Mumbai-Goa
-
కొంకణ్‌కు డబుల్ డెక్కర్ పరుగులు
సాక్షి, ముంబై: గణేష్ ఉత్తవాలను పురస్కరించుకుని కొంకణ్‌కు డబుల్ డెక్కర్ ఏసీ రైలు పరుగులు తీసింది. అయితే రైల్వే అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల మొదటి రోజు ఆ రైలు గంటా 15 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచింది. వివరాలిలా ఉన్నాయి. గణేష్ ఉత్సవాల కారణంగా రెగ్యూలర్‌తోపాటు ప్రత్యేకంగా నడిపే రైళ్లలో రిజర్వేషన్ ఫుల్ అయ్యాయి. దీంతో కొంక ణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ (ఎల్టీటీ) నుంచి కర్మాలి (గోవా) వరకు డబుల్ డెక్కర్ ఏసీ రైలు నడుపుతున్నట్లు ఇదివరకే రైల్వే పరిపాలన విభాగం ప్రకటించింది. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారు జాము 5.30 గంటలకు కుర్లా టర్మినస్ నుంచి బయలుదేరిన రైలు ఉదయం 8.40 గంటలకు రోహా స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గార్డు మారుతారు. కాని సెంట్రల్, కొంకణ్ రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో రోహా స్టేషన్లో కేవలం గార్డు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో కుర్లా నుంచి రైలును తీసుకెళ్లిన సెంట్రల్ రైల్వే డ్రైవర్ తాను రైలును ముందుకు తీసుకెళ్లలేనని మొండికేశాడు. దీంతో 75 నిమిషాలు రైలు అక్కడే నిలిచిపోయింది. అప్పటికే ఆ రైలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఏం జరిగిందో ప్రయాణికులకు తెలియదు. ఎనౌన్స్మెంట్ కూడా చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. చివరకు సెంట్రల్ రైల్వే అధికారులతో చర్చలు జరిపి ఆ డ్రైవర్‌కు నచ్చజెప్పడంతో 9.55 గంటలకు రైలు ముందుకు కదలింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
డబుల్ డెక్కర్ ‘పరుగు’ విజయవంతం
సాక్షి, ముంబై: కొంకణ్, సెంట్రల్ రైల్వే మార్గంపై డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు వారం రోజులుగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలు సఫలీకృతమయ్యాయి. దీంతో రైల్వే భద్రత కమిషనర్ శాఖ నుంచి త్వరలో గ్రీన్ సిగ్నల్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన నివేదికను ఆర్డీ ఎస్వో వారం రోజుల్లో సెంట్రల్, కొంకణ్ రైల్వే భద్రత శాఖ కమిషనర్ చేతన్ బక్షీకి సమర్పించనుంది. కొంకణ్, సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగానికి పంపించనుంది. ఆ తర్వాత ఈ నివేదికను మంజూరు కోసం రైల్వే భద్రత కమిషనర్ వద్దకు పంపిస్తారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ప్రయాణికులకు సేవలందించేందుకు రైలును సిద్ధం చేస్తారు. సెంట్ర ల్ రైల్వే హద్దులోని ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) నుంచి రోహ వరకు, కొంకణ్ రైల్వే హద్దులోని కోలాడ్ నుంచి మడ్గావ్ స్టేషన్ల మధ్య ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు పరీక్షలు నిర్వహించారు. ఈ రూట్లో ఉన్న ప్రమాదకర మలుపులు, సొరంగాలు, ఎత్తై వంతెనల వల్ల ఈ రైలుకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ప్లాట్‌ఫారాల ఎత్తు సమస్య కూడా ఏర్పడలేదు. కాగా జూలైలో రైల్వే ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలో డబుల్ డెక్కర్ రైలు ప్రకటించే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రారంభంలో దీన్ని ప్రత్యేక రైలుగా నడపనున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి క్రమబద్ధీకరించనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) నరేంద్ర పాటిల్ చెప్పారు.