణ ఇచ్చింది. ఎవరో తప్పుదారి పట్టించడంతో ఇదంతా జరిగిందని పేర్కొంది. అటువంటి పథకం మనుగడలో లేదని స్పష్టం చేసింది. అయినా కూడా రెండోరోజు బుధవారం కూడా అనేకమంది వచ్చి దరఖాస్తు చేసేందుకు ఎగబడ్డారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎంవో కార్యాలయం లేని పథకాన్ని ఉన్నట్టుగా చెప్పి పొవాయి వాసులను తప్పుదారి పట్టించడానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది. ‘1987 పొవాయి అభివృద్ధి పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తుందని తెలుసుకున్నాం. ఈ పథకం కింద హీరాంనందాని బిల్డర్స్ అభివృద్ధి చేసిన 400 చదరపు అడుగుల మేర నిర్మించిన మూడు వేల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నామ’ని సదరు ఫారమ్ పేర్కొంది. హీరానందని కాంప్లెక్స్‌లో అపార్ట్మెంట్లు ఉన్నాయని తెలుసుకున్న పేదలు అతి చౌక ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్నారని కార్మిక నాయకుడు మిలింద్ రణడే తెలిపారు. ‘1986లో పట్టణ భూపరిమితి చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం పొవాయిలో 240 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దీనిని అభివృద్ధి చేసేందుకు ఎకరాకు రూ.40 పైసల చొప్పున డెవలపర్‌కు సర్కార్ లీజుకిచ్చింది. 400 చదరపు అడుగులు, 800 చదరపు అడుగుల పరిధిలో ఆధునిక ఫ్లాట్‌ను డెవలపర్ నిర్మించారు. వీటిలోనే 70 శాతం రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లను సంపన్నవర్గాల కోసం 1,200 నుంచి 5,000 చదరపు అడుగుల ఫ్లాట్లు నిర్మించడం వివాదాస్పదమైంది. దీంతో రూ.135లకే చదరపు అడుగుల ధరకు 15 శాతం ఫ్లాట్లను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసింద’న్నారు. దీనినే ఆధారంగా చేసుకొని 400 చదరపు అడుగుల ప్లాట్లకు రూ.54వేల ధర సదరు ఫారమ్‌లపై ప్రచురణ అయి ఉందని రణడే వివరించారు. అయితే కొందరి చేతుల్లోనే భూమి, ఇళ్లు ఉండకుండా నిరోధించేందుకు 2007లో యూఎల్సీఏ చట్టాన్ని ప్రభుత్వం రద్దుచేసిందని రణడే గుర్తు చేశారు.