బ్రిటీష్ పాలకుల టైంలోని ఆస్తి కేసుకి ఇన్నేళ్లకు మోక్షం లభించింది. ఆ కేసు కోసం ఎనిమిది దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళ చివరికి గెలిచింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఈ మేరకు అలిస్ డిసౌజాకు అనే మహిళ దక్షిణ ముంబైలోని రెండు ఫ్లాట్ల కోసం బాంబే హైకోర్టులో ఏళ్ల తరబడి పోరాడుంది. ఈ ఫ్లాట్లు దక్షిణ ముంబైలోని రూబీ మాన్షన్‌లో మొదటి అంతస్తులో 599 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకటి, 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో మరొకటి ఉన్నాయి.
మార్చి 28న 1942న అప్పటి బ్రిటీష్ పాలకులు అనుమతించిన డిఫెన్స్ ఇండియా చట్టం ప్రకారం.. ప్రైవేటు ఆస్తులు స్వాధీనం చేయాలని అభ్యర్థిస్తూ..ఈ భవనంపై పిటీషన్ దాఖలు చేసింది డిసౌజా. దీంతో న్యాయమూర్తులు ఆర్‌డీ ధనుక, ఎంఎం సతయేలతో కూడిని డివిజన్ బెంచ్ మే 4న 1946లో డీ రిక్విజిషన్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఏడాది జులై, 1946 కల్లా యజమాని అలిస్ డిసౌజాకు తిరిగి అప్పగించాలని స్పష్టం చేసింది. కానీ అది జరగలేదు. ప్రస్తుతం సదరు యజమాని డిసౌజాకు 93 ఏళ్లు.
ఆమె తన ఆస్తి కోసం దాఖలు చేసిన పిటీషన్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. అయితే అప్పటి మున్సిపాలిటి శాఖలోని ప్రభుత్వాధికారి లాడ్ ఈ ఫ్లాట్‌లలో నివాసం ఉండేవారు. 1946లో కోర్టు ఉత్తర్వులను నాటి మాజీ ప్రభుత్వాధికారి వారసులు వ్యతిరేకించినట్లు కూడా పిటీషన్‌లో పేర్కొంది. తాను తన డీ రిక్విజిషన్ ఆర్డర్‌లను సైతం ఉపసంహరించుకున్నప్పటికీ తన ఫ్లాట్‌లను అప్పగించలేనట్లు వెల్లడించింది. అదే భవనంలోని ఇతర ఫ్లాట్‌లు యజమానుకు అప్పగించినట్లు కూడా కోర్టుకి తెలియజేసింది.
అందువల్ల జూలై 1946 డీ రిక్విజిషన్ ఉత్తర్వును తిరిగి అమలు చేసి తన ఫ్లాట్‌లను తనకు అప్పగించేలా మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముంబై కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని డిసౌజా తన పిటిషన్‌లో కోరారు. దీంతో కోర్టు ప్రస్తుతం నివాసం ఉంటున్న వ్యక్తుల నుంచి ఎనిమిది వారాల్లోపు శాంతియుతంగా స్వాధీనం చేసుకుని సదరు యజమాని డిసౌజాకి అప్పగించాలని బాంబే కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
(చదవండి: ఖర్గే కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది! కాంగ్రెస్ ఆరోపణలు)
Comments
Please login to add a commentAdd a comment